30, డిసెంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2238 (రాధేయుఁడు వెంబడింప...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
.
"రాధేయుఁడు వెంబడింప రాముఁడు బాఱెన్"
లేదా...
"రాధేయుం డదె వెంబడింపఁగ వడిన్ రాముండు బాఱెన్ గటా"
ఈ సమస్యను పంపిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

42 కామెంట్‌లు:

  1. బాధలనోర్చుట బ్రాహ్మణ
    గాధలలో లేదటంచు కర్ణుని నెరుగన్,
    ప్రాధేయతతో వేడగ
    రాధేయుఁడు; వెంబడింప రాముఁడు బాఱెన్!


    రాధేయుడు = కర్ణుడు, రాముడు = పరశురాముడు
    పాఱుట = దృష్టిని ప్రవహింపజేయుట

    కొంచెం (బాగా) కృత్రిమమైనది... మన్నించవలెను!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమస్యాపూరణాలలో అప్పుడప్పుడు ఇబ్బందులు తప్పవు. పరవాలేదు!

      తొలగించండి
  2. రాధసుతుండెవడచ్చట
    మైదానములోన సీత మనసును దోచన్
    తాదిరిగిన మృగ మేదన
    రాధేయుడు, వెంబడింప రాముడు బాఱెన్

    రిప్లయితొలగించండి
  3. డా.పిట్టా
    రాధా మాధవు కాలపు
    టాధారము ద్వాపరంబు నదె రామాఖ్యున్
    గాధాళియె త్రేతం గను
    రాధేయుడు వెంబడింప రాముడు బారెన్
    ఆధారంబులు కాల, వేగము,లనన్నాయా ప్రభారేఖలే
    మేధాశక్తిని నించి వేగమునదే మిన్నంగ నాకాశపున్
    వీధిన్ జూడగవచ్చు బింబములవే వీకన్ కృతాద్యాదిగన్
    రాధేయుండదె వెంబడింపగ వడిన్ రాముండు బారెన్గదా!
    (ఐన్ స్టీన్ సిద్ధాంతం ప్రకారం వేగాన్ని పెంచి కాలాన్ని అధిగమించవచ్చును.ఇప్పుడాకాశంలో గత యుగాల బింబాలున్నాయి.వేగం కాలాన్ని అధిగమించే లాగున పయనించ గలిగితే ఆ బింబాలను తిలకించ వచ్చును.త్రేతా లోని రాముని తర్వాతనే ద్వాపర యుగపు రాధేయుడు కనిపిస్తాడు.సమస్య ఈ వషయాన్ని చెప్పక చెప్పింది)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. ……………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { విప్రుడు కాదని పరశురాముడు

    గ్రహి౦చిన తర్వాత కర్ణుడు ప్రార్థి౦చట }


    ఓ ధర్మాత్మ ! గురూత్తమా ! సకల

    …………. విద్యోద్బోధకా ! స్వామి ! యా

    రాధి౦తున్ , బ్రియ శిష్య పుత్రకుడ నై |

    ………… రామా ! ధనుర్వేదమ్ము నే

    సాధి౦పన్ నిను నాశ్రయి౦తు ననుచున్ ,

    ……………… సద్భక్తి బ్రార్థి౦చుచున్


    రాధేయు౦ డదె వె౦బడి౦పగ వడిన్

    …………… రాము౦డు పారెన్ గదా ! !

    ( శిష్యపుత్రుడు = పుత్రుని వ౦టి

    శష్యుడు ; )

    ి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధనుర్వేదమ్ము నే' అన్నచోట గణభంగం. 'ధనుర్వేదమున్' అనండి.

      తొలగించండి
  5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి సమస్యకు నా పూరణ భేదమును దిలకించ గోర్తాను.

    ఉచ్ఛ నీచముల నెరుగ కుండుదు రట
    కింపురుషు లిలఁ జేసిరి కీడు వీడి
    నీతిఁ బండ్లను, చింతిలి నీదు దుర్ద
    శకు, నములకు భీతిలిరి నాస్తికజనమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      ఇది సమస్యాపూరణంగా కాక దత్తపదిలా భాసిస్తున్నది. అనన్యసాధ్యమైన విరుపు. అద్భుతం. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  6. మేధావియనుచుబొగడగ
    రాధామాధవుడుదానురయముననపుడున్
    గాధలుజెప్పుచునిట్లనె
    రాధేయుడువెంబడింపరాముడుబారెన్

    రిప్లయితొలగించండి
  7. సాధనఁ గొన విలువిద్యను
    రాధేయుడు వెంబడింప, రాముడు బారెన్
    యోధునిగాఁ దీర్చదలచి
    యాదిననాథుని కుమారు నస్త్ర నిపుణతన్
    పాఱుః ప్రచరించు, నెఱపు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. రాధాసుతు డని యేర్పడ
    నా ధరణీ సురు డలిగి మహాక్రోశమున
    న్నా ధానుష్కుడు భీతిలి
    రాధేయుఁడు, వెంబడింప రాముఁడు, బాఱెన్

    [రాముఁడు = పరశు రాముఁడు]


    యోధాగ్రేశులఁ బాండుపుత్రులను దర్పోద్రేకు లా కౌరవుల్
    వేధింపం జన ఘోష యాత్రకు మహావీరుండు గంధర్వుడే
    బాధించంగను ద్వైత గోత్రమునఁ దాఁ బ్రాణార్థ మాసన్నుడున్,
    రాధేయుం డదె, వెంబడింపఁగ వడిన్ రాముండు బాఱెం గటా

    [ఆసన్నుఁడు = సేవకుఁడు; రాముడు: భటుని పేరుగా భావించి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆహా! కామేశ్వర రావు గారు:

      కందపద్య నాల్గవ పాదం లో ఒకేఒక కామాతో నేను తంటాలు పడి బోళ్ళ పడ్డాను. రెండవ కామా తగిలించిన మీ ప్రతిభకు జోహార్లు!

      తొలగించండి
    2. శాస్త్రి గారు సమస్య పూరణార్థ మనేక వేషములు వేయ వలసి వస్తుంది. తప్పదు మఱి. ధన్యవాదములు.

      తొలగించండి
    3. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అనన్యసామాన్యమైన మీ ప్రతిభకు అద్దం పడుతున్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యోస్మి. ధన్యవాదములు.

      తొలగించండి
    5. నా పూరణకు స్ఫూర్తి దాయకము ప్రబంధపరమేశ్వరుడు ఎఱ్ఱాప్రెగ్గడ పద్యము.
      ఉ. కొందఱు సూతు, నశ్వములఁ గొందఱు, కొందరు చాపదండముం
      గొందఱు చక్రయుగ్మకముఁ, గొందఱు విస్ఫురితాతపత్రముం
      గొందఱు కూబరంబు, మఱి కొందఱు కేతువుఁ, గొంద ఱక్షమున్‌
      దందడిఁ దున్మివైచి విరథత్వ మొనర్చిరి సూతసూతికిన్‌. భా.ఆర.5.400
      వ. ఇట్లు విరథుం డయి కర్ణుండు వికర్ణురథం బెక్కిరణభూమికిం దొలంగి
      చనియె...

      తొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు;

    గురువు గారికి నమస్కారములు. తీవ్రమైన జ్వరముతో బాధపడి నందువలన గత నాలుగైదు రోజులుగా పూరణలు పంపుటలో అలసత్వము జూపినాను. మన్నించి ఇప్పుడు వాట్లను పరిశీలించండి.

    24-12-2016:

    నిస్త్రాణ బఱచు చుండెడి
    శస్త్ర శ్రేణులను మించు చిరునవ్వే
    విస్తృతముగ నేర్పించెడి
    శాస్త్రియె సరి నాయకుండు శాంతికి నెపుడున్.

    25-12-2016:

    శివుని భక్తులై చెలగెడి సేవకులిట
    శంకరుని గొల్చు చుంద్రు; క్రైస్తవులు సతము
    గొదకొనుచు దాము క్రీస్తును గొల్చు చుంద్రు
    అఘము లంతము గోరెడి నర్చనలవి.

    26-12-2016:

    హవణిక నొమ్మిక చెదరెడి
    సవ మెరుగని పదములెంచి సాహితి నొసగే
    సవతును గూడు కుకవిదౌ
    అవధానము ప్రజ్ఞ యనుట యనృతము సఖుడా!

    27-12-2016:

    పోరున కెదురుగ నుండెడి
    తేరున పందలు ముదుకలు తెఱవలు చిఱుత
    ల్నారభటించ నదీజుడు
    వీరుడు పోవిడుచు యుద్ధ విముఖుండగుచున్.

    28-12-2016:

    భువి జొచ్చిన కాలునితో
    పవిదిని వాదిడి తనపతి ప్రాణము లొందెన్
    ధ్రువ సావిత్రియె పటువై
    అవకాశము నిడిన నరుల కాహ్లాదమ్మా?

    29-12-2016:

    హరిని దైవ మనంగఁగ నరయ కుండి
    సృష్టి నెప్పుడు మిధ్యగా చింత జేయు
    పట్టు నుండెడి వారు నపాయ మనుచు
    శకునములు భీతిలిరి నాస్తిక జనమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారు తరచు నీ మధ్య మీకు జ్వరము వచ్చుచున్నట్లున్నది. ఇప్పుడు పూర్తి స్వస్థత చేకూరినట్లు తలుస్తాము. ఆరోగ్యవిషయమై తగు జాగ్రత్త వహించండి.

      తొలగించండి
    2. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్కారములు. నాకు గుండెకు రెండు సార్లు (ఇండియా;అమెరికా)లలో శస్త్ర చికిత్సలు జరిగినందువలన ఆరోగ్యము పూర్తిగా కుదురుకొనుటకు మరికొంత సమయము అవసరముచున్నది. ఈ మధ్యలో చిన్న చిన్న అవాంతరములు. భరించక తప్పదుగదా! నా ఆరోగ్యమై మీ విచితికి కృతజ్ఞతలు.

      తొలగించండి
    3. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణలన్నీ బాగున్నవి. అనారోగ్యం బాధించినా సమస్యాపూరణల పట్ల మీరు చూపుతున్న ఆసక్తి ప్రశంసింపదగినది.
      ఆరోగ్యమస్తు!

      తొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు;

    సాధువుగా నటియించుచు
    సాధించిన యస్త్రములవి సత్త్వము వీడి
    న్సాధించు న్నన నవియుచు
    రాధేయుడు వెంబడింప రాముడు బాఱెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వీడిన్' అన్నదానిని 'విడిన। న్సాధించు...' అనండి.

      తొలగించండి
  11. సాధించన్ విలువిద్య తాను ద్విజవేషమ్మున్ ప్రవర్తిల్లి ఆ
    రాధేయుండదె వెంబడింపగ వడిన్, రాముండు బారెన్ గటా
    యోధున్ జేయగ నస్త్రవిద్య రవిజున్ యోగమ్ము నాచార్యుడై
    ఆదిత్యాంగభవున్ శపించె తెలియ న్నాకర్ణు జన్మంబటన్

    రిప్లయితొలగించండి
  12. బోధించె శస్త్రవిద్యను
    రాధేయుడు వెంబడి పడ రాముడు,బారెన్
    భూధవు రుధిరము,గాంచిన
    క్రోధితుడై శాపమిడెను కుటిలత తెలియన్

    రిప్లయితొలగించండి
  13. , రాధేయుని మనసంతయు
    సాధకుడౌ రాముడచట సంధిగ్దపు నా
    మోదపు విధానముమరువ?
    రాధేయుడు వెంబడింపరాముడు బాఱెన్| {విద్యార్థులలోమిత్రులు అభిప్రాయము}
    2.నరేంద్ర మోడీనోట్లరద్దు,తనిఖీలుపై
    ఆధాయంబును మించునాస్తులకు సాక్ష్యాలేవి గన్పించకన్
    ప్రాదాన్యంబుగ దాచియుంచి తను సంపాదించునన్యాయమున్
    శోధించంగను యింటి కెళ్ళగనె?దాసుండవ్వకే వెళ్ళెగా
    రాధేయుండదె వెంబడింపగ వడిన్ రాముండు బాఱెన్ గటా|

    రిప్లయితొలగించండి
  14. రాధా తనయుడ నగుటనె
    బాధను భరియించి నాడ పలు విద్యలకై ;
    ప్రాధేయ పడెద విడుమని
    రాధేయుఁడు వెంబడింప రాముఁడు బాఱెన్

    రిప్లయితొలగించండి
  15. ప్రాధాన్యమ్మును గల్గినట్టి పలు పౌరాణేతి హాసాలతో
    డాదేశమ్మున నాటకమ్ములను తానావారు పెట్టింపగన్
    రాధేయుండను పాత్రధారినట శ్రీరాముండె తొల్గింపగన్
    క్రోధావేశముచెందినట్టియతడుక్రోశమ్ముతో నుగ్రుడై
    రాధేయుండదె వెంబడింపగ వడిన్ రాముండు బాఱెన్ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తోడన్+ఆ=తోడ నా' అవుతుంది. ఆ పాదంలో యతి తప్పింది. '..హాసాల నా।నా దేశమ్ముల...' అంటే సరి.

      తొలగించండి

  16. 'రాధేయు' ధనము 'రాముడు'
    వీధిని యపహరణ మిడిన విత్తము బడయన్
    బాధా హృదయము దోడుత
    రాధేయుడు వెంబడింప రాముడు బాఱెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వీధిని నపజయము..' అనండి.

      తొలగించండి


  17. బాధా తప్త హృదయములన్
    రాధేయుఁడు వెంబడింప, రాముఁడు బాఱెన్
    గాదే శరణన్న జనుల
    మోదము గాన, సుగుణములమోఘములు గదా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. సాధకులౌ నటులట నట
    నాధిక్యత పెంచుకొనఁగ నందరుఁ గూడన్
    నా ధనువేలఁ గొనితివని
    రాధేయుఁడు వెంబడింప రాముఁడు బాఱెన్

    రిప్లయితొలగించండి