19, డిసెంబర్ 2016, సోమవారం

సమస్య - 2229 (వేశ్యను వీక్షించి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"వేశ్యను వీక్షించి వేదవిదు లిడిరి నతుల్"
లేదా...
"వేశ్యను జూచి మ్రొక్కిరట వేదవిదుల్ గడుభక్తి నెల్లరున్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

15 కామెంట్‌లు:

 1. వేశ్య మధురవాణిని గని
  దేశ్యపు పలకుల వలపుల దేవిగ నేయు
  ద్దేశ్యముతో పూజించిరె?
  వేశ్యను వీక్షించి వేదవిదు లిడిరి నతుల్!

  రిప్లయితొలగించండి


 2. 'పశ్యసి సర్వం శ్రీకర
  లాస్యం రమణీ లలామ లావణ్యములౌ'
  నశ్యపు పొడిలాగించుచు
  వేశ్యను వీక్షించి వేదవిదు లిడిరి నతుల్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. డా.పిట్టా
  కశ్యము(గుర్రం)ను రౌతులొక్కటె
  సశ్యంబును రైతులొకటె సద్దర్శనలన్
  నశ్యతి యా(ఆ)త్మవిభేదము
  వేశ్యను వీక్షించి వేద విదులిడిరి నతుల్
  సశ్యములెల్ల బెంచుచును సామిని (భగవంతుని)దల్చిన సేద్యగాని యు
  ద్దేశ్యబవిత్రతన్ గనగ దీరె నహంకృతి నారదాఖ్యుకున్
  పశ్య సమత్వభావమను భావన నిర్గతమాయె వీరికిన్
  వేశ్యను జూచి మ్రొక్కిరట వేదవిదుల్ కడుభక్తి నెల్లరున్

  రిప్లయితొలగించండి
 4. వేశ్యను వేశ్యగ జూడక
  వేశ్యను దమ తల్లి వోలె వితరణ బుధ్ధిన్
  పశ్యతి భావము గలుగుత
  వేశ్యను వీక్షించి వేదవిదు లిడిరి నతుల్

  రిప్లయితొలగించండి
 5. వేశ్యను జూడగా ధరణి వేదము సాక్షిగ దల్లి భావనన్
  లా శ్యము జేసివారి మది లాలన తోడున నుండగా మరిన్
  వేశ్యను జూచి మ్రొక్కిరట వేదవిదుల్ గడు భక్తి నెల్లరున్
  వేశ్యల నెప్పుడున్నిలను వేరుగ జూడక నుంట మేలగున్

  రిప్లయితొలగించండి
 6. కశ్యపుని తపసు గూల్చగ
  వేశ్యగ నూర్వశియె నాడు విఖ్యాతి గన
  న్నశ్యర మీ జన్మమనుచు
  వేశ్యను వీక్షించి వేదవిదు లిడిరి నతుల్

  రిప్లయితొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:
  వేశ్య కులములో మనినను
  వేశ్యము నుండని సుచరిత పెంపగు నిమ్మున్
  పశ్యత్ఫాలుని గొలువగ
  వేశ్యను వీక్షించి వేదవిడులిడిరి నుతుల్.

  రిప్లయితొలగించండి
 8. రిప్లయిలు
  1. కశ్యప సుతాత్మజుండు ఘ
   నశ్యామల వర్ణుడునర నాముడు విమతా
   వశ్యుడు తిరస్కృ తామర
   వేశ్యను వీక్షించి వేదవిదు లిడిరి నతుల్


   వేశ్య యలంబుషాఖ్యకును బేర్మి సుతాత్మజు డా కుబేరుడే
   వేశ్య సుతుండు కాడె మరి విప్రు డగస్త్యుడు పూజనీయుడున్
   వేశ్య తనూజ సూను డిల విశ్రుత రాజట భారతావనిన్
   వేశ్యను జూచి మ్రొక్కిరట వేదవిదుల్ గడుభక్తి నెల్లరున్

   తొలగించండి
 9. వశ్యమగు కాముకుండిల
  వేశ్యను వీక్షించి, వేద విదులిడిరి నతుల్
  కశ్యప పుత్రుని గనియా
  పశ్య త్ఫాలుని తలచుచు పరవశు లగుచున్

  వశ్యము జేసికొన్న సఖి పన్నెడు కుట్రన దాగియున్న ను
  ద్దేశ్యమెఱంగలేని మగ ధీరులు తృప్తిగ వీడివచ్చిరే
  కశ్యపు బుత్రుడొచ్చి ధర కాంతుల బంచెడు వేళ ప్రాగ్దిశన్
  వేశ్యను, జూచి మ్రొక్కిరట వేదవిదుల్ గడు భక్తినెల్లరున్

  రిప్లయితొలగించండి
 10. వశ్యుడు దుర్గుణంబులకు, వాక్యవిధానము గాంచకుండ నీ
  కాశ్యపి బైనద్రిమ్మరుచు కాలము బుచ్చెడి వాడు, మత్తుడై
  దేశ్యను భారతాంబనని దెల్పగ బోవుచు బల్కె నీగతిన్
  వేశ్యను జూచి మ్రొక్కిరట వేదవిదుల్ గడుభక్తి నెల్లరున్.

  కాశ్యపిపై యశమందిన
  దేశ్యను భరతాంబనంచు దెల్పచు సురకున్
  వశ్యుడు పలికె నొకండిటు
  వేశ్యను వీక్షించి వేదవిదు లిడిరి నతుల్.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 11. మహిత చింతామణీ వేశ్య మంత్రమిడగ
  కొలిచె కృష్ణుని లీలాశుకుండు మహిని
  వెలసె.వేశ్యను వీక్షించి వేదవిదులి
  డిరి నతుల్ భక్తి మార్గమ్ము నరసి కొనుచు.

  రిప్లయితొలగించండి
 12. ఈశ్వరయాజ్ఞగనెంచిన
  వేశ్యౌ చింతామణిగని విజ్ఞులు దెలుపన్
  శాశ్విత మవ్వదు మనుగడ
  వేశ్యను వీక్షించి వేదవిదు లిడిరినతుల్|

  రిప్లయితొలగించండి
 13. వేశ్యసుత శకుంతల తా
  వశ్యము కాగ క్షితిపతికి భరతుడుకలిగెన్
  వేశ్యమనుమ డేలికగా
  వేశ్యను వీక్షించి వేదవిదు లిడిరి నతుల్

  రిప్లయితొలగించండి