28, జూన్ 2010, సోమవారం

దత్తపది - 3

కవి మిత్రులారా,
ఈ రోజు దత్తపది ఇస్తున్నాను. క్రింది పదాలను (అర్థాలను మార్చి) ఉపయోగిస్తూ నేటి బడి చదువులు విషయంగా మీకు నచ్చిన ఛందస్సులో పద్యం రాయండి.
అక్క, అన్న, అమ్మ, అయ్య.

33 కామెంట్‌లు:

 1. ముచ్చటగా మూడో సారి :-)
  --
  జీతపు జీవిగా బ్రతుకజేయుట కక్కర వచ్చు మార్గముల్
  పోతలు పోసి అమ్మకపు పుంతల నుంచుటె నేటి విద్యల
  య్యెన్, తృణమాత్రమయ్యనవె హేళనపాత్రమయెన్ మహార్ష వి
  ద్యల్, తెలివెట్లువచ్చు (తెరువెవ్వడిచ్చు) భరతావని కన్నచొ చెప్పశక్యమే

  రిప్లయితొలగించండి
 2. అన్ని విద్యలు బెట్టిరి అమ్మకాన,
  అన్న పానాదులమ్మేరు నాస్టలందు.
  జనము దోచుటె నేడయ్య, జగతి రీతి,
  అక్కరేమియు దీర్చునో రొక్క విద్య?

  గమనిక: నేడయ్య లో "అయ్య" గ్రహింపగలరు.

  రిప్లయితొలగించండి
 3. గీ||
  అక్కరకు రాని భాషయు,నిక్కము నిల
  అమ్మకమయినట్టిఁ జదువులయ్యవిఁ దల
  పంగ అన్నము నైనను పంచజాల
  నిట్టి విద్యలు వ్యర్థము,నెంచ గాను.

  టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి భావమే నాకూ వచ్చింది.

  రిప్లయితొలగించండి
 4. ఓ సారీ లింకును గమనించగలరు.
  http://kasstuuritilakam.blogspot.com/search/label/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%82%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%9A%E0%B1%82%E0%B0%A1%E0%B0%BE%E0%B0%AE%E0%B0%A3%E0%B0%BF%28%20%E0%B0%9B%E0%B0%82%E0%B0%A6%E0%B0%83%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81%20%29

  రిప్లయితొలగించండి
 5. గిరి గారూ,
  మంచి ప్రయత్నం. కాని 3వ, 4వ పాదాల్లో ప్రాస తప్పింది. మొదటి రెండు పాదాల్లో ప్రాస స్థానంలో "తకారం" ఉండగా చివరి రెండు పాదాల్లో సమ్యుక్తాక్షరాలు న్+తృ, ల్+తె(ల్తె) ఉన్నాయి. వీలైతే సరిదిద్దండి. నన్ను సవరించమంటే సరి చేసి రాస్తాను.

  రిప్లయితొలగించండి
 6. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  చక్కగా పూరించారు. ధన్యవాదాలు.
  రెండవ పాదాన్ని "అన్న పానాదు లమ్మేరు హాస్టలందు" అన్నా సరిపోతుంది.

  రిప్లయితొలగించండి
 7. రవి గారూ,
  అన్ని విధాలా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. నరసింహ గారూ,
  మీ బ్లాగులో ఛందఃప్రకరణాన్ని చూస్తూనే ఉన్నా. మీ కృషి ప్రశంసనీయం. కాకపోతే ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యానాన్ని పోస్ట్ చేయలేదు. ఇకనుండి నా అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటాను.

  రిప్లయితొలగించండి
 9. అక్కట!చదువులిదేమిటి?
  నిక్కము వద్దన్నవారె నేడు కనఁ బడున్.
  నిక్కమ్మమ్ముట చూడగ
  నొక్కరు నిలదీయ రేల? యుర్విని ఖలులన్.

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. అక్కర లేనిది అన్నము
  మెక్కిన వీసము అరుగదు మేనికి బరువే
  చక్కని సరుకే అమ్మగ
  అక్కర లేనిది కొనటము అయ్యరొ బొక్కే!

  రిప్లయితొలగించండి
 12. నవ్వుతూ నాలుగోసారి :-)
  --
  శంకరయ్య గారు, ఎక్కడో ప్రాసపూర్వాక్షర ప్రయోగములిలాంటివి చూసే నేను అలా వాడాను. ఎక్కడు చూసానో గుర్తులేదు. ఎక్కువ శ్రమలేకుండా నేను ఇలా మారుస్తాను, మీరేమి చేసేవారు?

  జీతపు జీవిగా బ్రతుకజేయుట కక్కర వచ్చు మార్గముల్
  పోతలు పోసి అమ్మకపు పుంతల నుంచుటె నేటి విద్యలా
  యే, తృణమాత్రమయ్యనవె హేళనపాత్రములార్ష శాస్త్రముల్,
  హా, తెలివెట్లువచ్చు భరతావని కన్నచొ చెప్పశక్యమే

  రిప్లయితొలగించండి
 13. రామకృష్ణారావు గారి పూరణలో అయ్య లేడు?:-)

  రిప్లయితొలగించండి
 14. ఔను రవీ!
  అయ్య వారిని చూస్తూ మరిచాను.

  అక్కట!చదువులిదేమిటి?
  నిక్కము వద్దన్నవారె నేడు కనఁ బడున్.
  నిక్కమ్మమ్ముట చూడగ
  నొక్కరు నయ్యధములఁ గని ఉతుకరదేలో!

  రిప్లయితొలగించండి
 15. అక్కరముల్ నేర్పుటకై
  చక్కగ అమ్మకము జేసె, అన్నన్నా! ఇం
  కెక్కడి చదువు విలువ, పో
  టెక్కగ? అయ్యవసరంబు ఎంతున్నదియో!

  (ఎల్.కె.జి. కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సిన నేటి దుస్థితి ప్రేరణగా...)

  రిప్లయితొలగించండి
 16. అన్నమడగనీయ రాకలైననుగాని
  ఆట లాడనీయ రక్కడసలు
  అయ్యమునిగదోచ నమ్మహా పండితుల్
  బడులె నరకమాయె బాలకులకు

  రిప్లయితొలగించండి
 17. చదువరి గారూ, మూడో పాదం - విడిగా ఉన్నట్టూ ఉందండీ-మిగతావాటి తో తూగకుండా - నాకొక్కడికేనా? -

  రిప్లయితొలగించండి
 18. చింతా రామకృష్ణారావు గారూ,
  పూరణ చాలా బాగుంది. అయితే మూడవ పాదంలో ఒక సందేహం. "నిక్కమ్ము+అమ్ముట"లో అమ్మ లేదు కదా. దానిని "నిక్కమ్మమ్మగ చదువుల" అని సవరిస్తే ఎలా ఉంటుంది?

  రిప్లయితొలగించండి
 19. గిరి గారూ,
  నవ్వుతూ నాలుగోసారి చెప్పింది సరిపోయింది. ఇంక నేను సవరించ వలసిన పని లేదు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. సుమిత్ర గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. చదువరి గారూ,
  చక్కని పద్యాన్ని అందించారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 22. నా పూరణ -
  అక్కడ చదువేది యని చెప్పి సర్కారు
  నడుపు బడులటన్న నచ్చరైరి;
  అమ్మకమగు వస్తు వయ్యె ప్రైవేటులో
  నయ్యధిక రుసుముల కంతు లేదు.

  రిప్లయితొలగించండి
 23. శంకరయ్య గారూ, నెనరులు.
  గిరిగారిని బరిలోనికి దింపినందుకు అభినందనలు మాస్టారూ.

  ఊకదంపుడు గారూ,
  మీరు కొంచెం మెత్తగా చెప్పారు గానీ, నిజానికి ఆ మూడో పాదాన్ని వేరే ఏదో పద్యంలోంచి ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుందండి. :) అమ్మను, అయ్యను పద్యంలో ఇరికించేందుకు ఆ పిల్లిమొగ్గలెయ్యాల్సి వచ్చింది. పద్యం మొత్తాన్నీ మళ్ళీ తిరగరాసి చూస్తాన్సార్.

  రిప్లయితొలగించండి
 24. వూకదంపుడు గారూ, శంకరయ్య గారూ, పాదాన్నొక్కదాన్నే మార్చే వీలు దొరికింది గానీండి.., అయ్యాయిలో అయ్య సరిగా ఇమడలేదేమోనని సందేహంగా ఉంది. పరిశీలించండి:

  అన్నమడగనీయ రాకలైననుగాని
  ఆట లాడనీయ రక్కడసలు
  అమ్మకాల సరుకు లయ్యాయి చదువులే
  బడులె నరకమాయె బాలకులకు

  రిప్లయితొలగించండి
 25. చదువరి గారూ, చాలాబాగుంది, ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 26. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  ఇప్పు డిప్పుడే మొదలవుతున్న e-books, e-education మొదలైనవి
  త్వరలోనే అన్ని వస్తువులూ అమ్మినట్టే షాపుల్లో పెట్టి "భోజనం తయ్యార్" అని
  బోర్డు పెట్టి అమ్మినట్టు సందుకొక షాపులో అమ్మబోతారని నా భావన :
  అక్కడ internet కలిగిన computer తప్ప ఇంకేమీ వుండదు !
  01)
  ______________________________________

  అమ్మ కానికి చదువులు ! - అధిక చౌక !
  అక్కరకు వచ్చు మీకిల ! - అన్న మిచ్చు !
  రండు కొనుటకు చదువులు - రండు రండు !
  అయ్య వార్లతో పనిలేదు ! - ఆర్యులార !
  ______________________________________

  రిప్లయితొలగించండి
 27. వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి