4, జూన్ 2010, శుక్రవారం

సమస్యాపూరణం - 3

కవిమిత్రులకు స్వాగతం!
ఈనాటి ఈ సమస్యను పూరించండి.
రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్.

14 కామెంట్‌లు:

  1. కొంచెం అతికించినట్టు, ఎటూ కానట్టూ ఉంది ఈ పూరణ అని నాకే తెలుసు. ఇందులో ఒక ఇంగ్ళీషు పదం వాడటం కోపం తెప్పించవచ్చును. క్షమించాలి. అలాగే రాధాకృష్ణులు జగన్మాత, జగద్పిత కాబట్టి వాళ్ళ శృంగారాన్ని వర్ణిస్తున్నా అందులో పవిత్రత ఉంటుంది అనే నమ్మకంతో (కొంచిత్ బద్ధకం, కంగారు మొ. వాటితో):

    కం:-
    ఏమైందీనాడు వెదుక
    రోమాంచకమౌ విధమున రోమాన్సాడన్
    ఆ మంజిమయని దైత్యవి
    రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్.

    రిప్లయితొలగించండి
  2. సందీప్ గారూ, మంచి ప్రయత్నం. అభినందనలు. అయితే మూడవ పాదంలో "ఆ మంజిమయని" అనేది అర్థం కావడంలేదు. ఒకవేళ అది టైపింగ్ పొరపాటు కావచ్చు.

    రిప్లయితొలగించండి
  3. శంకరయ్య గారు,

    మంజిమ అంటే "సౌందర్యం", "మనోఙ్ఞత" అని బ్రౌహ్ణ్య నిఘంటువు చెప్తోంది. [http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=manjimatable=brown]. అదే వాడేశాను. అంటే "రోమాన్సు చెయ్యడానికి వెదుకగా ఆ అందం (రాధమ్మ) ఏది ఈవేళ అని కృష్ణుడు అనుకుని, రాధమ్మను (వేణువూది) పిలిచాడు", అన్నది నా భావం. నిద్రకు వేళయ్యి కంగారుగా వ్రాశాను. క్షంతవ్యుణ్ణి.

    రిప్లయితొలగించండి
  4. lanke tappugaa icchaanu. idi saraina link:

    http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=manjima&table=brown

    రిప్లయితొలగించండి
  5. శంకరయ్యగారూ..మీ బ్లాగ్ లో ఏదైనా సరే..చదవడం, అర్ధాలు తెలుసుకుని..మళ్ళీ చదివి ఆనందించడం తప్ప..ఇంకేమి చేతగాని పామరురాలిని.

    రిప్లయితొలగించండి
  6. @ప్రణవీ స్వాతి
    పామరత్వం కాదండి సమస్య, సోమరితనం ఉంటే సమస్య! మీలో తెలుసుకోవాలనే కోరిక ఉండటమే గొప్ప! సమయం వెచ్చింది అర్థాలు తెలుసుకుని చదవడం అభినందనీయం.

    రిప్లయితొలగించండి
  7. ఓ సారి యమునా తటినున్న కృష్ణభగవానుడి వద్దకు ఒకేసారి రాధ, బలరాముడు వెళ్లారుట .. ఇద్దరు ఒకరికొకరు ఎదురై ..
    ఇద్దరూ వెనుదిరిగారుట ..
    ఇది నేను శ్రీకృష్ణుడిని సమీపించే సమయం కాదులే అని అనుకొని.
    ఇద్దరు వెనుదిరగటాన్ని కృష్ణుడు చూశాడుట..

    శ్యాముని కైజని ఇటుబల
    రాముడు,యటురాధయు, ఎదురై వెనుదిరుగన్,
    ఆమోహనుండుగని "జనె
    రాముండిటు రమ్మ"టంచు రాధను పిలిచెన్.

    రిప్లయితొలగించండి
  8. @ సందీప్ -
    సందీప్ గారూ, నిజమే ఆ పదాన్ని అర్థం చేసికొనడంలో పొరబడ్డాను. వివరణకు ధన్యవాదాలు.
    @ ప్రణీత స్వాతి -
    స్వాతి గారూ, నా బ్లాగుకు స్వాగతం. నేనిస్తున్న సమస్యలు సుకర ప్రాసతో, క్లిష్టత లేకుండా మీలాంటి ఔత్సాహికులను ప్రోత్సహించడానికే. మీరూ ప్రయత్నిచండి. అన్నట్టు .. మా అమ్మాయి పేరు కూడా స్వాతి. పెళ్ళయి కొడుకుతో అత్తవారింట్లో ఉంది.
    @ వూకదంపుడు -
    వూకదంపుడు గారూ, మీ పూరణతో నా బ్లాగు ధన్యమయింది. చాలా చక్కని పూరణను అందించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. ధన్యత నాదండీ, మీ బ్లాగుద్వారా ఒకటో రెండొ పద్యాలు వ్రాశాననిపించుకోవటం, తెలియని విషయాలు తెలుసుకోవటం

    ధన్యవాదములు, నమస్సులు.
    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  10. అందరికీ వందనములు
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !
    01)
    ___________________________________

    ప్రేమగ యమునా తటినే
    "స్వామీ "యని వెదకుచున్న - చంద్ర వదనయౌ
    భామను గని; సోదర బల
    రాముండిటు రమ్మటంచు - రాధను పిలిచెన్ !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  11. గోముగ సీతను పిలిచెను
    రాముండిటు రమ్మటంచు;...రాధను పిలిచెన్
    జామున వేకువ నందున,
    ప్రేమను బృందావనమున రేతిరి, పగలున్!

    రిప్లయితొలగించండి
  12. నామామృతపానమ్మున
    ప్రేమామృతమూర్తికొరకు, వేచినదానిన్
    సామప్రియుడాబృందా
    రాముండిటురమ్మటంచు రాధనుబిలిచెన్ !

    రిప్లయితొలగించండి
  13. దామోదరుడా కృష్ణుడు
    ప్రేమామృతమూర్తి రాధ ప్రియవల్లభుడే!
    నోములు నోచగ కార్తిక
    రాముండిటు రమ్మటంచు రాధను బిలిచెన్ !!

    రిప్లయితొలగించండి