2, డిసెంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2214 (సాని పొందున్నవారలే...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"సాని పొందున్నవారలే సత్పురుషులు"
లేదా...
"సానుల పొందు గల్గిననె సత్పురుషుల్ యశమున్ గడింతురే"

59 కామెంట్‌లు:

  1. ఆశు కవిత జెప్పుట యందు నగ్రగామి
    జోగు జలపాతమును బోలు జోరు గలిగి
    తనరు చున్నట్టి యాయవ ధాని మేడ
    సాని పొందున్న వారలే సత్పురుషులు.

    రిప్లయితొలగించండి
  2. మేనున మోహమున్ విడిచి మేటిమహామహి తాన్వులందరిన్
    బూనిక తోడ గొల్చియు తపోధనులన్ యెడ బాయకుండగన్
    దేనికి లొంగకుండ తమ దేహవిమోహమున్ వీడి పూజ్యులౌ
    సానుల పొందు గల్గిననె సత్పురుషుల్ యశమున్ గడింపరే?

    రిప్లయితొలగించండి
  3. పునరుక్తి దోషము సవరింపవలసి యున్నది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'జోగు...'?
      రెండవ పూరణలో 'మహిత+అన్వులు'...? 'తపోధననులన్+ఎడబాయక' అన్నపుడు యడాగమం రాదు. 'దేహవిమోహము' అన్నచోట గణదోషం. సవరించండి.

      తొలగించండి
  4. రాయ లాస్తాన మందున రసిక రాజు
    అన్న వలెత్రాణ కవనముల్ మిన్న గాను
    గండ పెండెర మునుపొందె ఘనుడు నల్ల
    సాని పొందున్న వారలే సత్పు రుషులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      అల్లసానిని ప్రస్తావిస్తూ పూరణ చెప్పడం బాగుంది.
      కాని 'త్రాణ కవనముల్'...?

      తొలగించండి
    2. క్షమించాలి
      "త్రాణ అన్నవలె "
      "మిన్నయైనవి కవనములు" అని నాఉద్దేశ్యము నమస్కారములు
      తప్పైతె ఏముంది ? మన్నించడమె మరి

      తొలగించండి
  5. పరుగులిడి త్రాగు చిక్కటి పాల కన్న
    నిలిచి దప్పి దీర్చెడి మంచి నీరు మేలు
    దాన హీనుడౌ దొరకన్న...దయగల దొర
    సాని పొందున్న వారలే సత్పురుషులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పరుగిడి త్రాగు...' అంటే గణదోషం. ముందున్నదే బాగున్నది. లేదా 'పరు గిడుచు త్రాగు...' అనండి.

      తొలగించండి
  6. మేనులు రంజిలం గమది మోహము నందున దేలియా డగన్
    మేనక వంటియ ప్సరస మీరిన వంపుల సోయగమ్ము లన్
    కానక త్రోసిరా జనిన కాంతలు నెంతయు నిచ్చగిం చరే
    సానుల పొందు గల్గిననె సత్పురుషుల్ యశమున్ గడింతురే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరు గణాలవారీగా కాక పదాలవారీగా టైప్ చేయండి.

      తొలగించండి


  7. జ్ఞాన సముపార్జ నాసక్తి చక్క గలిగి
    గురువు లందరిని గనుచు గుణికి తెలుసు
    కొనవలె పలుకుజిలుకలకొల్కియ దొర
    సాని పొందున్నవారలే సత్పురుషులు!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. బానల వంటి పొట్టలును బంగరు భూషలు "శ్రేష్ఠి" దేహులై
    చానల జూడ వెర్రిగొను చాడ్పున వేశ్యల యిండ్లలో జొరన్
    కానని వ్యాధులే "సుఖ"ము గన్న వశేషణమున్న, బాధలౌ
    సానుల పొందు గల్గిననె ; సత్పురుషుల్ యశముల్ గడింతురే!!
    వ్రేళ్ల బది యుంగరములున్న వెర్రి శ్రేష్ఠి
    భూష లొక్కొక్కటియు గొన్న భూములుడిగె
    చూచి చిత్రాంగి నటనల సూక్తి గనని
    సాని పొందున్న వారలే? సత్పురుషులు?!డా.పిట్టా నుండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. వృత్తి ధర్మాన తిరిగెడు పెనిమిటుండ
    సంతు పోషణ, నడతల చక్కఁజూచు
    విద్యఁ గల్గిన సంస్కారి విలువల నెర
    సాని పొందున్న వారలే సత్పురుషులు
    ( నెరసాని = నేర్పరియైన స్త్రీ )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పెనిమిటి+ఉండ' అన్నపుడు యడాగమం వస్తుంది. 'విభుడు గలుగ' అందామా?

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పూరణ:

      వృత్తి ధర్మాన తిరిగెడు విభుఁడు గలుగ
      సంతు పోషణ, నడతల చక్కఁజూచు
      విద్యఁ గల్గిన సంస్కారి విలువల నెర
      సాని పొందున్న వారలే సత్పురుషులు
      ( నెరసాని = నేర్పరియైన స్త్రీ )

      తొలగించండి
    3. గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పూరణ:

      వృత్తి ధర్మాన తిరిగెడు విభుఁడు గలుగ
      సంతు పోషణ, నడతల చక్కఁజూచు
      విద్యఁ గల్గిన సంస్కారి విలువల నెర
      సాని పొందున్న వారలే సత్పురుషులు
      ( నెరసాని = నేర్పరియైన స్త్రీ )

      తొలగించండి
  10. మోక్షదాతయై చరియించి వీక్షణముల
    కల్పవల్లియై కరుణించు గౌరి, గనగ
    లలిత సదయాంతరంగ, పరమశివు దొర
    సాని పొందున్న వారలే సత్పురుషులు!

    పొందు=అనుకూల్యము

    రిప్లయితొలగించండి
  11. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    వాణి - గీర్వాణి - సుమధుర వాణి - మరియు

    సరసిజజు రాణి - చల్లని చదువుల దొర

    సాని పొ౦దున్న వారలే సత్పురుషులు !

    వాణి దయలేని వారల బ్రతుకు బ్రతుకె ? ?

    రిప్లయితొలగించండి
  12. విద్యగల వారల కిపుడు విలువలేదు
    కలియుగమ్మున సతతము కలిమికి దొర
    సాని పొందున్న వారలే సత్పురుషులు
    నేతలై వారు దేశము నేలుచుండ్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. చదువు సంస్కారముల మేటి చతురు డగుచుఁ
    బరుల ధుఃఖము మరలింపఁ బాటు పడుచు
    నన్య దారలఁ గోరక యవనిఁ దనదు
    సాని పొందున్నవారలే సత్పురుషులు

    [తనదుసాని = తన భార్య]


    దాన గుణప్ర వృద్ధ పర దార ధనాళి విముక్త మానసుల్
    మానవ ధర్మ సంస్థిత సమంచిత భావ సమాశ్రితాత్ములున్
    దానవ నైజహీన గురు ధార్మిక సద్గుణ సత్యయుక్త స
    త్సానుల పొందు గల్గిననె సత్పురుషుల్ యశమున్ గడింతురే

    సత్సానువు= మంచి మార్గము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  14. ఆరితేరి యష్టావ ధానాన,ఘన శ

    తావధానమునను, సహస్రావ ధాన

    మునను సఫలత నొందిన ఘనుడు మేడ

    సాని పొందున్న వారలే సత్పురుషులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి. 'ప్రముఖుడయ్యు యష్టావధానమున...' అందామా?

      తొలగించండి
  15. కలిమి యున్నను కామమన్ కాంతగల్గ
    పొందజాలరు కీర్తి నే పురుషు డైన
    గాని నిరుపేదకైనను దానమనెడి
    సాని పొందున్న వారలే సత్పురుషులు

    రిప్లయితొలగించండి
  16. చాల మంది గల రట యీ జగము నందు
    సాని పొందున్న వారలే ,సత్పురుషులు
    శక్తి గొలదిని బరులకు సాయము నిల
    జేయువారలే జగతిని శేఖరన్న !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శీల కుల గుణ విభవమ్ము చెన్ను నమరి
    సందడించెడి వారల పొందు కంటె
    విద్య గూడుచు ననయము వేల్పుమిన్న
    సాని పొందున్న వారలే సత్పురుషులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. సానుల పొందు గల్గిననె సత్పు రుషుల్ యశమున్ గడింతురే
    సానుల పొందునున్ గలుగ సత్పురు షుండ గు టొప్పునే ధరన్
    సానుల గూడుచున్మసల జాడ్యము లెన్నియొ గల్గునే గదా
    తానుగ మంచియై యొరుల తా పము దీర్చిన గీర్తిగల్గు నున్

    రిప్లయితొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    విధము నెంచని తీరున విభవ మొంది
    పొలుపు మీఱుచు నేపారు మెలన దోడ
    సంతత మిలను సాగుచు సంపదలకు
    సాని పొందున్న వారలే సత్పురుషులు.

    రిప్లయితొలగించండి
  20. మానిత కీర్తిమంతులును మాధవనామ జపాభిలాషులున్
    భానుసమానతేజ పరిభాసితవక్త్రకళా విరాజితుల్
    మౌనవిభూషణాఢ్యులసమాన తపో ధన సన్నిధాన స
    త్సానుల పొందు గల్గిననె సత్పురుషుల్ యశమున్ గడింతురే

    రిప్లయితొలగించండి
  21. జ్ఞానము గల్గి నిత్యమును గానముఁ జేయుచు రామనామమున్
    వీనుల విందుగా, కరము ప్రేముడి పేదల చింతమాన్పగా
    దానము చేయుచున్, సతము ధార్మిక కార్యములన్ చెలంగు స
    త్సానుల పొందు గల్గిననె సత్పురుషుల్ యశమున్ గడింపరే

    రిప్లయితొలగించండి
  22. నాటి యల్లసాని కిలను సాటి గలరె!
    మేటి యవధాని ఈనాటి మేడసాని!
    వేఱు దొరసానుల దలపు వారి కేల?
    సాని పొందున్న వారలే సత్పురుషులు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారికి నమస్కారములు. నిన్నటి న్యస్తాక్షరి పద్యాన్ని కూడా చూడ గోరుతాను.
      ధన్యవాదములు.
      వియ్యమందెడి వేళల విఙ్ఞులైన
      వారలు మది నెంచరు వస్తు వాహనముల!
      హర్షమందుచు సుగుణాల నతివ గాంచి
      ముదము తోడ వేడుక లందు మునుగుచుంద్రు!

      తొలగించండి
    2. శ్రీధర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  23. డా.పిట్టానుండి
    "వశేషణము" టైపాటు. విశేషణము సుఖవ్యాధి అనే పదంలో సుఖ విశేషణమైనది కాని అది మర్మరోగము

    రిప్లయితొలగించండి
  24. దానము జేయుచున్నెపుడు ధర్మము వీడక దా జరించుచున్
    భానుకులాన్వయుండయిన పావన రాముని పాదసేవతో
    మానవ లోకమం దు మహిమాన్విత కీర్తిని బొందువారు స
    త్సానుల పొందు గల్గిననె సత్పురుషుల్ యశమున్ గడింతురే

    బ్రహ్మ మానస రాణి యా వాసరాంబ
    కచ్ఛపీనాద మొలకించు కమలనయన
    సత్కృపయె యున్న చాలదె చదువులదొర
    సాని పొందున్నవారలే సత్పురుషులు

    రిప్లయితొలగించండి
  25. తీయనైన మాటల నాడి తెలివితోడ
    పబ్బము గడుపు కొనియెడు వారు ధరను
    కొందరుందురు వసుధలో కూరిమిదొర
    సాని పొందున్నవారలె సత్పురుషులు.

    రిప్లయితొలగించండి
  26. దీనులు గాకపోరు”విదేయతకమ్ముడుగాగ కాముడై
    సానులపొందు గల్గె ననె”|”సత్పురుషుల్ యశమున్గడింతురే
    మానక మానవత్వ పరిమాణ,సమానత నేర్పు,కూర్పునన్
    పూనిక చేత సర్వులకు పూర్తిగ బంచగ?దైవ రూపులే|
    2.సానిపొందున్న వారలే సత్పురుషులు
    గారు కాలేరు కామవికార మందు
    స్వార్థ తత్త్వమె గమనించ సానిగాగ?
    లాభ,లోభంపులీలల శోభగాదు|



    రిప్లయితొలగించండి
  27. కష్టసుఖముల యందున నిష్టసఖిగ
    వెన్నుదన్నుగ తానుండి మిన్నగాను
    కన్నతల్లిని మరపించు గాదిలి,నెర
    సాని పొందున్న వారలే సత్పురుషులు!!!

    రిప్లయితొలగించండి
  28. వృత్తి ధర్మాన తిరిగెడు పెనిమిటుండ
    సంతు పోషణ, నడతల చక్కఁజూచు
    విద్యఁ గల్గిన సంస్కారి విలువల నెర
    సాని పొందున్న వారలే సత్పురుషులు
    ( నెరసాని = నేర్పరియైన స్త్రీ )

    రిప్లయితొలగించండి
  29. కానగ కాంగ్రెసందునను గౌరవనీయ పటేలు నుండెనే
    వానిని కొల్వరే భటులు వంగుచు వ్రాలుచు సోనియమ్ముకున్...
    మానిని మౌంటుబాటెనును మచ్చిక జేసిన నెహ్రువోలుచున్
    సానుల పొందు గల్గిననె సత్పురుషుల్ యశమున్ గడింతురే!

    మానిని = Lady
    సాని = అధిపురాలు

    రిప్లయితొలగించండి