14, డిసెంబర్ 2016, బుధవారం

సమస్య - 2224 (గీతను బోధించె నరుఁడు....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"గీతను బోధించె నరుఁడు గీష్పతి వినఁగన్"
లేదా...
"గీతను జెప్పె నర్జునుండు గీష్పతియే వినఁగన్ రణంబునన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

47 కామెంట్‌లు:



  1. వేతన మీయని పదవుల
    రాతను మార్చని విభుడిని రాబడి గన నీ
    రేతల పూరణల విడువ
    గీతను బోధించె నరుఁడు గీష్పతి వినఁగన్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. పాతవి పురాణ కధలని
    నూతన మార్పులను జేయ నూహా జనితం
    నేతలు నీతులు జెప్పుచు
    గీతను బోధించె నరుడు గీష్పతి వినగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జనితం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  3. చేతను డనియెడి ఛాత్రుడు
    భీతిల్లుచు బలికె గురుడు బెత్తము జూపన్
    కాతరుడయి తడబడుచును
    గీతను బోధించె నరుడు గీష్పతి వినగన్.

    ఆతడు మద్యపానమున నాతురుడై వచియించె నిట్టు లా
    పోతన వ్రాసె భారతము పూర్వము సత్యము నన్నయార్యుడే
    చేతము లుల్లసిల్ల గను చేసెను భాగవతాఖ్య సత్కృతిన్
    గీతను జెప్పె నర్జునుడు గీష్పతియే వినగన్ రణంబునన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. డా.పిట్టా
    ఊతము గొని వోట్లను గని
    వాతలు బెట్టుటను ప్రబల వైద్యుడు మోడీ!
    లోతుల నెరుగడు యార్థిక
    గీతను బోధించె నరుడు గీష్పతి వినగన్
    కోతల రాయుడన్నగతి గొప్పల కోసమె;యేమి దెల్యడా
    పూతనవోలె పాల్గుడుప బోవుచు నమ్ముడటంచు బల్కు వే
    రాతల పాఠనమ్ములను రాటును దేలిన అర్థశాస్త్ర వి
    జ్ఞాతల నెట్టి యావలకు;గడ్డు దినంబుల నోట్ల రద్దుతో
    గీతను జెప్పెనర్జునుడు గీష్పతియే వినగన్ రణంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఎరుగడు+ఆర్థిక' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. 'లోతుల నెఱుగం డార్థిక...' అనండి.
      'తెలియ'ను 'తెల్య' అనవచ్చునా? సందేహమే! '...యేమెఱుంగడా...' అనవచ్చు కదా!

      తొలగించండి
  5. చేతులు కలుపుచు నెల్లరు
    జాతిని ఐక్యముగ నుంచి జవసత్త్వములన్
    ప్రీతి నిడగ సౌహార్ధ్రా
    గీతను బోధించి నరుడు గీష్పతి యయ్యెన్

    రిప్లయితొలగించండి
  6. ప్రీతిగ పలికిన శ్లోకము
    లే తగు రాగమ్ములోన లెస్సగ బాడెన్
    ఖ్యాతిగనె ఘంటసాలయె
    గీతను బోధించె నరుఁడు గీష్పతి వినఁగన్.

    రిప్లయితొలగించండి
  7. తాతనునడుగగనిట్లని
    గీతనుబోధించెనెవరికియెవరుచెపుమా
    యాతడుజెప్పెనునిటులను
    గీతనుబోధించెనరుడుగీష్పతివినగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బోధించె నెవరికి నెవరు...' అనండి.

      తొలగించండి
  8. గీతయె పావన మంత్రము
    గీతయె సర్వార్థదాయి గీతయె నిధియౌ
    గీతయె జ్ఞానమ్మనుచును
    గీతను బోధించె నరుడు గీష్పతి వినగన్.(నరుడు=ఒక పండితుడు)

    చేతము మారిపోయి పలు చేష్టలు మాటలు వింతగొల్పెడున్
    భూతలమందు మందునల పుష్కలరీతిని ద్రాగువానికిన్
    సీతయనామధేయుడనె చిత్తుగద్రాగి విశాలవీధిలో
    "గీతనుజెప్పెనర్జునుడు,గీష్పతియేవినగన్ రణంబునన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. గీతనుజెప్పెనర్జునుడుగీష్పతియేవినగన్ రణంబునన్
    గీతనుజెప్పెగృష్ణుడటగీష్పతిసాక్షిగగ్రీడికేగదా
    తాతకుమందమర్పగుటదప్పుగజెప్పెనులెక్కజేయకన్
    గీతనునెప్పుడున్జదువకేలునుమోడ్చుచుమోక్షమబ్బుగా

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. సమస్య పాదసవరణ: గీతను జెప్పె నర్జునుడు గీష్పతియే వినఁగన్ రణంబునన్

      తొలగించండి
    2. జ్ఞాతుల గురువుల మిత్రుల
      ఘాతులఁ జేయంగ నొల్లక కుములెడు దరిం
      బ్రీతి రణావనిఁ గృష్ణుడు
      గీతను బోధించె నరుఁడు, గీష్పతి, వినఁగన్

      [నరుడు, గీష్పతి = పండితుడైన అర్జునుడు ]


      ధాతకు నైన శక్యమె మదద్యుతి చిత్తుల నుద్ధ రింపగం
      జేతులు వేయి వెల్గ నతి శీఘ్రమ భూసుర నాకు హోమ గో
      మాతను దానమిమ్మనుచు మర్మము లెల్లయు రాజనీతి నా
      గీతను జెప్పె నర్జునుడు గీష్పతియే, వినఁగన్, రణంబునన్

      [అర్జునుడు = కార్త వీర్యార్జునుడు, రణములో పండితుడే]

      తొలగించండి
    3. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగాను, ఉత్తమంగాను ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గీతను తీరుగ వినుచో
    నీతియు చేతన నెఱుకువ నెంతయు గల్గున్
    భూతార్ధమ్మిది యంచును
    గీతను బోధించె నరుడు గీష్పతి వినగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. పీతాంబరుడేమి బలికె?
    చేతనుడననెవరు బాల జెపుమా వేగన్?
    సాతినిడెదననె కర్ణుడు
    గీతను భోధించె, నరుడు, గీష్పతి వినగన్!!!

    రిప్లయితొలగించండి
  13. చేతస్సుమలప నరునకు
    పీతాంబరుడేమిసలిపె? విష్ణు సఖుడెవరు?
    శీతాంశుడుతారను గొనె
    గీతను బోధించె, నరుడు, గీష్పతి వినగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర తప్పక గురువుండాలి కదా! 'వివ్వచ్చు డనన్?' అందామా?

      తొలగించండి
  14. భీతిలి భండనమ్మికను వీడెద నంచు దొలంగ కృష్ణుడే
    గీతను జెప్పె, నర్జునుడు గీష్పతియే వినఁగన్ రణంబునన్
    తాతల వంటి పూజ్యులను తానువధించుట ఘోరకృత్యమౌ
    పాతకమే కదాయనెడు పార్థుని మాటల నాలకించియున్


    జాతికి సుపథము దెల్పగ
    గీతను బోధించె , నరుఁడు గీష్పతి వినఁగన్
    పాతక మంచు కదనమున
    భీతిల్లగ వెన్నుడంత విజయుని కపుడే.

    రిప్లయితొలగించండి
  15. తాతలు తండ్రులున్ గురువు దైవసమానుల గాంచి ముందుగన్
    భీతిలు యోద్ధ ప్రార్థునకు భీకర భారత యుద్ధమందునన్
    నీతిని కర్మ మార్గమును నేర్పుచు ధర్మము గూర్చి కృష్ణుడే
    గీతను జెప్పె, నర్జునుండు గీష్పతియే వినఁగన్ రణంబునన్

    రిప్లయితొలగించండి
  16. చేతన లుడిగిన విజయుడు
    చేతులు జోడించి వేడ శ్రీకరుడంతన్
    ప్రీతిగ శంకలు దీర్చెడి
    గీతను బోధించె, నరుడు గీష్పతి వినగన్!
    (నరుడు గీష్పతి = పండితుడగు నర్జునుడు)

    రిప్లయితొలగించండి
  17. తాతను భ్రాతలన్ గురుల తంపి వధించుట కూడదంచు తా
    చేతములోన గాసిపడు జిష్ణు కుమారు ప్రశాంతుఁ జేయగా
    గీతను జెప్పె నర్జునుడు గీష్పతియే వినఁగన్ రణంబునన్
    కాతరు చేయకన్ ఫలము ఘర్షణ నిర్వహణమ్మొనర్చగన్
    తంపిః యుద్ధము

    రిప్లయితొలగించండి
  18. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    పాతక భీతిచే నరుడు బాణములన్ విడి

    …………… మోకరి౦చగా ,

    నాతనికిన్ ధృతిన్ గరిపి యాదవ నాధుడు

    ………………… బోధ సేయుచున్

    గీతను చెప్పె | నర్జునుడు - గీష్పతి యే

    ……………… వినగన్ , రణ౦బున౦

    దాతప భాస్కరా౦శ సముడై యరి వీరుల

    …………………… ద్రు౦చె నా పయిన్ !

    రిప్లయితొలగించండి
  19. చేతుల తోడను జంపగ
    నాతరమవదని కిరీటి నాహవముననన్
    నీతరమౌనని పలుకుచు
    గీతను బోధించె నరుడు గీష్పతి వినగన్.

    గీతను పంచెను జగతికి
    గీతయె ముక్తియు నొసగను కేవలభక్తిన్
    గీతను పఠియించు మనుచు
    గీతను బోధించె నరుడు గీష్పతి వినగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  20. ఆతంకము దీర్పగ హరి
    గీతను బోధించె, నరుడు గీష్పతి వినగన్
    తాత గురువులన్ బంధుల
    తా తూపుల తాగడించ తగదని తెల్పన్

    రిప్లయితొలగించండి
  21. గీతను జెప్పిన దెవరని
    గీతను ప్రశ్నించగురువు కించిత్ వడిగా
    ఆతురతందున దెలిపెను
    గీతను బోధించె నరుడు గీష్పతి వినగన్|
    2.”నీతిని వీడి బంధువలనే పరిమార్చను కృష్ణ|తృష్ణచే
    గీతనుజెప్పె నర్జునుడు| గీష్పతియేవినగన్ రణంబునన్”.
    “జాతిపురోభి వృద్ధిమనజాలగ ?దుష్టులసంహరించుమా
    నేతయుబావయే దెలుప?నేర్పుగ జంపెనుసవ్యసాచియై|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'కించిత్ వడిగా' అనరాదు. 'కించిత్తు వడిన్' అనండి.

      తొలగించండి
  22. చేతుల తోడను జంపగ
    నాతరమవదని కిరీటి నాహవముననన్
    నీతరమౌనని పలుకుచు
    గీతను బోధించె నరుడు గీష్పతి వినగన్.

    గీతను పంచెను జగతికి
    గీతయె ముక్తియు నొసగను కేవలభక్తిన్
    గీతను పఠియించు మనుచు
    గీతను బోధించె నరుడు గీష్పతి వినగన్

    రిప్లయితొలగించండి
  23. ఆతడు చంద్రశేఖరుడు హాయిగ దిల్లిని దాడిజేయుచున్
    భీతిని వీడుచున్ గరపె బింకము తోడను డింపులయ్యకున్
    నీతులు రాజకీయమున నిశ్చిత రీతిని యిట్లుపోలుచున్:👇
    "గీతను జెప్పె నర్జునుడు గీష్పతియే వినఁగన్ రణంబునన్"

    రిప్లయితొలగించండి