8, జూన్ 2010, మంగళవారం

సమస్యాపూరణం - 5

కవిమిత్రులకు స్వాగతం. ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కంటిచూపుతోఁ జంపెడి ఘనులు కలరు.

8 కామెంట్‌లు:

  1. ఒక్క పలుకైన తెలుగులో నిక్కముగను
    పలుక లేనట్టి వీరులు పదుల సంఖ్య
    ఏలుచున్నారు సీమను ఏలికలుగ
    కంటిచూపుతోఁ జంపెడి ఘనులు కలరు

    రిప్లయితొలగించు
  2. డి.ఎన్.సి గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మంచి పూరణ నందించారు. అభినందనలు.

    రిప్లయితొలగించు
  3. మా తాతగారు మీ సమస్యాపూరణం చూసి సరదాగా క్రింది విధంగా పూరించారు.

    చెట్టు క్రిందను కూర్చొని జపము చేయు
    నట్టి మౌనికి తలమీద పడియె రెట్ట
    పట్టరాని కోపముతోడ పక్షిc జూచి
    కంటి చూపుతొ చంపెడి ఘనులు కలరు.

    రిప్లయితొలగించు
  4. మింటనగ్నిని చిన్డెడు యినుడి వోలె
    నడిసముద్రమునెగయు సునామి వోలె
    కడకు మదనుని జంపు ముక్కంటి వోలె
    కంటి చూపుతో జంపెడు ఘనులు కలరు.

    రిప్లయితొలగించు
  5. దీప్తి గారూ,
    నా సమస్యకు స్పందించి పూరించిన మీ తాత గారికి వందనాలు. పూరణ బాగుంది. అయితే మొదటి రెండు పాదాల్లో యతిదోషం ఉంది. ఇలా సవరిందాను.
    చెట్టు క్రిందను కూర్చొని చేసె జపము
    నట్టి మౌనికి తల మీద రెట్ట పడియె ....

    సుమిత్ర గారూ,
    మంచి పూరణ. అబినందనలు. అయితే మొదటి పాదంలో యతి తప్పింది. ఆ పాదాన్ని ఇలా సవరించాను.
    మింట నగ్నిని చిందెడు మిత్రుని వలె .....

    రిప్లయితొలగించు
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !
    01)
    __________________________________

    నేటి సినిమాల యందును - నిజము చూడ
    కుంటి వారైన ; హీరోలె - క్రోధము గను
    ఒంటి చేతిని వేలాది - నుగ్గ డించు !
    కంటిచూపుతోఁ జంపెడి ఘనులు కలరు !
    __________________________________

    రిప్లయితొలగించు
  7. చూపుతో మాడ్చె రతినాధు శూలి నాడు
    కొంగ నొక్కడు జంపెను క్రోధ దృష్టి
    కంటి నేను పురాణపు గాధలందు
    కంటి చూపుతో జంపెడి ఘనులు గలరు.

    రిప్లయితొలగించు