24, జనవరి 2017, మంగళవారం

సమస్య - 2262 (తరుణి! పుత్రివో?...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తరుణి! పుత్రివో? పౌత్రివో? ధర్మసతివొ?"
లేదా...
"రమణిరొ! పుత్రివో? మనుమరాలవొ? చెల్లివొ? ధర్మపత్నివో?"

46 కామెంట్‌లు:

  1. ...స్నేహేచ మాతా శయనేచ రంభా...



    ధర్మ కామము దీర్చగ ధర్మ సతివి!
    పుణ్య తీర్ధములను ద్రిప్ప పుత్రి వీవు!
    పట్టు బట్టి మారామున పౌత్రి వీవు!
    తరుణి! పుత్రివో? పౌత్రివో? ధర్మసతివొ?

    రిప్లయితొలగించండి
  2. డా.పిట్టా
    ధీర గంభీర దేహుడు దీప్తిమీరు
    నరుడు, సింహము చేతులు నాలుగున్న
    ఆయుధములె బ్రియమ్ములా? యరయడొకట
    తొడన వసియింప జేసెను తడమలేడె?
    తరుణి!పుత్రివొ, పౌత్రివొ,ధర్మ సతివొ
    మనుమనికినెట్లు వివరింతు,మాత లక్ష్మి!?
    శ్రమలను బంచుకొమ్మనిరి శాస్త్రము బ్రక్కకునెట్టి స్త్రీలిలన్
    క్రమముగ నౌకరుల్ జెలగ కాలపు వేగమునంటి జంటలై
    భ్రమణములుండ నిన్ మనుప రౌద్రము మానియు చద్దిగట్టు,వి
    శ్రమమన లేని జీవునిగ వీకన చాకిరి జేయు భర్త కో
    రమణిరొ!పుత్రివో మనుమరాలివొ చెల్లివొ ధర్మ పత్నివో?!
    (దేశ,విదేశాలలోని మారతున్న సంస్కృతికి శత సహస్ర జోహార్లతో)

    రిప్లయితొలగించండి
  3. వలపు సంకెళ్ళు బిగియించు కులుకు చెలివొ
    తనువు పులకించి మురిపించి తనరు పుత్రి
    మధువు చిలికించి సుధలూరు మనుమ రాల
    తరుణి ! పుత్రివో ? పౌత్రివో ? ధర్మ సతివొ ?

    రిప్లయితొలగించండి


  4. ఎవతి వీవు పద్మార్పిత ? యెచటి వనిత
    వి రమణీమణీ ! కవితల విరహ మేల
    తరుణి! పుత్రివో? పౌత్రివో? ధర్మసతివొ?
    తెలియ జేయుమమ్మ జిలేబి తెలియ జేయి !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు:

      మీ పూరణలన్నీ సరదాగా ఉండి నాకు చాలా నచ్చుతూ ఉంటాయి...మా హిందూస్తానీ మిత్రుడొకరు ఈరోజు "జిలేబి" పేరులో ప్రత్యేకత ఏమి అని నన్ను ప్రశ్నించారు. నాది ఉపాధ్యాయ వృత్తి అవడం వల్ల ఏదో ఒక సమాధానం కిట్టించి ఇవ్వడం అలవాటు. "నాకు తెలియదు" అని చెప్పడంతో సంభాషణ అంతమవుతుంది కాబట్టి. అందుకని నేను "జిలేబి" "జ" గణం కావున కంద పద్యాలలో బాగా ఉపయోగ పడుతుంది అని వివరించాను. కానీ ఈరోజు తేటగీతిలో కూడా "సల" గణం గా అచ్చిరావడం బహు సంతోషకరం ;)

      తొలగించండి


    2. ధన్య వాదాలండీ శాస్త్రి గారు !

      యెందెందైన యిమడగల
      దందురు మాయయ్యరు ననుదహరించి మరీ !
      సంధులలో విందులలో
      కందము లో కంది వారి కవితా సభలో :)

      జిలేబి

      తొలగించండి
  5. సతివి నీవిట్లు పోట్లాడ సవ్య మేన?
    ఆభరణముల దెచ్చితి అడుగ పుత్రి
    పలక బలపము గొంటిని పౌత్రి గోర!
    తరుణి! పుత్రివో? పౌత్రివో? ధర్మసతివొ?
    (తను పుత్రికకు, మనుమరాలికి బహుమతులు తేగా, అలిగిన ధర్మపత్నిని సముదాయిస్తున్న పతి స్తితి)

    రిప్లయితొలగించండి
  6. ఇలను తల్లియై తనరుదు వెవర వీవు?
    నాదు మానస గాత్రియై నావు నీవు?
    నెలమి నొడిలోన నాడెడి చిలుక వీవ?
    చెలిమి బలిమిని నామది నలము కొనుచు!
    తరుణి! పుత్రివో! పౌత్రివో! ధర్మ సతివొ!

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    ధీర గంభీర దేహుడు దీప్తిమీరు
    నరుడు సింహము చేతులు నాలుగున్న
    ఆయుధములె బ్రియంబులా యరయడొకట
    తొడన వసియింప జేసెను తడమలేడె?
    తరుణి పుత్రివొ పౌత్రివొ ధర్మ సతివొ
    మనుమనికి నెట్లు వివరింతు మాత లక్ష్మి!

    రిప్లయితొలగించండి
  8. తిరుగబడ రైలు కానలో తిమిరమందు
    గాచి క్షతగాత్ర వృద్ధుని కడువిధముల
    ప్రాణములు నిల్ప నాతడు బలికె నిటుల
    తరుణి! పుత్రివో? పౌత్రివో? ధర్మసతివొ?

    రిప్లయితొలగించండి
  9. తరుణి!పుత్రివోపౌత్రివోధర్మసతివొ!
    నిజమునరయగనన్నియునీవెయౌదు
    నీవులేనిదిశూన్యమేయవనియందు
    తరుణి!గైకొనుమమ్మవందనశతమ్ము

    రిప్లయితొలగించండి
  10. గురుత రోపజన పరంపర రమణీయ
    రాగ బంధ ప్రచోదిత భోగ కాంక్ష
    రత వికాస చిత్త భవ విరాజమాన
    తరుణి! పుత్రివో? పౌత్రివో? ధర్మసతివొ?

    [ఉపజనము = పుట్టుక]


    కమలదళాక్షి!భాషణ నికాయ విలాసిత పాటవమ్మునన్
    విమల దయా గుణైక పరివేష్టిత లోకన పారవశ్యతన్
    సుమధుర లీలఁ జూడ యమ సూనుడు భూపతి ధర్మ మూర్తికిన్
    రమణిరొ! పుత్రివో? మనుమరాలవొ? చెల్లివొ? ధర్మపత్నివో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొరపాటున ప్రాసాక్షరము ర గా నెంచి చేసిన మొదటి పూరణ. తదనుగుణముగా మార్చిన సమస్యాపాదముతో.

      కరమనురాగభాషణనికాయవిలాసితపాటవమ్మునన్
      పరమ దయాగుణద్యుతివిభాసితలోకనపారవశ్యతన్
      సురుచిరధర్మరాజుయమసూనుడు భూపతిధర్మమూర్తికి
      న్నరయగ పుత్రివో? మనుమరాలవొ? చెల్లివొ? ధర్మపత్నివో?

      తొలగించండి
  11. రమణిరొ! పుత్రివో?మనుమరాలవొ?చెల్లివొ?ధర్మపత్నివో?
    క్రమముగతెల్పుమీ యనగ లక్షణపల్కెను యత్తగారితో
    క్రమముగ పుత్రి నౌదు కురు రాజుకు,పౌత్రినిగ్రుడ్డి రాజుకున్
    అమల యశస్వి లక్ష్మణునకర్మిలి చెల్లిని సాంబుపత్నినిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారు రాజుకు, రాజుకున్ ప్రయోగములు లక్షణ విరుద్ధములు. రాజునకు, రాజునకున్ సాధువులు.

      తొలగించండి
    2. శ్రీ కామేశ్వరరావు గారూపద్యము సవరించితిని దయచేసి చూడ ప్రార్ధన

      రమణిరొ! పుత్రివో?మనుమరాలవొ?చెల్లివొ?ధర్మపత్నివో?
      క్రమముగతెల్పుమీ యనగ లక్షణపల్కెను యత్తగారితో
      క్రమముగ పుత్రి నౌదు కురు రాజ్ఞికి ,పౌత్రినిగ్రుడ్డి రేనికిన్
      అమల యశస్వి లక్ష్మణునకర్మిలి చెల్లిని సాంబుపత్నినిన్

      తొలగించండి
    3. చక్కటి సవరణలు చేసారు. ఱేనికి / న్నమల.. అనండి.

      తొలగించండి
    4. శ్రీ కామేశ్వరరావు గారికి ధన్యవాదములు మీ సూచన మేరకు సవరించిన పద్యము
      రమణిరొ! పుత్రివో?మనుమరాలవొ?చెల్లివొ?ధర్మపత్నివో?
      క్రమముగతెల్పుమీ యనగ లక్షణపల్కెను యత్తగారితో
      క్రమముగ పుత్రి నౌదు కురు రాజ్ఞికి ,పౌత్రినిగ్రుడ్డి రేనికి

      న్నమల యశస్వి లక్ష్మణునకర్మిలి చెల్లిని సాంబుపత్నినిన్

      తొలగించండి
  12. ………………………………….................
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,..


    స్వైరిణి తల౦ప దిక వావి వరుస లెవ్వి

    విత్త మొసగిన చాలును విటుని సరస

    తన సుపుత్రి c , బౌత్రి ని , పరధర్మసతిని

    ధర్మ మె౦చక నీటుగా తార్చ గలదు

    పడక పయి పడతి నడిగె పల్లవు డిటు

    " తరుణి ! పుత్రివో పౌత్రివో ధర్మసతివొ "
    ______________

    { స్వైరిణి = జారిణి ; పల్లవుడు = విటుడు }

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్షమించండి రుక్మిణీ బదులుగా ద్రౌపదీ అనివ్రాశాను

      తొలగించండి
  14. సుమముల వంటి స్వచ్ఛతయు సున్నిత దేహము నీకుస్వంతమే
    యమృతమయమ్ము నీహృదయమాపరమేశుని మారురూపువే
    మమతను పంచిపెట్టుచు సమాజమునందుననర్ధభాగమౌ
    రమణిరొ! పుత్రివో? మనుమరాలవొ? చెల్లివొ? ధర్మపత్నివో

    రిప్లయితొలగించండి
  15. స్నేహితుం డంపగా నిట జేరినావు
    తరుణి! పుత్రివో పౌత్రివో ధర్మ సతివొ
    యెవతెవోయెఱుగ నతడి కేమి వరుస
    తెలుపు మంటిని చెప్పుమా లలన వేగ


    ప్రమదలు నోచుచుండిరిట భక్తిగ పండుగ నోములందుకై
    విమలుడు నాదు మిత్రుడను పిల్వగ నాతడు పంపెనంటివే
    రమణిరొ! పుత్రివో మనుమరాలివొ చెల్లివొ ధర్మపత్నివో
    మమతలు పంచినట్టి తన మాతవొ తెల్పుముసావధానమున్

    .......... ............

    రిప్లయితొలగించండి
  16. స్నేహితుం డంపగా నిట జేరినావు
    తరుణి! పుత్రివో పౌత్రివో ధర్మ సతివొ
    యెవతెవోయెఱుగ నతడి కేమి వరుస
    తెలుపు మంటిని చెప్పుమా లలన వేగ


    ప్రమదలు నోచుచుండిరిట భక్తిగ పండుగ నోములందుకై
    విమలుడు నాదు మిత్రుడను పిల్వగ నాతడు పంపెనంటివే
    రమణిరొ! పుత్రివో మనుమరాలివొ చెల్లివొ ధర్మపత్నివో
    మమతలు పంచినట్టి తన మాతవొ తెల్పుముసావధానమున్

    .......... ............

    రిప్లయితొలగించండి
  17. అమలిన ముత్యమై ధర విహారము సల్ప విదర్భరాజుకున్
    కమలదళాయతాక్షిగ వికాసత తాతకు,రుక్మి శౌరికిన్
    విమల యశ్వసి కృష్ణునికి వీడని బంధము వేసె రుక్మిణీ
    రమణిరొ,పుత్రివో,మనుమరాలివొ,చెల్లివొ,ధర్మపత్నివో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామా రావు గారు శౌరికిన్ సాధువే కాని రాజుకున్ ప్రయోగము లక్షణ విరుద్ధము. రాజునకున్ సాధువు.

      తొలగించండి
  18. కమలదళాయతాక్షివిముఖంబునుజాటుగవేయకిత్తరిన్
    బ్రమదముగల్గునట్లుగనుమాకునుబంధుజనంబువారికిన్
    విమలమనంబుతోడననభేద్యముగానికజెప్పుమాయిదిన్
    రమణిరొపుత్రివోమనుమరాలివొచెల్లివొధర్మపత్నివో

    రిప్లయితొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువుగారికి నమస్కారములు. మెడికల్ చెకప్ లో యుండుట వలన రెండు రోజులుగా బ్లాగుకు దూరమైనాను. నా క్రింది పూరణలను పరిశీలించగలరు.

    22-01-2017:

    పరవశ మొనరించెడిదౌ
    వరవిక్రయ నాటకమున వనితగ నటియిం
    చు రవి యనెడి పేరుంగల
    పురుషుడు ప్రసవించి శిశువు బొలఁతి కొసంగెన్

    23-01-2017:

    చెలువమగు తమ రూపుతో చెన్నమరని
    తీరు పురుషుల దమవెంట త్రిప్పుకొనుచు
    కాపురమ్ముల గూల్చెడి కాముకిలగు
    భామినుల నంత మొందించు వాడె ఘనుడు

    24-01-2017:

    ఇంత రాతిరి వేళలో నంత వడిని
    యీదరికి జేరి వచ్చిన నీవెవరవు
    తరుణి! పుత్రివో? పౌత్రివో? ధర్మ సతివొ
    చూపు మందగించినదమ్మ చెప్పవమ్మ

    రిప్లయితొలగించండి
  20. డా.పిట్టా
    ధీర గంభీర దేహుడు దీప్తిమీరు
    నరుడు సింహము చేతులు నాలుగున్న
    ఆయుధములె బ్రియంబులా యరయడొకట
    తొడన వసియింప జేసెను తడమలేడె?
    తరుణి పుత్రివొ పౌత్రివొ ధర్మ సతివొ
    మనుమనికి నెట్లు వివరింతు మాత లక్ష్మి!

    రిప్లయితొలగించండి
  21. తరుణి! పుత్రివో పౌత్రివో ధర్మ సతివొ
    యెవరి కైనను గానోపు.యింతి,నేను
    పదితలలు గల్గు రావణ బ్రహ్మ,నిన్ను
    బలిమి చేబట్టి యనుభవింప గలనిచట

    రిప్లయితొలగించండి
  22. కుమతి కురూపి వంచధిక ఘోరముగా నిను బాధ పెట్టితిన్
    మమతను మానవత్వమును మట్టిని పూడ్చితి గాని నీవు నీ
    విమల మనంబుతోడ నను వీడక సేవను జేయుచున్న ఓ!
    రమణిరొ! పుత్రివో? మనుమరాలవొ? చెల్లివొ? ధర్మపత్నివో?

    రిప్లయితొలగించండి
  23. ఇందు పాల్గొనిన కవివరులు ప్రతి యొక్కరు కనీసము మరియొక్కరి పూరణ పై స్పందించిన గురు వర్యుల కానంద మొనగూర్చ గలదు. ఎవరికినైనా స్వీయ దోషములు కనిపించవు గదా!

    రిప్లయితొలగించండి
  24. ఒక నాటకకంపెనీలో వేరువేరువేషాలతోరాణించినపాత్రదారితోవేషదారిపలికిన పలుకులు
    తరుణి|పుత్రివో?పౌత్రివో,ధర్మసతివొ?
    ఆడగలిగిన పాత్రలో నీడవోలె
    నాటకంబున నారిగా నటనలందు
    పేరు బొందిన లలితను బిలిచిపలికె|
    2.శ్రమపడి పాత్రలన్నియును సర్వవిధాలుగా లక్ష్య సాధనా
    బ్రమలను ముంచి తేల్చగల భావనభాగ్యముగల్గియున్న ఓ
    రమణిరొ;పుత్రివో?మనుమ రాలివొ? చెల్లివొ? ధర్మపత్నివో?
    తమరిటదేవసుందరివొ?తన్విని గోరెను హాస్యదారుడై|


    రిప్లయితొలగించండి
  25. కవివరేణ్యులు కామేశ్వర రావు గారికి నమస్సులు. నా పూరణను పరిశీలించి అభిప్రాయము తెలుప మనవి.

    రిప్లయితొలగించండి

  26. పిన్నక నాగేశ్వరరావు.

    తల్లి దండ్రుల యవసరా లెల్ల దీర్చు

    చేయును సపర్యలను తాత చెంత జేరి

    పతిని ప్రేమించి సతతము పరవశించు

    తరుణి! పుత్రివో? పౌత్రివో? ధర్మ సతివొ?

    రిప్లయితొలగించండి
  27. నాతి నీ నడత నయనానందకరము
    కార్యనిర్వహణమ్మది ఘనము చూడ
    వారసత్వమా నీకు? నే ప్రముఖులకును
    తరుణి! పౌత్రివో?పుత్రివో? ధర్మ సతివొ?

    రిప్లయితొలగించండి
  28. కవిమిత్రులకు నమస్కృతులు.
    నా శరీరాగ్యోగంలో ఏలోపమూ లేదు. ఉన్నదంతా మానసికమైన అలజడి. కారణం తెలియని ఏదో భయం. దేనిమీదా మనస్సును కేంద్రీకృతం చేయలేకపోతున్నాను.
    గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు 'శంకరాభరణం' బ్లాగులో పద్యాలు చదివి, స్పందిస్తూ ఉండడం వల్ల సాంత్వన దొరికేది. కాని ఈసారి మీ పద్యాలను చదివినా స్పందించలేకపోతున్నాను.
    నాలుగైదు నెలలుగా 'ఆంధ్రభారతి' వారి నిఘంటు కార్యక్రమానికి చెందిన పని, ఆంధ్ర భాగవతం పద్యభావాలను టైప్ చేసే పని ఆగిపోయాయి.
    "నేను కోరుకున్న జీవన విధానం ఇది కాదు, చేయవలసిన పనులు, సాధించవలసినవి ఉన్నాయి. అందుకు ఈతిబాధలు, సమస్యలు, ఉద్విగ్నతలు అడ్డుగా ఉన్నాయి" అన్న భావం నా మనస్సును తొలుస్తున్నది.
    ఒకటి రెండు రోజుల్లో నేను మామూలు స్థితికి చేరుకుంటానన్న నమ్మకం ఉంది.
    అప్పటి వరకు దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనండి.

    రిప్లయితొలగించండి
  29. *********************************************
    తే.గీ. తరుణి! పుత్రివో? పౌత్రివో? ధర్మసతివొ?
    కరుణ తల్లివో? లేక సోదరి వయితివొ?
    ప్రణయ దేవత వైతివే ప్రకృతి కాంత,
    ధారపోయుచూ జనులకు ధరణి యందు!
    *********************************************

    రిప్లయితొలగించండి
  30. తరుణి కాగలదు పతికి తగిన విధము
    కరుణమీరగాతరుణిగాకరణమునకు
    మారు పేరు గ మాతగా మాన్య సహన
    తరుణి! పుత్రివో? పౌత్రివో? ధర్మసతివొ

    రిప్లయితొలగించండి
  31. శ్రీగురుభ్యోనమః

    సుమమును బోలు దేహమును సుందర రూపము స్నేహభావమున్
    మమతల బంచు మానసము మంగళ గాత్రము మంచి బుద్ధియున్
    క్రమముగ కల్గినట్టి కమలాక్షివి నీవు విధాత తండ్రికిన్
    రమణిరొ! పుత్రివో? మనుమరాలవొ? చెల్లివొ? ధర్మపత్నివో?

    రిప్లయితొలగించండి
  32. సమరము నందు జొచ్చుకొని స్వైరవిహారపు భీతి లేకయే
    కొమరు ప్రధాన మంత్రియవ కోరుచు గోముగ పట్టుబట్టిరే
    తమరిట రోమునుండి చని దారుణ రీతిని నాక్రమించినన్
    రమణిరొ! పుత్రివో? మనుమరాలవొ? చెల్లివొ? ధర్మపత్నివో?

    రిప్లయితొలగించండి