9, డిసెంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2220 (బలరాముఁడు సీతఁ జూచి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నగియెన్"
లేదా...
"బలరాముం డవనీతనూజఁ గని దుర్వారమ్ముగా నవ్వెరా"
(కందంలో ఉన్న సమస్య ప్రసిద్ధమైనదే)

59 కామెంట్‌లు:

 1. డా.పిట్టా
  ఇలలో నాటక విద్య సత్కళయగున్నెన్నంగ కావ్యాళిని
  న్లలనా వేషము వేయు వేళల నగున్ నవ్వుల్ తెరన్ దాటినన్
  పులకించెన్ సతి విగ్గు వీడె పతియౌ పొట్లాల పుట్నాల డ
  బ్బల"రాముండవనీ తనూజగని దుర్వారంబుగా నవ్వెరా!
  పలు వంకలు నాగలి గొనె
  కలమున సరి సరళరేఖ గనగల కొడుకై
  తొలి మేడి నొడిసె తండ్రియె
  బలరాముడు సీతజూచి ఫక్కున నవ్వెన్
  (విగ్గు ఆంగ్లమైనా పల్లెల్లో కూడ తెలిసినదే.పల్లెల్లో వింతగా వృత్తిని బట్టి డబ్బల రాము పేరుండుట సాధ్యం.కావ్యేషు నాటకమ్ రమ్యమ్,)

  రిప్లయితొలగించండి
 2. డా.పిట్టా
  సీత॥నాగటిచాలు అనే అర్థంలో వాడినాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 3. ఇలలో వింతలు మెండట
  కలనైనను పలుకరాని కాంతల పలుకుల్
  కలతలు నింపగ జనులకు
  బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నగియెన్

  రిప్లయితొలగించండి
 4. నెలవంకనుగనిజానకి
  నలకను బూనుచునుదాని నందము మీరన్
  తిలకమిడగమర్యాదా
  బలరాముడు సీతజూచి ఫక్కున నగియెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చేపూరి శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జానకి యలుకను...' అనండి.

   తొలగించండి
 5. అల జనకుని కొలువున జని
  యలవోకగ ధనువుద్రుంచి యాగతమగునా
  కలికిని కేలూన సుధీ
  బల,రాముడు, సీతజూచి ఫక్కున నగియెన్!

  రిప్లయితొలగించండి


 6. వనవాసం లో కష్టసమయాలలో చిన్ని‌చిన్ని సారూప్యతలు నవ్వును తెప్పిస్తాయేమో !


  అలసిన మనమున యవనిజ
  సొలసెను కలగను నయనపు సోయగముల తా
  నెలవంకై గానన్ దో
  ర్బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నగియెన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మనమున నవనిజ...' అనండి. (మనమునన్+అవనిజ)

   తొలగించండి
 7. హలమును నేలను బట్టుచు
  పలుగోపాలకులు లాగి వక్రత దున్నన్
  హల! 'చాలు' చాలు చాలని
  బలరాముఁడు 'సీతఁ' జూచి ఫక్కున నగియెన్.

  రిప్లయితొలగించండి
 8. అలవోకగ విలు ద్రుంచియు
  పలువురి మనముల గెలిచియు; పరిహాసముగా
  చెలి పలుకు పలుకులకు ధీ
  బల రాముడు సీత జూచి ఫక్కున నగియెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారు నిన్నటి మీ శంకరభక్తి గీతమునకు సలక్షణ పద్యమును తిలకించండి. మరియొక స్తుతి పద్యము కూడ.


   విశ్వేశ్వరుం బ్రమథ వీర గణాధినేతన్
   శశ్వద్వరప్రదుని శంకరు సాంబమూర్తిన్
   విశ్వాత్ము నిన్నసమ వీక్షణు నీలకంఠున్
   సుశ్వేత శైలతట శూలినిఁ గొల్తు భక్తిన్


   ఇల్లరికపు టల్లుడు మరి
   మల్లుం డట వల్లకాటి మదనాంతకుడే
   విల్లంది పురత్రయముం
   దల్లడిల మరల్చె యమసదన మొక్కసెలన్

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారు ! బాగున్నవి, అభినందనలు ! ధన్యవాదాలు !

   తొలగించండి
  3. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ******
   కామేశ్వర రావు గారూ,
   మీ పద్యాలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి, జనార్దన రావు గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 9. అలవోక రావణుఁదునిమి
  చెలికాడు విభీషణునకు చేకూర్చి క్షితిన్
  పలువురు మెచ్చంగ మహా
  బల, రాముఁడు సీతఁ జూచి ఫక్కున నగియెన్

  రిప్లయితొలగించండి
 10. చలమును విడనాడి యమున
  హలధర కోపపరితప్త హల ఘాతమునం
  దలవంచ వ్రయ్య గతియై
  బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నగియెన్

  [వ్రయ్య = చీలిక; సీత =నాఁగటిచాలు]


  వలయాలంకృత రత్నకుండల యుగప్రద్యోత కాంతార సం
  చలనానంద తరంగ హృత్కమలినీ సంతుష్ట బింబోష్ఠినిం
  బలలాశామతి కాకచుంచు కృత సంపాతవ్రణక్షిప్త దో
  ర్బలరాముం డవనీతనూజఁ గని దుర్వారమ్ముగా నవ్వెరా

  [వలయము = కంఠమాల ]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 11. కలకాలము ప్రేమికులై
  విలువలు బండింపనెంచి విద్యార్హతతో
  తలపున వలపులు రేగగ
  బలరాముడు సీత జూచి పక్కున నగియెన్|
  2.కలలో గాంచెను వింతగా సినిమ యాకర్షించుసౌందర్యమే
  నిలుపన్ సీతను గాంచి ముగ్ధుడయి తానెంచెన్ గదా పంతమున్
  బాలరాముం డవనీతనూజ గని దుర్వారమ్ముగానవ్వెరా|
  తలచన్ వింతగ గానుపించెగద|తత్వంబెంచ విడ్డూరమే|

  రిప్లయితొలగించండి
 12. క్రొవ్విడి వెంకట రాజారావు:

  చిలుకకు పలుకులు నేర్పెడి
  కలికి కులుకుల నతిశయము గని వైదేహీ
  వలపుల రాముడు నెదిరికి
  బలరాముడు సీత జూచి ఫక్కున నగియెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. లలనలమాటలమధ్యన
  చిలిపిగనొకలలనయనియెజెలియా!వింటే
  యిలనీసంఘటజరిగెను
  బలరాముడుసీతజూచిఫక్కుననవ్వెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సంఘటన జరిగె...' అనండి.

   తొలగించండి
 14. అలవోకన్ జలరాసిపైన ధృతితో నడ్డమ్ముగాకట్టి ఔ
  భళిరా యంచు దివైకసుల్ పొగడగన్ వాటమ్ముగావంతెనన్
  బలకాయించు విభూతి రావణుని వే పాలార్చి యత్యంత దో
  ర్బల, రాముండవనీ తనూజగని దుర్వారంబుగా నవ్వెరా
  బలకాయించుః అతిశయించు

  రిప్లయితొలగించండి
 15. క్రొవ్విడి వెంకట రాజారావు:

  చెలి జానకి తన ముద్దుల
  చిలుకను శ్రీరామ యనగ జేసి ముఱియ
  న్నలరుచు నెమ్మికతో ధీ
  బలరాముడు సీత జూచి ఫక్కున నగియెన్.

  రిప్లయితొలగించండి
 16. తెలియగమోసము గినిసెను
  బలరాముడు--సీతజూచిఫక్కున నగియెన్
  బలమంతజూపి విల్లున
  తెలిమొగములు వేయుచున్న ధీరులతీరున్.

  రిప్లయితొలగించండి
 17. 'వలదీసతి నీకు తగదు
  తొలగించెద దీని' ననుచు దూకిన దనుజన్
  వలకేల నాపి రవికుల
  బలరాముడు సీత జూచి పక్కున నగియెన్

  రిప్లయితొలగించండి
 18. వలవేయఁ దలఁచి గురునకు
  తలఁపున దుర్యోధనుండు తనదగు రీతిన్
  పిలుచుచు మదిర నొసంగన్
  బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నగియెన్!

  (సీత = మదిర )

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 19. బలగర్వితులై సాంబుని
  అలనాడొంటరినిజేసి యాలములోనన్
  ఖలమున కట్టెదరా యని
  బలరాముడు సీత జూచి ఫక్కున నగియెన్

  రిప్లయితొలగించండి
 20. తల వాసంబున కేగ రామసతి వక్త్రంబందు నాసక్తితోన్
  జలజాతాక్షి ముఖారవింద నడుమన్ సారంగముల్ గ్రమ్మగన్
  కలతం జెందుచు పంకజాక్షి మరి యా ఘండంబులన్ ద్రోల దో
  ర్బలరాముం డవనీతనూజఁ గని దుర్వారమ్ముగా నవ్వెరా

  రిప్లయితొలగించండి
 21. లలితాకార ధరాత్మజన్ బ్రియసఖిన్ లాలింపగా బూని య
  య్యలినీలాలక పల్కబోననుటచే నత్యంత హాస్యంబులౌ
  పలుకుల్ పల్కుచు సైగ సేయుచు మనోభారంబు దీర్పంగ నో
  బల! రాముం డవనీతనూజ గని దుర్వారంబుగా నవ్వెరా.

  అలినీలాలక దనసతి
  కలనా డావనములోన నతులితరీతిన్
  దలపై దృణములు చేరగ
  బల! రాముడు సీతజూచి ఫక్కున నగియెన్.
  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 22. తెనాలి రామకృష్ణ కవి పూరణ (అట!)

  లలనలు పాయస మానగ
  కలుగుదురే పిల్ల లనుచు క్ష్మాసుత నవ్వన్
  పొలమున దొరికెదరని ధీ
  బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నగియెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మహాకవి తెనాలి రామకృష్ణ పూరణో కాదో తెలియదు కానీ త్రేతాయుగములో కలియుగ హాస్య ధోరణితో చాలా బాగుంది.

   తొలగించండి
 23. గురువు గారికి నమస్కారములు. నిన్నటి పద్యాన్ని చూడ గోరుతాను.
  ధన్యవాదములు.
  మోహమున బడి కవులు రస
  రాహిత్యముగా కవితలు వ్రాయుచు యుండన్!
  ఏ హితమును నోచుకొనని
  సాహిత్యాధ్యమున దుమ్ము సమధిక మయ్యెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వ్రాయుచు నుండ। న్నేహితమును...' అనండి.

   తొలగించండి
 24. కవిమిత్రులకు నమస్కృతులు.
  మా అబ్బాయి కాలు విరిగి శస్త్ర చికిత్స జరిగి ఇంట్లో ఉండడం, మా కోడలు సుఖప్రసవానికి అవకాశం లేక శస్త్ర చికిత్స జరిగి ఆసుపత్రిలో ఉండడం (నాకు మనుమరాలు పుట్టింది), మా మనుమణ్ణి రోజూ బడికి తీసుకువెళ్ళి తీసుకురావడం, మా అక్కయ్యకు మోకాలి శస్త్ర చికిత్స జరగడం, నేను రోజంతా ఆసుపత్రుల చుట్టు తిరగడం తదితర కారణాలవల్ల నేను రాత్రి వరకు బ్లాగును చూడడం లేదు. అలసట వల్ల మీ పద్యాలను నిశితంగా పరిశీలించలేకపోతున్నాను. ఏదో మొక్కుబడిగా 'మీ పూరణ బాగున్నది. అభినందనలు' అంటున్నాను. మరో వారం రోజులు ఇదే పరిస్థితి. దయచేసి నిరుత్సాహ పడకుండా బ్లాగులో సమస్యాపూరణలు చేస్తూ, మిత్రుల పూరణల గుణ దోషాలను ప్రస్తావిస్తూ ఒకరి నొకరు ప్రోత్సహించుకొన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీకు మీ కుటుంబసభ్యులకు మా హార్దిక శుభాకాంక్షలు!

   తొలగించండి
  2. గురువుగారూ మీకు మనుమరాలు పుట్టినందుకు శుభాభినందనలు.

   తొలగించండి
 25. అలరేవతిపతి యెవరన
  నిలలో శివునివిలు విరిచె నెవరిని గనుచున్
  చలిమల సుతసుతు గని శశి
  బలరాముడు ,సీతను జూచి,ఫక్కున నవ్వెన్.

  రిప్లయితొలగించండి
 26. కలలో సీతయె యెదొ కని
  కలవరముఁ గొనఁగఁ, బతి ధృతి కలుగఁగఁజేయన్,
  దెలవాఱెను నంతట బల
  బల; రాముఁడు సీతనుఁ జూచి ఫక్కున నవ్వెన్!

  రిప్లయితొలగించండి
 27. అలనాడు పియూషమిడగ
  ఖలుడగు నసురునకు హరియె, గని రవి దెలుపన్
  బలిగొన జూడడె రాహువు
  బలవంతపు చావు వచ్చె భాస్కరున కటన్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  అలిగిన బలరాముడు లో,
  గిలిలో కేగంగ నటుని కృష్ణుని గాక
  న్నల నాటి యంజలిని గనె;
  బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నగియెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి