29, జూన్ 2010, మంగళవారం

సమస్యాపూరణం - 24

కవి మిత్రులకు నమస్కృతులు. ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
పెద్దపులిని చంపె పిరికివాఁడు.

26 కామెంట్‌లు:

 1. అవధానం పుస్తకంలో ఓ సమస్య చూశాను. ఔత్సాహికులు పూరించగలరు.

  "బోడికి బోడికిని పొత్తు పొసగెన్వసుధన్"

  రిప్లయితొలగించండి
 2. కంది శంకరయ్య గారూ
  తుదకు కిట్టిస్తున్నాను :) . వేరే తప్పులుంటే దయచేసి తెలుపగలరు.

  పగటిపూట కాకి బట్టలు కట్టి తా
  కాపు ఁగాచె పెద్ద కాపు నింట
  పట్టె, రాత్రిపూట పడతిని, ఆహ్హహ
  పెద్దపులిని చంపె పిరికివాఁడు

  కాకి రంగు బట్టలు కట్టువాడు= పోలీస్

  రిప్లయితొలగించండి
 3. రవిగారూ, కత్తి లాంటి సమస్యనిచ్చారు. :)
  ఇక సమస్యా పూరణ చేయు వారి విహారాన్ని చూడాలి.

  రిప్లయితొలగించండి
 4. వెట్టి పనులు జేసి వెక్కసమందితా
  వేచి వెట్టి పాలి చూచి చూచి
  ఊరి చివర నరికె యూరికామందును
  పెద్ద పులిని జంపె పిరికి వాడు

  సూచన: రంజన చెడి పాండవులరి.. పద్య
  భావ స్పూర్తి తో...

  రిప్లయితొలగించండి
 5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 6. రవి గారూ మీ సమస్యను శంకరయ్య గారికి ఈ మైల్ లో పంపండి. మీరు ఇచ్చిన సమస్య గా పెడతారు. కామెంట్సు లో ఇస్తే.. ఏ సమస్య పూరించాలో తెలీక సభ్యులు కంఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కదా..

  రిప్లయితొలగించండి
 7. గూడెమందు నొక్క కోతల రాయుడు
  అడవి లోకి వెడలె అలము లేర
  చూచెనొక్క పులిని చచ్చిన దానిని
  పెద్ద పులిని జంపె పిరికి వాడు!

  రిప్లయితొలగించండి
 8. రవి గారి సమస్యకు నా ప్రయత్నం.

  ఆడది మగనిని పరిణయ
  మాడటమది పాత మాట మగడే మగనిన్
  కూడుట మదియూ చట్టమె
  బోడికి బోడికిని పొత్తు పొసగెన్వసుధన్

  రిప్లయితొలగించండి
 9. క్షమించాలి. నా, ఇదివరకు పూరణ తప్పు. రెండవసారి.

  కట్టెలకుఁ వని జని కనె మనుజుఁడొకఁడు
  పెద్దపులిని; చంపె పిరికివాఁడు
  వాఁడు శశకమొకటి వాటముగాఁ దన
  మనమునందుఁ గలుఁగు భయము నార్ప.

  వెంకటప్పయ్యగారు, మీ సూచన బావుంది. ఇకపై అలాగే చేస్తాను.

  రిప్లయితొలగించండి
 10. రవి గారి సమస్యకి నా పూరణ

  వేడుకల మునిగె కోసల,
  పీడకలఁ గనిన పగిదిని భీతిలి చేరెన్
  చేడియ దరి ముదుసలి, పూ
  బోడికి బోడికిని పొత్తు పొసగెన్వసుధన్

  రిప్లయితొలగించండి
 11. @హరి దోర్నాల గారు: బాగా చమత్కారించారు. :-)
  @గిరి గారు: అందమైన పూరణ. సందర్భం కూడా వివరించగలరు.

  నా పూరణ.

  చేడియ కరమును జేఁగొని
  మోడుచు తిరుపతికిఁ జేరి ముండిత శిరుడై
  వీడెనొక తెఱువరి. మెఱుఁగు
  బోడికి బోడికిని పొత్తు పొసగెన్వసుధన్.

  రిప్లయితొలగించండి
 12. ధైర్య సాహసముల సూర్యతేజసములు
  పురుష సింహులచట పుట్టినారు
  కొదమ శౌర్యమునకు కొలతఇదియెచూడు
  పెద్దపులిని చంపె పిరికివాఁడు
  --------------------------
  కూడిరి ఎన్నిక లందున
  బోడివనుచు నొకరినొకరు పోల్చినవారే
  కోడై కూసెను లోకము
  బోడికి బోడికిని పొత్తు పొసగెన్వసుధన్

  రిప్లయితొలగించండి
 13. చదువరి గారు,
  చాల బావుంది - గుఱ్ఱపు డెక్కల తలపించే దరువుల వల్ల ఓపీ నయ్యరు పాటలనేలా గుర్తించ వచ్చో, రాజకీయ/సామాజిక స్పృహ ఉన్న పద్యాలు చూసి వ్రాసింది మీరని గుర్తించవచ్చు

  రవి గారు,
  సమాధానము నా చే చెప్పించడం కన్నా మీరే ఆలోచించండి - కోసలలో వేడుకలు చూసి ముసలిదానికి కన్నుకుట్టిందెప్పుడాని?

  రిప్లయితొలగించండి
 14. @గిరి గారు, చదువరి గురించి బాగా చెప్పారు.

  మీ పద్యం గురించి నాకు ఇదివరకే అర్థమయిందండి.:-) అయితే పద్యాలల్లేవారికోసమే కాక, సామాన్య శ్రోతలకోసమని ఆ సూచన.

  రిప్లయితొలగించండి
 15. భాస్కర రామిరెడ్డి గారూ,
  భావం కాస్త తికమక పెడుతున్నది.

  రిప్లయితొలగించండి
 16. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  పూరణ బాగుంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 17. హరి దోర్నాల గారూ,
  నేనిచ్చిన సమస్యతో పాటు రవి గారిచ్చిన సమస్యను కూడా సమర్థవంతంగా పూరించారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. రవి గారూ,
  గిరి గారూ,
  చదువరి గారూ,
  బాగున్నాయి మీ పూరణలు. ధన్యవాదాలు, అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. నిన్ను మించువాడు ఇలలోనె లేడ౦చు
  నమ్మకముగ పలుక నమ్మియతడు
  వెన్నుతట్టి లేపి ఎదను శక్తిని నింప
  పెద్దపులిని చంపె పిరికివాఁడు

  రిప్లయితొలగించండి
 20. శంకరయ్య గారూ, నేనకున్న భావమిది. సరిగ్గా పద్యంలో ఇమడలేదేమో.

  రక్షక భటుల మీద వ్యంగ్యంగా వ్రాసింది అది.

  "పగలంతా కాకీ దుస్తులు ధరించి (పోలీస్ యూనిఫాం చిహ్నం )పెద్ద పెద్ద వాళ్ళ ఇంటి ముందొ పడి గాపులు కాస్తావు.అదే రాత్రిపూట మాత్రం పెద్దపులి లాగా ఓ పడుపు వృత్తిలో నున్న స్త్రీని [పడతి] పట్టుకొని శిక్షవేస్తావు" అని అనుకున్నాను. పద్యం ఏరూపంగా వుంటే బాగుంటుందో దయచేసి సరి చేయండి.

  రిప్లయితొలగించండి
 21. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  01)
  __________________________________

  పిల్లి జూచి బెదరి - తల్లి చాటున దాగు !
  పెద్ద పులిని జంపె - పిరికి వాడు !
  ఆత్మ రక్ష వేళ - అదియె వచ్చు బలము !
  వింత యేమి యిందు - విహితు లార !
  __________________________________

  రిప్లయితొలగించండి
 22. అడవి కేగి వీరుఁడై యెల్లరుఁ గనఁగ
  పెద్ద పులినిఁ జంపె, పిరికివాఁడు
  కాఁడు, బల్లిదుండు, కన్య నాతని కిచ్చి
  పెండ్లిసేయ నీకుఁ బేరుఁ దెచ్చు.

  రిప్లయితొలగించండి
 23. బొమ్మలన్నితెచ్చి, బూచాటలాడుచు
  పులినిగాంచినంత, కలలుగనుచు
  బాలుడొకడుతాను, బహుభంగి క్రీడించె
  పెద్దపులినిజంపె పిరికివాడు

  రిప్లయితొలగించండి