21, డిసెంబర్ 2016, బుధవారం

సమస్య - 2231 (అమ్మా రమ్మని పిల్చె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"అమ్మా రమ్మని పిల్చె భార్యను మగం డయ్యర్ధరాత్రంబునన్"
లేదా...
"అమ్మా రమ్మనుచుఁ బిలిచె నాలినిఁ మగఁడే"

55 కామెంట్‌లు:

  1. కొమ్మా యేడకు బోతివి
    నిమ్ముగ నానీడ నుండి యేలుము నన్నే
    కమ్మని ప్రేమను పంచెద
    నమ్మా రమ్మనుచుఁ బిలిచె నాలినిఁ మగఁడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఏడకు' అనడం గ్రామ్యం. "కొమ్మా యెచ్చటి కేగితి। విమ్ముగ...' అనండి.

      తొలగించండి
    2. కొమ్మా యెచ్చటి కేగితి
      విమ్ముగ నానీడ నుండి యేలుము నన్నే
      కమ్మని ప్రేమను పంచెద
      నమ్మా రమ్మనుచుఁ బిలిచె నాలినిఁ మగడే

      తొలగించండి
  2. శ్లో|| కార్యేషు దాసీ కరణేషు మంత్రీ రూపేచ లక్ష్మీ క్షమయాధరిత్రి|

    స్నేహేచ ( భోజ్యేషు ) మాతా శయనేచ రంభా షట్కర్మయుక్తా  కులధర్మపత్నీ||


    అమ్మయె భోజన మివదే
    అమ్మయె నెయ్యమును నిచ్చు నమ్మయె
    లక్ష్మీ!
    అమ్మను వోలెడియు వనిత
    నమ్మా రమ్మనుచుఁ బిలిచె నాలినిఁ మగఁడే

    రిప్లయితొలగించండి
  3. ముమ్మాటికి నారంభను
    కొమ్మా! తలదన్నగలవు కువలయమందున్
    లెమ్మెవ్వరు నీసరి వెం
    కమ్మా! రమ్మనుచు బిలిచె నాలిని మగడే.

    నమ్మం జెల్లును సుందరీ! ప్రియసఖీ నాకస్థయౌ రంభయుం
    గొమ్మా! నీసరికాదు సత్యమిదియే కోపించగా నేలనే
    లెమ్మీరీతిగ నన్నుజూడ దగునే లేమా! కరంబంది వెం
    కమ్మా! రమ్మని పిల్చె భార్యను మగం డయ్యర్థరాత్రంబునన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. డా.పిట్టా
    కొమ్మా!యన జడతార్థము(జడతనుగను)
    (ని)యిమ్ముగ నేమే!యనంగ హేయము ధరణిన్
    బొమ్మలమైతిమి "సమత"న్
    అమ్మా!రమ్మనుచుబిలిచె నాలిని మగడే!
    సమ్మానంబును బొంది యానగరిలో సాహిత్యపుంవేదికన్
    నమ్మంజాలని పేరునన్ బిరుదమున్నందంగ సద్భక్తినిన్
    అమ్మా వాణి భవత్కృపా మహిమ యంచాచార్యుడౌ పుత్రకుం
    డమ్మన్ డాసి యొనర్పగా నతులవౌ నా(యా)భార్యవౌ శాలువల్
    "అమ్మా!రమ్మ"ని;పిల్చె భార్యను మగండయ్యర్ధరాత్రంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. బొమ్మన్ బోలు సుగాత్రిఁగాంచి, హృదిలో పొంగారి చేబట్టగా
    నమ్మేల్బంతిని పత్నిగాను, మది వే యాకాశ మున్ చేరగన్
    బమ్మేచేసిన ముద్దుగుమ్మ!మెరిసే బంగారు బొమ్మా! సు శీ
    లమ్మా! రమ్మని పిల్చె భార్యను మగం డయ్యర్థరాత్రంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. గురువు గారికి నమస్కారములు. నిన్నటి నా పూరణ
    చూడ గోరుతాను. ధన్యవాదములు.
    ఆత్మ పరమాత్మల కభేదమనుచు నెఱిగి
    నరుని సేవింప నెంచుచు నడచు వాడ!
    తఱచి చూడ మనుజు నెద దాగి యున్న
    దైవమును నమ్మ కుండగ దరమె యుండ!

    పావులు గాదు మనుజులా
    దేవుని చదరంగమందు! దిశ జూపుటకే
    జీవాత్మగ నరు జేరిన
    దైవమ్మును నమ్మకుండ తరమే యుండన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      నిన్నటి సమస్యకు మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. తమ్ముని బెండ్లికి నేగగ
    నిమ్ముగ నిక సిధ్ధమగుమ యెప్పటి వలెనే
    కమ్మని పలుకుల యోసీ
    తమ్మా రమ్మనుచు బిలిచె నాలిని మగడే

    రిప్లయితొలగించండి
  8. కం. కమ్మని శుభవార్త యొకటి
    చెమ్మగిలిన కనుల తోడ చెప్పగ నెంచెన్
    "బొమ్మ వలె నిలబడక; పు
    "ల్లమ్మా ! రమ్మనుచుఁ బిలిచె నాలినిఁ మగఁడే"
    *****&&&&&*****
    (భార్య పేరు చుక్కమ్మ అయితే "చుక్కా!"
    అని పిలవ వచ్చునేమో కానీ
    భార్య పేరు పుల్లమ్మ అయితే
    "పుల్లా!" అని పిలుస్తారనుకోను.)

    రిప్లయితొలగించండి
  9. అమ్మారుని మహిమేమో
    సమ్మోహించె, నలకొద్దు సంగమవేళన్
    సుమ్మీ! ఎందునిమిత్తము
    నమ్మార మ్మనుచుఁ బిలిచె నాలినిఁ మగఁడే ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తంగిరాల రఘురామ్ గారూ,
      వైవిధ్యమైన విరుపులతో చక్కని పూరణ అందించారు. అభినందనలు.

      తొలగించండి
  10. ఇమ్ముగ తన సంసారము
    నెమ్మిని నడపించు సతిని నెనరులు తొలుకన్
    కమ్మని ప్రేమముతో రమ!
    రమ్మా రమ్మనుచు బిలిచె నాలిని మగడే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. కమ్మని కాపురమందున
      నెమ్మినికాలము గడుపుచు నెనరులుచూపన్
      ఇమ్ముగ సంగతి వినురమ
      ణమ్మా రమ్మనుచుబిలిచె నాలిని మగడే.

      తొలగించండి
  11. గుమ్మము లోనికి వచ్చిన
    తమ్ముడు, మరదలును జూచి తబ్బిబ్బగుచున్
    గమ్మున తనభార్యను మం
    గమ్మా !రమ్మనుచు బిలిచె నాలిని మగడే!!!

    రిప్లయితొలగించండి
  12. కమ్మని వంటల తోడుత
    నిమ్ముగ భోజనమొసంగి హిమకరు జిగిలో
    తమ్ములముఁ బంప, ధృతి కాం
    తమ్మా! రమ్మనుచుఁ బిలిచె నాలినిఁ మగఁడే

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. అమ్మో కాలము దాటి పోయెడిని వయ్యారంబు నీకేల ర
      మ్మిమ్మీదున్నిటఁ గట్ట వేగముగ జాగేలన్ వరారోహ చి
      త్రమ్మే నిత్యము వచ్చు నుత్తమ ముహూర్తా లర్ధ రాత్రిన్ వరా
      లమ్మా రమ్మని పిల్చె భార్యను మగం డయ్యర్ధ రాత్రంబునన్


      ఇమ్మగ బిడ్డడె యాస్తిని
      నిమ్ముగ నమ్మగఁ దలంచి యీ కరముద్రల్
      సమ్మతి నిటఁ బెట్టగ వలె
      నమ్మా రమ్మనుచుఁ బిలిచె నాలినిఁ మగఁడే

      [నాలి = మోసము; మగఁడు = పురుషుడు]


      19/12/2016 నాటి సమస్య:
      ఇమ్మేదిన్ సతిరూప ధారి యయి దానీశానురక్తుండునై
      సమ్మోదంబుగ రామనామమును దాస్యాసక్తి నిందల్చుచు
      న్నమ్మానీ విట కాళివే పరమ హంసాఖ్యుండు సద్భక్తిని
      న్నమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్!

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'రమ్మిమ్మీదున్నిట..' అర్థం కాలేదు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఈ+మీదు =ఇమ్మీదు; రమ్ము+ఇమ్మీదున్ + ఇట = రమ్మిమ్మీదున్నిట; మీదు కట్టుట; పెండ్లి పనుల ప్రారంభమునకు ముందు విఘ్నేశ్వరునికి మీదు కట్టడ మాచారము కదా. ఆ విషయమునే ప్రస్తావించితిని.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మూడవ సమస్య 19 డిసెంబరు 2015 నాటిది. పొరపాటున 2016 అని వ్రాసితిని.

      తొలగించండి
    5. "మీఁదు" అని వ్రాసియుండిన మీకవగతమై యుండు ననుకుంటాను.

      తొలగించండి
  14. బొమ్మల నిమ్మని బాలుం
    డమ్మా! రమ్మనుచు బిలిచె, నాలిని మగడే
    కమ్మని కాఫీ బట్టుకు
    రమ్మనమని ,సుతునికిచ్చె రబ్బరు బొమ్మల్!!!

    రిప్లయితొలగించండి
  15. సొమ్ములు కాసులపేరులు
    కమ్మలుతెచ్చితిని చూడు గైకొని నన్నున్
    పొమ్మనకే నీ దాసుడ
    నమ్మా రమ్మనుచుఁ బిలిచె నాలినిఁ మగఁడే

    రిప్లయితొలగించండి
  16. అమ్మానాన్నల వీడి నీ సుఖమకై హర్షంబుతో వచ్చితిన్
    సమ్మానంబుగ ప్రేమ పక్షులముగా సాగాలి నిశ్చింత చి
    ల్కమ్మా! రమ్మని పిల్చె భార్యను మగం డయ్యర్ధరాత్రంబునన్
    సమ్మోహంబు జనించగా సరసుడై సల్లాప భావంబుతో

    రిప్లయితొలగించండి
  17. ి





    ……………………………………

    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    అమ్మమ్మా ! నిలువ౦గ జాల విడి నిన్ |

    …………… న్యాయమ్మె యూరి౦పగా |

    కొమ్మా రమ్ము | కవు౦గిలి౦చి వెస c

    …………… జేకొమ్మి౦క | నీ దృష్టి యే

    అమ్ము + ఆరమ్ము + అని , పిల్చె

    భార్యను మగ౦ డయ్యర్థ రాత్ర౦బునన్ |

    పొమ్మా యావల కైదు పూట లనియెన్

    ………… పూబోడి సిగ్గొ౦దుచున్ ! !

    ------------------------------------------

    అమ్మమ్మా = ఆహాహా ;
    అమ్ము=బాణము ; ఆరమ్ము= విరహ స౦తాపము ;

    నీ దృష్టి యే అమ్మారమ్మని = నీ దృష్టియే

    అమ్ము + ఆరమ్ము + అని = నీ చూపే

    బాణము మరియు విరహ స౦తాపము అని

    _______________________________________

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  18. లెమ్మా ఔషధమీయ నాకు నిశి పండ్రెండింటికిన్ దప్పకన్
    కొమ్మా యంచన లేవవైతి వకటా కోపమ్మ నిర్లక్ష్యమా
    వామ్మో బాధ పతివ్రతా ప్రియసతీ వా చండికా కాళి దు
    ర్గమ్మా రమ్మని పిల్చె భార్యను మగం డయ్యర్ధరాత్రంబునన్.

    రిప్లయితొలగించండి
  19. లెమ్మా ఔషధ మీయను
    కొమ్మా పండ్రెండు కనిన కోపమ వినులో
    పమ్మా చండీ అంకా
    లమ్మా రమ్మనుచుఁ బిలిచె నాలినిఁ మగఁడే

    రిప్లయితొలగించండి
  20. నెమ్మది గుణమున్న సతియె

    యమ్మగ పరిచర్య చేయ నవసాన దశన్

    నిమ్మళ మందగ ప్రేమగ

    నమ్మా రమ్మనుచు బిలిచె నాలిని మగడే.

    రిప్లయితొలగించండి
  21. అమ్మా నాన్నలు పంపగా నిటకు వయ్యారమ్ముగా వస్తివే
    సమ్మానించెద భార్యవంచునిను నీసాన్నిత్యమే కోరితిన్
    కొమ్మా రమ్మని పిల్చినన్ వినవు సంకోచమ్మునే వీడి యా
    దమ్మా రమ్మని పిల్చె భార్యను మగం డయ్యర్ధరాత్రంబునన్

    తమ్మునికి బెండ్లి జేయగ
    నమ్మాయిని జూడగవలె నమరావతిలో
    సుమ్మా!వేగిరముగ యా
    దమ్మా రమ్మనుచుఁ బిలిచె నాలినిఁ మగఁడే

    రిప్లయితొలగించండి
  22. అమ్మారమ్మనిపిల్చె|భార్యనుమగండయ్యర్ద రాత్రంబునన్
    సొమ్ముల్,షోకులు వీడి యుండుమనియే సూచింతు లేకున్నచో?
    అమ్మో బిల్లులు జూపకున్న మనకంటున్ ట్యాక్స్ సందేహమా
    సమ్మోహంబును సాకు భాగ్య మదియే|సాక్ష్యమ్ముగా నిల్చుగా|
    2.అమ్మో తేలని నమ్మెద
    నమ్మారమ్మనుచు,బిలిచెనాలిని మగడే
    నెమ్మదిగా యటువెళ్ళెను
    దిమ్మెకుదగ్గరగ గలదు దీపము దెమ్మా


    రిప్లయితొలగించండి
  23. రిప్లయిలు
    1. సమ్మోదంబున వేచియున్న తరుణిన్ సద్భాగ్య లోలాక్షినిన్
      సమ్మోహాకృతుడచ్యుతుండు తను హృత్సారాన బెండ్లాడియున్
      వమ్మున్గాదిది నమ్ము నేడు తరుణీ భావాన జంకేల చా
      లమ్మా రమ్మని పిల్చె భార్యను మగం డయ్యర్ధరాత్రంబునన్

      తొలగించండి

  24. కమ్మని కాపురమందున
    నెమ్మినికాలము గడుపుచు నెనరులుచూపన్
    ఇమ్ముగ సంగతి వినురమ
    ణమ్మా రమ్మనుచుబిలిచె నాలిని మగడే.

    రిప్లయితొలగించండి
  25. అమ్మును బోలిన కనుబొమ
    లమ్మో నీ చూపు తూపులంటగ విసరన్
    సమ్మోహనుఁ జేసిన రతి
    వమ్మా రమ్మునుచుఁ బిల్చె నాలిని మగఁడే

    రిప్లయితొలగించండి
  26. కమ్మంగున్నది బీరు పార్టి యనుచున్ కంగారు లేకుండనే
    గుమ్మంబెక్కగ లేటుగాను నరచెన్ గుండెల్లు జల్లన్నగా:👇
    "నమ్ముమ్ నేనిక త్రాగ బోను వినుమా నామాట తల్పున్ను తీ
    వమ్మా రమ్మని" పిల్చె భార్యను మగం డయ్యర్ధరాత్రంబునన్

    రిప్లయితొలగించండి