10, డిసెంబర్ 2016, శనివారం

సమస్య - 2221 (బలవంతపు చావు వచ్చె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"బలవంతపు చావు వచ్చె భాస్కరున కటన్"
లేదా...
"బలవన్ముృత్యువు ప్రాప్తమయ్యె రవికిన్ బ్రారబ్ధకర్మంబునన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

45 వ్యాఖ్యలు:

 1. తన పరుగుల మించి పోటీ పరుగులిడుతున్న సిటీ వాసుల పరుగుల మించాలని పరుగుల పెంచబోయిన సూరీడు :)  యిలలో జనవాహిని యురు
  కుల పరుగుల తనను మీర, గురుతర భారం
  బుల మేల్పరుగుల బోవన్
  బలవంతపు చావు వచ్చె భాస్కరున కటన్ !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఇలలో' అని ప్రారంభించండి. పద్య ప్రారంభంలో యడాగమం రాదు.

   తొలగించు
 2. అల పీయూషము బంచువేళ తమలో నద్దానవుండుండుటన్
  దెలుపన్ శ్రీహరి వానికుత్తుకను వే ద్రెంపంగ నద్దాన నా
  ఖలుడూనెం గద దీర్ఘకాలమకటా! కక్షన్ గనుండందుచే
  బలవన్మృత్యువు ప్రాప్తమయ్యె రవికిన్ బ్రారబ్ధకర్మంబునన్.

  ఖలుడగు దైత్యుని యునికిని
  తెలుపుటచే హరికి యతడు ద్రెంచుట వానిన్
  దెలియమె మనమద్దానన్
  బలవంతపు చావు వచ్చె భాస్కరునకటన్.
  హ.వేం.స.నా.మూర్తి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 3. ఇలనేలెడి సూరీడట
  గలగల పారెడి నదివలె కాలము దాటన్
  విలసితముగ పరుగు లిడగ
  బలవంతపు చావు వచ్చె భాస్కరున కటన్

  ప్రత్యుత్తరంతొలగించు
 4. డా.పిట్టా
  కలవారి సేవ జేయుచు
  నల నొక దశ కోటి నోట్ల నౌరాయనగా
  మలచగ నే.సి.బి పట్టన్
  బలవంతపు చావు వచ్చె భాస్కరునకటన్
  ప్రళయంబెప్పుడొ గాంచి యోడక మనిన్ బాయంగ పంచాంగపున్
  కళలన్నెంచియు లెక్కవేసికొనియున్ కాలానుగుణ్యంబుగన్
  మలి జన్మంబది రాని తీరునను"దామైతామె బోనెంచు"చో
  బలవన్మృత్యవు ప్రాప్తమయ్యె రవికిన్ బ్రారబ్ధ కర్మంబునన్
  (ఏకాదశి మరణమని ఈతకొయ్యల్లోబడి చచ్చెనట అనే జాతీయం/సామెత ప్రచారంలో ఉన్నది.కాశీలోనే చావాలనిమా బంధువొకడు తన 90వ యేట వెళితే జాడ దొరుకడంలేదు.బలవన్మరణమే అని భావిస్తున్నాము.ఇది వరంగల్లో వార్తల్లోకెక్కని వార్త)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 5. ఆర్యా,డా.పిట్టానుండి
  మడికొండ ప్రఖ్యాత పూర్వకవి సంక్రాంతి వర్ణనలో కోడి పుంజు వీర మరణాన్ని ఉగ్గడిస్తూ
  కుక్కుటమ నీవు సుకృతివి కోరి యురిని॥బెట్టుకొన్నను చావులభింప దుత్తరాయణమ్మున....అని వ్రాశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఆ కవి డా.పల్లా దుర్గయ్యగారు
  డా.పిట్టా నుండి

  ప్రత్యుత్తరంతొలగించు
 7. శంకరయ్యగారికి...నమస్సులు!

  సమస్య పాదం...
  బలవన్మృత్యువు ప్రాప్తమయ్యె రవికిన్ బ్రారబ్ధకర్మంబునన్ అని యుండవలెను. టైపాటు దొరలినది. సవరించఁగలరు.

  సవరించుకొని పూరించిన సుకవి మిత్రులకు అభినందనలు!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఇలలో బుట్టిన ప్రాణికిన్ హనువు తప్పింపంపగా సాధ్యమే
  కలనైనన్ దలపోయ రాదనుచు నాకాశం బునన్ దేలుచున్
  కలువన్ జేరగ వేడుకంచు కులుకన్ గర్వోన్న తంబందునన్
  బలవన్మృత్యువు ప్రాప్తమయ్యె రవికిన్ బ్రారబ్ధ కర్మంబునన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అక్కయ్యా,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 9. అల రాహువు మ్రింగఁగ మఱి
  బలవంతపు చావు వచ్చె భాస్కరునకట
  న్నిల యంతయు జీకటి యయి
  చలనమునే లేకయుండె జగతి యె సుమ్మీ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 10. అల మేషరాశి లోను
  చ్ల లోగల రవికి నీచ సంప్రాప్త మవన్
  తులలో శని తో వైరము
  బలవంతపు చావు వచ్చె భాస్కరునకటన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో టైపాటు...

   తొలగించు
  2. అల మేషరాశి లోను
   చ్చలో గల రవికి నీచ సంప్రాప్తమవన్
   తులలో శనితో వైరము
   బలవంతపు చావు వచ్చె భాస్కరునకటన్

   తొలగించు
 11. లలితమ్ముగ యజ్ఞమ్మున
  జ్వలితం బగుచుండ నంతఁ బామరు డొకడున్
  సలిలమ్ము గుమ్మ రింపగ
  బలవంతపుఁ జావు వచ్చె భాస్కరున కటన్

  [భాస్కరుడు =అగ్ని]


  ఇల వేదాంతము లెల్ల జెప్పుదురు లోకైకత్వ వాదమ్మునున్
  ఫలితం బెంచగ వట్టి మాటలు సుమీ పంతంబులే ముఖ్యముల్
  కలనైనం దలచంగ లేము కుల సంగ్రామంబు పేట్రేగగన్
  బలవన్మృత్యువు ప్రాప్తమయ్యె రవికిం బ్రారబ్ధకర్మంబునన్
  [రవి = జీవుడు]

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించు
 12. తలకును మించిన ఋణములు
  ఫలితం బాలేశమయ్యె పంటలు లేకన్
  తలపులలోభీతి కలుగ
  బలవంతపు చావు వచ్చె భాస్కరునకటన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 13. పులియై చెలరేగెనిలన్
  చలియే, హేమంత ఋతువె చయ్యన జేరెన్
  విలవిల లాడిరి జనులును
  బలవంతపు చావు వచ్చె భాస్కరున కటన్  చెలరేగెన్నిల శీతలానిలము విచ్చేయంగ హేమంతమే
  విలవిల్లాడెను లోకమున్ రవియు నిర్వీర్యమ్ముగా మారుచున్
  బలహీనుండుగా మారెనంచు కవి తావర్ణించె నీరీతిగా
  బలవన్ముృత్యువు ప్రాప్తమయ్యె రవికిన్ బ్రారబ్ధకర్మంబునన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'బలహీనండుగ' అన్నచోట టైపాటు.

   తొలగించు
 14. తలకున్మీరిన యప్పులన్సలిపి దారిద్ర్యంపు దుఃఖార్తియై
  ఫలితంబన్నది లేశమైచనగ పంటల్తక్కువౌటంజుమీ
  నిలలో రాబడి వేరులేకనిక నిశ్చేష్టుండుగానుండుటన్
  బలవన్మృత్యువు ప్రాప్తమయ్యె రవికింబ్రారబ్ధకర్మంబుగన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పొన్నెకంటి వారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జుమీ యిలలో...' అనండి.

   తొలగించు
 15. ఫలమునుబొంద హవనమున
  చిలుకించ ఘృతము నధికము స్థిరమగు భక్తిన్
  తెలియక జీర్ణించు విధము
  బలవంతపు చావు వచ్చె భాస్కరున కటన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 16. వలచిన చెలియే కాదన
  తలపులు బాధింప దాను తల్లడ బడుచు
  న్నిలయంతయు శూన్యమవగ
  బలవంతపు చావువచ్చె భాస్కరునకటన్!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 17. కలలన్ గాంచుచు నూతనంపు కరణిన్ కావించ సత్కర్షణన్
  విలువౌ సంపద ఖర్చుచేయ కడు సంప్రీతిన్ ఫలమ్మొందగన్
  కలిగెన్ నష్టము మిక్కుటమ్ముగను సంఘర్షంపు దుఃఖమ్ముతో
  బలవన్మృత్యువు ప్రాప్తమయ్యె రవికిన్ బ్రారబ్ధకర్మంబునన్
  కర్షణః వ్యవసాయము

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 18. జలధిని కలకలము కలుగ
  నల లెగయుచు గాలివాన నాహ్వానింపన్!
  కలవరపడి మనుజు లనిరి
  బలవంతపు చావు వచ్చె భాస్కరున కటన్!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 19. తెలవారక మున్నె వెడలె

  పొలమున పారించ నీరు; పురుగది ముట్టన్

  విలవిల లాడుచు నుండగ

  బలవంతపు చావు వచ్చె భాస్కరునకటన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 20. 3వ పాదం సవరణ..నిలలో. బదులుగా... ఇలలో అని చదువ గోరెదను.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. తొలికోడి కూత మొదలుగ
  మెలమెల్లగ నెగయ గ్రహణ మిత్తికి నింగిన్
  బలియై తాత్కాలికముగ
  బలవంతపు చావు వచ్చె భాస్కరున కటన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 22. చలిపులినిగని జనంబులు
  నిలలో బయటికి వెడలక నిఐటనె యుండన్
  బలహీనుండై చలితో
  బలవంతపు చావు వచ్చె భాస్కరున కటన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '..నింటనె..' టైపాటు.

   తొలగించు
 23. తెలిసి పొరబాటు జేయగ
  బలవంతపు చావు వచ్చె భాస్కరున కటన్
  తెలవారక ముందె మదిర
  నలవోకగ సేవనమ్మొనర్చు యువకుడౌ||

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తంగిరాల రఘురామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు