18, డిసెంబర్ 2016, ఆదివారం

సమస్య - 2228 (తాళములో నుండు కప్ప....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తాళములో నుండు కప్ప దడదడలాడెన్"
లేదా...
"తాళములోని కప్ప కడుఁ దల్లడమందె భయార్తచిత్తయై"
(ఒక అవధానంలో గరికిపాటి వారిని అడిగిన సమస్య)

25 కామెంట్‌లు:

  1. వేళల సామాన్యమ్ముగ
    తాళము కప్పలన దిరుగు ధారాళముగా
    తాళము బిగువగ ద్రుప్పున
    తాళములో నుండు కప్ప దడదడలాడెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "తాళములో నుండు కప్ప"

      అనగా నిచ్చట భావం:

      తాళములో చిక్కిన కప్ప

      తొలగించండి
  2. వ్యాళమును గాంచి నంతనె
    తాళము లోనుండు కప్ప దడదడ లాడెన్
    కాళము పైదిరుగు జనులు
    కాళింది సోయగములవి కనువిం దనుచున్
    --------------------------
    కాళము = ఒక రకపు ఓడ

    రిప్లయితొలగించండి
  3. డా.పిట్టా
    తాళపు రంధ్రము నెటులో
    కాళిడి జొరె కీటకమును గళమున వేయన్
    కేళిగ నమరిన "చెవి"కా
    తాళములోనుండు కప్ప దడదడలాడెన్
    మేళమువాడు తాళముల మెట్టుల నుంచి ప్రసాద వేళలో
    హేళగ దెర్చి బెట్ట కడహీనపు షట్పద మందనుండ భే
    తాళుని మాడ్కి నోటగొన మార్కొన జొచ్చె ఘటంబనే భ్రమన్
    తాళము గొట్టగా నకట!తాండవ దీధితి కోర్వలేక నా
    తాళములోని కప్ప కడు దల్లడమందె భయార్తచిత్తయై!

    రిప్లయితొలగించండి


  4. మేళముల జోరు గనుచున్
    ‌పాిిళిక శంకరునికొలువు పద్య ఢమఢమ
    ల్నాళములజీల్చగన్ పా
    తాళములో నుండు కప్ప దడదడలాడెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. వేళకుఁ దిండి లేక కడు భీతిలి యాఁకలి హెచ్చుచుండఁగన్
    గూళ యొకానొకం "డనకొండ" యనంగనుఁ బిల్చెడిన్ "హరి
    త్కాళము" చెర్వునం జొరఁగఁ, దత్సమయమ్మునఁ గాంచినట్టి పా

    తాళములోని కప్ప, కడుఁ దల్లడమందె భయార్తచిత్తయై!

    రిప్లయితొలగించండి
  6. వేళా కోలము కాదిది
    కాళిందుని బట్నమందు కాతర మగు నా
    నా ళపు టడుగున గల పా
    తాళములో నుండు కప్పదడదడ లాడెన్

    రిప్లయితొలగించండి
  7. గరిక పాటి వారి కమ్మని పూరణ
    దెలుపు డా ర్య !యిచట తెలిసి కొందు
    మతని పూరణంపు చాతుర్య ప్రతిభను
    గరిక పాటి కాడు గరిక పాటి

    రిప్లయితొలగించండి
  8. హాళిని యెప్పుచు ముదమున
    కేళీ లాసమ్ము నందు కేరిడబోవన్
    వ్యాళము బుసబుసలు విని పా
    తాళములో నుండు కప్ప దడదడ లాడెన్!

    రిప్లయితొలగించండి
  9. వ్యాళము రాగ లోపలకు బంధు జనంబులు వేసె దా
    తాళము ,లోని కప్ప కడు దల్లడ మందె భయార్త చిత్తయై
    వ్యాళము జూచి నంతటను వ్యాకులచిత్తము దోడనత్తఱిన్
    వ్యాళము గాంచినన్ భయము బారిని నొందుట సాజమే కదా

    రిప్లయితొలగించండి
  10. …………… ..…………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    [ ఒక ఊరి ప్రక్క చెరువు దగ్గర ఒక తాటి

    చెట్టు నేలను తాకుచు వ౦గి యున్నది . ఆ

    తాటి చెట్టు యొక్క తాటాకుల లోపలికి , ఒక

    కప్ప చొరబడినది . దానిని ఒక పాము మ్రి౦గ

    యత్ని౦ప , కప్ప భయపడి తల్లడిల్లెను ]
    ి


    పాళెము ప్రక్క చెర్వు కడ , వ౦గుచు ,

    . నేలను తాకు చున్న యా

    తాళపు టాకు ల౦దు c దగ దాగెను

    . మ౦డుక మొక్క | ట౦తలో

    వ్యాళము దాని మ్రి౦గుటకు య త్న

    . మొనర్ప , వడ౦కె | కావునన్

    దాళము లోని కప్ప కడు దల్లడ మ౦దె ,

    . భయార్త చిత్త యై ! !


    { పాళెము = ఊరు ; తాళపు టాకు = తాటి

    యాకు ; మ౦డుకము = మ౦డూకము ;

    వ్యాళము = సర్పము }
    ి

    రిప్లయితొలగించండి
  11. తాళము పొమ్మన పొరుగున
    తాళము నింటికిని వేసి తాళము క్రిందన్
    తాళము వేయగ నా పా
    తాళములో నుండు కప్ప దడదడలాడెన్.

    రిప్లయితొలగించండి
  12. తాళపు చెవి యొండున రే
    వేళం గలముం డొకండు వేగోద్ధతినిం
    దాళపు కప్పను దెరువగఁ
    దాళములో నుండు కప్ప దడదడ లాడెన్


    ఆళి వధూమతల్లి నలినాక్షి జిగీష నొకండు గాత భూ
    గోళపు వాసు లెల్ల మృదు కోకిల రావమనంగ మెచ్చ హిం
    దోళపు రాగ మంద వడిఁ దోరపు రాగముఁ జేరలేమి యా
    తాళములోని కప్ప కడుఁ దల్లడమందె భయార్తచిత్తయై

    [లోనికి+అప్ప=లోనికప్ప]

    రిప్లయితొలగించండి
  13. నాళీకాకరము తటిని
    తాళవనమునందు పుట్ట దాగిన ఖలుడౌ
    వ్యాళము బుస కొట్టగ విని
    తాళములో నుండు కప్ప దడదడ లాడెన్

    రిప్లయితొలగించండి
  14. వేళయె దాటి పోయెనని వేగముగా దన యింటికేగగన్
    తాళము వేసి తాస్వగృహ దారిని పట్టెను, కాలిబాటలో
    వ్యాళము గానిపించెనట బావకు చెల్లెలి కొట్టుయందు కాం
    తాళము లోని కప్ప కడు దల్లడ మందె భయార్త చిత్తయై

    అళము = ఉప్పమ్మెడు దుకాణము
    కాంత+అళము = కాంతాళము

    తాళము ను వేసి వెళ్ళితి
    కాళీ మందిరము చెంత గడబడ గాంచన్
    వ్యాళము గనియట మాకాం
    తాళములోనుండు కప్ప దడదడ లాడెన్

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువుగారికి నమస్కారములు. నేను గత రెండు రోజులుగా లేకపోవుట వలన పూరణలు పంపియుండలేదు. ఇప్పుడు పంపుతున్నాను. దయతో పరిశీలించండి.

    16-12-2016:

    వర్తకుండొక్కడు శిఖరి పట్టు నుండి
    నెంచు కాసులు జిగిదేఱి నివ్వటిల్ల
    వెఱగు బడుచుండి వెఱ్ఱివై వృక్షము దిగి
    కాసులు గని వచ్చె గపులు గంతు లిడుచు.

    17-12-2016:

    దేవు డనెడి వాని తెఱగు దెలియకుండు
    నకృత బుద్ధులైన నాస్తికులకు
    పరమపదము నుండి యిర కొచ్చిన హరి యా
    తిరుమలేశు డెట్లు దేవు డగును?

    18-12-2016:

    గోళము వంటి దొకటి యొ
    గ్గాళమగు రోదను బఱచుచు కాటమ్ము న్నా
    తాళము నంటుచు బడ పా
    తాళములో నుండు గప్ప దడదడ లాడెన్.

    రిప్లయితొలగించండి
  16. వ్యాళముగనుగొనగా కౌ
    తాళము లోనుండుకప్ప దడదడ లాడెన్
    వేళా పాళము లేకను
    తాళుట కష్టంబె పాముతాకిడి వినగా| {కౌతాళము=అదియొకఊరు}
    2.తాళుట కష్ట సాధ్యమని దాగిన కప్పకుగుర్తురాగ?ఆ
    .వ్యాళము వేగమున్ గదల?వాసము వీడుట తప్పదాయె|కౌ
    తాళము లోనికప్ప కడు తల్లడ మందె భయార్త చిత్తయై|
    హేళన జేయలేని బలహీనత లందున ధైర్య మెంచకన్.









    రిప్లయితొలగించండి
  17. కాళియ నామకుండొకడు కాంతయు దానును పట్నమేగి య
    వ్వేళగృహంబుజేరి గడి వెంబడి శబ్ద మదేమిటో గదా
    తాళుము చూతమంచు పరదా దొలగించినమీద తీయగా
    తాళము, లోని కప్ప కడు దల్లడమందె భయార్త చిత్తయై.

    కాళియుడు ధర్మపత్నియు
    కాళిని బూజింప గుడికి క్రమమొప్పగన
    వ్వేళకును జేరి తీయగ
    తాళము, లోనుండు కప్ప దడదడ లాడెన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  18. తాళము కప్పును గనుమని
    కూలయొకండిడెను తుప్పు కూడిన కప్పన్,
    తాళము దూరియు కదలక
    తాళములో నుండు; కప్ప దడదడలాడెన్

    రిప్లయితొలగించండి
  19. వేళయె దాటి పోయెనని వేగముగా గృహ మేగ బోవుచున్
    దాళము వేసి నే నడుచు దారిన గాంచితి, వ్రేటువడ్డ యో
    వ్యాళము , నన్ను గాంచినది యాగ్రహమందున, గాంచెదాని కా
    తాళము లోని కప్ప , కడు దల్లడ మందె భయార్త చిత్తయై

    కాతాళము =కోపము


    తాళము ను వేసి వెళ్ళితి
    కాళీ మందిరము చెంత గడబడ గాంచన్
    వ్యాళము గాంచితి నదికా
    తాళములోనుండు కప్ప దడదడ లాడెన్

    రిప్లయితొలగించండి
  20. చక్కని పూరణ లందిస్తున్న కవిమిత్రులకు అభినందనలు, ధన్యవాదాలు!
    కొన్ని ముఖ్యమైన పనుల్లో వ్యస్తుణ్ణై మీ పూరణలను సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.
    ఎల్లుండి నుండి తప్పక సమీక్షిస్తాను.

    రిప్లయితొలగించండి
  21. మహిత చింతామణీ వేశ్య మంత్రమిడగ
    కొలిచి కృష్ణుని లీలాశుకుండు మహిని
    వెలసె.వేశ్యను వీక్షించి వేదవిదులి
    డిరి నతుల్ భక్తి మార్గమ్ము నరసి కొనుచు.

    రిప్లయితొలగించండి
  22. కాళీ మందిరమున భూ
    మాళిగలోపలకు చేర మండలి రయమున్
    కాలముమూడెననుచు గజ
    తాళములో నుండు కప్ప దడదడలాడెన్

    రిప్లయితొలగించండి
  23. తాళము సుల్వుగా తిరుగ, తప్పక వచ్చును లాగగానె నా
    తాళము కప్పనుంచి; మరి దండిగ త్రుప్పట చేరగానయో
    తాళము వీడిరాక; నటు తాళము లోనను కప్ప చిక్కగా
    తాళములోని కప్ప కడుఁ దల్లడమందె భయార్తచిత్తయై :)

    రిప్లయితొలగించండి