26, డిసెంబర్ 2016, సోమవారం

సమస్య - 2235 (అవధానం బొక ప్రజ్ఞయౌ...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"అవధానం బొక ప్రజ్ఞయౌ నన నసత్యంబే కదా మిత్రమా"
లేదా...
"అవధానము ప్రజ్ఞ యనుట యనృతము సఖుఁడా"
ఈ సమస్యను సూచించిన జీడికంటి శ్రీనివాస మూర్తి గారికి ధన్యవాదాలు.

26 కామెంట్‌లు:

 1. అవలోకించుట చేత గాని యొకడే యాక్రోశమున్ జూపుచున్
  కవి తానేయని విఱ్ఱ వీగుచును గాండ్రించుచున్ జెప్పెగా
  అవివేకమ్మును వెల్లడించు కొనుచున్నాత్మీయ మిత్రుంగనిన్
  "అవధానం బొక ప్రజ్ఞయౌ నన నసత్యంబే కదా మిత్రమా"

  రిప్లయితొలగించండి
 2. అవధానము జేయుటలో
  అవగాహనయే యొకింత యలవడకుండ
  న్నవధానము జేయు కుకవి
  "యవధానము ప్రజ్ఞ యనుట యనృతము సఖుఁడా"

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు
  1. అవకతవక కూతలతో
   నవివేకుల గూలగొట్టి నాటకమాడే
   కవితా విహీను గొండొక
   యవధానము ప్రజ్ఞ యనుట యనృతము సఖుఁడా!

   తొలగించండి
 4. అవధానం బొక ప్రజ్ఞయౌ నన నసత్యంబే కదా మిత్రమా
  రవిరాజా! వినుమంచు నజ్ఞులగుచున్ రమ్యత్వమే లేక తా
  మెవరీరీతి వచించువారలు కటా! యెప్పట్టునన్ జూచినన్
  స్తవనీయం బయి వెల్గుచుండ భువిలో దైవప్రదత్తంబుగాన్.

  స్తవనీయంబిది యెంచిచూడ నిలలో దైవానుకంపంబుచే
  శ్రవణానందకరంబు సర్వగతులన్ సాహిత్య విజ్ఞానదం
  బెవరేనిన్ మది స్వీయమైన కృషిగా నిద్దానినిన్ దల్చి యీ
  యవధానం బొక ప్రజ్ఞయౌనన నసత్యంబే కదా మిత్రమా!

  భువిసత్కృషికిని భగవ
  త్స్తవమది గూడంగ నబ్బు ధనమిది కనుకన్
  గవి కాత్మీయంబగు, కేవల
  మవధానము ప్రజ్ఞయనుట యనృతము సఖుడా!
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా
  కవితా ధోరణి జన్మ సంచితము లోకంబందు సామర్థ్యమే?
  వ్యవధానంబది దైవికప్రభ యగున్ వ్యాప్తిన్ గొనన్ పండితుల్
  సువిశాలార్జిత శబ్ద భావ విదులై సోత్కంఠతో జూడరే?
  వివిధార్థ ప్రతిపాద భంజక స్మృతిన్ వీక్షింప నాశ్చర్యమౌ
  అవధానంబొక ప్రజ్ఞయౌనన నసత్యంబేకదా మిత్రమా?!
  హవమున నవధాన్యంబుల
  నవలీలగ జల్లినట్లె?!నవియే దధినిన్
  గవిసిన వడివడ తలనిడు
  యవధానము ప్రజ్ఞ యనుట యనృతము సఖుడా!

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టానుండి
  విడివడ కుదులు వడివడ టైపాటుగా నెంచ ప్రార్థన.౨వపూరణము౩వ పాదములో.

  రిప్లయితొలగించండి
 7. శ్రీగురుభ్యోనమః
  కవనంబందున ప్రజ్ఞ లేదు ఘనమౌ కావ్యంబులన్ జూడడే
  వివరంబుల్ వినిపించినన్ వినక నావేశంబుతో నూగుచ్
  న్నవివేకంబున నిట్లు పల్కె, నిదియున్ వ్యాపారమే కాదొకో
  అవధానం బొక ప్రజ్ఞయౌ నన నసత్యంబే కదా మిత్రమా

  రిప్లయితొలగించండి
 8. అవధానము ప్రజ్ఞయె మఱి
  యవధానము జేయునతడు హరిహర సఖుడే
  యవగతము లేనిపలుకిది
  య వధానము ప్రజ్ఞ యనుట యనృతము సఖుడా

  రిప్లయితొలగించండి
 9. కవిలోక మొప్పు సరసపు
  టవధానము ప్రజ్ఞయనుట; యనృతము సఖుడా
  కవనము సంఘము నందున
  నవగత మవదనుచు బలికి యాక్షేపించన్!

  రిప్లయితొలగించండి

 10. అవధానముపై సరియగు

  నవగాహన లేమి చేత నల్పుండొకచో

  నవివేకముతో నిట్లనె

  నవధానము ప్రజ్ఞయనుట యనృతము
  సఖుడా !

  రిప్లయితొలగించండి
 11. సవనవ్రాతము నిర్వహింప నిల దుస్సాధ్యమ్ము చింతింపగం
  గవనం బల్లుట ప్రజ్ఞయౌ నవని సత్కావ్యస్వరూపంబులై
  యవనిన్శ్వాసను నాపి యుంటనది ప్రాణాపాయమౌగాని యీ
  యవధానం బొక ప్రజ్ఞయౌ నన నసత్యంబే కదా మిత్రమా

  [అవధ+అనము = అవధానము = శ్వాసను చంపకుండుట; అనము = శ్వాస]


  భువనత్రయమున నిరత మ
  నవధ్యులు విరాగులు సుమనస్కు లయిన మా
  నవులకుఁ బశు ధన ధాన్య దు
  రవధానము ప్రజ్ఞ యనుట యనృతము సఖుఁడా

  రిప్లయితొలగించండి
 12. క్రొవ్విడి వెంకట రాజారావు:

  హవణిక నొమ్మిక చెదరెడి
  సవ నెరుగని పదము లెంచి సాహితి నొసగే
  సవతును గూడు కుకవిదౌ
  అవధానము ప్రజ్ఞ యనుట యనృతము సఖుఁడా!

  రిప్లయితొలగించండి
 13. అవధానంబొకప్రఙ్ఞయేనననసత్యంబేకదామిత్రమా
  యవధానంబదిప్రఙ్ఞనామిగులసత్యంబేమిత్రమాభువిన్
  వివరంబిచ్చితిచాలునారమణయావేశంబుగాబల్కుచో
  నవధానంబదియెన్నడున్నరయయయ్యాకాదసత్యంబుదా

  రిప్లయితొలగించండి
 14. వ్యవధానం బిసుమంత నీయక కవిత్వ ప్రోహమున్ జూపక
  న్నవలీలన్ చతురోక్తు లాడుట,సమస్యాపూరణమ్ముల్ వినా
  వివరింపంగ పురాణ కావ్యముల విన్పి౦ప౦గ గంటల్వినా
  యవధానం బొక ప్రజ్ఞయౌ నన నసత్యంబే కదా మిత్రమా

  రిప్లయితొలగించండి
 15. అవలీలంగ సమస్య పూరణలు జేయంగల్గు మీయిళ్ళలో
  కవితా ధారణ కంటెశక్తి యుతమై గన్పించు|చిత్రమ్ముగా
  భవితవ్యంబును బాగుజేయగలదౌ బంధమ్ము నమ్మేగదా|
  అవధానంబొక ప్రజ్ఞయౌనన?నసత్యంబేకదా మిత్రమా?
  2.సవరణ సంసారంబున
  అవమాన శతావధానమందించుట చే
  వివరణ లందున కోడలి
  అవధానము ప్రజ్ఞయనుట యనృతముసఖుడా


  రిప్లయితొలగించండి
 16. అవివేకముతో నొక్కడు
  అవధానము ప్రజ్ఞయనుట యనృతము సఖుడా
  భువిలో నెక్కడ లేదను
  టవివేకమది నిజమతని యజ్ఞత దెలుపున్.

  రిప్లయితొలగించండి
 17. భువిలో నిజమదియేగద
  అవధానము ప్రజ్ఞ యనుట,యనృతము సఖుడా
  వివరమ్ముగ దెలియకనే
  యవహాసము జేయునెడల నవధానమ్మున్!!!

  రిప్లయితొలగించండి
 18. నవలావణ్య విశుద్ధ భావ కవనా నైపుణ్యతా భవ్య వై
  భవముల్ భర్గుని సత్ప్రసాదమని తాఁ భావించినన్ పాండితీ
  భువనశ్రేణిఁ జయించ గల్గు, తన నైపుణ్యంబటన్ బల్క నా
  యవధానం బొక ప్రజ్ఞయౌ నన నసత్యంబే కదా మిత్రమా

  రిప్లయితొలగించండి
 19. కవనమ్మల్లగలేని పామరునితో సాంగత్యమ్ముతో నిట్లనె
  అవధానం బొక ప్రజ్ఞయౌ నన నసత్యంబే కదా మిత్రమా
  భువిలో కైతలు జెప్పగల్గుటది యంబోజాక్షి కారుణ్యమం
  చవివేకుండ్రకు తెల్యునే కవుల సత్సామర్థ్యమేపాటిదో


  అవివేకుడైన వాడనె

  యవధానము ప్రజ్ఞ యనుట యనృతము సఖుఁడా
  కవిసామర్థ్యము గనుగొన
  భువిలో నసమర్థుడెరుగ బోడది నిజమే

  రిప్లయితొలగించండి
 20. ద్రవిణమునకు లోబడెడు కు
  కవులను మచ్చిక యొనర్చి కపటముతోడ
  న్నవిరళము నిర్వహించెడి
  యవధానము ప్రజ్ఞయనుట యనృతము సఖుడా
  ద్రవిణముః ధనము

  రిప్లయితొలగించండి
 21. కవులన్ గుత్తముగా గ్రహించి సతమున్ కౌటిల్యమార్గమ్మునన్
  ద్రవిణమ్మున్ చవి చూపి వారలకు, ధారన్ గొప్పవాడంచు నీ
  భువిలో పేరును దొడ్డిదారిఁ గొను నా ముమ్మోటు తాఁ జేయు ఆ
  యవధానం బొక ప్రజ్ఞయౌనన నసత్యంబే కదా మిత్రమా
  ద్రవిణముః ధనము, ముమ్మోటుః మూర్ఖుదు

  రిప్లయితొలగించండి
 22. చవిలే నట్టివి పూరణల్ పరపుచున్ సంపర్కమే లేకయే
  కవనం బొప్పని వర్ణనల్ నుడువుచున్ కంఠమ్ము శోషించగా
  భవనం బందున ముచ్చటౌ ముదితలే పర్కించగా లేనిచో
  నవధానం బొక ప్రజ్ఞయౌ నన నసత్యంబే కదా మిత్రమా!

  రిప్లయితొలగించండి


 23. పవనకుమారా ! సరియే
  యవధానము ప్రజ్ఞ యనుట, యనృతము సఖుఁడా,
  కవులకు నేడది మెండుగ
  చవులూరింప గలదనుట చందము గానన్


  జిలేబి

  రిప్లయితొలగించండి