7, డిసెంబర్ 2016, బుధవారం

సమస్య - 2218 (తప్పు సేయువాఁడె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తప్పు సేయువాఁడె ధర్మవిదుఁడు"
లేదా...
"తప్పులు సేయు మానవుఁడె ధర్మవిదుం డన నొప్పు నెల్లెడన్"

69 కామెంట్‌లు:

 1. పూజ్యులు గురువర్యులు శ్రీ శంకరయ్య గారు, విజ్ఞులు కవివర్యులు స్నేహితులు శ్రీ కామేశ్వర రావు గారు:

  దాదాపు నెలన్నర క్రితం డింభకుడిలా సాహసము జేసి శంకరాభరణ వేదికలో చొరజొచ్చాను. నా యభిలాష గణదోషములు, యతి ప్రాస భంగములు లేకుండా కందపద్యాలు వ్రాయాలని.
  మీరిరువుర కృపవలన నా కోరిక నెరవేరినది. వయసు మించుచున్నది. ఇక శెలవు. శంకరాభరణము మరువజాలనిది. నమస్సులు. కవిమిత్రులకు శుభాశీస్సులు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. G.P. శాస్త్రి గారు ! సమయము, ఆరోగ్యము అనుకూలిస్తే కొనసాగమని ప్రార్థన.

   తొలగించండి
  2. శాస్త్రి గారు నమస్కారములు. మీరు నా కంటే నాలుగు సంవత్సరములు పెద్దనుకుంటాను. మీ ఆరోగ్యము బాగున్నట్లు తలుస్తాను. మాతృ భాషలో పద్యరచన ఆనందాన్ని ఇస్తుంది. మనస్సు ఆనందముగా ఉన్న ఆరోగ్యము చేకూరుతుంది. మీరా ఆనందాన్ని చక్కగా పొందగలరని నా విశ్వాసము.

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారు:

   నిజం చెప్పాలంటే నాకు తెలుగు రాదు. ఈసదస్సులో నేను బాలకుడు సర్కస్ చూసి చప్పట్లు కొట్టేలా చాలా ఆనందించాను. ధన్యవాదములు. మీ పద్యములు, వ్యాఖ్యలు చాలా బాగుండేవి....

   తొలగించండి
  4. గణపతి శాస్త్రి గారూ,
   మీ నిర్ణయం నాకు బాధను కల్గించింది.
   మొన్నటి దత్తపదిలో నేను పొరపాటున 'సీత వోలె' ప్రయోగాన్ని తప్పు పట్టాను. అది సాధువే. మీరు బ్లాగునుండి నిష్క్రమించడానికి అది కారణం కాదు కదా! దయచేసి ఆనాటి మీ పూరణ క్రింద నా తాజా వ్యాఖ్యను గమనించండి.

   తొలగించండి
  5. పూజ్యులు శ్రీ శంకరయ్య గారు:

   మీపై నాకున్న అభిమానము, గౌరవము, ఆప్యాయత అంతా ఇంతా కాదు. చెప్పనలవి కాదు. మీరు మహానుభావులు. నేనూ ఉపాధ్యాయునిగా నా జీవితమంతా గడిపాను.
   అందువలన మన వృత్తిలోనున్న ఆనందము నాకు బాగుగ తెలుసు. ఉద్యోగ విరమణ తరువాత కూడా మీరు చేస్తున్న ప్రజాసేవను చూసి నా హృదయం కరిగినది. మీకు నా శుభాశీస్సులు. అలసి పోయాను సార్! అంతకన్నా మరేమియు కారణము లేదు. శంకరాభరణము అపూర్వమైనది. సంతోషం.

   ప్రభాకర శాస్త్రి

   తొలగించండి
 2. తప్పు తప్పె కాని యొప్పెన్నడును కాదు
  ధర్మ పథము నెపుడు తప్ప రాదు
  తఱచి చూచినంత తానెట్టు లౌనొకో
  "తప్పు సేయువాఁడె ధర్మవిదుఁడు?"

  రిప్లయితొలగించండి
 3. శ్రీగురుభ్యోనమః

  తప్పనిదాయె సీతకును తప్పని తెల్సియు రామచంద్రుడే
  నిప్పున దూకమన్నపుడు నిందలకోర్చియు మిన్నకుండె తా
  నప్పుడు లోక దృష్టికి నియంతగ దోచిననేమి న్యాయమౌ
  తప్పులు సేయు మానవుఁడె ధర్మవిదుం డన నొప్పు నెల్లెడన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సామాన్య మానవుడు కాదు ఆయన మానవ శ్రేష్టుడు,పురుషోత్తముడు (శ్రీరాముడు)

   తొలగించండి


 4. అప్పు జేసి గట్టి గాను మెక్కుచు, మేలు
  తప్పు సేయువాఁడె ధర్మవిదుఁడు,
  కలి మహిమ జిలేబి గర్వపడుదురోయి
  జనులు కైపు గాంచి చక్క గాను !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 5. ఎప్పటి కేది కావలయు నియ్యతి దుస్తర జీవనాబ్ధిలో
  చెప్పగ వచ్ఛునే భువిని శ్రేయము సౌఖ్యము లందగోరుచున్
  దప్పులు సేయు మానవుఁడె, ధర్మవిదుం డన నొప్పు నెల్లెడన్
  దప్పని వాడె సత్యమును తన్మయతన్ బహుకష్టమంది యున్.

  వర గుణాఢ్యు నొకని జెరపంగ బూనుట
  తప్పు, సేయువాఁడె ధర్మవిదుఁడు
  విమల భావమూని వినయాన్వితుం డౌచు
  శిష్టు డగుట నతని చెలిమి సతము.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'శిష్టు డగుట యతని...' అనండి.

   తొలగించండి
 6. డా.పిట్టా
  తప్పు తప్పేయని తాత్సారమును జే‌సి
  మెప్పుకోలు కొరకు మేలు మరిచి
  ఎప్పుడేమి వ్రాయ; ముప్పగునని మాన
  తప్పు! "సేయువాడె ధర్మవిదుడు"
  ఒప్పనిరొక్కనాడు పతినొంచెను మృత్యువు దాన భార్యయే
  గుప్పున నాచితిన్ దొరలె గూఢములీ వ్యవహార పుంజముల్
  "తెప్ప"యె రామమోహన(రాజా రామ్ మోహన్ రాయ్)"సతీ" యను చట్టము నాతి జాతికిన్;
  తప్పులు సేయు మానవుడె ధర్మవిదుండననొప్పు నెల్లెడన్
  సామెత:Those who can,do;those who cannot,write:చేతలే ముఖ్యం,మానుకోవడం కాదు.అదే వ్రాతలో గురువు గారు చూపే తప్పులకు భయ పడితే మన బ్లాగు సాగదు కదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'తప్పేయని' అన్నచోట గణదోషం. 'తప్పె యనుచు' అనండి.

   తొలగించండి
 7. ఒప్పదటంచు దెల్సియును
  నొద్దిక లేక మనంబునందు తా
  తప్పులు సేయు; మానవుడె
  ధర్మవిదుం డన నొప్పు, నెల్లడన్
  గొప్పలు జెప్పవోక యొన
  గూడెడి కష్ట ఫలంబు లెంచుచున్
  ముప్పుల ద్రుంచి వైచి దగ
  మోద మొసంగి జనంగ ధారుణిన్!

  రిప్లయితొలగించండి
 8. తప్పని తెల్సియున్ తనదు ధర్మపరాయణ దీక్షనెంతయున్
  దప్పక జూదమాడి తన తమ్ముల నోడియు తన్నునోడియున్
  తప్పక భార్యనొడ్డి పరితాపమునొందెను, ధర్మమొప్పెడిన్
  తప్పులు సేయు మానవుఁడె ధర్మవిదుం డన నొప్పు నెల్లెడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తప్పు లేని వాడు ధరలోన గనరాడు
   ధర్మ సూక్ష్మ మెరిగి ధరణిలోన
   నయమున పొరపాటు నయిన, దిద్దగలుగు
   తప్పు సేయువాఁడె ధర్మవిదుఁడు

   తొలగించండి
  2. ఫణికుమార్ తాతా గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

   తొలగించండి
 9. కర్మయోగమందు గమనమ్మునుంచుచు
  సోమరితనమెల్ల చుట్టబెట్టి
  కార్యనిర్వహణముఁ గావించ దొరలెడు
  తప్పు సేయు వాఁడె ధర్మవిదుఁడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. క్రొవ్విడి వెంకట రాజారావు:

  జగతి పెంచి ప్రోచు చక్రి దెలిసియుండి
  యజ్ఞ సత్కృతమ్ము నతని కిచ్చి
  రాజసూయ మందు రాణించె దరుమయ్య
  తప్పు సేయు వాడె ధర్మ విదుడు?

  ధర్మ మాచరించ తత్తరించుచు నుండి
  తప్పు సేయు వాడె ధర్మ విదుడు
  నయ్యె గురువు నపదేశ మొందగా
  తప్పు సరియగు వడి తత్వ మమరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 11. దండనార్హుడి లను దప్పక ధరణిని
  తప్పుసేయువాఁడె ,ధర్మ విదుడు
  ధర్మ శాస్త్ర ములను దాతె లియు నతడు
  ధర్మ మునువి డువడు ధర్మ విదుడు

  రిప్లయితొలగించండి
 12. శాస్త్రిగారికినిడుచునుసాదరముగ
  వందనంబులనేనిటపదులకొలది
  శంకరాభరణమ్మునశక్తికొలది
  వ్రాయగోరుదుబద్యముల్ప్రతిదినమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ప్రభాకర శాస్త్రి గారిని గురించిన మీ పద్యం బాగున్నది.

   తొలగించండి
 13. కల్లలాడ తప్పు కల్లు త్రాగను తప్పు
  కల్లుత్రాగి వదరు కల్ల తప్పు
  తప్పులన్నిజేసి యొప్పులనుచు మార్చి
  తప్పు సేయు వాడె ధర్మవిదుడు

  రిప్లయితొలగించండి
 14. తప్పక దండనార్హు డిలదానగు నెప్పటి కైనను న్సుమా
  తప్పులు సేయుమానవుడె, ధర్మవి దుండ న నొప్పు నెల్లెడ
  న్నెప్పటి కప్పుడున్విమల చిత్తము తోడన నెల్లవారికిన్
  దప్పిక నో గిరంబులను దప్పక దీర్చుచునుండుచో భువిన్

  రిప్లయితొలగించండి

 15. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  మరచిపోయి మ౦చితనము

  ................... మానవత్వమున్ మదిన్

  నిరత మర్థమున్ గడి౦ప

  ................... నేరములను చేయుగా ,

  నరయ కరుణ సు౦త లేని

  ..................... ఆకతాయ వీరుడే |


  ధరణి తప్పు చేయు వాడె

  ................ ధర్మవిదుడు చెప్పుమా

  రిప్లయితొలగించండి
 16. పుణ్య మెట్లు పొందు పురుష పుంగవు డింకఁ
  దీర్థ యాత్ర సేయ? దీనులకును
  ధనము సుంతయైన దానము లేదనఁ
  దప్పు, సేయువాఁడె ధర్మవిదుఁడు


  చెప్పిరి పెద్ద లెల్లరును జీవు లశాశ్వతు లెంచ నిద్ధరన్
  గొప్పల కోసమై ధనము గోవెల కిచ్చిన ధన్యుడౌనె తా
  నప్పులు సేసియైన సకలార్తుల కిచ్చిన సద్గుణుండ యీ
  తప్పులు సేయు మానవుఁడె ధర్మవిదుం డన నొప్పు నెల్లెడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 17. ధరణి యందునెపుడు దండన కర్హుడు

  తప్పు సేయువాడె; ధర్మవిదుడు

  ధర్మ, న్యాయ శాస్త్ర్ర మర్మముల దెలిసి

  నడచుచుండు వాటి ననుసరించి.

  2 వ పూరణము.

  బ్రతుకుచుండు నెపుడు భయముభయముగాను

  తప్పు సేయువాడె; ధర్మవిదుడు

  తప్పు లున్న వాని తగు విచారణ జేసి

  తగిన శిక్ష వేయు ధర్మముగను.  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పరిహసించ బడును సరివార లందున
  తప్పు సేయు వాడె; ధర్మ విదుడు
  సతము గరువ మొందు సాటి వారల లోన
  తప్పు సేయ నపుడు త్రపయె గల్గు

  రిప్లయితొలగించండి
 19. ఒప్పుల కుప్ప నేననుచు నూపున రక్కసి తెంపు చూపగా
  చప్పున కత్తి దూసె వనజాక్షి యనెంచక రామకార్యమై
  విప్పిన మూట కాదుకద విల్లును చెప్పగ స్థూలదృష్టికిన్
  తప్పులు సేయు మానవుడె ధర్మవిదుండన నొప్పు నెల్లడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రవికిరణ్ తాతా గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అని+ఎంచక' అన్నపుడు యడాగమం వస్తుంది.

   తొలగించండి
 20. ముప్పుల నేక మొచ్చినను మోదము తోడుత స్వీకరించుచు
  న్నెప్పుడు ధైర్యమున్విడక యిమ్మహి లోనను నిర్మలాత్ముడై
  గొప్పగ ధర్మ కార్యములు జేయుచు నెన్నడు నీతి హీనమౌ
  తప్పులు సేయు మానవుఁడె ధర్మవిదుండన నొప్పు నెల్లెడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వచ్చినను.. ఒచ్చినను అన్నారు.

   తొలగించండి
 21. తప్పని యందువా అబల తాటకిఁ జంపుట వానరేశునిన్
  తప్పని యందువా దునుమ దాకొని మాటున భార్య నాటవిన్
  తప్పని యందువా విడువ దాశరథి న్నటులైన నమ్ముమా
  తప్పులు సేయు మానవుడె ధర్మవిదుం డన నొప్పు నెల్లెడన్.

  రిప్లయితొలగించండి
 22. సంపదలను గోరు స్వార్థపరుడిలను
  తప్పుసేయువాడె, ధర్మ విదుఁడు
  దానమిడుచునెపుడు దైవసన్నిధిలోన
  ముక్తి పథము వెదుకు భక్తి పరుడు


  కుప్పలు గానుసంపదలఁ గూర్చిన నల్లకుబేరులీ భువిన్
  తప్పులు సేయు మానవుఁడె ధర్మవిదుం డన నొప్పు నెల్లెడన్
  యప్పరమాత్మసేవయు నిరాశ్రయులెల్లరి క్షేమమున్ సదా
  తప్పక గోరుచున్ సిరుల దానము జేసెడు సద్గుణాత్ములే

  రిప్లయితొలగించండి
 23. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. యీ నా పద్యమును తిలకించ గోర్తాను.

  దుష్ట నికృష్ట వినష్టా
  నిష్టాతుష్టాపదిష్ట నిర్దిష్ట మతి
  క్లిష్టాభిమృష్ట శిష్టా
  శిష్టాదేష్టాతిసృష్ట చేష్టా రతుడే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా.పిట్టా నుండి
   ఆర్యా, మీ వెంట నేనూ వస్తున్నా సరదాగా,దీవించండి!
   స్రష్టా పద్యవిశేష వి
   శిష్టాతిశయః ప్రతిష్ఠ శ్రీకర శిష్టా
   కష్ట సమాస సుపుష్టా


   షష్టాష్టకృతాష్ట కష్ట నష్టా ద్రష్టా,

   తొలగించండి
  2. ఆర్యా మీపద్య రత్నముతో ప్రహృష్ట చేతస్కుడ నయ్యాను. మీ నైపుణ్యమున కభినందనలు.
   “షష్టాష్టకృతాష్ట కష్ట సౌష్టవ నష్టా” అన్నయతి మైత్రి తో మరింత ప్రకాశమానమగును!

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారూ,
   పిట్టా వారూ,
   మీ పద్యాలు వృత్యనుప్రాసాలంకార భూషితాలై శోభిస్తున్నవి. అభినందనలు.

   తొలగించండి
 24. మోక్షగామి కర్మముల విడనాడుటె
  తప్పు! సేయు వాడె ధర్మ విదుడు!
  ఫలము కోరు కొనక పనులు సేయునపుడె
  పరమగతి నరునికి ప్రాప్త మగును!

  రిప్లయితొలగించండి
 25. ముప్పుల నేక మొచ్చినను మోదము తోడుత స్వీకరించుచు
  న్నెప్పుడు ధైర్యమున్విడక యిమ్మహి లోనను నిర్మలాత్ముడై
  తప్పక ధర్మ కార్యములు తానొన రించి కునీతి భాహ్యమౌ
  తప్పులు సేయు మానవుఁడె ధర్మవిదుండన నొప్పు నెల్లెడన్

  రిప్లయితొలగించండి
 26. పరుల సొత్తు దోచి బాగు పడుదు నంచు
  తప్పు చేయు వాడె ధర్మ విదుడు
  ననుట తప్పటంచు నార్యులనెడి మాట
  తప్పు గాఖదు నెపుడు ధరను చూడ.

  ధర్మపథము వీడి దార్లు గొట్టుచునుండి
  అజ్ఞు డౌచు తిరిగి యవని యందు
  తల్లి దండ్రుల నిటు దయమాలి దండించి
  తప్పు చేయు వాడె?ధర్మవిదుడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 27. శౌరి భజనతోడ సతతమ్ము తనియుచు
  పేద వారిపైన ప్రేమ జూపి
  దానధర్మముల ను ధర చేయకుండుటే
  తప్పు , చేయువాడె ధర్మ విధుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 28. గొప్పల బొవకుండకడు కూర్మిని జూపుచు పే దవారిపై
  తిప్పల లోన చిక్కి నను తీర్చుగ వారాలకోర్కెలం ధృ తి
  న్నోప్పగు కార్యముల్ సలుపు యోచన తోడుత సంఘ మేలుకై
  తప్పులు సేయుమా నవుడె ధర్మ విదుండన నోపునెల్లెడన్

  రిప్లయితొలగించండి
 29. తప్పులుదిద్దగా చదువు|ధర్మము నిల్పగ మానవత్వమే|
  నిప్పులవంటి నీతి ననునిత్య సుఖాలకు వంట కుర్పులా|
  తప్పులు సేయు మానవుడే”ధర్మవిధుండననొప్పు నెల్లెడన్
  అప్పులు యెన్నియున్న తనఆశయ సిద్ధిగ సత్య మెంచుటే”.
  2.హాని గూర్చి జీవతతికి యల్ప బుద్దిజూపుచున్
  తానెతప్పు సేయువాడె ధర్మ విదుడు కాడులే
  “జ్ఞానివోలె పరుల కొరకు జన్మ సార్థకంబుచే
  దానధర్మ మెంచువాడె దక్షుడంచు నెంచుమా”|
  2.


  రిప్లయితొలగించండి
 30. తప్పని తెలిసినను ముప్పును దప్పించ
  బల్కె ముసిని పాండవాగ్రజుండు
  ధర్మమునిలబెట్ట ధరణిని దప్పక
  తప్పుసేయువాడె ధర్మవిధుడు!!!

  రిప్లయితొలగించండి
 31. 2218 వ సమస్యకు పూరణ:
  తప్పులు సేయు మాత్రమున ధర్మ విరోధిగ నెంచవచ్చునే
  యిప్పుడమిన్ రవంతయును నెప్పుడు దప్పులు సేయకుందురే
  తప్పులు సేయు మానవుడె ధర్మ విదుండన నొప్పు నెల్లెడన్
  తప్పుల నుండి నేర్చుకొని తానవి మాటికి చేయకుండినన్.

  రిప్లయితొలగించండి
 32. అప్పుల నివ్వగా ప్రజల హాయిని గోరి పరిశ్రమాలకై
  చెప్పక చేయకే ఖలులు చేతులు మార్చుచు పారిపోవగా
  గొప్పగ సేవ జేయుటను కోరుచు నించుక దేశసేవకై
  తప్పులు సేయు మానవుఁడె ధర్మవిదుం డన నొప్పు నెల్లెడన్!

  రిప్లయితొలగించండి