16, డిసెంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2226 (కాసులఁ జూచి వచ్చినవి....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కాసులఁ జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతు లన్నియున్"
లేదా...
"కాసులఁ గని వచ్చెఁ గపులు గంతు లిడుచు"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

  1. వాసిగ దోచుకొందుకని వాపిరివోలె జనంబు కాంక్షతోన్
    రాసులు కూడబెట్టగను రాలినకట్టలు గేలిచేయగా
    యూసులు జెప్పుచున్నవట యూరక మార్పులు జేయుచుండినన్
    కాసులఁ జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతులన్నియున్

    రిప్లయితొలగించండి
  2. నోట్లు మార్చి నంత నూతనత్వము రాదు
    రాజ కీయ మందు రభస గాని
    కోటి కొరకు మనిషి కూసువిద్య లెరుగు
    కాసులఁ గని వచ్చెఁ గపులు గంతు లిడుచు

    రిప్లయితొలగించండి
  3. డా.పిట్టా
    కాసరములవలెబ్యాంకిన్
    కాసను గట్టుచును బె(పె)నుగు కాలము వచ్చెన్
    గ్రాసముకానని విడతల
    కాసుల గని వచ్చె గపులు గంతుల నిడుచున్
    (కాసగట్టుట॥బిగువుగా నడుం గట్టుట.కపి,విష్ణువు బ.వ.లో దేవతల సమూహ వాచకం,వచ్చె.)

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా
    మోసము జేయు వారలకె ముట్టెను నోట్లవి రెండు వేలలో
    కాసిరి (కా)గాపు బ్యాంకి కడ గవ్వయు లభ్యము గాక యాకటన్
    గోసుల దాచి బిస్కతుల గొన్నిటి నోటను వేయబూన ని
    ష్కాసితకాసరప్పడమె కాసగు వానరజాతి మెచ్చు నా
    కాసుల జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతులన్నియున్
    (నిష్కాసిత॥వెడలింప బడిన.కాసర॥వరి వంటి ధాన్యవి.కాసరప్పడము॥బిస్కత్తు యె.కాసు,అగు॥పైకం, తినే పదార్థమే ద్రవ్యం కోతులకు)

    రిప్లయితొలగించండి
  5. చూసెను లంక తోటలను చోద్యముగా ఫలపుష్ప శోభలన్
    మేసెను పండ్లు కాయలను మేలగు రొట్టల గోల జేయుచున్
    కూసెను రామదండు చని గొప్ప ముదమ్మున కొట్టవచ్చు రా
    కాసులఁ జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతు లన్నియున్.

    రిప్లయితొలగించండి
  6. త మిని దానిమ్మ పండ్లుగా దలచి మదిని
    మేటి రత్నాల కాంతుల మెఱయు చుండు
    కాసులు గని వచ్చె గపులు గంతు లిడుచు
    నాహ రించగ విత్తుల నార్య !యవియ

    రిప్లయితొలగించండి
  7. క్రోసుల దవ్వునుండి తమ కోర్కెల దీర్చెడు తల్లియంచు నా
    బాసర కేగుదెంచిరట పావన మూర్తికృపాకటాక్షమున్
    వాసిగ గోరి తుంటరులు, భారిగ జేరిన యట్టి బాలరా
    కాసులఁ జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతు లన్నియున్

    పాఠ శాలలోనజదువు బాలురెల్ల
    వాసరమ్మను పూజింప వచ్చిరటకు
    కపట మెరుగని బాలరా కాసులగని
    వచ్చె గపులు గంతులిడుచు బారులు గను.

    రిప్లయితొలగించండి
  8. కాసులు జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతులన్నియు
    న్నా సలు గల్గె వాటికిని నాయత రీతిని గాసు ల న్గనన్
    వీసము నాలసింపకను వేగముగా నట చిందు లేయుచు న్
    గా సర బీ సరన్ దిరుగు కాలక పీశు ల జూచితే శివా !

    రిప్లయితొలగించండి
  9. బాసట నిల్వ రామునకు వానర ముఖ్యుడు నర్కపుత్రు న
    బ్బాసలు సోకఁ గర్ణములఁ బౌరుష మేసర సాధులోక సం
    త్రాసుల యుద్ధ కోవిదుల రాక్షస వీరుల వైరు లెల్లఁ గొ
    ర్కాసులఁ జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతు లన్నియున్

    [ఏసరు = మీఱు, అతిశయించు; కొర్కాసు = నిప్పు ఉన్న కట్టె, కొఱవి]


    సంతసమ్మున కార్తికోత్సవము లందు
    జనులు వచ్చి చేర వన భోజనములకును
    భక్ష్యచయ భరిత సుగంధ పాత్ర కర వి
    కాసులఁ గని వచ్చెఁ గపులు గంతు లిడుచు

    రిప్లయితొలగించండి
  10. లంకలోన ప్రవేశించి రాముతోడ
    కదన మందున మెదలు రా కాసులఁగని
    వచ్చెఁ కపులు గంతులిడుచు వాయు పుత్రు
    వెనుక కరమగు ధృతితోడ పెనగులాడ

    రిప్లయితొలగించండి
  11. బాసట నిచ్చి రామునకు వానర యోధులు కట్టి వారధిన్
    హాసముతోడ లంక జని యక్కజ మొప్ప, రణమ్ము బ్రహ్మ రా
    కాసులఁ జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతులన్నియున్
    భీషణ సంగరమ్మునను వృత్రుల చెచ్చెర సంహరించగన్

    రిప్లయితొలగించండి
  12. రాష్ట్రపతి భవనము రణరంగ మవగ
    రాజకీయులు తరలగ రంకె లిడుచు
    నేను నేనచు నరచెడి నేతల తిర
    కాసులఁ గని వచ్చెఁ గపులు గంతు లిడుచు

    రిప్లయితొలగించండి
  13. బాసట రోక్కమున్,పసిడి,పంటలు ముఖ్య మటంచునెంచియే
    దాసులు ధర్మమున్ విడిచి దక్షతచేతను కూడబెట్టగా?
    మోసము గుర్తెరింగి మనమోది ప్రధానియునిర్ణయాలతో
    మీసము ద్రిప్పు వారలట మిక్కిలిరొక్కము పారవేయగా?
    కాసులుజూచి|” వచ్చినవి గంతులు వేయుచుకోతులన్నియున్
    పాసిన తిండికై |బ్రతుకు బంచగ భాగ్య మటంచు నెంచియే”|
    2.తినిన విస్తర్లు నోట్లున్న తనిఖి జేయ?
    వింతగాదని కనుగొని చెంత నొకడు
    కాసులుగనివచ్చె|”గపులు గంతులిడుచు
    చెట్టు దిగివచ్చె తిండికై పట్టుదలగ”
    మోడి వేసిన మంత్రమామోదమనగ|


    రిప్లయితొలగించండి
  14. మాసము దాటిపోవ , పరిమాణము తగ్గక పాత నోట్లు రా
    కాసుల వోలె వచ్చి పడ కట్టలు కట్టలు గాగ నెల్లెడన్
    మోసము జేయ గల్గు తగు మార్గము జూపెద మంచు మెండుగా
    కాసులఁ జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతు లన్నియున్

    రిప్లయితొలగించండి
  15. మోసము జేసి రావణుడు భూమిజ నెత్తుక పోయె లంకకున్
    రోసముతోడ రాముడు విరోధముతోగల రాక్షసేంద్రుడిన్
    నాశము జేయ వానరుల నమ్మిరణంబొన రించ లంక రా
    కాసులఁ జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతు లన్నియున్

    రిప్లయితొలగించండి
  16. భద్రగిరి యాత్రికుల వద్ద పదునెనిమిది
    వందల పదునెనిమిదిసంవత్సరంపు
    రాగి నాణెము పైన "శ్రీ రామ హనుమ
    కాసులుగని"వచ్చె|గపులు గంతులిడుచు

    రిప్లయితొలగించండి
  17. పెండ్లి వేడుకలందున పేరిశాస్త్రి
    కాసుల గనివచ్చె;కపులు గంతు లిడుచు
    పెళ్ళి పందిరి నంతయు పెరికి వేయ
    పరుగు దీసిరెల్ల జనులు భయము చేత.

    రిప్లయితొలగించండి

  18. జీతము పెంచమంచుచును చేయగ సమ్మెను కర్మచారులే
    నీతులు చెప్పుచున్ భటుల నేతల నెత్తిన పాలు పోయుచున్
    జీతము పెంచకే బుధులు చిల్లర రూకలు నేలజల్లగా
    కాసులఁ జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతు లన్నియున్

    రిప్లయితొలగించండి