కవిమిత్రులారా,
అంశం - రామాయణ సంబంధమైన ఏదైనా అంశం.
నిషిద్ధాక్షరములు - ఋ, ౠ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ అనే అచ్చులు, ఆ అచ్చులతో కూడిన హల్లులు. (అనగా అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ అనే అచ్చులు, ఆ అచ్చులతో కూడిన హల్లులను మాత్రమే ఉపయోగించాలి)
ఛందస్సు - మీ ఇష్టము.
అంశం - రామాయణ సంబంధమైన ఏదైనా అంశం.
నిషిద్ధాక్షరములు - ఋ, ౠ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ అనే అచ్చులు, ఆ అచ్చులతో కూడిన హల్లులు. (అనగా అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ అనే అచ్చులు, ఆ అచ్చులతో కూడిన హల్లులను మాత్రమే ఉపయోగించాలి)
ఛందస్సు - మీ ఇష్టము.
రఘు కులమున బుట్టి రావణు దునుమాడి
రిప్లయితొలగించండిజనక సుతను గాచి జయము నంది
అందరికిని గూడ ఆరాధ్యు డయినాడు
ధర్మ మూర్తి యయిన దాశరథియు.
గుఱ్ఱం జనారదన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిఅక్కా(అ.ఆ)ఇక్కీ(ఇ.ఈ)న్జూడవు
పక్కాగ నిరక్షరుడవు పద జీవిక కా
చక్కని రామాయణ మా
చుక్కను జూచుకను నడవ జూపును దరినిన్
నీమములిన్ని జీవనము నిట్టుల గడ్పగ జూడుమంచు నా
రాముడు సీతలున్నిగమ రాసుల బంచిరి శాస్త్ర పుంజపున్
ధామము వారి గాథయయిధాత్రిని నిండగ బుద్ధి జీవిగా
బాములనీడ్చు సాహసము బర్వగ చింతల బాయుమీ సఖా!
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
భరతునికి రాజ్యమివ్వుము!
రిప్లయితొలగించండికరవాలము వీడిరాము కానన ములనన్
పరిచారికలను వదలుచు
తరలిక వనవాసమాడి తపములు జరుపన్!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కాననములఁ దాఁ। బరిచారికలను...' అనండి.
రామరామయనుచురామునిదలచిన
రిప్లయితొలగించండిరాముడిచ్చుమనకురాసులగమి
రాసులనగధనపురాసులుభువిని
నిజముబలుకుచుంటినిజముగాను
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం చివర గణదోషం. 'రాసులు పుడమిన' అనండి.
రావణాది దుష్ట రాక్షస సంహార!
రిప్లయితొలగించండిసకల సురవరగణ సన్నుత! భవ
సాగర పరిరక్ష! సత్య పరాక్రమ!
రాగ దయ్య గావ రామ చంద్ర!
సీతా మానస సాగర
శీతాంశుసమా!సితాంగ! జిత కీనాశా!
భీత లవణాల యాశ్రిత!
వీత భయామర మునివర వినుతా! రామా!
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమనోరంజక పూరణ లందించారు. అభినందనలు.
రెండవ పూరణలో ఒక సందేహం... రాముడు నల్లనివాడు కదా! 'సితాంగ' అన్న సంబోధన?
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. అవునండి రాము డసితాంగుడే.
తొలగించండిశీతాంశుసమ + అసితాంగ = శీతాంశుసమాసితాంగ; శీతాంశుసమ! అసితాంగ!
స్వయం వరానికి వచ్చిన రామున్ని సీతకు చూపుతూ చెలికత్తె యతని గూర్చి చెబుతున్నమాటలుగా నూహించి
రిప్లయితొలగించండిఅంద మందు చంద్రు డాజాను బాహువు
ఇనకులతిలకుండు ఘనుడతండు
దశరథ తన యుండు దయగల రాముడు
మునిజనముల గాచు దనుజహారి
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిశ్రీరామా! రఘుపుంగవ
కారుణ్యా గుణ వరీయ ఘన బలరామా!
మారీచాది నిపాతిక
సూరీ! కరుణించు మమ్ము సూటిగ రామా!
నిచ్చలు నీ నామమ్ము
న్నచ్చున బలుకుచు విరాళి నర్చన సలుపన్
కచ్చితముగ పాతకములు
పుచ్చుచు రూపడుగు జుండు పూర్తిగ రామా!
దుర్జనులగు రాక్షసులను
నిర్జించి మునుల యజమును నిల్పి తుదకు
న్నార్జమ్మునా మిధిలలో
నార్జించితివి విలు నిలిపి యమలను రామా!
వనమున జానకి మాతను
తనరుచు కాకాసురుండు చీదర బఱచన్
కనలుచు బ్రహ్మాస్త్రమునం
గనుబీకి వదలితి వీవు కరుణను రామా!
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
మూడవ పూరణ మూడవ పాదంలో 'లో' అన్న నిషిద్ధాక్షరాన్ని ప్రయోగించారు.
రాముడు ధర్మరక్షకుడు రావణు జంపి రణాగనంబునన్
రిప్లయితొలగించండినీమము తప్పకుండ ప్రియ నీతి విభీషణు లంక రాజుగా
నా మహి వాసులున్ మిగుల హర్షము గాంచగ నిర్ణయించు శ్రీ
రాముని మానవాళి మది రంజిలగా స్తుతి యింత్రు నిత్యమున్
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నారామ రమ్మను నా తండ్రి రమ్మను
రిప్లయితొలగించండి.....వనముల కరగిన బ్రతుక ననును
కరము నీయగ రమ్ము కవుగిలించగ రమ్ము
.....ననువీడి చనకుము తనయ యనును
నను జంపి హాయిగా నాయనా రాజ్యమున్
.....పాలింప కత్తిని బట్టు మనును
కన్న కుమారుని కానల కంపిన
.....ఘనకీర్తి బడసిన ఘనుడ ననును
పడతి మాయమాటకు కట్టు బడితి ననును
రామ నినువీడి నిలువవు ప్రాణము లను
హా సుతా ప్రియ హా రామ ఆగు మనును
దరికి రమ్మని విలపించు దశరథుండు.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ కరుణరసాత్మకమై అద్భుతంగా ఉంది. అభినందనలు.
కానలకు రాము నంపుము
రిప్లయితొలగించండిమానితముగ భరతు నిపుడు మహికధిపతిగా
భూనాథ!యుంచు మంచును
దా నుడివిన దపుడు కాంత దశరథున కటన్. ౧.
ఇది గాని దన్య మడుగుట
సుదతీ! యుచితంబు నీకు చూడుము నాకున్
ముదమిచ్చు ప్రాణ మాతడు
వదలుము హఠమంచు రాజు పలుకగ సతియున్. ౨.
వరమిచ్చి మాట దప్పుచు
నరపతి! పలుకంగ నిట్లు న్యాయం బగునా?
ధరణిని నిది గాకుండగ
నురుగుణ! యన్యంబు వలవ దున్నతచరితా! ౩.
అని పలికి రామచంద్రుని
తన వద్దకు పిలువ బంచి తన్వంగి కటా!
తనవాంఛ దశరథాధిపు
ఘనతరమగు నాజ్ఞ గాగ క్రమత న్నుడువన్. ౪.
గుణధాముడు శ్రీరాముం
డణుమాత్రము బాధపడక యది తనవిధిగా
ప్రణతులనిడి సంతసమున
క్షణ మాగక విపినభూమి జనినాడు గదా! ౫.
భూతనయ లక్ష్మణుండును
నాతని కనుచారు లగుచు నటవికి జనినా
రీతీరు జూచి జనకుం
డాతత దు:ఖాబ్ధి మునిగి రందరు నకటా! ౬.
అధికార వాంఛ జనులను
బధిరాంధుల రీతి మార్చు, బుద్ధిని గూల్చున్
బుధజన హితవాక్యంబుల
విధమును గాంచంగ నడ్డు విజ్ఞత గాల్చున్. ౭.
జయమగు దరశరథ సుతునకు
జయమగు వినయాది సకల సద్గుణమణికిన్
జయమగు సీతాపతికిని
జయమగు సర్వత్ర రామచంద్రున కవనిన్. ౮.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిఖండకృతిని బోలిన మీ పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
శివుని విల్లు విరచి సీతమనంబును
రిప్లయితొలగించండిరాజుల కల చిదిమి రణమునపుడు
తనదు వశము సలిపి తారక రాముడు
జగమునందు ఘనత చాటినాడు.
మనుజ జన్మదాల్చి మర్యాదపురుషుడన్
ఖ్యాతిగాంచినట్టి ఘనుడు వాడు
విల్లువిరచి చూపి వీరరాఘవుడునాన్
సీతమనమునందుజిక్కినాడు.
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
(విభీషణుడు రావణునితో చెప్పిన మాటలు....)
రిప్లయితొలగించండిరవికుల వార్ధి చంద్రుఁడగు రాముని భార్యను బట్టినావు నీ
వవుర దురాత్మకుండవు, క్షమార్హుఁడవా? దశకంఠ! వీర రా
ఘవుఁడన నల్పమానవుఁడు గాఁడు, త్వదీయ వినాశకారుఁ డీ
భువి బ్రతుకంగ రా దతని పాలిట కీడు దలంచువానికిన్.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. క్షమించమని కోరుతూ.
తొలగించండివిభీషణుడు జ్యేష్ట భ్రాతను పితృసమానముగా భావించిన వాడు. రాక్షస కులాన్ని, రాజుని రక్షించు కోవడానికి హితవచనములు మాత్రమే పల్కెను గాని దూషణ వాక్యాలు పలుక లేదు.
మహర్షి దృష్టిలో విభీషణుని స్వభావమును వ్యక్తపరచే మాటలు:
పూజ్యమానో రక్షోభిః, దీప్తమానో స్వతేజసా; ఆచార కోవిదః;
ప్రయుజ్య సముదాచారం; జగా మాసనం రాజ దృష్టి సంపన్నం;
శశంస నామాథ పశ్చాచ్ఛరణౌ వవందే;
విభీషణుడు రావణుని హితము కోరుతూ వాడిన పద జాలము:
రాజన్; మహా రాజా; నిశాచర;
జీవంస్తు రామస్య న మోక్ష్యసే త్వం; ప్రదీయతాం దాశరథాయ మైథిలీ;
వసేమ రాజన్ నిహవీత శోకాః;
స్వస్తి తేస్తు; గమిష్యామి సుఖీభవ మయా వినా
కామేశ్వర రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
ఆ మాటలను రాయబారిగా వచ్చిన అంగదునితో అనిపిస్తే ఎలా ఉంటుంది?
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. బాగుంటుందండి. రాము డంగదుని చే నట్లే యనిపించెను.
తొలగించండికలుష మగు మతి సతికైక తాన డుగ గ
రిప్లయితొలగించండిద శరథుఁ డిడ వరముల ధర్మగతిని
తండ్రిమాటలు మన్నించి తనయుడు చ నె
వనమునకు తనపత్నియు అనుసరించ
ఒక్క తప్పు దొరలింది
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాక్షాత్ హరియవతారుడు
రిప్లయితొలగించండిదాక్షాయణ హరిణను సహధర్మిణి వలచన్
లక్షాన్వితు రఘుపతి యుప
రక్షుండిగ యనుజు నుంచి రయమున జనియెన్ ||
గురువుగారూ, నిన్నటి పూరణ...
అడుగడుగున నక్రమములు యంతటనిక
నలవి లేని యశాంతియే నగరి లోన
యింత భారమైన బ్రతుకు కంటె, యోరి
తండ్రి! మరణమ్ము సంతోషదాయకమ్ము ||
తంగిరాల రఘురామ్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో క్షప్రాసకోసం కొన్ని పొరపాట్లు చేశారు.
తంగిరాల రఘురామ్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో క్షప్రాసకోసం కొన్ని పొరపాట్లు చేశారు. వివరంగా రేపు చెప్తాను.
రఘురాం గారు యీ సవరణలు గమనించండి.
తొలగించండిసాక్షాత్+హరి +అవతారుడు = సాక్షాద్ధర్యవతారుడు
లక్షాన్వితరఘుపతి; రక్షుండుగ ననుజు
హరిణము లో ము వర్ణ లోపమనుమానాస్పదము. “దాక్షాయణమృగమును” అంటే బాగుంటుంది.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాముడు రావణాది ఘన రాక్షసజాతిని జంపి భూమిజ
తొలగించండిన్బాములనుండి కాచుటది, పావన జీవనచారిగా సదా
నీమముదప్పకుండుటయు, నిర్మలభాసిత తాపసుండుగా
దా-మనుచున్మనీషియయి ధర్మముగాచుట వింతగాదుగా.
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసీత జాడ చాట శీతాంశు డగుపించి
రిప్లయితొలగించండిఆననమును జూపి యాకసమున
తల్లి వదన మఱయ తనను చూడమనుచు
హనుమ సంత సింప నరిగి నాడు
రవికిరణ్ తాతా గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"రా"కలుషముల బాపంగ రసనజాచు
రిప్లయితొలగించండి"మ"అధరములను బంధించి మరల తిరిగి
"రాక"వలదను పాపాల రమ్యముగను
"రామ"నామము జగతికి రాచబాట.
సూర్యనారాయణ గారూ,
తొలగించండిబాగున్నది మీ పూరణ. అభినందనలు.
Sriకందిశంకరయ్యగురువర్యులకునిన్నటిపూరణలుపంపుచున్నానుదయతోచూడవిన్నపము
రిప్లయితొలగించండి12.12.16.ఇంటివారికి నరకమౌ కంటకంబు
తండ్రి మరణమ్ము|”సంతోష దాయకమ్ము
మునుపు సాకిన సధర్భముడులయూహ
కలలవలె నాట మనసుసంకలనమందు|
2.దినమొక గండమైదిగులు. దీనత నింపెడిరోగబాధలున్
అనువుగ వెంటనంటగ?ప్రయాసలయందుజయమ్ము గానకన్
మనుగడ వందయేళ్ళు ననుమానములందునసాగ సౌఖ్యమా?
జనకుని చావు పుత్రునకు సంతసముంగలిగించు సత్యమౌ|{తండ్రినరకయాతనకంటెవందఏళ్ళచావుమేలనుకొనుట}
13.12.16. రామ నీనామ జపము విరామమనక
హనుమ జరుపగ లాభంబు వినగ మనకు
కథల యందున గనిపించు కాంక్షలన్ని
భక్తి రక్తియుయనునట్లు భావమందు|
నా పద్యంలో " చనె" అనేపదం, తంగిరాల రఘురామ్ గారి పద్యంలో మొదటి పద్యం చివరి పాదంలో "జనియెన్" అనే పదంలో హల్లుతో కూడిన "ఎ" వున్నది. అవి చెల్లవు కదా?
రిప్లయితొలగించండిరెడ్డి గారు మీరన్నది నిజమే.
తొలగించండి... తనయుడు చన
వనమునకు తనపత్నియు ననుసరించు" అంటే సరిపోతుంది.
యతి గణదోషాలు కూడా యున్నవి మీ పూరణలో. చూడండి.
తొలగించండికవివర్యులు కామేశ్వర రావు గారికి ధన్యవాదములు, సమావేశంలో ఉండి సెల్ ఫోనులో టైపు
తొలగించండిచెయటంలో, తప్పులు దొర్లాయి. సవరించిన పూరణ.
కలుష మతికైక శయనించ నలుక పాన్పు
దశరథుఁ డిడ వరములను ధర్మగతిని
తండ్రిమాటలు మన్నించి తనయుడు చన
వనమునకు తనపత్నియు ననుసరించు
రామ వనవాసము,తనకు రాజ పదవి
రిప్లయితొలగించండివలదని భరతుడవని రామ పాదుకలకు
పట్టమున్ కట్టి తగు పరిపాలనమును
భ్రాత పనుపున తా జరుపగ దలంచె.
చిన్న సవరణతో....
రిప్లయితొలగించండిరామ వనవాసము,తనకు రాజ పదవి
వలదని భరతుడును రామ పాదుకలకు
పట్టమున్ గట్టి తగు పరిపాలనమును
భ్రాత పనుపున తా జరుపగ దలంచి
రామభద్రుని కలియగ రయము నుఱుకు.
పంక్తిరథకుమార పట్టాభి రామయ్య
రిప్లయితొలగించండికరుణ జూపి మమ్ము కావవయ్య
జాగు వలదు స్వామి జానకీ రామయ్య
జయము నియ్య వయ్య జగతి యందు.
2.రామనామ మిలను రమణీయమయినది
బాధలు నశి యించు వసుధ యందు
ముక్తి నంద వచ్చు ముప్పూటల భజించ
రామ రామ యన్న రక్తి కలుగు.
3.రాముడు సకలసుగుణాభిరాముడిలను
సతము కాపాడు చుండును శంక వలదు
భక్తి నిలను జూపుచు నుండ వరము లిచ్చు
కామితమ్ములు తీర్చును కల్ల కాదు.
4.శివుని విల్లు విరువ శ్రీరామ చంద్రుడు
వసుధిజపుడు తాను వధువు కాగ
పరిణయమ్ము జరుగ వసుధజనులు జంట
ముచ్చటయిన దనుచు మురిసి రపుడు.
5దశరథ తనయుండు దనుజుల వధియింప
మునిని యనుసరించి ముందు నడచి
శక్తి జూపి తాను శత్రువులను జంపి
ముదము కూర్చి నాడు మునికి తాను.
6.రవిజు భయము బాపి రామచంద్రుని కల్సి
ముదమునందినాడు ముందు హనుమ
వార్ధి దాటి నట్టి వానర వీరుని
సతము తలువ కలుగు జయము నిజము.
6.రామరామ యనెడి రమ్యమంత్రమిదియు
శ్రీకరంబిది మరి సిద్ధి గలది
.జానకిసతతమ్ము జపియించి తరియించు
అనుదినము జపింప హాయి కలుగు.
7.రహిని కూర్చు చుండు రామనామ మిలను
పుణ్యమబ్బు చుండు పూజ వల్ల
భయము నుడిపి సతము జయమును కలిగించు
మంత్రరాజ మిదియు మరువ కయ్య.
8.కానకు చని నాడు కాకుత్స రాముండు
తండ్రి మాట వినుచు తరుణి గూడి
తమ్ముడనుసరింప ధనువును దాల్చుచు
జనుల చూచు చుండ జగతి యందు.