అంశము- ఉత్తరుని ప్రగల్భములు
ఛందస్సు- ఉత్పలమాల
మొదటి పాదం 1వ అక్షరం 'ఉ'
రెండవ పాదం 7వ అక్షరం 'త్త'
మూడవ పాదం 14వ అక్షరం 'రుఁ'
నాల్గవ పాదం 19వ అక్షరం 'డు'
ఛందస్సు- ఉత్పలమాల
మొదటి పాదం 1వ అక్షరం 'ఉ'
రెండవ పాదం 7వ అక్షరం 'త్త'
మూడవ పాదం 14వ అక్షరం 'రుఁ'
నాల్గవ పాదం 19వ అక్షరం 'డు'
ఈ పిచ్చుకపై బ్రహ్మాస్త్రం సార్!!!
రిప్లయితొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిఒకసారి ప్రయత్నించి చూడండి! బ్రహ్మాస్త్రమో, గరికపోచయో తెలిసిపోతుంది!
శాస్త్రి గారు ఇచ్చిన యక్షరములను మర్చిపొండి. ఉత్తరుని గూర్చి మామూలుగా ఉత్పలమాలలో ఉ తో పద్యము వ్రాయండి. రెండవ పాదములో న గణము త్త ఉన్న పదమును ఎన్నుకోండి. అలాగే మూడవ పాదములో యతి భగణము తర్వాతి భ గణము మధ్య వీరుడు శూరుడు ఇత్యాదులు వచ్చేటట్లు చూడండి. అలాగే ఆఖరి పాదము చివరి ముందటి యక్షరము డు ఉంచండి. అంతే.
తొలగించండిడాక్టర్ సీతాదేవి పూరణ:
తొలగించండిఉత్తర గోగ్రహాగ్రహము నూపగ నుత్తర రాకుమారుడే
తత్తర లేక నుత్తమ రధంబును డాయగ శస్త్ర వేగమున్
సత్తువ జూప నుత్స్యుకత శౌర్యము వీరుల జాడతోడుగా
మిత్తిని చిత్తు జేతుననె మీరిన మాటల హెచ్చు వాడుగన్
ఉక్కడ గించెదన్ సమర మొప్ప వియచ్చర కోటితోడ నే
రిప్లయితొలగించండిసొక్కక దేవదత్త పరిశోభిత గాత్రుడు వీరుడర్జునుం
డక్కజ మందు రీతి వినుడద్భుత తీరున పోరు సల్పెద
న్నొక్కడు చిక్కెనేని తరువోపు నిషంగది లేనెలేడుగా
ఉక్కడ గించెదన్ సమర మొప్ప వియచ్చర కోటినైన నే
తొలగించండిఫణికుమార్ తాతా గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
'నేఁ జొక్కక' అనండి. 'అద్భుతతీరు' దుష్టసమాసం. 'అద్భుతరీతిని' అనండి.
గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. సవరించాను.
తొలగించండిఉక్కడగించెదన్ సమర మొప్ప వియచ్చర కోటినైన, నేఁ
జొక్కక దేవదత్త పరిశోభిత గాత్రుడు వీరుడర్జునుం
డక్కజ మందు రీతి రణమందున శూరుఁడు భీష్ముడుండినన్
గ్రక్కున జంపివేతు ప్రహరంబున, సారథి యుండతోడుగాన్
ఉన్నత విక్రమాన్వితుడ, నుత్తర నామ సుశోభితుండ నే
రిప్లయితొలగించండిగ్రన్నన జేరి యిత్తరిని గౌరవ సేనల జీల్చి గోకులం
బెన్న మరల్చి దెత్తునిదె యీరలు, పౌరులు కుందనేల నా
కన్నిట దక్షుడొక్క డిట నబ్బినచో రథచోదకుండుగాన్.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిఉక్కిరి బిక్కిరౌదురిట యూహలకందని రీతి సారథీ!
ఒక్కడు నిల్వడిత్తరిని యుత్తరు నేర్పున సైన్యమందు నే
నొక్కడ నూర్గురన్ బడగ నొవ్వగ బోరుదు జూతువీవె నే
నెక్కడ సవ్యసాచియును యెక్కడ నన్నును మీర లేడు లే!
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
ఉత్త ప్రగల్భముల్ పలుకు నుత్తరు డంచు దలంతు రేల నో
రిప్లయితొలగించండియిత్తరి నాకు నుత్తముడు నీడగు సారధి యున్న నాజిలో
కుత్తుక లుత్తరింతు నరి తొత్తుల వీరుడనై చెలంగి నా
సత్తను జాటెదన్ వినుడు సర్వులు నాసరి లేడొకండునున్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ఉత్తముడైన చోదకుడు యుద్ధము కోసము సంక్రమించినన్
రిప్లయితొలగించండిచిత్తొనరింతు నిత్తరిని శీఘ్రముగా రిపు సంచయమ్ములన్
చిత్తము తొందరించె నిక చెచ్చెర వైరులఁ ద్రుంచి వైచెదన్
పుత్తుకు పంపెదన్ రిపుల పోరున, గుప్పునఁ జేసి దాడులన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. మూడవ పాదం 'రుఁ' ఉండే విధంగా, నాలుగవ పాదంలో 'పుత్తుకు పంపెపెదన్' బదులు" పుత్తున కంపెదన్' అని మార్చాను. పరిశీలించ ప్రార్థన.
తొలగించండిఉత్తముడైన చోదకుడు యుద్ధము కోసము సంక్రమించినన్
చిత్తొనరింతు నిత్తరిని శీఘ్రముగా రిపు సంచయమ్ములన్
చిత్తము తొందరించె నిక చెచ్చెర శూరుఁడ నై చెలంగెదన్
పుత్తున కంపెదన్ రిపులఁ బోరున గుప్పునఁ జేసి దాడులన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈమధ్య రామునకు, రాముకు మొదలైన ప్రయోగాల మీద 'పద్యాల సవ్వడి' అనే వాట్సప్ గ్రూపులో కొంత చర్చ జరిగింది. బాలవ్యాకరణ సూత్రం ప్రకారం 'రామునకు' అనడం సాధువు. ప్రాఢ వ్యాకరణ సూత్ర ప్రకారం 'రాముకు' అనికూడ అనవచ్చు ఆ చర్చ సారాంశం. అప్పటినుండి ఈ వ్యత్యాసం గురించి నేను ఎక్కువగా పట్టించుకొనడం లేదు.
ఉన్నత రాజవంశమున నుద్భవ మందితి, యుద్ధవిద్యలం
రిప్లయితొలగించండిదెన్నికఁ గన్న నుత్తముఁడ, నెవ్వఁడు నా సరి గాఁడు, గౌరవుల్
న న్నెదిరించి నిల్తురె? ఘనప్రతివీరుఁడనై విరోధులన్
మన్నుఁ దినంగఁ జేసెద, సమానుఁడు నాకు ధనుంజయుండు పో!
గురువుగారూ పూరణ చాలాబాగుంది.
తొలగించండిశ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిఉగ్రుడనై చెలంగి కురుయోధుల నెల్లర మట్టుబెట్ట నా
యాగ్రహ కీల చిత్తమున వ్యాపనమొందె బృహన్నలా యికన్
నిగ్రహమెంతయున్ విడచి నే కడు ధీరుడనై రణంబు నం
దగ్ర పథాన నిల్తునిక నచ్చెరు వేల జయంబు జూడుమా
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
ఉత్తము డైన వాడిపుడు యుధ్ధము జేయగ సాయముండుచో
రిప్లయితొలగించండిజిత్తుగ జేతు నత్తఱిని జేవను జూపుచు శత్రు సైన్యమున్
జిత్తము సంతసింపగను చె చ్చెర వైరుల జంపుదున్ననిన్
సత్తువ జూడుడీ యికను సాహస కార్యపు నాదు దాడులన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో అర్ధానుస్వార యుక్తమైన 'రుఁ' ఇచ్చాను. కేవలం మిస్సన్న గారు, శ్రీపతి శాస్త్రి గారు దానిని ప్రయోగించడం సాఫల్యం జెందారు. మిగిలినవారు 'రు'ను ప్రయోగించారు. గమనించండి.
రిప్లయితొలగించండిగురువుగారూ, మీరు ఇదివరలో అర్ధానుస్వారం మీద ఒక పాఠం చెబుతానని చెప్పారు. చెబితే నేర్చుకోవాలని ఎదురు చూస్తున్నాను. దయచేసి మీ పరిస్థితులు అనుకూలించినపుడు వీలైనంత త్వరగా నేర్పమని మనవి.
తొలగించండినిజమే... కొద్ది రోజులుగా నేను అనారోగ్యం, మానసిక ఒత్తిళ్ళతో తీరిక లేకుండా ఉన్నాను.
తొలగించండిఅన్నీ అనుకూలిస్తే జనవరిలో హైదరాబాదులోని వృద్ధాశ్రమంలో చేరబోతున్నాను. ఇక అప్పుడు కావలసినంత తీరిక. సమయాన్ని ఎక్కువగా బ్లాగుకు కేటాయించవచ్చు.
గురువుగారూ, మనము ఎన్నడూ కలవనప్పటికీ మీమీద నాకు ఏర్పడిన ఆత్మీయత కారణంగా ఇది చదవగానే నా కళ్లలో నీళ్ళు తిరిగి నేను చదువుతున్నది కలో నిజమో తెలియని మానసిక సంఘర్షనకి లోనయ్యాను. మీకు హైదరాబాద్ లో ఏ విధమైన సహాయ సహకారాలు కావలసినా అందించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను.
తొలగించండిఉల్లము దల్చినంత యొక యూపున శత్రువు బారద్రోలి;క్రొ
రిప్లయితొలగించండిత్తల్లును దర్పమే విరియ దన్నుదు, చెండుదు సేననెల్ల;మీ
రుల్లసిలంగ నే రణము నుగ్రముగన్ మరి చేయకుందునే?
డుల్లును మేతి వీరుడు కడున్ మరి నా బిగి జెప్పనేటికిన్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రతి యక్షరము పాదాదిగ రావలెనని పొరబడ్డాను.
తొలగించండి(నిదుర ఆవహింహుచున్న సమయము)
సవరణ: (నాల్గవ పాదమునందు)= "మేటి వీరుడు"
రిప్లయితొలగించండిగుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
ఈనాటి న్యస్తాక్షరి నియమాల ననుసరించి మరో పద్యాన్ని వ్రాయండి.
ధన్యవాదాలు శంకరయ్య గారూ !
తొలగించండిఉత్తమ యోధుడయ్యె కద యుత్తరు డంచు జనుల్ నుతించగా
రిప్లయితొలగించండితత్తర జెందకత్తరిని దగ్ధ మొనర్చెద శత్రు సేనలన్
బిత్తర పోవ జేసి కడు భీకర పోరున ; గోవులన్నిటిన్
దెత్తును నాకు దీటయిన తేరును తోలెడి వాని తోడుగన్
నిన్నటి సమస్య కు నా పూరణ
అమ్మాజీ యను వనితను
తిమ్మాజీ పెండ్లియాడె ; తియ్య విలుతుడై
"తుమ్మెదలె నీదు కురులు క
దమ్మా!" రమ్మనుచు బిలిచి నాలిని మగడే
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉర్విని నున్న రాజులకు నోర్వగ రాని పరాక్రమంబునన్
తొలగించండిసర్వ ధరాధి పోత్తముడఁ జాపగుణధ్వని కౌరవధ్వజా
ఖర్వ వినాశ కారణ వికాస ఘనోరుఁ గనుండు నన్ననన్
గర్వము తోడఁ బల్కు విలుకాడె మహారథు డుత్తరుండు బో
[ధ్వజము = గర్వము; అఖర్వము = అధికము]
కవీంద్రులు కామేశ్వర రావు గారు:
తొలగించండిఎంత తేలికగా చెప్పేశారు! ప్రయత్నిస్తాను. ఈలోగా మా చెల్లెలు వ్రాసింది ఒక పద్యం ఇస్తున్నాను. దయజేసి సమీక్షించండి.
__/\__
డాక్టర్ సీతాదేవి పూరణ:
తొలగించండిఉత్తర గోగ్రహాగ్రహము నూపగ నుత్తర రాకుమారుడే
తత్తర లేక నుత్తమ రధంబును డాయగ శస్త్ర వేగమున్
సత్తువ జూప నుత్స్యుకత శౌర్యము వీరుల జాడతోడుగా
మిత్తిని చిత్తు జేతుననె మీరిన మాటల హెచ్చు వాడుగన్
శాస్త్రి గారు నమస్కారములు. మీ పూరణ గూడ చూడ గుతూహలముగనున్నది.
తొలగించండిడా. సీతా దేవి గారు చక్కటి పూరణ చేశారు.
అయితే చిన్న చిన్న వ్యాకరణ దోషములున్నవి.
"లేక యుత్తమ" అనండి. లేక మీద ద్రుతము లేదు.
ఉత్సుకత లో యా వత్తవసరము లేదు. చేతును పదమసాధువు. చేయుదును సాధువు. "జేయగల" అన్న సరిపోవును.
"రధంబును డాసెను" అన్న భావము పూర్తి యగును.
__/\____/\____/\___
తొలగించండిపోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిపూరణ ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.
*****
డా. సీతాదేవి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కామేశ్వర రావు గారి సూచనలను గమనించండి.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిఉన్నత శస్త్ర విద్యలఁ సమున్నతి గాంచితినాహవంబులో
రిప్లయితొలగించండినన్నెదిరించు రిత్త రిపునాయక కోటిని బట్టి ద్రుంచెదన్
సన్నుతి గాంతు శక్ర బలసన్నిభవీరుఁడటంచు నాపరాక్రమా
త్త్యున్నతి జూపి కౌరవులనోడఁగజేసెద నేఁడు చూడుమీ!
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ఉక్కిరి బిక్కిరౌదురని యుత్తర వీర ప్రతాపమందు త
రిప్లయితొలగించండిత్తక్కిలి మూకచిత్తవుట తథ్యము బాణము లే ప్రభాకరున్
రుక్కుల వోలె నిప్పులను రువ్వగ భీరువులైన శాత్రువుల్
డుక్కులునవ్వరే పగతుడొక్కడు సైతము నిల్వలేడుగా.
డుక్కులు=కనపడకుండా పోయినవారు , మరుగున పడినవారు
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి ధన్యవాదములు
తొలగించండిపద్యంలోని నాలుగు పాదాల మొదటి అక్షరాలలో సైతం -ఉ-త్త-రు-డు- వచ్చినవిషయాన్ని గమనింప మనవి
విరించి గారు నమస్సులు. విశేషమైన ప్రయోగము చేసారు. చాలా బాగుంది. తత్తక్కిలి యన నర్థము కాలేదు. కొంచెము వివరించ గలరా?
తొలగించండివిరించి గారూ,
తొలగించండిమీరు చేసిన విశేష ప్రయోగాన్ని నేను గమనించలేదు. మన్నించండి.
మీ ప్రయత్నం నిజంగా ప్రశంసనీయం. సంతోషం!
తత్ తక్కిరి
తొలగించండిఓహో లి పొరపాటున పడిందా? తత్ సంస్కృత పదము తక్కిరి దేశ్యము. రెంటికి సమాసము చేయ రాదు కదా!
తొలగించండిఉత్తర|”నీదుబొమ్మలకు ఉత్తమ మైనవి యేరి దెత్తు నీ
రిప్లయితొలగించండిచిత్తము మెచ్చు|ఉత్తరుడు చిత్ర విచిత్రపు రంగు వస్రముల్
పుత్తడి హారముల్ గనిన పూర్తిగ వీరుల జంపి తెత్తు”,నా
సత్తువ జూపుమార్గమిది సంగర మందునజేతుదాడులున్
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఉత్తమమైన నేరిమిని మొగ్గర మెంచుచు కౌరవుల్ననిన్
చిత్తుగ జేయు సత్తమున జెట్టిని నేనట నార్బటించగా
చిత్తము లావిరోధులవి చిక్కిడ పోరును జేయలేకయే
గొత్తుగ పారిబోయెదరు కూటువతోనని యుత్తరుండనెన్.
నిన్నటి పూరణ:
నెమ్మిక మిక్కుట మవ్వగ
నిమ్ముగ సొగయిచు ముదమున నెంతయు పిరము
న్నొమ్మిక జూపుచు గోముగ
నమ్మా! రమ్మనుచు బిలిచె నాలిని మగడే.
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
న్యస్తాక్షరిలో 'డు' అనవలసిన చోట 'డ' అన్నారు.
శ్రీ కెంబాయితిమ్మాజిరావుగారిపూరణ
రిప్లయితొలగించండిఉక్కడగింతు కౌరవుల వ్యూహము మార్కొని పార్థు లీల నే
నక్కట,గాని,?యిత్తరిని నాజినిజేయ రథమ్ముదోలగా?
నొక్కరుయైన చోదకులు యూరను లేరు|పసుల్ మరల్చగా
నిక్కటు లెట్లు దీరు?నికనేగతి నేనెదురింతుసూడులన్.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉత్తర నాదు సోదరికి నూనిక దెత్తును బొమ్మ పొత్తికల్
రిప్లయితొలగించండిజిత్తుల ద్రుంచి చిత్తమున జేకొని నల్వురు విస్మయంబుతో
హత్తుకొనన్ ప్రతాపమున నహ్హహ వీరుడనంగ నేర్పుతో
దెత్తును గోవులన్గెలిచి తీరున వెన్దిరగేను నెప్పుడున్!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
కాని నాల్గవ పాదంలో 'డు' స్థానభ్రంశం చెందింది.
అవును గురువుగారూ.. వెన్దిరగేను చూడుడిన్...అంటాను....సరిపోతుంది గదా!
తొలగించండినమస్సులు.
ఉత్తర ! కుచ్చు లీకు నిక నొప్పవు ముచ్చుల భూషలన్ని నీ
రిప్లయితొలగించండికిత్తును వారిచిత్తములకింకనశాంతియు గల్గు రీతి నే
నెత్తెద విల్లు రౌరవమునెల్లరు జేరు( గదా రణంబులో
నెత్తురు త్రాగు సిమ్హమిక నెయ్యము గోరుచు నాటలాడునే