సీత - కైక - సుమిత్ర - తార
పై పదాలను ఉపయోగిస్తూ
మహాభారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(నిన్నటి వరంగల్ అష్టావధానంలో నే నిచ్చిన దత్తపది)
పై పదాలను ఉపయోగిస్తూ
మహాభారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(నిన్నటి వరంగల్ అష్టావధానంలో నే నిచ్చిన దత్తపది)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్యులు శ్రీ శంకరయ్య గారు:
తొలగించండిసీత - కైక - సుమిత్ర - తార
పదములను అన్యార్ధములో వాడ వలెనా?
ప్రశ్నలో 'అన్యార్థం' అని పస్తావించలేదు. కనుక స్వార్థంలోను, అన్యార్థంలోను ప్రయోగించవచ్చు.
తొలగించండిరణ రంగమున కృష్ణుడర్జునునితో:
తొలగించండితారవోలె వెలుగు వీర శౌర్యములు సు
మిత్రమా దునుముర శత్రు వులను
దీనికై కనుముర దివ్య రూ పమిదియె
సీతవోలె నోర్చి గీత వినుము!
సీతవోలె వోర్చి?
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
సీత శబ్దాన్ని ఏ అర్థంలో ప్రయోగించారు?
'సీతవోలె నోర్చి' అనడమే సాధువు. 'వోలె'... వు,వూ,వొ,వో లతో ప్రారంభమయ్యే పదాలు తెలుగులో లేవు.
"సీత" ను రామాయణం లోని సహనశీలి సీతాదేవి గా ప్రయోగించాను...స్వార్ధము గానే!
తొలగించండిపదునెనిమిది అధ్యాయాల గీతను వినుచుటకు సహనము కావలయును కదా!!!
శాస్త్రి గారూ,
తొలగించండినా వల్ల ఒక పొరపాటు జరిగింది. 'సీత+పోలె=సీతవోలె' అవుతుంది. ఇంతచిన్న అంశాన్ని (గసడదవాదేశసంధిని) ఎలా విస్మరించానో అర్థం కావడం లేదు. మీ ప్రయోగం సరైనదే. మన్నించండి.
డా.పిట్టా
రిప్లయితొలగించండికర్మను గూర్చి, పతి సతికి జేసే బోధ:
"ఓసీ తప్పదు గృష్ణు చెల్లియయినన్ యోద్ధల్ పతుల్ యైన యే
త త్శీలావతి ద్రౌపదిన్ గనుము నే తప్పాయె నిర్వస్త్రగా
జూసే వేడుకకై కరాళి మెదలెన్ స్తోత్రంబె గాపాడెనే
యాసీనుండ్రగు బెద్దలేమనరు నేయాశల్ సుమిత్రాళిపై
జేసే వారమొ కష్ట కంటకములే జెల్లన్ విపత్తారలై
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది.
కాని పతుల్+ఐన అన్నపుడు యడాగమం రాదు. శీలవతిని శీలావతి అన్నారు. ఏతత్+శీలవతి = ఏతచ్చీలవతి అవుతుంది. జూసే, జేసే... అని వ్యావహారికాలను ప్రయోగించారు.
ఆర్యా, డా.పిట్టా నుండి
రిప్లయితొలగించండిజ్యోతిష్యంలో తారాబల ప్రకరణంలో విపత్తార మూడవది.సరదాకోసం శ్లో.
జన్మభం దేహ నాశాయ సంపత్ సంపద ఏవచ
ద్విపతశ్చ కార్య నాశాయ క్షేమం క్షేమకృతే భవేత్
ప్రత్యశ్చ కార్య నాశాయ సాధనాత్కార్య సాధనే
నైధనే నిధనేపిశ్యా మిత్రంచ సుఖి సంపదా
పరమ మైత్రం సుఖే వింద్యా నవతారాః ప్రకీర్తితః మా నాన్న నా గురువు.వారికి వందనములతో,
సీ సీ తనయునికై కసి
రిప్లయితొలగించండియాసురగుణు డౌచు నూనె నవ్వారలపై
దా సుమి! త్రప లేకుండగ
దాసునివలె విభుడు సర్వ తారక మనుచున్.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిబాగున్నది మీ పూరణ.
'దా సుమి' ... అర్థం కాలేదు.
ఆర్యా!
తొలగించండినమస్కారములు
తాననే అర్థంలో వాడాను.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఓసీ! తన్వీ! కృష్ణా!
గాసిలు నీకై కఱకున కడపెను కమిత
న్నీసున భీముడు తారలు
భాసిలు వేళ సుమి! త్రపయె పంబగ జేయన్.
(కృష్ణ= ద్రౌపది; కమిత= కాముకుడు (కీచకుడు); త్రప= కీర్తి)
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
తులసీతరు ఛద నైకై
రిప్లయితొలగించండిక లఘుత్వాంగక సుమిత్ర గణ సేవిత తా
ర లస దమృతకర నిభముఖ
సలలిత ఘననీల వర్ణ సదజిర కృష్ణా
విద్వత్కవులు కామేశ్వర రావు గారూ మీ పూరణము అద్భుతం..... నమస్సులు.
తొలగించండివిజ్ఞులు కవివర్యులు కామేశ్వర రావు గారు:
తొలగించండినా కోసం దయదలచి మీ పద్యరాజమునకు ప్రతిపదార్ధము తెలుపగోరెదను...
శర్మ గారు నమస్సులు. ధన్య వాదములు.
తొలగించండిశాస్త్రి గారు నమస్సులు.
తులసీ తరు= తులసి చెట్టు; ఛదన+ఏక+ఏక = ఛద నైకైక = ఒకేఒక్క ఆకు కంటే; లఘుత్వ +అంగక =తేలికయైన శరీరము కలవాడు; సుమిత్రగణ సేవిత= మంచి స్నేహితులచే సేవింప బడువాడు; తార లసత్ +అమృతకర నిభముఖ= తారలతోప్రకాశించుచున్న చంద్రుని వంటి ముఖము కలవాడు; సలలిత = మనోహరమైన; ఘననీల వర్ణ = మేఘము వంటి నీల వర్ణపు సత్ +అజిర = మంచి దేహము కలవాడు; కృష్ణా!
మీ నైపుణ్యము శ్లాఘనీయం
తొలగించండి__/\__
తొలగించండిసుకవి మిత్రులు కామేశ్వర రావు గారూ...నమస్సులు! మీ పూరణము అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచిన్న సందేహము...
తరు ఛదన...తరుచ్ఛదన...కావాలి కదా..."ఛేచ సూత్రము: వార్తికము... హ్రస్వస్య ఛే పరే తుగాగమ స్యాత్" ప్రకారము!
కవిపుంగవులు మధుసూదన్ గారు నమస్కారములు. అవునండి. తుగాగమ సంధి విస్మరించాను. గుర్తు చేసినందులకు ధన్యవాదములు. చదువుతున్నప్పుడేదో వెలితి యనిపించింది. ఇప్పుడర్థమైనదా వెలితి.
తొలగించండిసవరించిన యీ పూరణ తిలకించ గోర్తాను.
తులసీ తరు పర్ణైకై
క లఘుత్వాంగక! సుమిత్ర గణ సేవిత! తా
ర లస దమృతకర నిభముఖ!
సలలిత ఘననీల వర్ణ సదజిర కృష్ణా!
వేంకట సుబ్బ సహదేవుడు గారు ధన్యవాదములు.
తొలగించండిపోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ విద్వత్తును, కవితాప్రవీణ్యాన్ని ప్రశంసించడానికి నాకు మాటలు దొరకడం లేదు. అత్యద్భుతమైన పూరణ మీది. అభినందనలు, ధన్యవాదాలు!
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ యపూర్వాభిమానమునకు నా కళ్ళు చెమర్చుచున్నవండి. ధన్యవాదములు.
తొలగించండిదౌత్యమును సంజయుడు తెచ్చె ధర్మజునకు
రిప్లయితొలగించండి"మేలు గోరుము,వలయు సుమిత్ర భావ
మన్నదమ్ములకై,కలహమ్ము వలదు
ధర్మమును వెలయ జేసిన తారవీవు
ధరణి రాజ్యముకై నిసీ తలపనేల?"
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కీచకుడు సైరంధ్రితో...
రిప్లయితొలగించండిఓసీ! తన్వంగీ! నిను
చూసి మది సితార మ్రోగె సుమి!త్రపయేల
న్నాసగ నీకై కమ్మని
వూసులతో వేచియుంటి నొకపరి గనుమా!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఊసులను వూసులు అన్నారు. 'కమ్మని యూసులతో...' అంటే సరి!
రాజ్యలాలసకొరకుకైకయ్యమాడ
రిప్లయితొలగించండిసీ,త మరిటుసుమిత్రవాసిగనుమెలగు
చుండతారసిల్లగనెవ్వరుండరార్య
యనుచుబలికెనుగృష్ణుడునచ్చటపుడు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిబాగున్నది మీ పూరణ.
కొరకు తర్వాత కై ఎందుకు?
ఓసీ తనువెల్ల కనులు
రిప్లయితొలగించండిచేసుకు నీకై కదిలెను సింహబలుడు తా
రాసక్రీడకు రమ్మనె
నేసుమి త్రవనేల చనగ నీరజ నేత్రా
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాయబారం విఫలమైన తరువాత శ్రీ కృష్ణుడు అర్జునునితో:(అర్జునునిపై కృష్ణు నికి యున్న చనువుతో "ఓసీ" యను సంబోధన చేయటం జరిగింది)
రిప్లయితొలగించండివెడగొన కో'సీ! త'త్త్వము
నుడివితి నీ'కై, క'లతల నొవ్వకుమికపై,
కడిగొనుము, 'సు మిత్ర'త్త్వం
బొడగూడుచు 'తార'సిలెడి యొద్దిక లేదే!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రేయసీ తగునె నీ ప్రియునితో దాగుడు
రిప్లయితొలగించండి.....మూతలు రమ్మింక మురిపె మలర
తాళజాలనుసుమి త్రాతవై యొడి జేర్చి
.....లాలింప రమ్మింక రాగ మలర
పొందుకై కలగంటి పూబోడి కరుణించి
.....కలియగా రమ్మింక వలపు లలర
తారల గూడె సూ తారాధిపతి తాను
.....వేగలే రమ్మింక ప్రేమ మలర
రమ్ము నర్తనశాలకు రాజ మదన
రాజ్య మేలగ నని చెప్పి రమణి నీవు
సిగ్గు నటియించి దాగుండి సింహబలుని
యిట్లు వేధింప న్యాయమే యిందువదన.
మిస్సన్న గారూ,
తొలగించండిమనోహరమైన పూరణ మీది. అభినందనలు.
గురువుగారికి ధన్యవాదములు.
తొలగించండిసుయోధనుని మయసభానంతర మానసం:
రిప్లయితొలగించండిసరసీ తలంపు గాజని
మురిపెమ్ముగఁ గాలు మోప మునకై కదలన్
విరగబడి నవ్వె సుమి! త్రప!
మఱువన్ నను తా రగుల్చ మయసభలోనన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
'సరసీ తలంపు' అనడం దోషం.
గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పూరణ పరిశీలించమనవి:
తొలగించండిసుయోధనుని మయసభానంతర మానసం:
సరసీ తలమది గాజని
మురిపెమ్ముగఁ గాలు మోప మునకై కదలన్
విరగబడి నవ్వె సుమి! త్రప!
మఱువన్ నను తా రగుల్చ మయసభలోనన్!
ఏకైక పుత్రు మరణము
రిప్లయితొలగించండినా కేలను తారసిల్లె ననిలో కృష్ణా!
లేక సుమిత్ర వరులచట
శోకించ, నిసీ తగునని చూసిరె! వైరుల్
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈరతారయ్యె ఫలితము పోరులోన
రిప్లయితొలగించండినాదు యేకైక పుత్రుండు నాకమేగె
తనయు మరణపు సెగ యిసీ! తగులుచుండె
కమలపు సుమిత్ర నిమ్లుక్తి కన్నముందు
కుటిలు సైంధవు తప్పక కూలఁద్రోతు
ఈరతారుః తారుమారు, నిమ్లుక్తిః అస్తమయము
దుర్యోధన స్వగతం....
రిప్లయితొలగించండిఓసీ! తాకెను మది నీ
దౌసిగ్గదిలేనినవ్వు తారాస్థాయిన్
వేసెను నాకై కష్టము
దాసీవేసుమి త్రపితవె ధారుణి నీవే!