24, డిసెంబర్ 2016, శనివారం

సమస్య - 2233 (దరహాసమ్ములు సాలు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"దరహాసమ్ములు సాలు వక్త్రమున శస్త్రశ్రేణులన్ మించగన్"
లేదా...
"శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

60 కామెంట్‌లు:

 1. చురకత్తుల్ దెగగోయు కుత్తుకలు ద్రుం
  చున్ ప్రేమసంరావమున్
  హరువున్ ద్రోయుగదాతి నిష్ఠురపు వా
  గార్భాటమున్ బెంచగన్
  ధర సౌహార్ద మనోవికాసమున సా
  ధ్యంబొందగా నెప్పుడున్
  దరహాసమ్ములు సాలు వక్త్రమున శ
  స్త్ర శ్రేణులన్ మించగన్!

  రిప్లయితొలగించండి
 2. శాస్త్రములు దెల్ప లేదటె
  దస్త్రశ్రేణులను మించు దయయే మేలౌ
  వస్త్ర విహీనుండైనను
  శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "దస్త్రశ్రేణి" దుష్టసమాసం అవుతుందేమో! మన్నించ వలె!

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీ రన్నట్టు అది దుష్టసమాసమే. 'దస్త్రపు శ్రేణులను...' అంటే సరి!

   తొలగించండి
 3. పరిహా సమ్ములు జేయకుం డగను సాపత్యంబు నందించుచో
  దరహా సమ్ములు సాలు వక్త్రమున శస్త్రశ్రేణులన్ మించగన్
  పరివే ష్టింపగ మానసం బునను కోపావేశముల్ మాన్పినన్
  కరుణా రాధన పెంచినంత జగమున్నేలంగ సాధ్య మ్మగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది.
   'మాన్పినన్' అన్నదాన్ని 'మాన్చినన్' అనండి. చివరి పాదంలో యతితప్పింది. 'జగమున్గాపాడ సాధ్యమ్మగున్' అనండి.

   తొలగించండి
  2. పరిహా సమ్ములు జేయకుం డగను సాపత్యంబు నందించుచో
   దరహా సమ్ములు సాలు వక్త్రమున శస్త్రశ్రేణులన్ మించగన్
   పరివే ష్టింపగ మానసం బునను కోపావేశముల్ మాన్చినన్
   కరుణా రాధన పెంచినంత జగమున్గాపాడ సాధ్య మ్మగున్

   తొలగించండి
 4. అస్త్రముల నుపయోగించుచు
  శస్త్రము లనుమించు భాష సాయకము లనన్
  నిస్త్రాణ మునందు మనిషికి
  శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ రెండవ పూరణ బాగున్నది.
   మొదటి, మూడవ పాదాల్లో గణదోషం. 'అస్త్రముల బ్రయోగించుచు.... నిస్త్రాణమ్మున నరునకు' అనండి. 'మనిషి' సాధువు కాదు (బ్రౌణ్యంలో ఉన్నా).

   తొలగించండి
  2. అస్త్రముల బ్రయోగించుచు
   శస్త్రము లనుమించు భాష సాయకము లనన్
   నిస్త్రాణమ్మున నరునకు
   శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే

   తొలగించండి
 5. అరులంచున్ మనమందు భావనములే కత్యంత ప్రేమంబుతో
  ధరవారందరినిన్ సహోదరులుగా దానెంచి యవ్వారితో
  వరసల్లాపము లాడుచుండుట లికన్ భవ్యంబులై వెల్గు నా
  దరహాసమ్ములు సాలు వక్త్రమున శస్త్రశ్రేణులన్ మించగన్.

  శాస్త్రోక్తము, వేదోక్తం
  బస్త్రంబుల దాల్చకునికి యాహవమందున్
  శాస్త్రులు మెచ్చెడి రీతిగ
  శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 6. డావ.పిట్టా
  దస్త్రము విప్పెనుద్రౌపది
  వస్త్రము నొలువంగ జూచు వైనము గడగెన్
  అస్త్రమె ఆ(యా)పని వేడుక
  శస్త్ర శ్రేణులను మించు సరి చిరునవ్వే!
  పరులంజూడ విచిత్ర వేషములనన్ భాసిల్లునెట్లున్న దు
  ష్కరమౌ ద్ర(త్ర)చ్చుట హేయభావనల నీ కన్నుల్ యోష్టముల్ విప్పుటే
  చిర సౌఖ్యంబని నవ్వి వారి మనముల్ ఛేదింప భావ్యంబొకో?
  దరహాసమ్ములు సాలు వక్త్రమున శస్త్ర శ్రేణులన్ మించగన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'కన్నుల్+ఓష్ఠముల్' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 7. భస్త్రిక సెగలను పెంచును
  శస్త్రమ్ములు పగను వోలె.శాంతినిపొందన్
  శాస్త్రియు గాంధీ తెలిపిరి
  శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే.


  రిప్లయితొలగించండి


 8. అస్త్రము లేల జిలేబీ
  శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే,
  శాస్త్రము చదువన్ తెలియదు
  ఓ స్త్రీ మృదు భాషణ వలనొప్పును మేలౌ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. కొరఱగాకుండును కొన్నిమార్లు బరిలో కోదండముల్ బాణముల్
  సరియౌ రీతిని చక్కబెట్ట నవుగా చర్చింప చిర్నవ్వులే
  అరివర్గమ్ముల గెల్వజాలు నివియే యాలోచనన్ జేసినన్
  "దరహాసమ్ములు సాలు వక్త్రమున శస్త్రశ్రేణులన్ మించగన్"

  రిప్లయితొలగించండి
 10. సరసోల్లాపము లెల్ల మారు వికటాసందర్భ హేలాగతిం
  బరిహాసమ్ములు దెచ్చు నెల్లరకు విభ్రాంతిన్ వివాదమ్ములే
  దరహాసమ్ములు సాలు వక్త్రమున శస్త్రశ్రేణులన్ మించగం
  గరవాలమ్మునఁ గాని కార్యములు తత్కాలంబ చేకూరగన్


  శాస్త్ర విదుల నైనను గుసు
  మాస్త్ర శరాఘాత సుహృదయార్తులఁ జేయున్
  వస్త్ర విశేష లస దబల
  శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 11. శ్రీగురుభ్యోనమః

  అరయన్ మేదిని రాగమేఘముల దివ్యంబైన వాత్సల్యముల్
  మెరయున్ ధారగ ప్రేమ వర్షములుగ్ బ్రాహ్మీమాత రూపంబులై
  కురియున్ శాంతియు సౌఖ్యముల కలుగు సంకోచంబు లేకుండగా
  దరహాసమ్ములు సాలు వక్త్రమున శస్త్రశ్రేణులన్ మించగన్

  నిస్త్రింశంబులు బట్టక
  శాస్త్రంబుల జదివి మిగుల చతురతతో వా
  గస్త్రంబులనున్ బట్టిన
  శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అరయన్ మేదిని రాగమేఘముల దివ్యంబైన వాత్సల్యముల్
   మెరయున్ ధారగ ప్రేమ వర్షములు బ్రాహ్మీమాత రూపంబులై
   కురియున్ శాంతియు సౌఖ్యముల్ కలుగు సంకోచంబు లేకుండగా
   దరహాసమ్ములు సాలు వక్త్రమున శస్త్రశ్రేణులన్ మించగన్

   తొలగించండి
  2. శ్రీపతి శాస్త్రి గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 12. విస్తృతముగ వర్ణించిరి
  శాస్త్రమ్ములలోన బుధులు శత గ్రంథముల
  న్నస్త్రమ్మటు సాగు వరము
  శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే

  రిప్లయితొలగించండి
 13. వస్త్రమ్మై కనులను దయ
  శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే
  యస్త్రము కమ్మని పలుకౌ
  ఓ స్త్రీ! అమ్మ థెరిసా అయో! వీడితివా||

  గురువుగారూ, నిన్నటి పూరణ కాస్త చూడండి -

  భర్తీ కాని కొఱయినను
  భర్త మరణవార్తను విని భార్య మురిసె సం
  పూర్తిగ జీవచ్చవమై
  యార్తికి మూర్తికి విడుదల యానందమెగా ||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తంగిరాల రఘురామ్ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 14. శస్త్రశ్రేణులనరయగ
  శస్త్రశ్రేణులనుమించుసరిచిరునవ్వే
  శస్త్రముచిరునగవులికను
  నస్త్రములేయౌనుబ్రదుకయందరికెపుడున్

  రిప్లయితొలగించండి
 15. ----------------------------
  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { నవ్వు చే అన్ని పనులు సాధి౦ప వచ్చును .

  ముఖమున క్రూరమైన తీక్షణ మైన నగవు

  శస్త్రములను మి౦చును }
  ి

  దర హాసమ్ముల(న్) సర్వకార్యములు

  ………… సాధ్య౦బౌను | వర్జ౦చి గ౦

  దర గోల౦బగు బుధ్ధి , వర్తిలుము

  ………… మిత్రత్వాన | క్రౌర్య౦పు వా

  దర హాసమ్ములు సాలు వక్త్రమున ,

  …………… శస్త్రశ్రేణులన్ మి౦చగన్ |

  దర మౌ - శా౦తమె , జీవనా౦బుధి నికన్

  ……….... దాట౦గ నిక్కమ్ముగా

  { వాదర = త.వి. = (ఖడ్గాదుల) పదను ,

  వాదర = , , = పదునైన తీక్షణమైన ;

  క్రౌర్య౦పు వాదర హాసము = మనసులో

  క్రౌర్య మున్నపుడు కనిపి౦చే తీక్షణమగు

  నగవు , క్రూరపు నవ్వు ;

  త ర ము = ప డ వ , ఓడ }

  తర మౌ శా౦తమె = శా౦తమె ఓడ యగు ను __________________________

  ి

  రిప్లయితొలగించండి
 16. కం.అస్త్రమ్ములు గావు మనకు
  విస్త్రృతముగ జింత జేసి వివరింపంగన్
  శాస్త్రమ్ములు నుడూవును గద
  "శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నుడూవును (నుడువును)' టైపాటు.

   తొలగించండి
 17. సునీల్ బాబు పూరణ:

  శస్త్రములవి విల్లంబులు
  అస్త్రములవి పాపల తెలి హాసము లలరన్
  శస్త్రాస్త్రముల నరయగను
  శస్త్ర శ్రేణులను మించు సరి చిరు నవ్వే !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సునీల్ బాబు గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. డా పిట్టా నుండి
  ఆర్యా
  రెండవ పాదంలో ఈసవరణ స్వీకరించ మనవి.
  "ష్కరమౌ ద్రచ్చుట హేయ భావనల నీ కన్నుల్ ముఖాల్ విప్పుటే " ఇది సరి చూచు కొని మనవి చేయుచున్నాను.రఫ్ నుండి తొందర పాటులో నిర్ణీత అక్షర సంఖ్య మించింది.sorry!

  రిప్లయితొలగించండి
 19. వస్త్రములదాగు సిగ్గులు
  శస్త్ర శ్రేణులను మించు సరి చిరు నవ్వే,
  విస్తృతసమ్మోహక ది
  వ్యాస్త్రములు కద మదనునకు వ్యాకుల పరచన్

  రిప్లయితొలగించండి
 20. శరవేగమ్మున హేళనల్ గురియ? విశ్వాసమ్మునెంతున్న|ఆ
  పరువంబింతయు నిల్వలేకయిక యే బంధాలులేనట్లుగా
  తరముల్ కంటును|ఈర్ష్యయే మిగుల? సంతాపంబునన్ గ్రుంగుటే
  దరహాసమ్ములసాలు వక్త్రమున శస్త్ర శ్రేణులులన్ మించగన్|
  2.అస్త్రము వంటిది హేళన
  శస్త్ర శ్రేణులను మించు సరి చిరునవ్వే|
  దస్త్రము వంటిది పరువము
  శస్త్రముతోచింపివేయ?జన్మకుచావే|

  రిప్లయితొలగించండి

 21. విస్తృత పర్యటన జరిపి

  శస్త్రము చిరునవ్వె కాగ జాతిని గాంధీ

  యస్త్రము లేకుండ నడిపె

  శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే.

  రిప్లయితొలగించండి
 22. శాస్త్రము లెన్నియొ జదివిన
  శాస్త్రికి కోపమ్మెయున్న సరిగాదదియే
  మేస్త్రీ కూలీయైనను
  శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే.

  రిప్లయితొలగించండి
 23. పరివారంబును గూడి వచ్చి యటవిన్ వాశిష్ఠ వాసంబునన్
  శరసంధానము చేసె తాపసునిపై శాస్త్రంబు పాటింపకన్
  పరిహాసంబును బొందె విశ్వరథుడే ప్రాఘాతమందోడియున్
  దరహాసమ్ములు సాలు వక్త్రమున శస్త్రశ్రేణులన్ మించగన్

  రిప్లయితొలగించండి


 24. విస్తృత పర్యటన జరిపె

  శస్త్రము చిరునవ్వె కాగ స్వాతంత్ర్యముకై

  యస్త్రము లేకనె గాంధీ

  శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే.

  రిప్లయితొలగించండి
 25. రాయబార సమయమున సుయోధనుడు శ్రీకృష్ణపరమాత్మతో...

  పరిహాసమ్ములు రాయబారికిని భావ్యమ్మౌనె గోపాలకా?
  నిరహంకారముఁ జూపి సంధికిని మన్నింపంగ కాంక్షింతువే?
  విరసంబౌ వచనంబులేల? మము నావేశంబునన్ ముంచెడున్
  దరహాసమ్ములు సాలు వక్త్రమున శస్త్రశ్రేణులన్ మించగన్!

  రిప్లయితొలగించండి
 26. వరలున్ మానిత సౌమ్యభాషణ శుభవ్యాపారలీలాకృతుల్
  స్థిరమై నిల్చును సౌఖ్య సంపదలు నిక్షేపంబుగా చెంత, భా
  సురమౌ కీర్తియు,కార్యసాధనము పొల్చున్ గాననుత్కృష్టమౌ
  దరహాసమ్ములు సాలు వక్త్రమున శస్త్రశ్రేణులన్ మించగన్

  రిప్లయితొలగించండి
 27. అరివీరుండ్రను గూల్చ యుద్ధములు సంహారమ్ములింకేటికో
  దరహాసమ్ములు సాలు వక్త్రమున శస్త్రశ్రేణులన్ మించగన్
  పరిహాసమ్మిది కాదు వాస్తవము సంప్రాప్తించు నే శాంతియే
  పరమానందము నిండి విశ్వమున సౌభ్రాతత్వమే వెల్గగన్

  అస్త్రము తో పనిలేదని
  శాస్త్రము లెన్నో చదివిన సత్పండితుడౌ
  శాస్త్రియె చెప్పిన దేమన
  శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే

  రిప్లయితొలగించండి
 28. కరముల్ మోడ్చక కాంగ్రెసోడినపు డున్ గంభీర ఘట్టాలలో
  శిరముల్ వంచక ప్రార్థనాలయములో సేవల్ శ్మశానాలలో
  పరువుల్ పోయెడి రీతిగా సభలలో వర్తించి కన్ కొట్టగా
  దరహాసమ్ములు సాలు వక్త్రమున శస్త్రశ్రేణులన్ మించగన్

  రిప్లయితొలగించండి