1, డిసెంబర్ 2016, గురువారం

న్యస్తాక్షరి - 37 (వి-వా-హ-ము)

అంశము- పెండ్లి వేడుక
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాల మొదటి అక్షరాలుగా వరుసగా
‘వి - వా - హ - ము’ ఉండాలి.

71 కామెంట్‌లు:



  1. విరివిగాను బంధువులటు విడిది గనుచు
    వాహనంబుల జోరుగా వచ్చిరి, మరి
    హవనములు, నయ్య వారల హంగు లనగ
    ముదిత లెల్ల మురిసిజూడ ముద్దు పెళ్లి !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. వివిధ వన్నెల పూవులు విరిసి విరియ
    వాద్య బృందాల వీనులు పరవసించ
    హద్దు మీరిన యతిధులు హాజరవగ
    ముచ్చటలు మీర ముదితలు మురిసి మెరిసె!

    రిప్లయితొలగించండి
  3. వినుతి జేయగ వచ్చిరి వేడు కనుచు
    వాహ నములందు విరివిగా బారు తీరి
    హవన ములుగురు వులభూరి హారి వరము
    ముదిత లందరు పెండ్లిని ముచ్చ టించ

    రిప్లయితొలగించండి
  4. విరుల మాటున విసిరిన వింటి చూపు
    వాలుగన్నుల వయ్యారి వలపు దెలుప
    హసిత వదనమున సుమనోహరుడు దేల
    ముచ్చటగ గూర్చి ముడివేయు ముద్దు వేడ్క

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాజేటి సుమలత గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. డా.పిట్టా
    వియ్యములవారు సరి,బోల్చ విత్తమునకు
    వాతలనుబెట్టె"మోది"యె వాడ వాడ
    హసిత వదనముల్ వసి వాడె, హ్లాదమెచట?
    మురిపెముల ముచ్చటల బెళ్ళి మూగవోయె!;😢

    రిప్లయితొలగించండి
  6. విరుల ముత్యాల పందిరి వెలుగు లందు
    వాలు కన్నుల చిన్నారి వలపు చూపు
    హసిత వదనము విరియగ హాయి నొంది
    మురిసి వరుడేమొ పులకించి మోద మలరె

    రిప్లయితొలగించండి
  7. వినుడు కమనీయమై యొప్పి యనుపమముగ
    వాసి గలిగించు వధువుకు వరున కతుల
    హర్ష దీప్తులు చిందించు నందరకును
    మునిజనామోద మైనట్టి మనువు భువిని.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. వియ్యమున జంటలఁ గలుపు వేడ్కతోడ
    వాడ లనుగల బంధువుల్ కూడుకొనగ
    హరిత తోరణములఁ గట్టి కరము తుష్టి
    ముదము సేసన బ్రాలను పోయు దినము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. మిత్రులందఱకు నమస్సులు!

    విఘ్న మాపఁగఁ బూజించి విఘ్నపతిని;
    వారిజాక్షిని వరుని సవరణ సేసి,
    ర్షమున వారి పెండ్లి సేయంగ, నపుడు
    ముదముతో దీవనముల నిడుదురు బుధులు!

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  10. వివిధ నగలను ధరియించి యువిదలలర
    వాలు పేకాటలను మగవారలాడ
    హసిత వదనాలపిల్లలే యుసిగనాడ
    మురియ వధువును వరుడును జరిగె పెండ్లి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పద్యంలో నిజమైన పెండ్లి వేడుకలు కన్పించాయి. చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
  11. విరులు కంఠాల మాలలై మురిసి పోవ
    వాలు చూపుల జారిన మేలి ముసుగు
    హద్దు లేదని జంటకు ముద్దునీయ
    ముదము గూర్చదె వారల ముచ్చటచట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. వివిధ నగలను ధరియించి యువిదలలర
    వాలు పేకాటలను మగవారలాడ
    హసిత వదనాలపిల్లలే యుసిగదిరుగ
    మురియ వధువును వరుడును జరిగె పెండ్లి.

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వినయ గుణముల వర్ధిల్లు వీక గలుగు
    వాసి కెక్కిన గోత్రాల వారిరువురు
    హసిత మనముల నలరారు ననువు గూడి
    మురిపె మొందుచు కళ్యాణ మూర్తు లయ్యె.

    విరిసిన మనసు లలరగ మరులు గలిగి
    వారిరువురు వినయ శీల ప్రథితు లచట
    హరుని సాక్షిగ పాణిగ్రహణము దోడ
    మురియుచు నిలచి నానంద మొందఁజేసె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'మూర్తులైరి' అనండి.
      రెండవ పూరణలో 'నిలిచి యానంద...' అనండి.

      తొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువు గారూ! నమస్కారములు. మీ సూచనల ననుసరించి నిన్నటి పూరణ పద్యాలను సవరించాను. పరిశీలించ గలరు.

    ఆధిక్య మమర గలదను
    బోధనతో నాంగ్లము నిట పురుటము లాడే
    మేధా శూన్యుల కెల్లను
    మాధుర్యము లేని భాష మన తెలుగు గదా!

    సాధుత్వమ్మది కొరవడు
    నాధునికాంగ్లమ్ము నేర్చి యడరెడి వారౌ
    బోధన శూన్యుల కెప్పుడు
    మాధుర్యము లేని భాష మన దెలుగు గదా!

    రిప్లయితొలగించండి
  15. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    విరియు చు౦డె సిగ్గు వధువు పెదవి పైన

    వాలు చు౦డె వరుని మది వధువు పైన

    హర్ష వర్షము కురిపి౦ప న౦ద రపుడు

    ముగిసె పె౦డ్లి మ౦గళ వాద్యములిక మ్రోగ

    రిప్లయితొలగించండి
  16. విస్తరంపు టరుగది భువి మితిమీఱ
    వాయువర్త్మము మించగఁ బందిరిఁ గన
    హరితపు టరటి మ్రానులు నంద మీయ
    ముచ్చటగ బెండ్లి యచ్చట ముదము నొసగె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణ తో:

      విస్తరంపు టరుగది భువి మితిమీఱ
      వాయువర్త్మము మించగఁ బందిరిఁ గన
      హరితపు టరటి మ్రానులు నంద మీయ
      ముత్తియంపుముగ్గులఁ బెండ్లి ముదము నొసగె

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. వి - వా - హ - ము

    విబుధ వర్యులొసంగు దీవెనల ఝరులు
    వారిజాక్షుల సరస సంభాషణములు
    హరిహరాదుల పూజా ప్రహర్షణములు
    మురిసిలెల్లరుద్వాహసమ్మోహనమున

    రిప్లయితొలగించండి
  18. రిప్లయిలు
    1. శ్రీగురుభ్యోనమః

      విలసితోల్లాస హాసపు విరుల జల్లి
      వాడ శోభిల్ల ననురాగపందిరల్లి
      హరుస మందుచు వధువుకు వరుడు మూడు
      ముడుల వేయంగ జూడగా ముచ్చటగును

      తొలగించండి
    2. శ్రీపతి శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. విజ్ఞవరులార! కళ్యాణ వేదికపయి
    వాద్యఘోషలు మిన్నంట వరుడు గనుడు
    హర్షమున మంగళపు సూత్ర మంది యదిగొ
    ముదిత మెడలోన ముడివేసె మోహనముగ.

    వివిధ రకముల భోజ్యంబు లవిరళమగు
    వారిజాక్షుల ముచ్చట్లు వాద్యగతులు
    హరిత పత్రాలమాలలు పరిణయమున
    ముదము గూర్చును సర్వథా మదిని దోచు.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  20. విందు భోజన సందళ్ళు వెల్లివిరియ
    వారిజాక్షుల సరదాలు సౌరులొలుక
    హరుసమందెడు వధువును వరునిజూసి
    మురిసి దీవించు నెల్లరు పరిణయమున!!!

    రిప్లయితొలగించండి
  21. వివిధ రకముల వాద్యముల్ వినబ డంగ
    వార కాంతల నృత్యముల్ వాహ యనగ
    హసిత వదనంబు తోడన హన్సి కచట
    ముడులు వేయించు కొనియెను మూడు సామి !

    రిప్లయితొలగించండి
  22. వియ్యమందగ జేరగ విడిది చెంత
    వాద్యముల తోడ; సుందర వరుని గాంచి
    హర్షమొందెడి వధువుకు హద్దు గలదె!
    మునుగ శుభకార్యమందున మోదమలర

    రిప్లయితొలగించండి
  23. విరులు నవ్వ?వధూవరు లరుగు దెంచ
    వారిజాక్షకు తాళిని వరుడు గట్ట
    హర్షమందున నాశీస్సు లందరివ్వ?
    ముద్దు ముచ్చట మురిపాలు హద్దు మీరె|
    2.విడిది వినుతిసత్రంబుగా వినుతికెక్క
    వారసత్వపు నవ వధూవరులురాగ
    హక్కు మాంగల్య మందించ?చెక్కులాగ
    మురిసి పోయెను జంటలా మోదమందు|



    రిప్లయితొలగించండి
  24. విందులు వినోదముల తోడ బెండ్లి వేడ్క
    వారికిని వీరికని గాక నేరికైన
    హరికి నైనను మరి భవ హరునకైన
    ముదము గూర్చును మదికిని ముచ్చటగను

    రిప్లయితొలగించండి
  25. విభులు, విప్రులు , పనివారు, విపుల బంధు
    వాహిని యెజేరె నచట సంబరము తోడ,
    హవన కార్యక్రమాదుల నవని వేల్పు
    ముదము గా జరిపింపగన్ ముగిసె పెండ్లి.

    రిప్లయితొలగించండి
  26. విరియ తాటాకు పందిరి విరుల తోడ

    వాద్య మేళపు సన్నాయి పరుగుతీయ

    హర్షమున బంధుమిత్రులు హాజరవ్వ

    మురియుచున్ వధువుకు తాళి నపుడు కట్టె.

    రిప్లయితొలగించండి
  27. విందులు వినోద ముల గృహ మందగించ
    వాహనమ్మున నూరేగి వాడవాడ
    హరుసమడరగ హితులతో వరుడురాగ
    ముదిత మెడలోన మాంగల్య మొదవుదినము

    రిప్లయితొలగించండి
  28. విడిది చేసిరి విడిదింట వేలజనులు
    వారికన్ని సౌకర్యముల్ వాసిగాను
    హర్షమగునట్లు నిపుడుచేయంగ వలెను
    ముదితలెల్లరురండిటుముగ్గు లిడగ

    విలువ గలిగిన నగలను వేగ దాల్చి
    వారిజాక్షు లెల్ల పట్టు వలువలనిట
    హర్షచిత్తమున ధరించి యలుపు లేక
    ముచ్చటగ మాటలాడుచు మురియుచుంద్రు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  29. విడిదియంతటనిండగబెండ్లివారు
    వాద్యఘోషాలువినువీధివ్యాప్తిజెంద
    హర్షపులకితగాత్రయౌయాగిరిజకు
    ముడులుమూడునువేసెనుమూర్తిరాజు

    రిప్లయితొలగించండి
  30. విమల లావణ్య సౌభాగ్య సుమము బోలు
    వారిజాక్షియె రాకేందు ప్రభలు చిందు
    హరువు లొలికెడి వరునితో కరము బట్టి
    ముదము తోడుత పెండ్లాడె ముచ్చటగను!

    రిప్లయితొలగించండి
  31. విడును కాశీ ప్రయాణమ్ము వడుగు వేడ్క
    వాసిగా గౌరి పూజను వధువొనర్చు
    హవము సాక్షిగ నయ్యెద రాలుమగలు
    మురిసి దీవెనల్ బంధులు కురియ జేయ

    రిప్లయితొలగించండి
  32. వింత కష్టమొచ్చను మోది పెద్ద నోట్ల
    వాడకము రద్దు చేసెను పాపమయ్యొ
    హంసవాహనా!నల్ల ధనార్జనులను
    ముంచె మున్ముందు నింకేమి ముంచగలడొ!

    రిప్లయితొలగించండి
  33. వియ్యమందెడి వేళల విఙ్ఞులైన
    వారలు మది నెంచరు వస్తు వాహనముల!
    హర్షమందుచు సుగుణాల నతివ గాంచి
    ముదము తోడ వేడుక లందు మునుగుచుంద్రు!

    రిప్లయితొలగించండి
  34. విరియ మోములు వేదిక మెరుగులీన
    వారిజాక్షియు వరుడిని చేరినంత
    హరి సిరుల రూపమా జంట ధరణిపైన
    మురిసి కలియన్నవతరమ్ము ముదము గొల్పు

    రిప్లయితొలగించండి
  35. విడిది జేరగ వచ్చిరి వియ్యమంద,
    వారి రాకకు ఎదురేగి పాద్య మొసఁగి,
    హంసరాగపు మాలిక లాలపించి,
    ముచ్చటల దీర్చ సాగిరి ముచ్చటగను
    కొరుప్రోలు రాధా కృష్ణా రావు

    రిప్లయితొలగించండి