శంకరయ్యగారూ..నా బ్లాగ్ చూసి, చదివి, అభినందించినందుకు ముందుగా ధన్యవాదాలండీ. ..ఏదో అలా చిన్న చిన్న మాటల్లో నా జ్ఞాపకాలు, సరదా కబుర్లు రాయగలిగాను కానీ..పద్యాలు రాసే స్థాయి నాకు లేదండీ. మాతృభాష మీద అభిమానం వున్నా..పట్టు లేదండీ. ఓ న మః లు కూడా సరిగ్గా రావండీ. చదువుకుని, అర్ధాలు వెతుక్కుని మళ్ళీ చదువుకుని ఆనందిస్తూ వుంటాను..అంతే. మీలాంటి పెద్దల ఆశీస్సులు వుంటే కనీసం తడుముకోకుండా చదువుకుని అర్ధం చేసుకోగలిగే స్థాయికి చేరుకోగలను.
వసంత కిశోర్ గారూ, ఒకవిధంగా ఇది నా దత్తపదికి నెట్ ద్వారా వచ్చిన మొదటి పూరణ. నా మిత్రుడు తన పూరణను ఫోన్ ద్వారా పంపాడు. నేరుగా వచ్చిన మొదటి పూరణ మీది. పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.
శంకరయ్యగారూ..నా బ్లాగ్ చూసి, చదివి, అభినందించినందుకు ముందుగా ధన్యవాదాలండీ. ..ఏదో అలా చిన్న చిన్న మాటల్లో నా జ్ఞాపకాలు, సరదా కబుర్లు రాయగలిగాను కానీ..పద్యాలు రాసే స్థాయి నాకు లేదండీ. మాతృభాష మీద అభిమానం వున్నా..పట్టు లేదండీ. ఓ న మః లు కూడా సరిగ్గా రావండీ. చదువుకుని, అర్ధాలు వెతుక్కుని మళ్ళీ చదువుకుని ఆనందిస్తూ వుంటాను..అంతే. మీలాంటి పెద్దల ఆశీస్సులు వుంటే కనీసం తడుముకోకుండా చదువుకుని అర్ధం చేసుకోగలిగే స్థాయికి చేరుకోగలను.
రిప్లయితొలగించుసందీప్ గారూ చాలా చాలా థాంక్సండీ..మీ ప్రోత్సాహానికి.
రిప్లయితొలగించుదయచేసి "నెలమి" కి అర్ధం చెప్పరా..
రిప్లయితొలగించుస్వాతి గారూ, అది "నెలమి" కాదు, "ఎలమి" ప్రత్యక్షమగుచున్ + ఎలమిన్ అని పదవిభాగం. ఎలమిన్ అంటే సంతోషంతో, దయతో, ప్రేమతో, ఉత్సాహంతో అనే అర్థాలున్నాయి.
రిప్లయితొలగించుధన్యవాదాలండీ..
రిప్లయితొలగించుఅందరికీ వందనములు
రిప్లయితొలగించుఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
01)
___________________________________
సర్వ వానర మూకలు - సాయ పడగ
అబ్ది కావల నెలకొన్న - నసురు తోడ
సకల రాక్షస వీరుల - సంహరించి
అలరు బోడిని యలరించె - నచ్యుతుండు !
___________________________________
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించుఒకవిధంగా ఇది నా దత్తపదికి నెట్ ద్వారా వచ్చిన మొదటి పూరణ. నా మిత్రుడు తన పూరణను ఫోన్ ద్వారా పంపాడు. నేరుగా వచ్చిన మొదటి పూరణ మీది. పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.
అశోక వనంలో సీతతో త్రిజట పలికిన ఊరడింపు మాటలు..
రిప్లయితొలగించుకలతను జెందకు మమ్మా!
అల రాఘవు డిటకు వచ్చి యసురుల జంపున్ !
వలపుల రాణివి నిన్నే
నెలతా! నినుగొని జనునిక నిజమిది వినుమా !
అలతి పూజకె మెచ్చు దయాంబురాశి
రిప్లయితొలగించుకలతఁ జెందిన భక్తులఁ గాచువాఁడు
తలఁచినంతనె యెదుట ప్రత్యక్షమగుచు
నెలమి నను బ్రోచు రాముని కెవఁడు సాటి?