6, డిసెంబర్ 2016, మంగళవారం

సమస్య - 2217 (రాక్షసుల సహస్రదృక్కు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రాక్షసుల సహస్రదృక్కు రక్షించు సదా"
లేదా...
"రాక్షసు లెల్లరన్ సతము రక్షణ సేయు సహస్రనేత్రుఁడే"

61 కామెంట్‌లు:


  1. భక్షణ చేసెడి దుర్మద
    రాక్షసుల, సహస్రదృక్కు రక్షించు సదా
    రక్షక భటులటు కూల్చుచు
    శిక్షలు వేయగ జిలేబి చిక్కులు తీరున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      పద్యం బాగుంది. కానీ పూరణ భావం కొంత సందిగ్ధంగా ఉంది.

      తొలగించండి
  2. డా.పిట్టా
    లక్షిత లక్ష్య సాధనకు లాక్షణికుండన"భిన్ను లాడె"నే
    వక్షమునాన్చి బెంచెనొక వాహిని బాంబుల వ్రేల్చె నిద్ధరిన్
    తక్షణ భీతికై నిజ మతాగ్రహ మౌఢ్యపు ముష్కరాళియౌ
    రాక్షసులెల్లరన్ సతము రక్షణ సేయు సహస్రనేత్రుడే!
    పక్షము బెంచియు ఖలుడే
    సక్షమతన్ సర్వ జనుల సంత్రాసముకై
    పక్షుల మాదిరి గూల్చెడు
    రాక్షసులసహస్రద్రుక్కు;రక్షించు సదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  3. శిక్షితు లైనవారలు, విశిష్టులు ధార్మిక వర్తనంబునన్,
    రక్షణ గూర్చబూనుచు ధరాస్థలి నధ్వరకర్మలన్ సదా
    దీక్షగ జేయువిప్రు లిక ధర్మము గూల్చెడివారి కెల్లెడన్
    రాక్షసు లెల్లరన్ సతము రక్షణసేయు సహస్రనేత్రుడే.

    దీక్షితుల, విప్రవరులను
    రక్షణకై యుచితమైన క్రతువులు చేయన్
    దక్షుల, దుష్టుల యెడలను
    రాక్షసుల సహస్రదృక్కు రక్షించు సదా!
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. ఆర్యా!
      క్షమించాలి
      ధర్మము త్రెంచెడి గా సవరిస్తున్నాను.

      తొలగించండి
  4. రక్షించుచు సరిహద్దులు
    వీక్షించుచు రేయిపగలు వీరత్వముతో
    రక్షణదళ సభ్యులుపని
    రాక్షసుల సహస్రదృక్కు రక్షించు సదా

    రిప్లయితొలగించండి
  5. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దీక్షను గూడుచు నిరతము
    నక్షధరుని గొల్చుచుండి నలరుచు నుండ
    న్నీక్షించుచు ప్రహ్లాదుని సరి
    రాక్షసుల సహస్రదృక్కు రక్షించు సదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. దుర్యోధన స్వగతం....

    ఓసీ! తాకెను మది నీ
    దౌసిగ్గదిలేనినవ్వు తారాస్థాయిన్
    వేసెను నాకై కష్టము
    దాసీవేసుమి త్రపితవె ధారుణి నీవే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ దత్తపది పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దీక్షను గూడుచుండి హరి తేజము నంతయు డెందమందున
    న్వీక్షను జేయుచున్ శివము నెంచెడి భావముతో భజించి ప
    ద్మాక్షుని యర్చనమ్ములు విధమ్ముగ సల్పుచు నుండు భక్తులౌ
    రాక్షసు లెల్లరన్ సతము రక్షణ సేయు సహస్రనేత్రుడే1

    రిప్లయితొలగించండి
  8. యక్షులు నరయగ బక్షమె
    రాక్షసుల, సహస్ర దృక్కు రక్షించు సదా
    యక్షయ పాత్రను బోలెను
    భిక్షుల నందరిని దాను బ్రేమనుధరణిన్

    రిప్లయితొలగించండి
  9. శిక్షించును శ్రీనాథుడు
    రాక్షసుల , సహస్రదృక్కు రక్షించు సదా
    దీక్షగ క్రతువుల జేసెడు
    దక్షుల సద్ధర్మ పరుల తథ్యము బ్రోచున్


    పక్షియె వాహనమ్ముగ భవాండము నేలెడు పద్మనాభుడే
    యిా క్షితి యందు భారమగు హీనుల ద్రుంచెను దీక్షతో గదా
    రాక్షసు లెల్లరన్ , సతము రక్షణ సేయు సహస్రనేత్రుఁడే
    దక్షుల ధర్మమూర్తుల గదా సురపాలకుడైన తానిలన్

    రిప్లయితొలగించండి
  10. అక్షౌహిణీ సమేతము
    నీ క్షోణినిఁ గావగ మది నెంచి యడరెడిన్
    సుక్షత్రియులను విదళిత
    రాక్షసుల సహస్రదృక్కు రక్షించు సదా


    రాక్షసు లెల్లరన్ సతము రక్షణ సేయు, సహస్రనేత్రుఁడే
    దక్షతఁ బూని పోరినను, దానవ వంశ గురూత్తముండు నే
    కాక్షుడు భార్గవాన్వయ మహార్ణవ సోముడు బ్రహ్మ తేజుడు
    న్నక్షయ వేద పారగుడు నద్భుత శిష్యగణాభిమానియున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువుగారూ శతసహస్రవందనములు. అత్యద్భుతమైన పూరణలతో అమితానందము కలిగించిన మీకు ధన్యవాదములు మరియు అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీపతి శాస్త్రి గారు నమస్కారములు మరియు ధన్యవాదములు.

      తొలగించండి
    3. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  11. భక్షణ చేయుచుండునిల భక్తవిరాగుల నెవ్వరౌ, కృపా
    వీక్షణ చేత మాధవుడు విప్రుల గోవుల నేమిసేయు, ఫా
    లాక్షుని పుష్ప బాణముల రంజిల మన్మధు నెవ్వరంపెనో
    రాక్షసు లెల్లరన్ సతము రక్షణ సేయు సహస్రనేత్రుఁడే

    రిప్లయితొలగించండి
  12. శిక్షించగ జూచు సతము
    రాక్షసుల సహస్రదృక్కు, రక్షించుసదా
    దక్షతను గోరు సుజనుల
    పక్షమ్మువహించి గాచు వాస్తోష్పతియే!!!

    రిప్లయితొలగించండి
  13. మా తమ్ముడు రవికిరణ్ తాతా చేసిన పూరణ.

    దీక్షితులై లోకములను
    ఈక్షణమున గాచునట్టి ఈదల నిరృతుల
    యేక్షణము బాయక సరి
    రాక్షసుల సహస్రదృక్కు రక్షించు సదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవికిరణ్ తాతా గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. కొన్ని లోపాలు....
      'లోకములను+ఈక్షణమున' అని విసంధిగా వ్రాయరాదు. 'లోకమ్ముల । నీక్షణమున' అనండి. 'ఈదల' అర్థం కాలేదు. 'నిరృతుల + ఏక్షణము' అన్నపుడు యడాగమం రాదు. రెండవపాదం చివర తప్పకుండా గురువుండాలి.

      తొలగించండి
  14. రాక్షస రాజుగా నెనరు రావణు డేలెను గన్నతండ్రిగా
    రాక్షసు లెల్లరన్ ,సతము రక్షణ సేయు సహస్ర నేత్రుడే
    యేక్షణ మందునై నమరి యేమరు పాటును లేక యుండగా
    వీక్షణ జేయుచున్ దివిని వేలుపు లందఱి బాగు లన్ సుమీ

    రిప్లయితొలగించండి
  15. రక్షక భటులగు వారు సు
    శిక్షితు లైనపుడె శాంతి స్థిరముగ నుండున్
    భక్షకుల పాలిటయె పని
    రాక్షసులను సహస్ర దృక్కు రక్షించు సదా !

    రిప్లయితొలగించండి
  16. సమస్యా పాదం లో సవరణ: "రాక్షసుల సహస్ర....."

    రిప్లయితొలగించండి
  17. లక్షణ మొప్పుచు బరగి సు
    శిక్షితులై జీవనమును జేకొను వారై
    దక్షత గలిగిన దీక్షా
    రాక్షసుల సహస్రదృక్కు రక్షించు సదా!

    రిప్లయితొలగించండి
  18. శిక్షించ తలంచు సతము
    రాక్షసుల సహస్రదృక్కు, రక్షించు సదా
    యక్షరుడార్తి జనమ్ముల
    దక్షత్వముతోడఁ జంపి తనశత్రువులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. కక్షవహించి పోరుకయి కాలును వేల్పులపైన దువ్వుటన్
    రాక్షస రాజు లెల్లరును, రావణు డండగ నుండి కాచుటే
    రాక్షసు లెల్లరన్ సతము, రక్షణ సేయు సహస్రనేత్రుఁడే
    దీక్షను బూని వేల్పులకు దిక్కయి నిల్చెను మాటిమాటికిన్

    రిప్లయితొలగించండి
  20. "వృత్యనుప్రాస " తో వేలూరి శివరామ శాస్త్రి గారు వసంత ఋతువును వర్ణించిన ఈ ఉత్పలమాల చూడండి.
    ఉ.అంత దిగంత దంతుర నిరంతర కాంత వనాంత సంతతా
    క్రాంత లతాంత మంతక దురంతక కంతుని నిరంతరాంత వా
    సంతిక మంతరాంతర నిశాంత లతాంతర కాంత కాంత మ
    శ్రాంతము సంతసంబిడె వసంతము సంతత మంతనంతటన్.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మనోహరమైన పద్యాన్ని పరిచయం చేశారు. ధన్యవాదాలు.
      రెండవపాదంలో '..కంతు నిరంతరాంత...' అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
    2. నిజమే టైపింగులో ఒక " ని " అదనంగా టైపయింది.

      తొలగించండి
    3. శివరామ శాస్త్రి గారు తిరుపతి వేంకట కవుల శిష్యులు.అప్పుడపుడు అవధానాల్లో జంట కవుల్లో ఒకరు లేకున్నా, లేదా అస్వస్థత వల్ల ప్రక్కన గూర్చున్నా ఆ స్థానాన్ని వీరు భర్తీ చేసే వారట.

      తొలగించండి
  21. దక్షతతోడుతన్ నిలిచి దైత్యగురుండు కరమ్ము ప్రేమతో
    రాక్షసులెల్లరన్ సతము రక్షణ సేయు, సహస్రనేత్రుడే
    భక్షణచేయుచున్ సురతి ప్రాజ్ఞులొసంగు హవిస్సులన్ ధృతి
    న్నక్షరు దీవెనల్ గొనుచు నార్తుల రక్షణ చేయుచుండెడిన్

    రిప్లయితొలగించండి
  22. రక్షణ చేసెడు వారల
    రక్షణమైనను నలయక రాత్రియు బవలున్
    వీక్షించుచుందురా పని
    రాక్షసుల సహస్ర దృక్కు రక్షించు సదా.

    శిక్షించును శ్రీహరి తా
    రాక్షసుల సహస్రదృక్కు రక్షించు సదా
    దక్షులునైన మునులనిల
    చక్షు సహస్రములతోడ జగతిని గనుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

  23. శ్రీగురుభ్యోనమః

    అక్షయమైన ప్రేమల ననంతుడు తానిడు సృష్టి కంతయున్
    శిక్షణ నిచ్చుచున్ కఠిన శిక్షల వేయుచు శిష్టదుష్టులన్
    మోక్షపదమ్ము జేర్చు గద మోదమునన్,శరణంచు మ్రొక్కెడిన్
    రాక్షసు లెల్లరన్ సతము రక్షణ సేయు సహస్రనేత్రుఁడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీగురుభ్యోనమః

      మోక్షము నిచ్చును కమలద
      ళాక్షుడు స్థితికారకుండు హ్లాదనమున దాన్
      రక్షన గోరుచు శరణను
      రాక్షసుల సహస్రదృక్కు రక్షించు సదా

      తొలగించండి
    2. శ్రీపతి శాస్త్రి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  24. యక్షోరగ గంధర్వుల
    పక్షుల మానవుల ఘోర పాపుల నైనన్
    శిక్షింపడు శరణాగత
    రాక్షసుల సహస్రదృక్కు రక్షించు సదా.

    రిప్లయితొలగించండి
  25. చక్షువులన్ సారించెడు
    రాక్షసుల సహస్ర దృక్కు రక్షించు సదా!
    నిక్షేపమ్ముగ లంకను
    శిక్షితుఁడౌ హనుమ దీవిఁ జేరెడు వరకే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  26. భక్షణ జేయ బల్విధుల భాగ్యము లొందుచు రేబవళ్ళులన్
    కుక్షిని నింపు దుర్మతుల గూలఁగజేయగ సైనికాళి యై
    రక్షణ జేయ నెంచి ఘనరక్కసు లట్టుల దీక్ష బూన, నా
    రాక్షసు లెల్లరన్ సతము రక్షణ సేయు సహస్రనేత్రుఁడే

    రిప్లయితొలగించండి
  27. రాక్షసు డైన రావణుని రాజ్యమునందు సుభిక్ష ముంచగా
    రాక్షసు లెల్లరన్ సతమురక్షణ సేయ|”సహస్ర నేత్రుడే
    రాక్షసు డై నహల్యగని రాత్రియు జేసిన దుష్టచేష్ట లౌ
    రా|క్షణ మెంచగా నది సరైనది గాదుగలోకులెంచగా”?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాక్షసుడై యహల్య...' అనండి.

      తొలగించండి