కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"అవకాశమ్ముల వీడినన్ నరుల కాహ్లాదమ్ము సేకూరదే"
లేదా...
"అవకాశము విడిన నరుల కాహ్లాదమ్మా"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"అవకాశమ్ముల వీడినన్ నరుల కాహ్లాదమ్ము సేకూరదే"
లేదా...
"అవకాశము విడిన నరుల కాహ్లాదమ్మా"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
కైకేయి భరతునితో:
రిప్లయితొలగించు"సవినయముగ శ్రీ రాముం
డవనీశుడు తండ్రి యాన నడవికి జనియెన్
జవదాటకు నామాట స
దవకాశము విడిన నరుల కాహ్లాదమ్మా?"
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించుజవసత్వమ్ములు డిగ్గగా తనువదే జాటంగ నున్నాను నే
నవహేలం బరి నిల్వ జూచెదవొకో యార్భాటమే సుమ్మి నీ
వవలీలన్గొను కార్యముల్ బరువగున్నావర్తనీయంబులౌ
అవకాశమ్ముల వీడినన్ నరులకాహ్లాదమ్ము సేకూరదే?
వివరమున నుండు త్రాచులు
అవలీలగ విడుచు కుబుస మట్టులె ముదిమిన్
అవయవ బలిమిని బాసియుక
అవకాశము విడిన నరుల కాహ్లాదంబౌ!
డా.పిట్టా
రిప్లయితొలగించుచివరన"క"టైపాటు
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'త్రాచులు+అవలీలగ' అన్నపుడు సంధి నిత్యం. అక్కడ 'సర్పము। లవలీలగ...' అనండి.
రిప్లయితొలగించునేటి మన దేశం లో ప్రతి పక్షాల తీరు :)
జవరాలా దేశమునం
దవకాశము విడిన నరుల కాహ్లాదమ్మా
లవలేశమైన సిగ్గె
గ్గువలయు కారణములేక గుగ్గిలమవ్వన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించుదివినే కోరెదవేల మానవ మహా దివ్యత్వ మేమున్నదో
భువిలో దైవ మనేక సంపదల వైభోగమ్ములన్ కూర్చినన్
భవదీయానుభవమ్ము పొందగ సదభ్యాసమ్ము సాధించుచో
నవకాశమ్ముల వీడినన్ నరుల కాహ్లాదమ్ము సేకూరదే
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భవమొందుట ప్రతి నరునికి
రిప్లయితొలగించువివరించగ నదియ వరము విశ్వము నందు
న్నవ భావనలకు మనుజుల
కవకాశము; విడిన నరుని కాహ్లాదమ్మా?!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కురుక్షేత్రమున శ్రీకృష్ణుడు అర్జునునితో:
రిప్లయితొలగించుప్రవచన గీతా సార
మ్మవగత మైనన్ జయమ్మొ? యనినన్ స్వర్గ
మ్మొ? విశద పడంగఁ జిక్కిన
నవకాశము విడిన నరుల కాహ్లాదమ్మా?
గుండా వేంకట సహదేవుడు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వివిధాకర్షణ విక్రయప్రకట నావిష్కార తుల్యమ్ములున్,
రిప్లయితొలగించుదివ సంచార నిబంధ జాలకపు రీతిన్నుండెడుం, దీక్ష్ణదృ
ష్టి విశాలద్రుమ కాష్ఠ మందునిడు పాఠీ నాశ నాభమ్ముల
య్యవకాశమ్ముల వీడినన్ నరుల కాహ్లాదమ్ము సేకూరదే?
[జాలకము = వల; అశనము = అన్నము , ఎర ]
అవనిం బున రవకాశమ
లవడునె మఱిమఱి విడువఁ గలతయే మిగులున్
లవలేశమైన నేమి స
దవకాశము విడిన నరుల కాహ్లాదమ్మా!
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించుమీ రెండు పూరణలు శ్రేష్ఠములై అలరారుచున్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించుపవనా!చెప్పుమయీయది
రిప్లయితొలగించుయవకాశమువిడిననరులకాహ్లాదమ్మా
వివరణగోరుదుమరినే
వివరముగాజెప్పుమయ్యవిందునునిపుడే
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విందును+ఇపుడే=విందు నిపుడే' అవుతుంది. 'విందు ముదమునన్' అనండి.
అన్నట్టు... మీ పంటినొప్పి ఎలా ఉంది?
భువిపై పుణ్యమునకు ప
రిప్లయితొలగించుర్యవసానముగా ఘటిల్లు నక్షర మెపుడున్
వివిధపు తప్పుల మోక్షపు
నవకాశము విడిన నరుల కాహ్లాదమ్మా?
భువిపైనన్ భవితవ్యమెప్డు కలుగున్ పుణ్యంపు చెయ్దమ్ములన్
రిప్లయితొలగించుచెవిగొంచున్ చెడు లాభముల్ సతతమున్ శీఘ్రమ్ము, దుష్టత్వ ప
ర్యవసానమ్ముగ సంభవించ నిల నిర్యాణమ్ము కైవల్యపు
న్నవకాశమ్ముల వీడినన్ నరులకాహ్లాదమ్ము సేకూరదే
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అవకాశమ్ములవీడినన్నరులకాహ్లాదమ్ముసేకూరదే
రిప్లయితొలగించుయవకాశమ్ములవీడినన్నెటులనాహ్లాదమ్ముసేకూరునో
వివరంబిమ్ముమునెయ్యమాయిపుడయీవేళన్సమాచారము
న్నవగాహంబగుచొప్పునన్నిజమునాకర్ధంబునౌన్సుమాా
సుబ్బారావు గారూ,
తొలగించుమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
నవమాసంబులు మోసి కష్టముల నానందించెడిన్ తల్లికై
రిప్లయితొలగించుభవితన్ గోరుచు నీదు సౌఖ్యముల సంపాదించెడిన్ తండ్రికై
భువిలో నుండగ వెంట వచ్చి హితమున్ బోధించు నాభ్రాతకై
యవకాశమ్ముల వీడినన్ నరుల కాహ్లాదమ్ము సేకూరదే
ఫణికుమార్ తాతా గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
తొలగించుకవనాధిక్యత జూపితిన్ ప్రబల సంఖ్యా గోష్టి సాధించితీ
రిప్లయితొలగించుయవధానాది విశిష్ట కార్యముల విద్యావ్యాప్తి గావించితిన్
భవితవ్యంబును నూత్న సత్కవులకున్ ప్రాప్తించగా నెంచి నా
యవకాశమ్ముల వీడినన్ నరుల కాహ్లాదమ్ము సేకూరదే
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవుగిలి గోరుచు వచ్చిన
రిప్లయితొలగించునవయువతి వరూధినిని ననాదర పరచన్
ప్రవరాఖ్యునికే చెల్లును
అవకాశము విడిన నరుల కాహ్లాదమ్మా
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జవసత్వము లుడుగకమును
రిప్లయితొలగించుభవదీయ పదములనుగన భక్తి నెరుగక
న్నవ సానకాల మగునే ?
యవకాశము విడిన నరుల కాహ్లాదమ్మా
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
.శ్రవణానందము నింపుభక్తి,తగువిశ్వాసంబుతోగూర్చు సత్
రిప్లయితొలగించుకవితా కూర్పులనేర్పులున్ విడిచిలౌఖ్యంబందు నత్యాసతో
భవితవ్యంబును పాడుజేయుపని ప్రాప్తంబంచు| భావించుచున్
అవకాశమ్ముల వీడినన్ నరుల కాహ్లాదమ్ముసేకూరదే?
2.అవిరళ కృషి ఫలితమ్మును
నవలీలగ ద్రుంచి?పరుల నవహేళనతో
యువకుల ర్యాగిం గనియెడి
అవకాశము విడిన నరుల కాహ్లాదమ్మా?
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
లౌక్యంబు... లౌఖ్యంబు అని టైపాటు...
రిప్లయితొలగించుఅవకాశము వచ్చినపుడు
వివేచనము తోడ దాని వినియోగించన్
భువి కలుగును సంతోషము
నవకాశము విడిన నరుల కాహ్లాదమ్మా ?
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుబవరమ్మ౦ దరదంపు చక్రమొరుగన్, బాణప్రయోగమ్ములున్
రిప్లయితొలగించుయవసానమమ్మున గుర్తు రామి నని యా పర్శురాముండు శా
పవశమ్మున్,ఘనదాన మింద్రునకుతద్భానుజుం డిచ్చు, నీ
యవకాశమ్ముల వీడినన్ నరుల కాహ్లాదమ్ము సేకూరదే
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రయోగమ్ములన్+అవసాన...' అన్నపుడు యడాగమం రాదు. 'బాణప్రయోగమ్ములం। దవసానమ్మున...' అనండి.
యువకుల్ భారత మాత పుత్రులును సర్వోత్కృష్ట జీవమ్ముకై
రిప్లయితొలగించుజవసత్వంబులు దారవోసి యతిగా సంపాదింప యత్నించియున్
పవలున్ రాత్రులు గష్టమొందుచును సంపాందించినారిప్పు డే
అవకాశమ్ముల వీడినన్ నరుల కాహ్లాదమ్ము సేకూరదే
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
:42 [PM]
రిప్లయితొలగించుకవితా గోష్ఠులు జరుగగ
నవకాశము విడిన నరుల కాహ్లాదమ్మా?
నవనిని మరిమరి జరుగవు
తవకముతో వినగ నేగ తనివియు కలుగున్.
అవకాశమ్ములు సతతము
భువిలో దొరకవు గనుమిటు పోవిడువంగన్!
జవమున పొందుము లాభము
నవకాశము విడిన నరుల కాహ్లాదమ్మా.
తొలగించు
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అవినీతిరూపు మాపుచు
రిప్లయితొలగించుభవితను దిద్దెడు విధమున పాలింతుననే
యువనాయకునిగెలుపునకె
యవకాశము విడిననరుల కాహ్లాదమ్మా?
అవినీతిరూపు మాపుచు
రిప్లయితొలగించుభవితను దిద్దెడు విధమున పాలింతుననే
యువనాయకునిగెలుపునకె
యవకాశము విడిననరుల కాహ్లాదమ్మా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుభవితన్ దిద్దెదనంచు చెప్పి జనులన్ వంచించెనానేతయే
రిప్లయితొలగించుయవినీతే తనయాయుధమ్ముగను తానార్జించు విత్తమ్ముతో
జవరాలిన్నధి నేతగా గన యధిష్ఠానమ్మె వద్దంచన
న్నవకాశమ్ములవీడినన్ నరుల కాహ్లాదమ్ము సేకూరదే
రిప్లయితొలగించుగురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
వరమ్మ౦ దరదంపు చక్రమొరుగన్, బాణప్రయోగమ్ముల౦
దవసానమమ్మున గుర్తు రామి నని యా పర్శురాముండు శా
పవశమ్మున్,ఘనదాన మింద్రునకుతద్భానుజుం డిచ్చు, నీ
యవకాశమ్ముల వీడినన్ నరుల కాహ్లాదమ్ము సేకూరదే
యువతిన్ జూడక కన్నులన్ పరుగుచున్ యుద్ధాలు కాట్లాటలన్
రిప్లయితొలగించుభవనాల్ కట్టుట పూనకే మసలుచున్ పాతైన వద్దిళ్ళలో
కవులన్ దూరము నుంచుచున్ కవితకున్ కర్ణంబులే మూయుచున్...
అవకాశమ్ముల వీడినన్ నరుల కాహ్లాదమ్ము సేకూరదే!