10, జూన్ 2010, గురువారం

సమస్యాపూరణం - 7

కవి మిత్రులారా, రోజు పూరించవలసిన సమస్య -
టంట టంట టంట టంట టంట.

13 కామెంట్‌లు:

 1. విరులు విరిసెనంట మరులు రేగెనంట
  పర్వులెత్తి వాగు పారెనంట
  పరవశమున మనసు పాడెనీ పాటంట
  టంట టంట టంట టంట టంట

  రిప్లయితొలగించండి
 2. చిన్న సవరణ:

  విరులు విరిసెనంట మరులు గొలిపెనంట
  పర్వులెత్తి వాగు పారెనంట
  పరవశమున మనసు పాడెనీ పాటంట
  టంట టంట టంట టంట టంట

  రిప్లయితొలగించండి
 3. ఫణి ప్రసన్న కుమార్ గారూ,

  నీదు పూరణము ఫణిప్రసన్న కుమార!
  నచ్చెనయ్య, నిన్ను మెచ్చినాను,
  నయముగాను నీకు జయఘంట మ్రోగింతు
  టంట టంట టంట టంట టంట.

  రిప్లయితొలగించండి
 4. గుట్ట మీద నున్న గుడిలోని జేగంట
  టంట టంట టంట టంట టంట
  చెట్టు కొమ్మ నున్న చిట్టి మాబడి గంట
  టంట టంట టంట టంట టంట

  రిప్లయితొలగించండి
 5. పాటగాని మదిని పలికె భావలహరి
  పదము కూర్చి పలుక పాటవోలె
  రాగమతిశయిల్ల రంజిల్లె శృతియందు
  టంట టంట టంట టంట టంట

  రిప్లయితొలగించండి
 6. హరి దోర్నాల గారూ,
  కడు మనోహరముగ గుడి గంట బడి గంట
  మ్రోగఁ జేసినావు బాగు బాగు
  దొడ్డ కవివి నీవు దోర్నాల హరి ! నీదు
  పూరణంబు బ్లాగు భూషణంబు.

  రిప్లయితొలగించండి
 7. "సుమిత్ర" గారూ,
  చిత్రభావముల "సుమిత్ర"! నీ పూరణం
  బందుకొంటి యుక్తమైనదంటి
  పట్టు వదలకుండ ప్రతి సమస్యకు నీదు
  పూరణమ్ము నేను కోరుకొంటి.

  రిప్లయితొలగించండి
 8. మధుర పూరణాల మధుపంబు యిదెయంట
  సరస భావ సుధల విరిపొదంట
  జాగు లేక విరిసె రాగమొకటియంట
  టంట టంట టంట టంట టంట

  రిప్లయితొలగించండి
 9. రవి గారూ,

  మింట వెలుఁగు "రవి" నా బ్లా
  గింటికి తన పద్యకాంతు లిచ్చెను, నేఁ జే
  కొంటిని, జయఘంట పలికె
  టంటం టట టంట టంట టంటం టంటం.

  రిప్లయితొలగించండి
 10. ప్రణీత స్వాతి గారూ,

  వదలక బ్లాగును చూచుచు
  నెద మెచ్చియు వ్యాఖ్యలంపి యెల్లప్పుడు నా
  కిదె మోద మొసఁగు మనుచు న
  నెద; నీ కిదె శుభమగును, ప్రణీత స్వాతీ!

  రిప్లయితొలగించండి
 11. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !

  01)
  ______________________________

  జారె మెట్ల మీద - మరచెంబు తొందర
  టంట టంట టంట - టంట టంట !
  పెండ్లి జరిగె పిదప - ప్రేమ బుట్ట తొలుత
  శంకరాభరణము - శారదకును !
  _______________________________

  రిప్లయితొలగించండి
 12. గదిని గోడకున్న గడియారమున గంట,
  చర్చి గంట, పాఠశాల గంట,
  గిత్త మెడను గంట,కేశవు గుడి గంట,
  టంట, టంట, టంట, టంట, టంట.

  రిప్లయితొలగించండి