(వామనావతారుడైన హరి అంతకంతకు పెరుగుతూ, అఖిలాండాన్ని ఆక్రమిస్తున్నాడు. విష్ణుపాదజాత గంగ, ఆయన పాదాలను కడగాలని, తనూ ఆ పాదాల పరిమాణానికి అనుగుణంగా బ్రహ్మాండంగా పెరిగింది. అలా పెరిగిన గంగ (నీటి) లో నభస్సు (ఆకాశం) ఓ పడవలా తేలింది)
చేత వీణఁ దాలిచి విరించి సుతుడయ్యు గగన భువనములఁ దిరుగు కలహ వర్తి నారదుఁడను హరిపద గానముల సాహు కారు మేఘాలలోన షికారు చేసె
చింతా రామకృష్ణారావు గారూ ! " నీటి పైన నావ నడుపుట సరిపోదు " అన్న మీ పద్య పాదంలో యతి భంగమయింది. మీరు గమనించినట్టు లేదు. ఒక్కొక్కసారి అలా జరిగిపోతుందిలెండి. సరి చేయండి
I thorouly enjoyed all the poems, specially the poems where 'bus' was converted into a telugu or sanskrit word, exhibiting the beauty of the poets' imagination.
మహామహులందరూ పోటాపోటీ గా తమ పాండిత్యాన్నీ చతురతను మేళవించి చూపగా చదువరులకు పరమానందం పద్య ప్రేమికులకు ఇది విందు భోజనం ( ఛందోబద్ధంగా రాయలేను. నాకు చేతనైనంతలో ఈ బ్లాగు పై నా అభిమానాన్ని చూపించుకునే ప్రయత్నం)
శంకరయ్య గారు, మీకు నా వందనములు, అభినందనములు, కృతజ్ఞతలు
@ డా. ఆచార్య ఫణీంద్ర - ఫణీంద్ర గారూ, ధన్యవాదాలు. చింతా వారి పూరణలో "నదులలోన నావ నడుపుట సరిపోదు" అని సవరిస్తే సరిపోతుందనుకుంటాను. చింతా వారేమంటారో?
@ మాధురి - @ ప్రణీత స్వాతి - @ సాయి ప్రవీణ్ - నా బ్లాగులో కవిమిత్రుల పద్యాను చూసి మీరు ఆనందిస్తున్నందుకు తృప్తిగా, కించిత్తు గర్వంగా ఉంది. మీరడిగినట్లు కొందరు కవులు మాత్రమే పద్యాలకు వివరణలు ఇస్తున్నారు. సమయాభావం వల్ల నేనూ ఇవ్వలేక పోతున్నాను. క్షంతవ్యుణ్ణి.
రవి గారూ, ఇంతకు ముందే మీరు పూరించిన దత్తపది నా బ్లాగులో మొట్టమొదటి వృత్తమని వ్యాఖ్యానించాను. వృత్తంలో సమస్యలివ్వాలంటే ఔత్సాహిక కవులు ధైర్యం చేస్తారా అని అనుమానం. వారానికి ఒక సమస్య వృత్తంలో ఇవ్వమన్న మీ సలహా బాగుంది. తప్పక ఆచరణలో పెడతాను.
హరి గారూ, రెండో పద్యం మరింత బావుంది. నా గత వ్యాఖ్య రాయడంలో మీ మొదటి పూరణ బావులేదని కాదండి.. పద్యార్థం నాకలా స్ఫురించిందని చెప్పడమే! :) నిజానికి ఆ పద్యమూ బావుంది.
పోన్లెండి, నా కారణంగా దాన్ని మించిన పద్యం అందించారు! :)
అఒనండీ ఫణీంద్ర గారూ! నీటిపైన నావ నిలుపుట సరికాదు అన్నది పరాకున నడపుట అని వ్రాసాను. మీరు గుర్తించి చెప్పినందుకు ధన్యవాదాలు. మార్చి మరల పంపితిని. గమనింప మనవి.
నీటి పైన నావ నిలుపుట సరిపోదు. బస్సు కూడ నీట ప్రబల వలె వ టంచు శాస్త్ర వేత్త యద్భుతంబుగ చేసె. బస్సు నీటఁ దేలె పడవ వోలె.
ఆర్యా!
రిప్లయితొలగించండిమీరిచ్చిన సమస్యకు నా పూతణను తిలకించండి.
నీటి పై నావ నడపుట సరిపోదు.
బస్సు కూడ నీట ప్రబల వలెన
టంచు శాస్త్ర వేత్త యద్భుతంబుగ చేసె.
బస్సు నీటఁ దేలె పడవ వోలె.
ఇక నా సమస్య నవలోకించండి.
కారు మేఘాలలోన షికారు చేసె.
అక్షరం ముద్రితం కాకపోతే మళ్ళీ సరిచేసి ప్రచురిస్తున్నాను.
రిప్లయితొలగించండినీటి పైన నావ నడుపుట సరిపోదు.
బస్సు కూడ నీట ప్రబల వలె వ
టంచు శాస్త్ర వేత్త యద్భుతంబుగ చేసె.
బస్సు నీటఁ దేలె పడవ వోలె.
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
ముద్దులొలుకుచున్న అద్దాల బస్సది
రిప్లయితొలగించండిఅదుపుతప్పి జారి నదిని జేరె
చుక్క దూరలేదు చక్కగా సీలుండ
బస్సు నీటఁ దేలె పడవ వోలె
చదువరి గారూ,
రిప్లయితొలగించండిపూరణ చాలా బాగుంది. అభినందనలు.
రామకృష్ణారావు గారి సమస్యకు పూరణను అవధరించండి:
రిప్లయితొలగించండినరుడొకపరి హరినిజేరి యరదమెక్కి
కారుమేఘాలలోన షికారు చేసె
భీకరధ్వనుల ప్రజలు భీతిచెంది
అర్జునర్జునయని జేసి రార్తరవము
చిన్నతనమునఁ జూచితి చిత్ర మొకటి
రిప్లయితొలగించండిఆదియె "దొరికితే దొంగలు" అందులోన
ధూళిపాల చేసిన మందుతోడఁ జూడ
కారు మేఘాలలోన షికారు చేసె.
చదువరి గారూ,
రిప్లయితొలగించండిరామకృష్ణారావు గారి సమస్యకు మీ పూరణ చాలా బాగుంది.
కట్టె త్రిభుజమొకటి, కాగిత రాంబస్సు
రిప్లయితొలగించండినొకటి నీట విడువ నుల్లసమున,
మునిగె త్రిభుజము, మరి ముదముగఁజూడ రాం
బస్సు నీటఁ దేలె పడవ వోలె!!
రాంబస్సు = చతురస్రము వంటి ఒక ఆకారము
బస్సు నీటి యందు పడినప్పు డెప్పుడు
రిప్లయితొలగించండిమునిగి పోవు నీట పూర్తి గాను
బస్సు పడవ గాక బస్సెయై నపుడెట్లు
బస్సు నీటఁ దేలె పడవ వోలె?
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిహరి దోర్నాల గారూ,
ఒకరిని మించిన వారొకరు. మీ చక్కని పూరణలతో నా బ్లాగుకు శోభ తెస్తున్నారు. ధన్యవాదాలు.
చదువరి పూరణ చూచితి.
రిప్లయితొలగించండిముదమొప్పెడి శంకరయ్య పూరణ గంటిన్
మదులకు ముదమును గొలిపెను.
సదయులు మీ కిరువురికిని సలిపెద నుతులన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితెచ్చు బొమ్మలన్ని నిరుగగొట్టుచు నీట
రిప్లయితొలగించండిముంచి ఆటలాడు ముద్దు పాప
కొరకు బస్సుఁ దేగ విరిగెనదియు.బొమ్మ
బస్సు నీటఁ దేలె పడవ వోలె
హరి త్రివిక్రముడయి అఖిలాండమును నిండ
హరిపదాబ్జ గంగ హరిపదపరి
మాణమందు భంగి బ్రహ్మాండమగుచో న
భస్సు నీటఁ దేలె పడవ వోలె
(వామనావతారుడైన హరి అంతకంతకు పెరుగుతూ, అఖిలాండాన్ని ఆక్రమిస్తున్నాడు. విష్ణుపాదజాత గంగ, ఆయన పాదాలను కడగాలని, తనూ ఆ పాదాల పరిమాణానికి అనుగుణంగా బ్రహ్మాండంగా పెరిగింది. అలా పెరిగిన గంగ (నీటి) లో నభస్సు (ఆకాశం) ఓ పడవలా తేలింది)
చేత వీణఁ దాలిచి విరించి సుతుడయ్యు
గగన భువనములఁ దిరుగు కలహ వర్తి
నారదుఁడను హరిపద గానముల సాహు
కారు మేఘాలలోన షికారు చేసె
విజ్ఞు లగువారి మాటలు విడిచి పెట్టి
రిప్లయితొలగించండిప్రభువు నేనంచు ఆర్డరు పాసు చేసి
రాజు గాలి మోటరు ఎక్కి రాజ్య మేల
కారు మేఘాలలోన షికారు చేసె.
"నభస్సు నీటఁ దేలె పడవ వోలె" -బహుబాగున్నది, రవి గారూ!
రిప్లయితొలగించండిహరి గారూ, మీరు ఏ అర్థంలో రాసారోగానీ, మీ పూరణలో నాకు రాజశేఖరరెడ్డి, కేసీయారుల అర్థం స్ఫురించింది. లేక, నా ఆలోచనలన్నీ అదే ధోరణిలో సాగుతున్నాయో! :)
చదువరి గారు, ఇది చూడండి
రిప్లయితొలగించండివిజ్ఞు లగువారి మాటలు విడిచి పెట్టి
ప్రభువు నేనంచు ఆర్డరు పాసు చేసి
చావు లిఖియించి ఉందేమొ జాత కమున
కారుమేఘాలలోన షికారు చేసె.
చిరంజీవీ! రవీ!
రిప్లయితొలగించండిబస్సు నభస్సుగ మార్చిరి.
బస్సును బస్ బొమ్మ చేసి బహు జాగ్రతతో
నిస్సందేహముగా మన
బస్సును మున్నీట దేల్చి ప్రబలితిరి రవీ!
చేత వీణఁ దాలిచి విరించి సుతుడయ్యు
గగన భువనములఁ దిరుగు కలహ వర్తి
నారదుఁడను హరిపద గానముల సాహు
కారు మేఘాలలోన షికారు చేసె
ఈ కారు మేఘాలలో షికారు కొట్టుతున్నా ఆపి
అద్భుతముగ పూరించిరి.
సద్భావముతోడ మీరు సరసత తెలియన్
ఉద్భవ మగు పద భావము
లద్భుతమయ. కవి వరేణ్య! హాయిని గొలిపెన్.
చింతా రామకృష్ణారావు గారూ !
రిప్లయితొలగించండి" నీటి పైన నావ నడుపుట సరిపోదు " అన్న మీ పద్య పాదంలో యతి భంగమయింది. మీరు గమనించినట్టు లేదు.
ఒక్కొక్కసారి అలా జరిగిపోతుందిలెండి. సరి చేయండి
I thorouly enjoyed all the poems, specially the poems where 'bus' was converted into a telugu or sanskrit word, exhibiting the beauty of the poets' imagination.
రిప్లయితొలగించండిరవి గారు,
రిప్లయితొలగించండిఉదయము సమస్యను చూసినప్పుడు నేను కూడ నారద మహర్షినే తీసుకొని పూరిద్దామనుకున్న.
నేను అనుకున్న కీలక పాదము:-
దేవ ముని నారద మహర్షి, ధీనిధి, అవి
కారు, మేఘాలలోన షికారు చేసె!
ఒకర్ని మించి ఒకరి పద్యాలండీ..చాలా బాగున్నాయ్.
రిప్లయితొలగించండిమహామహులందరూ పోటాపోటీ గా
రిప్లయితొలగించండితమ పాండిత్యాన్నీ చతురతను మేళవించి చూపగా
చదువరులకు పరమానందం
పద్య ప్రేమికులకు ఇది విందు భోజనం
( ఛందోబద్ధంగా రాయలేను. నాకు చేతనైనంతలో ఈ బ్లాగు పై నా అభిమానాన్ని చూపించుకునే ప్రయత్నం)
శంకరయ్య గారు,
మీకు నా వందనములు, అభినందనములు, కృతజ్ఞతలు
@ రవి -
రిప్లయితొలగించండిరవి గారూ, పద్యాల సాహుకారు అవుతున్నారు. అభినందనలు.
@ డా. ఆచార్య ఫణీంద్ర -
ఫణీంద్ర గారూ, ధన్యవాదాలు. చింతా వారి పూరణలో "నదులలోన నావ నడుపుట సరిపోదు" అని సవరిస్తే సరిపోతుందనుకుంటాను. చింతా వారేమంటారో?
@ మాధురి -
@ ప్రణీత స్వాతి -
@ సాయి ప్రవీణ్ -
నా బ్లాగులో కవిమిత్రుల పద్యాను చూసి మీరు ఆనందిస్తున్నందుకు తృప్తిగా, కించిత్తు గర్వంగా ఉంది. మీరడిగినట్లు కొందరు కవులు మాత్రమే పద్యాలకు వివరణలు ఇస్తున్నారు. సమయాభావం వల్ల నేనూ ఇవ్వలేక పోతున్నాను. క్షంతవ్యుణ్ణి.
@జిగురు సత్యనారాయణ గారు: నారదుడంటేనే మేఘాల మధ్య తిరిగే ఆయన కాబట్టి, ఎవరో ఒకరు ఇలా ఆలోచిస్తారని ఊహించాను.
రిప్లయితొలగించండి@కంది శంకరయ్య గారు: అప్పుడప్పుడు (వారాంతాలలో) వృత్తాలకు చెందిన సమస్యలూ ఇస్తే బావుంటుంది.
రవి గారూ,
రిప్లయితొలగించండిఇంతకు ముందే మీరు పూరించిన దత్తపది నా బ్లాగులో మొట్టమొదటి వృత్తమని వ్యాఖ్యానించాను. వృత్తంలో సమస్యలివ్వాలంటే ఔత్సాహిక కవులు ధైర్యం చేస్తారా అని అనుమానం. వారానికి ఒక సమస్య వృత్తంలో ఇవ్వమన్న మీ సలహా బాగుంది. తప్పక ఆచరణలో పెడతాను.
హరి గారూ,
రిప్లయితొలగించండిరెండో పద్యం మరింత బావుంది.
నా గత వ్యాఖ్య రాయడంలో మీ మొదటి పూరణ బావులేదని కాదండి.. పద్యార్థం నాకలా స్ఫురించిందని చెప్పడమే! :) నిజానికి ఆ పద్యమూ బావుంది.
పోన్లెండి, నా కారణంగా దాన్ని మించిన పద్యం అందించారు! :)
అఒనండీ ఫణీంద్ర గారూ!
రిప్లయితొలగించండినీటిపైన నావ నిలుపుట సరికాదు
అన్నది పరాకున నడపుట అని వ్రాసాను.
మీరు గుర్తించి చెప్పినందుకు ధన్యవాదాలు.
మార్చి మరల పంపితిని. గమనింప మనవి.
నీటి పైన నావ నిలుపుట సరిపోదు.
బస్సు కూడ నీట ప్రబల వలె వ
టంచు శాస్త్ర వేత్త యద్భుతంబుగ చేసె.
బస్సు నీటఁ దేలె పడవ వోలె.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
సముద్రయానం చేసే కొలంబస్ అను నావికుడు
ప్రమాదానికి లోనైతే :
01)
____________________________________
క్రొత్త దీవుల గన - కోరిక నాతడు
పడవ పైన నబ్ధి - పయన మయ్యె !
అబ్ధి మునుగ పడవ - అందున్న ,యా కొలం
బస్సు , నీటఁ దేలె - పడవ వోలె !
____________________________________