కవి మిత్రులారా,
రోజురోజుకు పెరుగుతున్న మీ ఆదరణ, ప్రోత్సాహం నన్ను ఆనందపరవశుణ్ణి చేస్తున్నాయి. ఔత్సాహికులే కాకుండా లబ్ధప్రతిష్ఠులైన కవులు కూడ నా బ్లాగును ఆదరించడం నా అదృష్టం. ఆందరికీ శత సహస్ర వందనాలు.
ఇక ఈ రోజు పూరించవలసిన సమస్య ........
పొగ త్రాగుమటంచు లోక పూజ్యుండయ్యెన్.
పగతురకైనను క్షేమము;
రిప్లయితొలగించండిసుగతిని; గొలుపంగ నొకఁడు సుర యజ్ఞంబు
న్నగణితముగ నొనరిచి; యా
పొగ త్రాగుమటంచు లోక పూజ్యుండయ్యెన్.
(యజ్ఞ ధూమ పానము క్షేమ కరము)
ఈ సమస్యను కూడా పూరిద్దామా?
చదువులు చెప్పించు కొలది చవటాయెనురా!
రామకృష్ణారావు గారూ, పూరణ చాలా బాగుంది. ధన్యవాదాలు. మీరిచ్చిన సమస్యకు ఈ సాయంత్రం పూరణ నందిస్తాను.
రిప్లయితొలగించండిఅన్నట్టు .. సుమిత్ర పేరుతో వ్యాఖ్యానిస్తున్నది పురుషుడే. గమనించ మనవి.
శంకరయ్యగారూ..రామ కృష్ణా రావు గారూ..నాదొక చిన్న మనవి. సమస్య పూరణ తరవాత దాని అర్ధం కూడా చెప్పరా ప్లీజ్..నాలాంటి వారి కోసం.
రిప్లయితొలగించండిచదవాలన్న తపన, చదివినా కొన్ని అర్ధం కాక వేదన.. అందుకే నా ఈ మనవి. మీ అమ్మాయే అనుకుని నన్ను క్షమించేసి దయచేసి అర్ధాలు కూడా చెప్పరూ ప్లస్.
ప్రణీత స్వాతి గారు,
రిప్లయితొలగించండిఈ విషయంలో నేను మీకు తోడు :)
నాకు పద్యాలు చాల వరకు అర్ధం అవుతాయి కానీ అక్కడక్కడ కొన్ని పదాలకు అర్ధం తెలియదు. మనకి ఇది సహాయ పడుతుంది చూడండి.
http://dsal.uchicago.edu/dictionaries/brown/
మీకు ముందే తెలిసి ఉండచ్చు. తెలియని పక్షంలో ఉపయోగ పడుతుందని ఇస్తున్నాను .
జగముల బ్రోవ సురలడిగె
రిప్లయితొలగించండిపొగ త్రాగుమటంచు, లోక పూజ్యుండయ్యెన్
నగరాజసుతపతి శివుడు
పొగకును మూలమగు విషముఁబూని ముదమునన్!!
(వివరణ: క్షీర సాగర మథనములో ఏదో భయంకరమైన పొగ లోకాలను కమ్మి వేసినప్పుడు, ఆ పొగకు కారణమేమిటో తెలియక దేవతలు శివున్ని ప్రార్థించగా, ఆ పొగకు కారణము విషమని తెలిసిన శివుడు దానిని ధరించి లోక పూజ్యుడు అయ్యాడు.)
రగలని కట్టెలనేమి క
రిప్లయితొలగించండిలుగు? మందులిడి యెటులన్ బలుకు వెజ్జెటులన్
నిగమ విదితుడగు వరుసన్?
పొగ, త్రాగుమటంచు, లోక పూజ్యుండయ్యెన్!!
ముదముగ పలికెను తెలుగున
రిప్లయితొలగించండిపదములు సొగసుగ చదువుల ప్రారంభమునన్,
చదివిన పిమ్మట పలకడు
చదువులు చెప్పించు కొలది చవటాయెనురా!!
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. నే నిచ్చిన సమస్యకు రెండు పూరణలు ఇచ్చి, చింతా వారి సమస్యను కూడ పూరించి నా బ్లాగుకు వన్నె తెచ్చారు. ధన్యవాదాలు. మీ సహకారం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.
ప్రణీత స్వాతి గారూ,
రిప్లయితొలగించండిసాయి ప్రవీణ్ గారూ,
మీరు కోరినట్లుగా పూరణ లందించే కవులు తమ పద్యాలకు వివరణ ఇస్తారని ఆశిద్దాం. ఓకవేళ వారు ఇవ్వకపోతే ఆ పద్యాలకు నేను వివరణలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సరేనా?
మదులకు నెక్కని; తికమక
రిప్లయితొలగించండిచదువు"కొనెడి" రోజులొచ్చె.సభ్యతమాపెన్.
చదివించితి నొకనిని. ఈ
చదువులు చెప్పించు కొలది చవటాయెనురా!
భావము:-
నే నొకనికి బాగా చదివించెయ్యాలనే దురాశ కొద్దీ ఒక పల్లెటూళ్ళో కేరళీయులు పెట్టిన కాన్వెంట్లో ఎక్కువసొమ్మైనా సరే కష్టపడి సంపాదించి చెల్లించి చదివించాను. పాశ్చాత్యతను పులుముకొనిన ఆ సంస్థ బండెడు పుస్తకములితని భుజానికెత్తి ఈతనికర్థం కాని వారి పద్ధతిలో వారి భాషలో చెప్పడమే కాక వ్యాయామాదులను మటుమాయం చేసి ఈ విద్యార్థిని సజీవ (పనికి రాని)యంత్రంగా మార్చేసారు.చదువు కొన్న పదార్థమై వ్యర్థమయింది. ఈ విద్యార్థి చదువు చెప్పించిన కొద్దీ అసలు వచ్చినదీ మర్చిపోయి చవటగా మారాడు.
శ్రీ చింతా రామకృష్ణారావు గారిచ్చిన "చదువులు చెప్పించుకొలది చవటాయెనురా" సమస్యకు నా పూరణ ......
రిప్లయితొలగించండిసదసద్వివేక మెఱుఁగక
నెద మెచ్చిన పనులఁ జేయు హీనాత్ములఁ దా
వదలకఁ దిరిగెడు సుతునకు
చదువులు చెప్పించు కొలఁది చవటాయెనురా.
( మంచి చెడుల వివేకం లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే దుష్టులతో స్నేహం చేసే కొడుకుకు చదువులు చెప్పించిన కొద్దీ చవట అయ్యాడు )
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీతిగ బ్రతికెడు వైనము
రిప్లయితొలగించండిజాతిని సేవించు భావజాలము లేకన్,
విత్తార్జన చింతన గల
చదువులు చెప్పించు కొలది చవటాయెనురా!
ప్రస్తుతం చదువులు ఎలా ఉన్నాయో చెప్తూ....
"నీతి నియమాలు, దేశభక్తి లేకుండా
కేవలం ధనార్జనే లక్ష్యంగా
చదువు చెప్పించిన కొద్దీ చవట అయ్యాడు" అని అర్థం.
@ శంకరయ్యగారు, రామకృష్ణారావు గారు, సత్యనారాయణ గారు
పూరణలు బాగున్నాయి. అభినందనలు.
"సుమిత్ర" గారూ,
రిప్లయితొలగించండిమంచి భావం. అయితే ప్రాస తప్పింది. మీరు ముందు వ్రాసిన వ్యాఖ్య తొలగించబడిందని, దానిని బ్లాగు రచయిత తొలగించారని ఉంది. నేను ఏ వ్యాఖ్యను తొలగించలేదు. వ్యాఖ్యలను తొలగించడం ఎలాగో నాకు తెలియదు. అంతటి సాంకేతిక పరిజ్ఞానం నాకు లేదు. ఆ వ్యాఖ్యను మీరే తొలగించారా? అలా తొలగించాలంటే ఏం చేయాలి?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరయ్యగారు, మీరు www.blogger.com లో లాగిన్ అయి, ఈ టపా చూస్తూ, ఆయా వ్యాఖ్యల క్రింద కనబడే ఓ చిన్ని డబ్బా బొమ్మను నొక్కితే వ్యాఖ్య తొలగిపోగలదు.
రిప్లయితొలగించండివ్యాఖ్యలు వ్రాసే వారికీ ఈ సదుపాయం ఉంటుంది.
రవి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
నా మనవి మన్నించి నా(లాంటి వారి)కోసం పద్యాలు అర్ధాలతో చెప్తున్నందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపద్యాలన్నీ(అర్ధాలతో కలిపి చదువుకున్నా) చాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండిపొగతాగెడి మగవారిని
రిప్లయితొలగించండితగువాడెడి సతులనుండి తగ రక్షింపన్
యుగకర్తై గురజాడయె
పొగ త్రాగుమటంచు లోక పూజ్యుండయ్యెన్
@చదువరి గారు...
రిప్లయితొలగించండిచప్పట్లు :)
చదువరి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణను ఆలస్యంగా చూసాను. పూరణ చాలా బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభుగభుగమని పొంగి సుధయె
రిప్లయితొలగించండిపొగ చెట్టైనదని త్రాగి పొగడుచు చుట్టన్
నగవుల రసిక గిరీశము
పొగ త్రాగుమటంచు లోక పూజ్యుండయ్యెన్