3, జూన్ 2010, గురువారం

సమస్యాపూరణం - 2

కవిమిత్రులకు స్వాగతం.
ఈ రోజు సమస్య ఇది.
కాపురముం గూల్చినట్టి ఘనునకు జేజే.

11 కామెంట్‌లు:

 1. కం//
  ద్వీపమున మంట పెట్టుచు
  కోపముతో గంతులేసి కోటల రూపున్
  మాపుచు చక్కనిదగు లం
  కాపురమున్ గూల్చినట్టి ఘనునికి జేజే

  రిప్లయితొలగించండి
 2. వాహ్ .... పుష్యం గారూ, మంచి పూరణను అందించారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !

  01)
  ___________________________________

  బాపెను సీతా శోకము
  ఊపున లంఘించి యబ్ధి - ఒంటిగ హనుమే !
  పాపుల నెలవగు నా ,లం
  కాపురముం గూల్చినట్టి - ఘనునకు జేజే !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 4. పాపము పుణ్యము నెంచక
  కోపముతో మండిపడుచు కొట్టుచు మందున్
  వాపోవక చెదపురుగుల
  కాపురముం గూల్చినట్టి ఘనునకు జేజే!

  రిప్లయితొలగించండి
 5. ---------------------------------
  కం.
  పాపము ముదుసలి వాడికి
  పాపయు పదునెన్మిదేండ్ల పడుచును జేయన్
  కోపముతో నొక లాయరు
  కాపురమున్ గూల్చినట్టి ఘనునకు జేజే!!
  ---------------------------------
  - గానుగుల

  రిప్లయితొలగించండి
 6. ----------------------------------------
  కం.
  ఆపుణ్యాత్ముడు రాముడు
  యా పావని సీతజాడ హనుమయు దెలుపన్ !
  పాపియు నగు రావణ లం
  కాపురమును గూల్చినట్టి ఘనునకు జేజే !!
  ----------------------------------------
  - గానుగుల

  రిప్లయితొలగించండి
 7. ----------------------------------------
  కం.
  మాపున సిరి వెన్నెల లో
  ఏ పున వికసించ కలువ ఎన్నో కాంతుల్
  ప్రాపుగ దినకర కాంతుల
  కాపురమును గూల్చి నట్టి ఘనునకు జేజే
  ----------------------------------------
  - గానుగుల

  రిప్లయితొలగించండి