25, డిసెంబర్ 2016, ఆదివారం

సమస్య - 2234 (శంకరునిఁ గొల్చుచుంద్రు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"శంకరునిఁ గొల్చుచుంద్రు క్రైస్తవులు సతము" 

లేదా
"శంకరు నాశ్రయించిరఁట సై యని క్రైస్తవు లెల్ల భక్తితోన్" 
ఈ సమస్యను పంపిన పిట్టా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.

34 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. గరళమును గ్రోలె నొకడుపో వరము లిడుచు
   సిలువనెక్కె మరొకడహో వలపు తోను
   ఈశు డనెదరు కొందరు నేసు నొకరు
   పేరులెన్నైన పరమాత్మ వేరు వేర?
   శంకరునిఁ గొల్చుచుంద్రు క్రైస్తవులు సతము

   తొలగించండి

  2. భక్తి శ్రద్ధల తోడను భారతీయు
   లందరాస్తిక జనములై ననవరతము
   శంకరుని కొల్చుచుంద్రు క్రైస్తవులు సతము
   ఏసు క్రీస్తును కొలుచెద రిలను నెపుడు.

   తొలగించండి
 2. ప్రమద గణముల నొకడట ప్రభువు యేసు
  అవత రించెను భువిపైన యాదు కొనగ
  మతము లందున భేదము హితము కాదు
  శంకరునిఁ గొల్చుచుంద్రు క్రైస్తవులు సతము

  రిప్లయితొలగించండి
 3. డా.పిట్టా
  ఈశు డనగ సర్వేశ్వరు డీప్సితములు
  సుఖములిచ్చెడు దాత నీ స్తోత్రములకు
  యాసతో యేసు యైన నయ్యదియె భక్తి
  శంకరుని గొల్చుచుంద్రు క్రైస్తవులు సతము

  రిప్లయితొలగించండి
 4. శంకరుం డన సుఖముల సదయుఁ డగుచు
  గూర్చువాఁడని యర్థము; కోరుకొనిన
  నిస్తుల సుఖమ్ముల నొసంగు క్రీస్తనఁబడు
  శంకరునిఁ గొల్చుచుంద్రు క్రైస్తవులు సతము.

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా
  వంకలు లేని యా సిలువ వాసి గదా కరుణార్ద్రమౌ హృదిన్
  శంకరుడట్లె దీనులకు సౌఖ్య ప్రదాతగ సౌమ్యగామి యౌ
  బొంకక వేల స్తోత్రముల బూజయె చాలు నిరీశ్వరత్వపున్
  శంకరు నాశ్రయించిరట సై యని గ్రైస్తవ సోదరుల్ యిలన్

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా
  ఆర్యా కృతజ్ఞతలు
  నా పూరణలో "భక్తి" యిదివరకే వచ్చినందున
  శంకరునాశ్రయించిరట సై యని గ్రైస్తవ మిత్రు లెల్లరున్ ...గా మార్చినాను.

  రిప్లయితొలగించండి
 7. డా.పిట్టా
  పొంకముగాను యీ సిలువ బోలును లింగ మిదేమి పోలికో!
  అంకము జేర్చ దీనులను యార్తిని రూపము మార్చిరిద్దరున్
  అంకెల లోన కూడికకు నర్థముగా నిలువడ్డమున్నవీ
  శంకల బాపుకొందమిక చాలు నిరీశ్వర తత్త్వమంచు నా
  శంకరునాశ్రయించిరట సై యని క్రైస్తవులెల్ల భక్తితోన్

  రిప్లయితొలగించండి
 8. తనను దలచిన క్షేమంబు లనయ మొసగు
  పాపనాశకు నేసును బహుళములగు
  వరము లిచ్చుచు నుండెడు భక్తజనవ
  శంకరుని గొల్చుచుంద్రు క్రైస్తవులు సతము

  అంకిత భావులై సతత మాకరుణామయు నేసు నెల్లెడన్
  శంక యొకింత బూనక లసద్గుణదాతను సర్వరక్షకుం
  గింకరులై చరింప ఘనకీర్తి నొసంగెడు ఘోరపాపనా
  శంకరు నాశ్రయించిరట సైయని క్రైస్తవు లెల్ల భక్తితోన్.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 9. హిందువులు మోక్షమిమ్మని యెవని గొల్తు?
  రెవరు క్రీస్తును భక్తితో నింపుమీర
  దలతు? రేవేళ లందున? తెలుపు మయ్య
  శంకరుని గొల్చుచుంద్రు, క్రైస్తవులు, సతము.

  రిప్లయితొలగించండి
 10. భారతమునందు నివసించు భాగ్య పరులు
  కొన్ని సొమ్ముల కొఱకునై గుణము విడువ
  మనసు నందున భర్గుని మరువలేక
  శంకరునిఁ గొల్చుచుంద్రు క్రైస్తవులు సతము

  రిప్లయితొలగించండి
 11. శ్రీగురుభ్యోనమః

  జంకక నేను చెప్పెదను జాతి మతమ్ములనేకమైనను
  న్నింకొక రెట్లు దైవమగు నీశుడు దప్ప సమస్త సృష్టికి
  న్నింకువ యౌచు నిల్చె నభయేశుడు వారికి, యేసు రూపుడౌ
  శంకరు నాశ్రయించిరఁట సై యని క్రైస్తవు లెల్ల భక్తితోన్

  రిప్లయితొలగించండి
 12. దైవ మొక్కడే వినుమరి ధరణి నుండు
  నామములు బలు విధములు నమ్ము డార్య !
  తనరశంభుడు క్రీస్తుగా గనబడుట న
  శంకరుని గొల్చు చుంద్రు క్రైస్తవులు సతము

  రిప్లయితొలగించండి
 13. పాప నాశన కారియ ప్రభు సుతుడని
  యెంచి భక్తిప్రపత్తుల నెల్లను మది
  నుంచి క్రీస్తుఁ బశ్చిమ సకలోర్విజన వ
  శంకరునిఁ గొల్చుచుంద్రు క్రైస్తవులు సతము


  బొంకులు నేర్చి నిత్యమును మూరిన స్వార్థపు బుద్ధిఁ దాల్చుచున్
  శంకను వీడి కావలము సల్పగఁ బొందిన ఘోర పాపపుం
  బంకిల మెల్లఁ బాపి జనవర్గ సురక్షణ భార ధారి యౌ
  శంకరు నాశ్రయించిరఁట సై యని క్రైస్తవు లెల్ల భక్తితోన్

  [శంకరుడు = సుఖమును గలుగఁజేయువాఁడు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రైస్తవ సన్మతప్రభవ కారణ భూతుడు పుణ్య మూర్తియున్
   నాస్తిక భావ నాశక సనాతన ధర్మ వికాసమాన చి
   త్త స్తవనీయ పూరుషుడు దైవ సుతుండు నరేంద్ర ధర్షిత
   న్యస్త విశాల చార వినతాంబుధి వీరుడు క్రీస్తుఁ గొల్చెదన్

   [చారము = చెఱ]

   తొలగించండి
  2. Meaning:

   A name with which a Religion had its fame

   A man of pure soul who sees the atheists crawl

   Flares up the fire of Ten Commandments as a whole

   A man of honour and Son of The Omniscient

   Captured by the king and had the rupture of jail

   Made the ocean bowed whom I always adore!

   తొలగించండి
 14. బడుగు వర్గపు సేవలఁ గడుముదమున
  సలుపుచున్ పయనించుచు సత్య పథము
  పావనమగు హృదయముతో భక్త జన వ
  శంకరుని గొల్చు చుండ్రు క్రైస్తవులు సతము

  రిప్లయితొలగించండి
 15. మరియమకు పరి శుద్ధాత్మ మహిమ వలన
  యేసుజనియించె సుతునిగ నీశునకును
  పాపులను బ్రోవ,నమ్మిన భక్తజన వ
  శంకరునిఁ గొల్చుచుంద్రు క్రైస్తవులు సతము

  రిప్లయితొలగించండి
 16. బొంకులు గావు సత్యమట భూరి ధనమ్ములు పొంది కొందరున్
  శంకలు మాని నమ్మగ ను స్వస్థత నొందిన వారు కొందరున్
  కంకులుయాది వారమున క్రైస్తవులై మరునాడు బోయలై
  శంకరు నాశ్రయించిరఁట సై యని క్రైస్తవు లెల్ల భక్తితోన్

  రిప్లయితొలగించండి
 17. జంకక క్రైస్తవుల్ ద నరశంకరుడే తమ యేశు నంచు దా
  పంకజ నాభునిన్ దయను భవ్యుని గొల్చుట మంచి దంచుచున్
  శంకరు నాశ్ర యించి రట సైయని క్రైస్తవు లెల్ల భక్తి తోన్
  శంకరు డిచ్చుదప్పక ను సర్వశు భంబులు నంచు బ్రీతి గాన్

  రిప్లయితొలగించండి
 18. సంకటమైన స్థాయి కొన సాగుచు నుండగ జీవితమ్మునన్
  వంకర మార్గమున్ బడక పావన మైన మనస్సుతోడుతన్
  శంకరు నాశ్రయించిరట సైయని క్రైస్తవులెల్ల భక్తితోన్
  శంకల వీడి జీవనము చక్కగ సాగునటంచు తల్చుచున్

  రిప్లయితొలగించండి
 19. మదిని శివమందిరముగను మార్చి హిందు
  బాంధవులు నిరతమ్మిల భక్తితోడ
  శంకరునిఁ గొల్చుచుంద్రు, క్రైస్తవులు సతము
  తమదు దేవుడేసనుచును దలతురుగద

  శం నకర్థమ్ము సుఖమంచు జగతి యందు
  కరుడనగ నిచ్చు వాడంచు గదర తెలియ
  శంకరుడు క్రీస్తనంగను శంక యేల
  శంకరునిఁ గొల్చుచుంద్రు క్రైస్తవులు సతము

  రిప్లయితొలగించండి
 20. పంకజనాభుఁడాదిగ సుపర్వులు రాక్షస దిగ్గజంబులున్
  జంకుచు నా హలాహలము సర్వము మ్రింగుమటంచు నార్తితో
  శంకరు నాశ్రయించిరఁట, సై యని క్రైస్తవు లెల్ల భక్తితోన్
  వంకలు లేని యేసు సిలువన్ ధరియించిరి భూషణమ్ముగాన్.

  రిప్లయితొలగించండి
 21. కింకరుని వోలె నిరతము కించబడక
  బండి నడుపుట కొఱకయి పాటు పడుచు
  కాపరిగ నుండి నిరతము గాచు తమ వ
  శంకరునిఁ గొల్చుచుంద్రు క్రైస్తవులు సతము

  రిప్లయితొలగించండి
 22. క్రొవ్విడి వెంకట రాజారావు:

  నిన్నటి పూరణ:

  నిస్త్రాణ బఱచు చుండెడి
  శస్త్ర శ్రేణులను మించు సరిచిరునవ్వే
  విస్తృతముగ నేర్పించెడి
  శాస్త్రియె సరినాయకుండు శాంతికి నెపుడున్.

  నేటి పూరణ:

  శివుని భక్తులై చెలగెడి సేవకులిట
  శంకరుని గొల్చు చుంద్రు; క్రైస్తవులు సతము
  గొదకొనుచు దాము క్రీస్తును గొల్చు చుంద్రు
  అఘము లంతము గోరెడి నర్చనలవి.

  రిప్లయితొలగించండి

 23. ఈప్సితమ్ముల నీడేర్చు నీశ్వరుండె

  యనుచు భక్తితో హిందువు లనవరతము

  శంకరుని గొల్చుచుంద్రు; క్రైస్తవులు సతము

  నేసు ప్రభుని దేవునిగా స్తుతింతురంత.

  రిప్లయితొలగించండి
 24. ఏసు నందు మహేశుడు యిమిడియుండ
  ఇద్దరొకటని తలచినపెద్దవారు
  శంకరుని గొల్చు చుంద్రు క్రైస్తవులు సతము|
  మతముహితమని గుర్తించుమాన్యులనిరి|
  2.శైవ మతహిత కర్తలు-సర్వుడనుచు
  శంకరుని గొల్చు చుంద్రు|”క్రైస్తవులుసతము
  ఏసుప్రభువును భక్తిగానెంచువారు
  నూత్న వత్సరమందు వినూత్నక్రియల
  జేయబూనుచు చర్చిలో శిలువముందు
  ప్రార్థనలు సల్పు చుంద్రు సంప్రాప్త మనుచు”|


  రిప్లయితొలగించండి
 25. అంకిలి యేర్పడంగనె?సహాయముగోరి హలాహలమ్ముకై
  శంకరు నాశ్రయించిరట|”సైయని క్రైస్తవులెల్ల భక్తితోన్
  కింకరులుంచు బాధలను కీడును మాన్పగ రక్షకుండుగా
  అంకితమైన యేసు”|ప్రభు నందరుగొల్తురు చర్చిలంతటన్”.  రిప్లయితొలగించండి
 26. మతము చూపిన దారిలో మసలు చుండి
  తమను రక్షించు నేసను తత్వమందు
  వెలసి క్రీస్తుకు ముందున్న వీడి ప్రతిమ
  శంకరునిఁ, గొల్చు చుంద్రు క్రైస్తవులు సతము

  రిప్లయితొలగించండి
 27. వంకర బుద్ధితో నొకడు పట్టణమందలి బీడుభూమినే
  బొంకుచు నాదనంచనగ బోరున నేడ్చుచు గట్టి ప్లీడరౌ
  శంకరునాశ్రయించిరట సైయని క్రైస్తవులెల్ల, భక్తితో
  సంకటముల్ హరించు తమ స్వామికి చర్చిని గట్టనెంచుచున్

  రిప్లయితొలగించండి
 28. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈరోజు ఒక పుస్తకావిష్కరణ సభకు వెళ్ళి తరువాత కవిసమ్మేళనంలో పాల్గొని రావడం, మా అమ్మాయి తన పిల్లలతో ఇంటికి రావడం వల్ల ఇంట్లో హడావుడి తదితర కారణాల వల్ల పద్యాలను పరిశీలించడానికి సమయం, అవకాశం లభించలేదు. రేపు ఉదయమే రాంభట్ల వారి అష్టావధానంలో పాల్గొనడానికి హైదరాబాదు వెళ్తున్నాను. కనుక ఈనాటి, రేపటి పూరణలను వీలువెంబడి పరిశీలిస్తాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 29. బింకము లేక వోట్లడిగి బీహరు బెంగలు బెంగులూరులో
  కుంకలు వృద్ధులున్ జడులు కూరిమి తోడను మెచ్చుచుండగా
  శంకలు తీర్చ వోట్లరుల జందెము జూపుచు నెత్తి బొట్టునున్
  శంకరు నాశ్రయించిరఁట సై యని క్రైస్తవు లెల్ల భక్తితోన్ :)

  రిప్లయితొలగించండి