11, డిసెంబర్ 2016, ఆదివారం

సమస్య - 2222 (శంకరాభరణము...)

కవిమిత్రులారా!
(నేటి సమస్య సంఖ్యను చూస్తే నాకు ఆనందం, ఒక విధమైన తృప్తి, (కించిత్తు గర్వం) కలుగుతున్నాయి. ఈ సంఖ్యను చేరడానికి కవిమిత్రులందిస్తున్న సహకారమే కారణం. ఈ సహకారాన్ని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"శంకరాభరణము సమస్యలకు నెలవు"
లేదా...
"అరయఁగ శంకరాభరణమందు సమస్యల వెల్లువే కదా"

73 కామెంట్‌లు:

 1. ఏవి యున్నను లేకున్ననెక్కు వేవి?
  పుడమిని సమస్యలు మిగుల పుష్కలమ్ము
  వంక లేనిది మన బ్లాగు శంక దేల?
  "శంకరాభరణము సమస్యలకు నెలవు"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శంక+అది' అన్నపుడు యడాగమం వస్తుంది. 'శంక యేల' అనండి.

   తొలగించండి
  2. సవరణకు ధన్య వాదాలు! శంకరయ్య గారు !

   తొలగించండి
 2. ఉరకలు వేయుగా మదియె యూహకు రెక్కలు వచ్చి జేరినన్
  తరగని సంపదౌను గద తర్కముతో గమనించి జూడగన్
  విరియగ జేయుచున్ మనము విజ్ఞులు పాల్గొను గొప్ప బ్లాగిదే
  "అరయఁగ శంకరాభరణమందు సమస్యల వెల్లువే కదా"

  రిప్లయితొలగించండి
 3. విరియగ పద్యరత్నములు వేలకువేలు కవుల్ కలమ్ములన్
  మురియుచు పాఠకుల్జదివిమోదము నొందుచు మీదు మిక్కిలిన్
  సరసపు భాషణల్ సదరు సందియముల్ వెలిబుచ్చు కొందురే
  అరయఁగ శంకరాభరణమందు సమస్యల వెల్లువే కదా .

  రిప్లయితొలగించండి
 4. శాంతి నిచ్చును మనసుకు వింత బ్రమత
  కావ్య రత్నము లన్నియు కలత దీర్చు
  దివ్య లోకాల తేలించు దైవ లీల
  శంకరాభరణము సమస్యలకు నెలవు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. నమస్కారములు
   దిక్కు తోచని నన్ను దిక్సూచివై నడిపి వెలుగులోనికి దెచ్చి మెలగజేసి నట్టి గురువు నీవె .
   నా కొనఊపిరి ఉన్నంతవరకు ఈ వెలుగులొనె మలిగి పోవాలని
   ధన్యవాదములు సోదరా ! చిరకాలం మాకీ వెలుగులను అందించాలని ఆశీర్వదించి . అక్కయ్య

   తొలగించండి
 5. డా.పిట్టా
  శంకరుడు ఫణి భూషణ సరస నటుడు
  వంక దిరిగిన పాముల వలె సమస్య
  లన్న శంకలే సాహిత్య లాస్యములగు
  శంకరాభరణము సమస్యలకు నెలవు!
  హరి!యిది యెంతమాట సరి హైందవమే యిది యెంత ఘోరమం
  చరచియు ఘంటమూనగను శారద "చూపు"సమస్య దీర్పు నా
  కరణపు లెక్క మెప్పుగొను,గడ్డు వివాదపు తీర్పునేర్పు మే
  లరయగ"శంకరాభరణ"మందు సమస్యల వెల్లువే కదా!
  (కరణముపంతులు లెక్క మాయాజాలంగా పల్లె వాసులను ఆశ్చర్య పరచేది.సమస్యా పూరణము కరణము లెక్కయే.సమస్యలు మెలికలుదిరిగిన పాములు. కాని అందంగా ఉంటాయి.వానికి దగ్గరగా మెదలడం ఒక గండం.కాని సమాధాన శోధనకు చిందులేయడమే.)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 6. ఆర్యా శంకరయ్యగారూ,నమస్సులు
  మీరెంతగానో కంది శంకరులైనారో ౨౨౨౨సంఖ్య చెబుతున్నది.మీ నిశ్శబ్ద సేవ శ్లాఘనీయము. Alexander Pope చరణం గుర్తుకు వచ్చింది,Not a stone should tell where I lie అన్నట్లుగా గుప్త దానం సాహిత్యంలో చేయడం మీ ఆదర్శ వాద సంస్కృతి. జీవేదశ్శరద శ్శతమ్!అనేది నా ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 7. కవికి సభలోన బంగారు కడియ మొకటి
  బహుకరించగ నప్పుడే ప్రకటితమగు
  వార్తలను గాంచి జనకుండు పలికెనిట్లు
  శంకరా! భరణంబు సమస్యలకు నెలవు.

  దినము మారిన జాలును ఘనతరమగు
  పద్యపాదంబు లొసగుచు హృద్యముగను
  పూరణంబులు జేయించు నౌర! సతము
  శంకరాభరణంబు సమస్యలకు నెలవు.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 8. రెండు వేలకు పైబడి రెండునూర్ల

  యిరువదియు రెండవ సమస్య నీ దినంబు

  నిచ్చినారు పూరించమని,కవి మిత్రు

  లార!పంపుడీ వైవిధ్యమౌ రచనల

  శంకరాభరణము సమస్యలకు నెలవు.

  రిప్లయితొలగించండి
 9. సురుచిర పద్యపాదముల జూపును నుండును బూరణార్థమై
  నిరుపమమన్నరీతి యనునిత్యము శంకర రక్షణంబులో
  కరమరుదౌచు మాదృశుల గాంక్షలు దీర్చెడి కావ్యమందు నే
  నరయగ శంకరాభరణమందు సమస్యల వెల్లువే కదా!
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆర్యా!
   మొదటి పాదంలో జూపుచు నుండును అని ఉండవలయును. టైపులో పొరపాటు.

   తొలగించండి
  2. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 10. సందియమదేల గురువర్య! చక్కగాను
  శంకరాభరణము సమస్యలకు నెలవు,
  పూర ణల జేయగా పద్య పుష్పములవి
  మా తెలుగుతల్లి పదముల మల్లెమాల !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. మేధ వికసించు రీతిగ సాధనమ్ము
  సలిపి యౌత్సాహిక కవులు సంత సించ
  పూరణమ్ముల జేయగ ప్రోత్సహించు
  'శంకరాభరణము' సమస్యలకు నెలవు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. శంకరార్యుల వారి అంకిత బావానికి, సాహితీ సేవకు, సహన భావానికి, ఓపికకు జేజేలు ! జోహార్లు !

  రిప్లయితొలగించండి
 13. నాలుగురెండులవరకును
  నీలహరీసాగుకతననింపయెమదికి
  న్బాలా!యింకనునెన్నియొ
  నలవోకగవ్రాయునేర్పునందీయుముమా

  రిప్లయితొలగించండి
 14. సమస్యలు వెల్లువైతే పూరణలు కొల్లలు!
  ఆచంద్ర తారార్కం ఈ బ్లాగు
  ఇలాగే నిరంతరాయంగా కొనసాగాలని
  ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 15. రసజగత్తును మురిపించు రమ్యమైన
  పూరణమ్ముల దాచె తా పొట్టలోన
  కంది శంకర మాన్యుల ఘనత జాటు
  శంకరాభరణము సమస్యలకు నెలవు.

  పురజను లే యసాధ్యమని చాటు సమస్య లకెల్ల చక్కగా
  సరసులు మెచ్చురీతిన విశారదులైన కవీశ్వరుల్ జనుల్
  మురిసెడు సాహితీ సరపు ముత్తెములందగ జేయు వేదికే
  అరయఁగ శంకరాభరణమందు సమస్యల వెల్లువే కదా

  రిప్లయితొలగించండి
 16. సరళతర పరిష్కృతములు సరస విలసి
  తారవింద సమములు క్షీరాబ్ధి మథన
  తుల్య మేధో మథన పద్య తోరణమ్ము
  శంకరాభరణము సమస్యలకు నెలవు


  తరగని సంపదున్న మరి తారక రాముడు చిక్కె చిక్కులం
  బరగెను వెన్నదొంగ చిఱు బ్రాయము నుండి సమస్యలందున
  న్నరయఁగ శంకరాభరణ మందు సమస్యల వెల్లువే కదా
  ధరణి తలమ్మునందు సుకృతమ్ములఁ దీరు సమస్య లింపుగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 17. మాన్యులు శంకరయ్యగారికి నమశ్శతములు. ఈ విషయంలో మీ ప్రోత్సాహమే మాకు సమధిక ఉత్సాహం ఇచ్చింది. మీ సాహితీ సేవ కడుంంగడు శ్లాఘనీయము.

  అరయగ శంకరాభరణమందు సమస్యల వెల్లువే కదా
  స్థిరమతి ధీనిధై వెలిగి చిక్కని చక్కని పద్యరత్నముల్
  గరగర వ్రాయగల్గిన వికాస సమున్నత భావ వీచికల్
  యరమర లేక మాకొసగె హార్దిక వందనమాచరింతునే.

  శంకరాభరణము సమస్యలకు నెలవు
  మాత్రమెయనరాదు ఘన సుమార్గదర్శి
  సాహితీమిత్ర సత్కావ్య సౌరభముల
  పంచుకొనదగు వేదిక పర్వమనగ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
   ధన్యవాదాలు!
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 18. శంకరాభరణముసమస్యలకునెలవు
  కాదుసామి!స మస్యలగణముకాాదు
  పూరణలుజరుగునిచటముఖ్యముగను
  బరగనిదియొకమంచిదేవాలయమ్ము

  రిప్లయితొలగించండి
 19. అరయగశంకరాభరణమందుసమస్యలవెల్లువేకదా
  యురకలువేయపండితులయూహలు,భావములెన్నియోమరి
  న్వరలినశంకరాభరణమందలిపూరణంబులేసుమా
  వరమగుపాయసంబుగడుపారభుజించినదృప్తిమాదిరిన్

  రిప్లయితొలగించండి
 20. సరిసరి యీ దినమ్మునను చక్కఁగ వేసియు సంఖ్య నిట్టు లీ
  వరుసను రెండు రెండులకుఁ బ్రక్కన రెండును రెండుఁ, గంది శం
  కరయ మహోదయుండు తన గమ్యము నిద్దరి రాఁగఁ దెల్పె మీ;
  కరయఁగ శంకరాభరణమందు సమస్యల వెల్లువే కదా!

  రిప్లయితొలగించండి
 21. మనసు లేక మగనితోటి మనుగడ సరి
  పడక వైవాహికంబిక వద్దనుకొని
  నెలత పతి సొమ్ము నాశించ నేల? కాదె
  శంకరా! భరణము సమస్యలకు నెలవు||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువుగారూ, శంకరాభారణ వేదిక ద్వారా నాబోటి ఔత్సాహికులకి, సాహసికులకి, తెలుగు భాషాభిమానులకి మీరు అందిస్తున్న తృప్తి, ఆనందం, హాయి ఈ కొన్ని మాటల్లో చెప్పనలవి కానిది. ఇది స్వానుభవం కాబట్టి చెప్తున్నా. నావంటి ఏమీ తెలియని వారిని సైతం అక్కున జేర్చుకుని, పద్యాల్లో మంచి చెడుల సద్విమర్శలను ప్రసన్నతతో తెలియజెప్పి మరిన్ని మంచి పద్యాలు రాసే అవకాశాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్న మీకు శతకోటి వందనాలు, నమస్సులు. ఈ సాహితీ వనంలో 2222 మాత్రమేనా, మరిన్ని వందలూ వేలూ పూలు పూయాలని మనసారా ఆకాంక్షిస్తున్నా - ఇట్లు మీ అభిమాని, రఘు

   తొలగించండి
  2. తంగిరాల రఘురామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ధన్యవాదాలు!

   తొలగించండి
 22. దినదినము సమస్యల నిడితిరయ మీరు,
  పద్యములతో రణమ్ములఁ బఱఁగు మమ్ముఁ
  బద్యముల తోరణములతో వఱలఁజేయ!
  శంకరాభరణము సమస్యలకు నెలవు!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దినదినము సమస్యల నిడితిరయ మీరు,
   పద్యములతో రణమ్ములఁ బఱఁగు మమ్ముఁ
   బద్యముల తోరణములతో వఱలఁజేయ!
   శంకరాభ! రణము సమస్యలకు నెలవు!!

   తొలగించండి
  2. మధుసూదన్ గారూ,
   మీ యీ రెండు విధాల పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 23. రెండువేలకుపైగనునుండెననుచు
  సంబరమ్మునునొందితె సామిమీరు?
  చాలదాసంఖ్య మీయండసామిమాకు
  నుండునెడలనునింకనుమెండుగాను
  వ్రాయనేర్తుముతప్పకవలదుశంక

  రిప్లయితొలగించండి
 24. "శంకరాభరణము సమస్యలకు సెలవు"
  కాదు కాదని జూచితి కండ్లు నులిమి
  నాల్గురెండ్లను, జూడనానందమాయె
  "శంకరాభరణము సమస్యలకు నెలవు."

  రిప్లయితొలగించండి
 25. శంకరాభరణము నూతన కవులకును
  శంకలేని విధముగాను శంక రయ్య
  గారు ఏర్పరచిన బ్లాగు గారవము గ
  శంకరాభరణము సమస్యలకు నెలవు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వడ్డూరి రామకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. 'శంకరాభరణము నూత్న సత్కవులకు' అందామా?

   తొలగించండి
  2. శంకరాభరణము నూత్న సత్కవులకు
   శంకలేని విధముగాను శంక రయ్య
   గారు ఏర్పరచిన బ్లాగు గారవముగ
   శంకరాభరణము సమస్యలకు నెలవు
   ధన్యవాదాలు గురువుగారూ

   తొలగించండి
 26. ఇరువది రెండు చెంగటను నిర్వది రెండును వ్రాయ దానికిన్
  సరియగు పద్యపాదములు సై యను దత్తపదాలు న్యస్తమౌ
  క్షరరహితాలు వర్ణనలు చాటుకవిత్వము లేమి చెప్పుదు
  న్నరయగ శంకరాభరణ మందు సమస్యల వెల్లువే కదా.

  రిప్లయితొలగించండి
 27. స్థిరముగ నుండబోని చలచిత్తము పాదము లేమొ సున్న వా
  తెరను క్షణాల ప్రాణముల దీసెడి గాఢవిషమ్ము మేనిపై
  జరజర బ్రాక కంపరము సై యను భోగము భీతి పక్కిరా
  నరయగ శంకరాభరణ మందు సమస్యల వెల్లువేకదా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణ వైవిధ్యంగా ఉంది.

   తొలగించండి
 28. శ్రీకందిశంకరయ్యగారికివంసనచందనాలతో మీకృషి,విలువైనది,విజ్ఞాన మైనది
  1.రెండువేలు మరియురెండువందలరెండు
  లక్ష సంఖ్యలగుచు లాభమొసగ|
  కవుల పద్యరచన కాంక్షలుబెంచెడి
  శంకరాభరణము సమస్యలకునెలవు|
  2.విరిసిన మల్లె జాజులకువిజ్ఞతనెంచ సుగంధమేగదా?
  కురియగ వానజల్లుభువి కోర్కెలు దీర్చెడిబంధమందమే|
  అరయగ శంకరాభరణమందు సమస్యల వెల్లువేగదా|
  మరువని మౌన రాగమయి|మాదరిజేరెను బ్లాగురూపమున్|.


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   ధన్యవాదాలు!
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 29. తరగని సాహితీ జలధి ధైర్యముతోడను నేను నీదుచున్
  నిరతము సాగుచుంటి నట నిక్కము సంధి సమాస కష్టముల్
  మరి గణ బాధలున్న గురి మానక గమ్యము జేర నెంచితిన్
  అరయఁగ శంకరాభరణమందు సమస్యల వెల్లువే కదా

  రిప్లయితొలగించండి
 30. కందముల యందము మదిని కాన లేక
  కంది శంకరుని దయన కన్న నావి
  శంకరాభరణము సమస్యలను దీర్చ
  శంకరాభరణము సమస్యలకు నెలవు!

  రిప్లయితొలగించండి
 31. పద్య రచనను నేర్పించ హృద్యముగను
  ప్రతిదినమ్మున విధిగపూరణము లిడుచు
  శారదాంబను గొలుచుచు సమధికముగ
  తెలుగు పద్యపు మధురిమ దెలియజేయ
  శంకరార్యుని తలపున సంజనించు
  శంకరాభరణము సమస్యలకు నెలవు!!!

  రిప్లయితొలగించండి
 32. శంక రార్యుని దయతోడ నంకురించి
  నట్టి మొలక కైతలకిప్డు పట్టుఁ గొమ్మ
  బండరాతిని సైతము మెండు కొలుపు
  శంకరాభరణము సమస్యలకు నెలవు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 33. శంకరాభరణం కవిమిత్రులందరం కలసి మన గురువర్యులు శంకరయ్య గారిని సన్మానించే మంచి రోజు ఎప్పుడో?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మియాపూరులో మీరు నన్ను సన్మానించారు కదా! అది చాలదా?

   తొలగించండి

 34. శ్రీగురుభ్యోనమః

  మెరిసెడి భావమేఘముల మెండగు కాంతుల సోయగమ్ముతో
  కురిసెడు పద్య వర్షముల గుంపనమౌ రసధార పారగా
  మురియుచు పూరణమ్ములను ముగ్ధ మనోహర రీతి సల్పగా
  నరయఁగ శంకరాభరణమందు సమస్యల వెల్లువే కదా

  రిప్లయితొలగించండి
 35. మరువగలేము ప్రీతిఁ గడు మాన్యగురుండె యొసంగు విద్యలన్
  కరమగుతుష్టి బ్లాగులను కైతల వ్రాయగ సాటి మిత్రులే
  ధరణి వెలుంగు సుమ్మ సతతమ్మును మెండగు పద్యవిద్యతో
  నరయఁగ శంకరాభరణమందు సమస్యల వెల్లువే కదా

  రిప్లయితొలగించండి
 36. రసపు పద్యాలు జిలికించు రాగ మిదియె,
  సరిగమపదని సరిజేయు తాన మిదియె ,
  పరమ సత్యము పలికించు పల్ల విదియె,
  "శంకరాభరణము" సమస్యలకు నెలవు
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి