29, డిసెంబర్ 2016, గురువారం

సమస్య - 2237 (శకునమ్ముల్ గని....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"శకునమ్ముల్ గని భీతిఁ జెందిరఁట యాశ్చర్యంబుగన్ నాస్తికుల్"
లేదా...
"శకునములకు భీతిలిరి నాస్తికజనమ్ము"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

43 కామెంట్‌లు:

  1. గుడిపాటి వెంకట "చలం" చరిత్ర:

    నాస్తికులు గుడిపాటి వారాస్తికులుగ
    అష్ట గ్రహకూటమిని నమ్మి భ్రష్టులైరి
    చిత్తశుధ్ది గలిగి యున్న చింత లేదు
    శకునములకు భీతిలిరి నాస్తికజనమ్ము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఛందస్సునుల్లంఘించి "అష్టగ్రహము" లను విడదీసి "అష్ట గ్రహము" లుగా జేసితిని..."దుషట చతుషటయము" వలె...మన్నించవలె!

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అష్టగ్రహ' అన్న సమాసంలో అవసరాన్ని బట్టి 'ష్ట' గురువుగాను, లఘువుగాను స్వీకరించే సౌలభ్యం ఉంది. అక్కడ ఛందోల్లంఘన జరుగలేదు. "సమాసంలో ఉత్తరపదాద్యక్షరం రేఫసంయుక్తమైనపుడు పూర్వపదాంత్యాక్షరాన్ని లఘువుగాను, గురువుగాను స్వీకరించవచ్చు"

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
      సంస్కృత సమాసములో ప, బ,క లతో గూడిన రేఫ సంయు క్తాక్షరములకు, “హ” సహిత సంయు క్తాక్షరములకు పూర్వ లఘ్వక్షరమును గురువు లేక లఘువుగా గ్రహించ వచ్చునని చదివితిని. వివరించ గోర్తాను.

      తొలగించండి
    4. కామేశ్వర రావు గారూ,
      సంయుక్తాక్షరాలకు ముందుండే లఘువును గురువుగా గుర్తించే విషయంలో కొన్ని విషయాలను గమనించవలసి ఉన్నది.
      సాంసృతిక సిద్ధ సమాసాలలో పరపదాదిలో సంయుక్తమున్నపుడు పూర్వపదాంత లఘువు గురువు అవుతుంది. ఉదా. శంఖధ్వానము (ఖ గురువు). సాంస్కృతిక సాధ్య సమాసాలలోను, మిశ్ర సమాసాలలోను పై స్థితిలో పూర్వపదాంత లఘువు పాక్షికంగా గురువు అవుతుంది. ఉదా. యదుపతి స్తవము (సాంస్కృతిక సాధ్య సమాసం), ముదుసలి వ్యాఘ్రము (మిశ్రసమాసం). పై రెండింటిలో పూర్వపదాంత లఘువులు (తి,లి) పాక్షికంగా గురువులు. అనగా వాటిని తేల్చి పలికి లఘువులుగా, ఊది పలికి గురువులుగా ప్రయోగించవచ్చు. ఆచ్ఛిక సమాసాలలో ఈ గురుత్వం కలుగదు (ఇంటి ప్రక్కన - టి లఘువే).
      సిద్ధ సమాసాలలోను, భిన్న పదస్థితిలోను రేఫసంయుక్తం పరమైతే పూర్వపదాంత లఘువు పాక్షికంగా గురుత్వాన్ని పొందుతుంది. ఉదా. శతతాళదఘ్న హ్రదము (ఘ్న లఘువే అయింది).
      ఈ రేఫకు సంబంధించిన అంశము కేవలం సంస్కృతానికే పరిమితం.
      (ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య గారి 'తెలుగు చందః పదకోశము' నుండి).

      తొలగించండి
    5. పూజ్యులు శంకరయ్య గారు, కవివర్యులు కామేశ్వర రావు గారు:

      ఈ క్లిష్టమైన అంశం నాకు కొంత వరకు అర్ధమైనది. ధన్యవాదములు!

      తొలగించండి
    6. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ వివరణకు మిక్కిలి ధన్యవాదములు.
      నేను చదివినది కూడ సంస్కృత ఛందము నందునే.
      అష్టగ్రహ సిద్ధ సమాసము, రేఫము “గ” తో ( ప, బ,క లతో కాక)
      గూడినది కాబట్టి తప్పని సరిగా గురువే అవ్వాలేమోయని యనుకున్నాను.

      తొలగించండి
  2. డా.పిట్టా
    పాదరసపు పోకడగన పాడియౌను
    శూన్యమున నుండు సువిశాల సూత్రములును
    గాలికోడియె బలుకు విజ్ఞానశాస్త్ర
    శకునములకు భీతిలిరి నాస్తిక జనమ్ము!
    వికలంబున్ బొడసూపనోపు శుభముల్ విప్పారగాదోచు న
    మ్మకమున్ గానని యస్తి నాస్తి మతులే మాయన్ గ్రహించంగ లే
    రకలంకంబుగ గాలివానకిరవౌ నా గాలికోడిన్ బలే
    శకునమ్మున్ గని భీతిజెందిరట యాశ్చర్యంబుగన్ నాస్తికుల్

    రిప్లయితొలగించండి
  3. డా.పిట్టా
    వికలంబేర్పడు వేళ జీవులవే విచ్చేయు నీ దారినిన్
    సకలంబా పరమాత్మునాజ్ఞయని వే శాస్త్రంబులన్ హేతువే
    నికరంబుండు ననంగనోపు బ్రజగా నెన్నంగ వేరేమి దు
    శ్శకునమ్మున్ గని భీతిజెందిరట యాశ్చర్యంబుగన్ నాస్తికుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మూడవ పూరణలో 'జీవులవే' అన్నచోట గణదోషం.

      తొలగించండి
  4. శ్రీగురుభ్యోనమః

    ప్రకటింపన్ భగవంతు డెవ్వడనుచున్ ప్రత్యేక కావ్యంబులన్
    వికటించెన్ పలు దుష్టభావనలు విద్వేషంబులన్ బెంచుచున్
    నికరంబైన నిజంబు నిప్పు కదరా! నిర్వీర్యులన్ జేయగా
    శకునమ్ముల్ గని భీతిఁ జెందిరఁట యాశ్చర్యంబుగన్ నాస్తికుల్

    రిప్లయితొలగించండి
  5. పిల్లెదురు పడ పనిమాను పిరికి వారి,
    బల్లి పాటుకు నొక్కొక్క భవితఁ జెప్పు,
    బాపడెదురైన వెనుదిర్గి పనికిమాలు
    శకునములకు భీతిలిరి నాస్తిక జనమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. ప్రకృతిం గంపిలఁ జేసి యా వఱద దర్పం బూడఁ దగ్గంగ నా
    వికటాకారపు గృధ్ర రాజముల నాభీలచ్ఛ దోద్రేకులున్
    శకునమ్ముల్ గని భీతిఁ జెందిరఁట యాశ్చర్యంబుగన్ నాస్తికుల్
    సకలక్షేత్రము లందు హేతు గణ సత్సారంపు సంశోధకుల్


    క్షుతముల బిడాల సవ్యపు గతులను గని
    కడు నశుభములని జనులు గలతఁ జెంది
    శకునములకు భీతిలిరి, నాస్తికజనమ్ము
    వారిఁ జూచి నవ్వి రట నవారితముగ

    [క్షుతము = తుమ్ము ; సవ్యము = ప్రతికూలము]

    రిప్లయితొలగించండి
  7. శకునములకుభీతిలిరినాస్తికజనమ్ము
    సహజమయ్యది,యాస్తికుల్సహితమార్య!
    భయపడుదురుతప్పకవాటికిలను
    శకునఫలితముమిన్నగజగతినుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  8. నా రచన
    "కందాల విందు " లోని ఒక కంద పద్యము:
    *****$$$$$*****
    బిస్బేలా బాత్ సమమును
    బ్రిస్బేన్ పురి సాటి వచ్చు పేరేదిలలో
    డిస్బర్సుమెంటు దినమును
    ఫేస్బుక్కును మించునట్టి ఫ్రెండెవరిలలో?
    ********+++++++********

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ సరదా మణిప్రవాళ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. పుడమి కంపించుటకు కొంత తడవు ముందు
    జంతుజాలము పక్షుల జాతులన్ని
    వికృతముగ కూసి తెలిపిన శకునములకు
    భీతిలిరినాస్తికజనమ్ము విధిని కొలిచి

    రిప్లయితొలగించండి


  10. పగలనకను రాత్రనక గబగబ జరుగు
    దుర్ఘటనల గాంచి యకాల దురితములను
    శకునములకు భీతిలిరి నాస్తికజనమ్ము
    వివరముతెలియ కున్నది విభుని రీతి !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. జీవులవియే విచ్చేయుగా సవరించుకున్నాను గణ భంగము తప్పింది.తొందరలో కనిపించని దోషం.వెరిఫై &వెరిఫఫై మంచి సూత్రం......డా.పిట్టా నుండి

    రిప్లయితొలగించండి
  12. పిల్లి యెదురైన మెండుగా తల్లడిల్లి
    యాస్తికులు పయనమ్ముల నాపమనుచు
    శకునములకు భీతిలిరి; నాస్తికజనమ్ము
    కాను పించని దైవమే కల్ల యనగ
    .

    రిప్లయితొలగించండి
  13. తరతరమ్ములు జూపెడి దారు లందు
    కొంద రీరీతి నట్టివి కూడ దనుచు
    శకునములకు భీతిలిరి; నాస్తికజనమ్ము
    వాటి నొప్పరు శాస్త్రీయ బాట వేయ!

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా
    Proposal for samasya pooranam:
    వచ్చి కరుగవు వడగండ్లు వాన తోడ
    లేదా
    వానల వచ్చు ముత్యముల వాసిని యా వడగండ్లు నిల్చెరా!
    డా.పిట్టా నుండి

    రిప్లయితొలగించండి
  15. దేవుడే లేడటంచును దృఢముఁ బల్కి
    ముదుక వారి మాటలు హృదిఁ గదలుచుండ
    దయ్యములగూర్చిన తలంపు తలఁకునిడగ
    శకునములకు భీతిలిరి నాస్తిక జనమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. సకలార్థమ్ముల నిచ్చుతల్లియని విశ్వాసమ్ముతో భక్తులే
    వికచాబ్జాననిఁ గాంచ వెళ్ళునపుడే పిల్లీ.క్షుతమ్మంచు దు
    శ్శకునమ్ముల్ గనిభీతిజెందిరట, యాశ్చర్యంబునన్ నాస్తికుల్
    ముఖవర్ణంబులు మారుచుండగ నదే మూర్ఖత్వమే యందురే


    పిల్లి యెదురయ్యె పక్కింటి పిల్ల తుమ్మె
    ననుచు పూజారుల్ జేసెడు పనుల నాపి
    శకునములకు భీతిలిరి, నాస్తిక జనమ్ము
    మూఢ నమ్మక మని వారు మూర్ఖులనిరి.

    రిప్లయితొలగించండి
  17. అకలంకమ్మగు నమ్మకమ్ముమదిలో నగ్రమ్ముగా చేకుఱన్
    సకలమ్మున్ కడు మిథ్యయంచు ధృతి పంచారించి యశ్రాంతమున్
    వికలంబైన మనస్సుకారణము నిర్వీర్యమ్ము ప్రాప్తించగన్
    శకునమ్మున్ గని భీతిజెందిరట యాశ్చర్యంబుగన్ నాస్తికుల్

    రిప్లయితొలగించండి
  18. శునకములరువంగ నిదొక చోద్యమనుచు
    పైకి పల్కుచు నుండియు భయము తోడ
    శకునములకు భీతిలిరి నాస్తిక జనమ్ము
    లర్ధరాత్రము లందున హడలిపోయి.

    రిప్లయితొలగించండి
  19. అకటా! డింపులు ప్లేను క్రింద దిగగా నార్భాటమున్ జేయుచున్
    వికటంబవ్వగ మానసమ్ము వడిగా వీర్యమ్ము గోల్పోవగా
    ప్రకటించెన్ తన నిశ్చయమ్ము శివునిన్ ప్రార్ధింప కైలాసమున్...
    శకునమ్ముల్ గని భీతిఁ జెందిరఁట యాశ్చర్యంబుగన్ నాస్తికుల్ :)

    రిప్లయితొలగించండి