23, డిసెంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2232 (భర్త మరణవార్తను...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"భర్త మరణవార్తను విని భార్య మురిసె"
లేదా...
"భర్త పరేతుఁ డయ్యెనను వార్త వినంగనె భార్య నవ్వెరా"
ఈ సమస్యను అందించిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

79 కామెంట్‌లు:

  1. పూజ్యులు శ్రీ శంకరయ్య గారికి, కవివర్యులు శ్రీ కామేశ్వర రావు గారికి:

    నా సోదరి డా. సీతాదేవి ధన్యవాదములు తెలిపమన్నది.

    మీరిరువర స్ఫూర్తితోడనూ, సూచనలతోడనూ నేను జేసిన నిన్నటి న్యస్తాక్షరి పూరణ జతపరుస్తున్నాను...సరదాగా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      సోదరి సీతాదేవి గారిని రోజూ సమస్యాపూరణలు చేయమని ప్రోత్సహించండి.

      తొలగించండి
  2. ఉత్తమ కార్యమే మనది యోయి బృహన్నల! చక్కనోడినే!
    బిత్తర వోదురుత్తముల వీక్షణ జేసిన శత్రువుల్ సదా
    చిత్తుగ నోడరే మనల జేతుల వీరులు శూరులందరున్
    కొత్తవిరోయి నా కవచ కుండలముల్ భయమెల్ల వీడుమోయ్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మొదటి ప్రయత్నమైనా చక్కని పద్యాన్ని సలక్షణంగా వ్రాశారు. సంతోషం!
      'మనల జేతుల' అన్న ఒక్క ప్రయోగమే అతకడం లేదు.

      తొలగించండి
    2. సోదరి సీతాదేవి ఆర్ధిక శాస్త్రంలో, నేను భౌతిక శాస్త్రంలో "వైద్యులము"...

      తొలగించండి
    3. భౌతి కార్థిక శాస్త్రాచార్యులకు చందశ్శాస్త్ర ప్రావీణ్యము సులభసాధ్యమే! ప్రయోగాలలో మూల పదార్థములను పాళ్ళను మార్చి ఫలితములను సాధించినట్లే వివిధ శబ్దప్రయోగములతో పద్య రచనా వ్యాసంగము మహదానంద దాయకమే. మీరిరువు రందులకు సమర్థులే.

      మీ ఉత్పలమాల నీలోత్పలముగా గణ యతి ప్రాస సానుకూలముతో భాసించుచున్నది.
      ఇక యిప్పుడు సుందర తర శబ్దములతో భావప్రకటనను మెఱుఁగు పరచిన చదువరులకు శ్రవణానందముగా నుండును.
      "బిత్తర వోదురుత్తములు వీక్షణ జేసిన"; "మనదు జేతుల" "కొత్తవిసుమ్ము" "భయమెల్ల వీడుమా" అనిన బాగుంటుంది.ఓయి ని ఓయ్ అన నసాధువు.
      11. యుష్మదస్మదాత్మార్థకంబుల కుత్తరపదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాష నగు.
      నీదు కరుణ - నీ కరుణ, నాదు నేరిమి - నా నేరిమి, తనదు రూపు - తనరూపు.

      16. పదాంతంబు లయి యసంయుక్తంబు లయిన ను లు రు ల యుత్వంబునకు
      లోపంబు బహుళంబుగ నగు.
      ఇందు నురుల కుత్వలోపంబు ప్రాయికంబుగ హల్పరకంబులకుఁ జూపట్టెడు.
      మ్రాన్పడె - మినువడె - మిన్వడె - వత్తురు వారు - వత్తుర్వారు - కారుకొనియె - కార్కొనియె - రాములు - రాముల్‌ - వనములు - వనముల్‌.


      తొలగించండి
    4. అయ్య బాబొయ్! కామేశ్వర రావు గారు:

      నయం ఇంకా మీరు మాకు "థీసీసు ఎగ్జామినర్" అయి ఉండలేదు...అలా అయి ఉంటే మా డిగ్రీలు ఆకాశ పుష్పములై ఉండేవి.

      నిజం చెప్పలంటే బాలవ్యాకరణం పుస్తుకం లోని మొదటి 30 పేజీలు 3 సార్లు చదివి ఇక నాతరం కాదని ప్రస్తుతానికి ప్రక్కన పెట్టాను. చూద్దాం!

      మీ నారికేళ పాకపు రచనలు అర్ధo అయినా అవకపోయినా రోజూ చదివి సరస్వతీదేవి ప్రసాదమయిన మీ శోభకు ఆనందిస్తూ వందనలు అర్పిస్తుంటాను.

      ఆనందభరిత నమస్కృతులు!

      తొలగించండి
    5. నమస్కారములు. ధన్యవాదములు. అట్లే "శూరులందరుం/ గొత్తవి.."

      తొలగించండి
  3. డా.పిట్టా
    (చేటు,ఎరుగని)చేటెరుగని బోడి మగని(రెండవ)పెళ్లికి బోయె అనేది సామెత.ఆమె అమాయకత్వమా లేక తత్త్వ జ్ఞానమా అనే భావన వస్తుంది.అప్పుడు వగవనిది భర్త మరణ సమయమున మాత్రం వగవడం దేనికి అనుకోవడం ఆశ్చర్యం కాదు.
    మగని పెళ్లికి వెళ్ళిన మగువ యొకతె
    వగవలేదు విధిని దాటి వరల లేక
    జనన మరణాలు సమమను జాన గాన
    భర్త మరణవార్తను విని భార్య మురిసె
    (చెబితే వినక వానికి తోచక రెండవ భార్య కావాలనే వారికి యిది త త్త్వ పూరిత సందేశము సుమండీ,కృతజ్ఞతలు!)

    రిప్లయితొలగించండి
  4. సతిని వేధించు పురుషుడు సరస మనక
    సాని కొంపల దిరుగుచు కాని పనుల
    నిత్య నరకము జూపించు నేత పురుగు
    భర్త మరణవార్తను విని భార్య మురిసె
    -----------------------------
    నేత పురుగు = మర్కటము

    రిప్లయితొలగించండి
  5. వర్తన మీఱ కీచకుని వంచన చేయుచు మాలినీసతి
    న్నార్తిగ రాత్రివేళ జవనంబున రమ్మని విన్నవించినన్
    నర్తనశాల యందు పవనాత్మజు చేతను చేదిదేశపున్
    భర్త మృతుండవంగనుచు వార్త వినంగనె భార్య నవ్వెరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భర్తయు మృత్యుడయ్యెనను వార్త వినంగనె భార్య నవ్వెరా

      తొలగించండి
    2. ఫణికుమార్ తాతా గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమస్యపాదంలోని దోషాన్ని సవరించాను.

      తొలగించండి
    3. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. సవరించాను.

      వర్తన మీఱ కీచకుని వంచన చేయుచు మాలినీసతి
      న్నార్తిగ రాత్రివేళ జవనంబున రమ్మని విన్నవించినన్
      నర్తనశాల యందు పవనాత్మజు చేతను చేదివంశపున్
      భర్త పరేతుఁ డయ్యెనను వార్త వినంగనె భార్య నవ్వెరా

      తొలగించండి
    4. ఫణి కుమార్ గారు కీచకుడు చైద్యుడు కాదు. చేది దేశపు రాజు శిశుపాలుడు.

      తొలగించండి
    5. పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. కీచకుడి పూర్వీకుడైన ఒక రాజు పేరు చేది. ఆ వంశస్థుడు కావడం వలన కీచకుడిని చేది రాజు అంటారు అని నేను వినియున్నాను. నర్తనశాల సినిమాలో దరికి రాబోకు రాబోకు రాజా పాటలో చేది రాజా అని సంబోధన కనబడుతుంది. అందువలన నేను విన్నది నిజమే అని భావించి ఇలా వ్రాశాను.

      తొలగించండి
    6. చేది వంశపు రాజు అనడం అనుమానాస్పదం అయిన పక్షంలో, క్రింది సవరణ పరిశీలించగలరు.
      సూత వంశపున్ | భర్త పరేతుఁ డయ్యెనను వార్త వినంగనె భార్య నవ్వెరా

      తొలగించండి
    7. ఫణి కుమార్ గారు దీనిని విమర్శగా భావించక సాహిత్య చర్చగా గ్రహించ మనవి.
      నర్తన శాల లోని పాట:
      "దరికి రాబోకు రాబోకు రాజా
      ఓ... తేటి రాజా... వెర్రి రాజా
      దరికి రాబోకు రాబోకు రాజా"

      భారతము ప్రకారము కీచకుడు కేకయ రాజ నందనుండు, మత్స్యపతి మఱందియు, దండనాథుండును.
      వంశపున్ భర్త అని ద్రుతాగమ మసాధువు. సమాసమున పుంపులకు బరుష సరళంబులు పరంబులగునపుడే నుగాగమము. "భ" స్థిరము. పదంపడి కీచకుడు రాజు కాలేదు. సూత వంశమూ కాదు.
      అందుచేత దండనాథునిగా "మత్స్య భూ చమూ" అనిన సమంజసము గా నుండునని నా భావన.

      తొలగించండి
    8. పూజ్యులు కామేశ్వరరావు గారికి అభివాదములు. మీ విమర్శ కూడా నాకు ఆశీర్వచనమేనండీ. మీ వంటి పెద్దలతో సాహితీ చర్చలో పాల్గొనే స్థాయి నాకు లేదు. మీరు చెప్పిన విషయాలను నేర్చుకోవడమే నాకు పరమావధి. మీ సవరణ చాలా బాగుంది. ధన్యవాదములు.

      తొలగించండి


  6. దుఃఖ మదియేల, జననము, దూరమైన
    మరణమును దరి జేర్చును, మనను దిటవు
    గాన మహిలోన బాధను గప్పు కొనుచు
    భర్త మరణవార్తను విని భార్య మురిసె !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    హర్తగ నీతికిన్ మెడను హారపు బెళ్లి బ్రతిజ్ఞ జేసియున్
    గర్తను ద్రవ్వెరా వివిధ కారణముల్ గన సంతు లేమికిన్
    నర్తనశాలయా జగము?నాతిని నింకొక దాని గూడ నా
    వర్తముయా(న)యె నట్లె నిసువా?శిశువా?యిట నాశ దీర దా
    భర్త మృతుండె లేడనిన వార్త వినంగనె భార్య నవ్వెరా!

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    ఆవర్తము.యావర్తము యాయె(నాయె)పాఠాంతరమైన ‌సాధువునుగ్రహించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నాయె... అనడమే సాధువు.

      తొలగించండి
  9. చేరి వానర సేనలు సేవఁజేయ
    కడలి మీదనె వారధిఁ గట్టి వచ్చి
    రావణాసురుని వధించి చేవఁ జూప
    భర్త, మరణవార్తను విని భార్య మురిసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. క్యాన్సరనగానె చేతులు కాళ్ళు వణక
    ఇల్లు వాకిలి బంగారు గుల్ల యవగ
    నొప్పు లేడ్పులు కేకలు నొప్పలేక
    భర్త మరణవార్తను విని భార్య మురిసె!

    రిప్లయితొలగించండి

  11. శ్రీగురుభ్యోనమః

    ధూర్తు డొకండు గోప్యముగ దొంగతనమ్మును జేయ బూని తా
    హర్తగ రాణివాసమున హారము గైకొని బోవుచుండగా
    స్పూర్తిగ బట్టె చారుడటు శోధన జేయుచు ప్రశ్న వేయగా
    భర్త మృతుండుడాయెనను, వార్త వినంగనె భార్య నవ్వెరా

    రాణివాసములో దొంగతనమునకు వెళ్లి చారునకు పట్టుబడిన దొంగ తడబాటుగా భర్త చనిపోయాడు,వస్తున్నాడు వంటి పొంతన లేని సమాధానములు చెప్పగా యీ వార్త విని చారుని భార్య నవ్వినది.

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువుగారి సూచనతో సంస్కరించిన నిన్నటి పూరణ:

    ఉత్తమమైన నేరిమిని మొగ్గర మెంచుచు కౌరవుల్ననిన్
    చిత్తుగ జేయు సత్తమున జెట్టిని నేనట నార్బటించగా
    బిత్తరవోవు వారలట భీతిలి పోరు మరించ లేరనెన్
    యుత్తరుడా సభాస్థలిని యోహల చెంతను డాబులాడుచున్.

    రిప్లయితొలగించండి
  13. సమస్య పాదాన్ని కొంచెంసవరించాలేమోనండీ.

    రిప్లయితొలగించండి
  14. అతులితానంద కారణ మడుగ నపుడు
    సతము దుర్మార్గ గామియై సాటివారి
    కార్తి గలిగించు వాడాత డనుచు దెలుప
    భర్త మరణవార్తను, విని భార్య మురిసె.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. ఏక ధాటిగ నేడ్చెను భాగ్య లక్ష్మి
    భర్త మరణ వార్తను విని, భార్య మురిసె
    ముద్దు మురిపాల తోడనుముంచి తనను
    రేయి బగలును దానుంట రీతి గాంచి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మొదటి పాదంలో యతి తప్పింది. 'ఏకధాటిగ నేడ్చెను హేమలతయె' అనండి.

      తొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పెండ్లైన దినము మొదలిడి విన్ననువును
    లేని రీతి ననయము మాలిమి నిలుపక
    ధర్మ భాగినైన దన నాథఃకరించు
    భర్త మరణ వార్తను విని భార్య మురిసె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మొదటి పాదంలో గణదోషం. 'పెండ్లి యైన దినమునుండి...' అనండి. 'విన్ననువును' అన్నది అర్థం కాలేదు. '..దన నధఃకరించు' అనండి.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారములు. 'విన్ననువు' ను 'సరివిధము' అనే అర్ధంలో వాడాను.

      తొలగించండి
  17. _____________________________________

    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    [ L.I.C. agent ఒకాయనతో అన్నా డిలా }
    …………………………………………… .. ........

    ఆరు లక్షలకున్ " డబుల్ యాక్సిడె౦టు -

    పాలసి " ని గొనె నెలక్రి౦ద బాలకృష్ణ |

    స౦భవి౦ప దుర్ఘటనము చచ్చిపోయె |

    కన్నులారక దు : ఖి౦చె మొన్న వరకు ,

    భర్త మరణవార్త విని భార్య | మురిసె

    ె" మగ డపుడు చేసి చనిపోయె మ౦చి " యనుచు

    రిప్లయితొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఈసు భావము నెంచుచు నెసను చెఱచి
    కదనమునకు కారకుడౌచు కసిమసఁగిన
    బిరుసు యా ధార్తరాష్ట్రుడు కురు ధరణిజ
    భర్త మరణ వార్తను విని భార్య మురిసె
    ననుచు దెల్పె భీమునికట నర్జునుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బిరుసు+ఆ' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  19. సీత! నీవిక ముక్తవు చెఱను బాసి
    రాము డవనిజ విన గభీరముగ నుడివె
    రావణుని చంపితి నని గర్వమునఁ బలుక
    భర్త, మరణవార్తను విని, భార్య మురిసె


    సమస్య పాదమును సవరించి చేసిన పూరణ:

    వర్తన మేలనో కడిది భారము నేనది మోయ నేర్తునే
    కర్తకు జాలి లేదనుచుఁ గర్కశు డంచుఁ దలంచి యేడ్చి తా
    నార్తిని నెత్తి మొత్తుకొనె నత్తరి చిత్తము సంచలింపగన్
    భర్త మృతుండు నయ్యెనను వార్త వినంగనె భార్య నవ్వెరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వర్తన మేలనో కడిది భారము నేనది మోయ నేర్తునే
      కర్తకు జాలి లేదనుచుఁ గర్కశు డంచుఁ దలంచి యేడ్చి తా
      నార్తిని నెత్తి మొత్తుకొనె నత్తరి చిత్తము సంచలింపగన్
      భర్త పరేతుఁ డయ్యెనను వార్త వినంగనె భార్య నవ్వెరా

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. శ్రీయుతులు కామేశ్వర రావు గారు:

      మీరందించిన చిట్కాలతో నేను తెగించి వ్రాసిన ఉత్తరకుమార భాషణలు వీక్షింప మనవి.

      ధన్యవాదములు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      శాస్త్రి గారు మీ పూరణను జూచి నా యభిప్రాయమును కూడ వ్రాసితిని చూడండి.

      తొలగించండి
  20. అశ్వ రక్షణకై పార్ధు డంత మొంద
    భర్త మరణ వార్తను విని భార్య మురిసె
    బభ్రువాహను బంపించి భర్త కడకు
    మరల బ్రతికించి శాపంబు మఱల జేసె

    రిప్లయితొలగించండి
  21. ధూర్తులు దుష్టభావులయి తోరపు గ్రూరత దూరవాణిలో
    నార్తిని గూర్ప బూనుచు భయంకర మౌగతి దెల్పినప్పుడున్
    భర్త పరేతుఁ డయ్యెనను వార్త, వినంగనె భార్య నవ్వెరా
    నర్తన జేయుచుం గనుచు నాథుడు ప్రక్కనె చేరి యుండుటన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. బాధ్యతల వీడి నిత్యము వాడలందు
    త్రాగుచు కుటుంబమును గూర్చి తలచకుండ
    గిల్లి కజ్జాల ధనమును కొల్లగొట్టు
    భర్త మరణవార్తను విని భార్య మురిసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. పండితుడె యయ్యు పడరాని పాట్లు పడుచు
    మంచి కావ్యము తన భర్త యెంచి గూర్చ
    భార్య పొంగెను ; ములుకులే పలుకు కృతికి
    భర్త, మరణవార్తను విని భార్య మురిసె

    రిప్లయితొలగించండి
  24. హర్తగ మారి నిత్యమును హానికరమ్మగు చేష్టితమ్ములన్
    పూర్తిగ తృప్తిఁ బొందుచును మోసపు మాటలతో సతమ్ము దు
    ర్వర్తనుడై వసించు యనురాగ విహీనపు వింతజంతువౌ
    భర్త పరేతుఁ డయ్యెనను వార్త వినంగనె భార్య నవ్వెరా

    రిప్లయితొలగించండి
  25. భర్తపరేతుడయ్యెననువార్తవినంగనెభార్యనవ్వెరా
    భర్తపరేతుడయ్యెననిభార్యయెనవ్వుటనమ్మశక్యమా
    యార్తినిరోదనంబుననహాపతి!వీడినయేమినాగతిన్
    ధూర్తులునాకికన్భువినిదోరముగాబలునిందలేతురే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గతిన్' అన్న ప్రయోగం అక్కడ కుదరదు.

      తొలగించండి
  26. ఆర్తిని కుమిలెను గద తన
    భర్త మరణవార్తను విని; భార్యమురిసె తా
    కర్తగ బడసి కుటుంబము
    వర్తన గావించి తనదు బాధ్యత దీర్చన్!

    రిప్లయితొలగించండి
  27. ప్రేమపిచ్చిది|గుడ్డిది|పెరిగితరుగ?
    బంధ మనుబంధ మందు విసంధి గాగ?
    విఫల మైనట్టి ప్రేమకు పిచ్చిదయ్యు
    భర్త మరణ వార్తనువిని భార్య మురిసె|
    2.కర్తయు దైవమంచు తగుకాంక్షలు లేకను జీవితాశయా
    వర్తనమందు మానవత బంచగ నుందురు దైవ దూతలై|
    “ఆర్తిగ భక్తి భావనలె|ఆశనిరాశను సన్య సించగా?
    భర్త పరేతుడయ్యెననువార్త వినంగనె భార్యనవ్వెరా

    రిప్లయితొలగించండి
  28. చేరి లంక రాముడు కపి సేనతోడ

    నాహవంబున లంకేశు సంహరించి

    సీతకున్ రావణుండు జచ్చెనని చెప్ప

    భర్త ; మరణ వార్తను విని భార్య మురిసె.

    రిప్లయితొలగించండి
  29. కలలుకల్లలే గావున కలను తనదు
    భర్త మరణ వార్తను విని భార్య మురిసె
    భర్త ఆరోగ్యమునకిక భయము వలదు
    తొలగె కీడట౦చును తెలుప బుధులు

    రిప్లయితొలగించండి
  30. విజయ పతి మరణించె నంచుజను లాడు
    ముచ్చటల విని వెంటనె మూర్ఛబోయె
    భర్త మరణవార్తను విని భార్య, మురిసె
    విజయ కాదు వి. జయ యంచు విషయ మెరగి


    ధూర్తుడొకండు వచ్చెనట దుష్కృత చిత్తుడతండు దేవతా
    మూర్తుల దొంగిలించు ఘన మ్రుచ్చుడు, స్నేహితు రాలితోడ నా
    హర్తయె జెప్పెనిట్లు పరిహాసము లాడుచు నీలివార్తలన్
    భర్త పరేతుడయ్యెనను వార్తవినంగనె భార్యనవ్వెరా!

    రిప్లయితొలగించండి
  31. భర్తీ కాని కొఱయినను
    భర్త మరణవార్తను విని భార్య మురిసె సం
    పూర్తిగ జీవచ్చవమై
    యార్తికి మూర్తికి విడుదల యానందమెగా ||

    రిప్లయితొలగించండి
  32. భర్త యనగ భరిచువాడుభాధ్యతలను
    భర్త తనను తనకుటుంబ భాధ్యతలను
    భార్యకు వదలిపెట్టిన భర్తలాంటి
    భర్త మరణవార్తను విని భార్య మురిసె

    రిప్లయితొలగించండి
  33. సతము త్రాగుచు సతినట శంకతోడ
    కష్టముల పాలు చేయు నిష్కరుణి యైన
    భర్త మరణ వార్తను విని భార్య మురిసె
    నట్టి వాడున్నన్ లేకున్నన్ నవని నొకటె.

    రిప్లయితొలగించండి
  34. భర్తను చంపబోవురని వైరులు చెప్పగ రాత్రి రాత్రియే
    భర్తను తోలగాను తను భద్రముగానట పుట్టినింటికిన్
    వార్తను ఫేకుదౌనొకటి పండుగ జేయుచు పంచగానహా!
    భర్త పరేతుఁ డయ్యెనను వార్త వినంగనె భార్య నవ్వెరా :)

    రిప్లయితొలగించండి