17, డిసెంబర్ 2016, శనివారం

సమస్య - 2227 (తిరుమల వేంకటేశ్వరుఁడు....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తిరుమల వేంకటేశ్వరుఁడు దేవుఁడు గాఁడని చెప్పి రెల్లరున్"
లేదా...
"తిరుమలేశుఁ డెట్లు దేవుఁ డగును"
ఈ సమస్యను సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

31 కామెంట్‌లు:

 1. వరముల కోరివచ్చు తన భక్తుల కోర్కెలు తీర్చు దైవమై
  స్థిరముగ మానసమ్ముల వసించెడు వాడగుశ్రీనివాసుడే
  అరయగ గొప్పదైవమని నాంధ్రము, నాంగ్లము రెండు బాసలన్
  "తిరుమల వేంకటేశ్వరుఁడు దేవుఁడు గాఁడని చెప్పి రెల్లరున్"
  (దేవుడు, God +అని)

  రిప్లయితొలగించండి
 2. వరముల నిచ్చు వేలుపని భక్తిగ మ్రొక్కులు దీర్చకొండపై
  కురులను దీసి యిత్తురట కోటుల కాసుల నీయకున్నచో
  పరుసము లేక దీనులను బాధలనుండి విముక్తి చేయగన్
  తిరుమల వేంకటేశ్వరుఁడు దేవుఁడు గాఁడని చెప్పిరెల్లరున్

  రిప్లయితొలగించండి
 3. మహిమ పేర ముడుపు మైకమందు మునిగి
  కోట్ల కొలది ధనము కుమ్మ రించి
  లంచ మిడిన గాని వంచనే జేసిన
  తిరుమలేశుఁ డెట్లు దేవుఁ డగును .

  రిప్లయితొలగించండి
 4. డా.పిట్టా
  అప్పునడుగబోగ నటునిటు జనములె
  రెప్పపాటు విడుపు లేక నరుల
  మెప్పుబొంద ధనదు అప్పు హళ్ళికి హళ్ళి
  తిరుమలేశుడెట్లు దేవు డగును?!
  పరువుకు బోయి యప్పులను బాయక గుందెడు వాని వైనమున్
  బరువగు వడ్డి కాసులకె బండగ మారిన వాని కష్టముల్
  సరియగు వర్తనన్ ఋణము సాంతము దీర్చెడు నా ప్రతిజ్ఞలన్
  తిరుమల వేంకటేశ్వరుడు దేవుడు గాడని చెప్పిరెల్లరున్

  రిప్లయితొలగించండి
 5. [తిరుపతిలో జరిగిన సభలలో మహమ్మదీయులు, క్రైస్తవులు కలియుగ దైవమగు వేంకటేశ్వరునిం గూర్చి పలికిన సందర్భము]

  "వరమిడి ప్రోచు హిందువుల పాలిటి దైవము వేంకటేశ్వరుం
  డిరవుగఁ బ్రోచి కావఁగను హెచ్చగు దైవమె! కాని, యెప్పు డా
  కరమయి మహ్మదీయునకుఁ గ్రైస్తవుకుం గొలువంగఁబోని యా

  తిరుమల వేంకటేశ్వరుఁడు దేవుఁడు గాఁ" డని చెప్పిరెల్లరున్!

  రిప్లయితొలగించండి
 6. తిరుమలేశు డెట్లు దేవు డగుననుట
  నాస్తికుల పలుకులు నమ్మ వలదు
  కలియుగమున మనకు కాంక్షితములు దీర్చు
  దైవ మాయనగద కవి వరేణ్య !

  రిప్లయితొలగించండి
 7. తిరుమల వేంకటేశ్వరుడు దేవుడు గాడని చెప్పి రెల్లరున్
  తిరుమల వేంకటేశ్వరుడు దేవుడు కాక మరేమగున్నిల
  న్నురమును సాక్షిగా జెపుమ యోకవి పుంగవ ! వేంకటేశుఁడున్
  ధరణిని దైవమే గదయ దా మనబోటి సుభక్త కోటికిన్

  రిప్లయితొలగించండి
 8. వరముల నిచ్చుదేవుడని వాంఛలుదీరగ వేగమేజనన్
  తిరుమలకొండమీదికి,విధిన్ వికటించి ప్రమాదమేర్పడన్
  తరిమిన గాయముల్ వ్యధల తాళగజాలక కోపముజూపుచున్
  తిరుమల వేంకటేశ్వరుడు దేవుడు గాడని జెప్పిరెల్లరున్

  రిప్లయితొలగించండి
 9. దేవుడన్న వాఁడు జీవుఁడుఁ గాడని
  నమ్ము చుండ రాతి బొమ్మయనుచు
  మ్రొక్కు వారికెపుడు దక్కఁగ ఫలమౌచు
  తిరుమలేశుఁడెట్లు దేవుఁడగును

  రిప్లయితొలగించండి
 10. వరము లిచ్చి బ్రోచు భక్తుల నెల్లడ
  తిరుమలేశు; డెట్లు దేవుడగును
  మహిమ లేక మహిని, మనసున గొలచిన
  వరము లీయ బోని వట్టి రాయి!

  రిప్లయితొలగించండి
 11. కరుణను బ్రోచు భక్తులను కాన్కల నివ్వగ లేనివారలన్
  వరము లొసంగు వాడనుచు భక్తిగ గొల్చిన దైవమాతడే
  దురితులు నాస్తికుల్ నుడువు దుస్సహ దుర్భర వాక్కులే కదా
  తిరుమల వేంకటేశ్వరుడు దేవుడు గాడని జెప్పిరెల్లరున్


  రిప్లయితొలగించండి
 12. వరములనిడు వారు వందలు
  వందలు
  అమృత మిచ్చు వారలరుదు గాదె
  తిరుమలేశు డిట్లు దేవదేవుండాయె
  తిరుమలేశుఁ డెట్లు దేవుఁ డగును?

  రిప్లయితొలగించండి
 13. ఒనరగ బాహు యుగ్మమున నూపిరు లూదుచు కొంటె కృష్ణుడే
  తనువున బెంచినట్టి ఘన తాపము తాళక సత్యభామకున్
  కనులెరుపెక్కగా వివశ కామ విలాస ముఖారవిందమున్
  ఇన శశిబింబ యుగ్మముదయించె దినాంతము నందు దద్దిశన్

  రిప్లయితొలగించండి
 14. పరమ రసాయ నాంకగణ భౌతిక శాస్త్ర నికాయ సంపద
  న్నెరుగగ వచ్చునే? నరుల కీ భువనభ్రమ ణాపదేశముం
  గరువలి వేగ హేతువును గంటిరె? మూర్ఖులు హేతువాదు లీ
  తిరుమల వేంకటేశ్వరుఁడు దేవుఁడు గాఁడని చెప్పి రెల్లరున్


  సంస్కృతాంధ్ర పదములకు సంధి జేసి
  తిరిటఁ దత్సమ మీశుడు తిరుమల పద
  మిది వికృతి! యొదవు తిరుమలేశుఁ డెట్లు?
  దేవుఁ డగును వ్యాకరణము తెలియఁబరుప!

  పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. తిరుమల తత్సమ పదముగా తోచుచున్నది కాని తిరు దేశ్యము, మల ప్రాకృతసమము, సంస్కృత ప్రాకృత భవమునైన పదము.
  అత్వ సంధితో “తిరుమలీశుడు” సాధువని నాయభిప్రాయము. నా సందేహము తీర్చ గోర్తాను.
  తత్సమ పదము పరమైనచో అ త్వసంధి జరుగ వచ్చును కద.
  “క్రిందికి జనకగ్నియ పోలె” భా. ఆ. 2-60

  రిప్లయితొలగించండి
 15. అరయగ తల్లి తండ్రియును నాత్మ సఖుండును నెంచి చూడ సో
  దరుడును బంధువున్ గురుడు భావము నందున దోచుచుండి మే
  లరసెడి సేమకారకుడు నందరి కీ ధర నమ్మి కొల్చినన్
  తిరుమల వేంకటేశ్వరుఁడు దేవుఁడు గాఁడని చెప్పి రెల్లరున్.

  రిప్లయితొలగించండి
 16. కోర్కెలసరిదిద్దు కొంగుబంగారమే
  తిరుమలేశుఁ డెట్లు దేవుఁ డగును
  మాయమాటలాడి మహిళల వంచించు
  కుటిలుడైన యోగి కువలయమున

  రిప్లయితొలగించండి
 17. స్థిరమగు భక్తితోడుతను చేరిభజించిన కాచు నిత్యమున్
  తిరుమల వేంకటేశ్వరుడు, దేవుడు గాడని చెప్పిరెల్లరున్
  తరుణుల చేరదీయుచును తద్దయు కామముతోడ మానమున్
  చెఱచుచు మాయమాటలను చెప్పిచరించు ఫకీరు రూపునిన్

  రిప్లయితొలగించండి


 18. కొండ లయ్య సామి కోరికలను దీర్చు
  తిరుమలేశుఁ డెట్లు దేవుఁ డగును
  కోరికలను విడువ కొంచమైన నవకా
  శముల నివ్వక నిటు చల్ల జూడ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్నటి నుండి క్షణం తీరిక లేని పనులు, ఆ పనులకోసం ప్రయాణాలు. మీ పూరణలను చదివి, సమీక్షించడానికి అవకాశం లభించడం లేదు. మరో రెండు రోజులవరకు ఇదే పరిస్థితి. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనండి.
  మిత్రుల పద్యాలను (అవకాశాన్ని బట్టి) సమీక్షించవలసిందిగా పోచిరాజు కామేశ్వర రావు గారికి ప్రత్యేక విజ్ఞప్తి.

  రిప్లయితొలగించండి
 20. వినుచు రోజు కధను వివరమ్ము తెలియక

  తిరుమలేశు డెట్లు దేవుడగును

  ననుచు మనుమ డడుగ నా వేంకటేశుని

  కధను చెప్పె బామ్మ కమ్మగాను.

  రిప్లయితొలగించండి
 21. కురుల నైన నిడక కోరిన దిత్తునా
  పరుగు లెత్తి నాదు పదముల బడ ?
  ననెడు వాని నెపుడు నాస్తికుల నెదరు
  తిరుమలేశుఁ డెట్లు దేవుఁ డగును?

  రిప్లయితొలగించండి
 22. సురుచిర సౌఖ్యసంపదలు శుద్ధమనంబున తన్ను బిల్వగా
  నరుదగు సద్యశంబిడును హర్షము నింపును జీవనంబునం
  దిరుమల వేంకటేశ్వరుడు దేవుడు, గాడని చెప్పిరెల్లరున్
  వరమగు భక్తి గొల్చినను పల్కనివాడిల నీయుగంబునన్.

  ఉర్విజనుల గావ నుండ నీయుగమందు
  తిరుమలేశు, డెట్లు దేవు డగును
  ధరణిపైన నన్యు డరయంగ నారీతి
  పలుక కుండు వాడు దలచి యున్న.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 23. స్థిరముగ లోక రక్షణము జేయుచు నాశ్రిత పక్షపాతియై
  వరముల నిచ్చిభక్తజన బాధలు తీర్చెడుదేవుడే భువిన్
  తిరుమల వేంకటేశ్వరుఁడు , దేవుఁడు గాఁడని చెప్పి రెల్లరున్
  పురముల లోన క్రైస్తవము భూరిగ చాటెడు మతాధికారులే

  క్రైస్తవుండ్రకిలను క్రీస్తుయే దేవుండు
  తిరుమలేశుడెట్లు దేవుడగును
  వసుధ లోన హిందు బాంధవులెల్లరు
  వేంక టేశునితమ వేల్పులంద్రు

  రిప్లయితొలగించండి
 24. పరుగిడ నేల చర్చికిర పాపము దీర్చును గాడటంచురో
  పరుగిడ నేల మజ్దిదుకు వంగుచు నల్లహొ!యక్బరంచురో
  పరుగులు మాని రండురిట బంగరు కొండల దేవదేవుడౌ
  తిరుమల వేంకటేశ్వరుఁడు దేవుఁడు గాఁడని చెప్పి రెల్లరున్ :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. అరరే! యేసోబు! నిజము
   పరమాత్ముడొకండు చూడ ప్రభువత డేరా
   పరుగిడి రమ్మ శరణనగ
   తిరుమల రాయడు విభుండు దేవుడు "గాడే" :)


   జిలేబి

   తొలగించండి