18, డిసెంబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 172

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె.

28 కామెంట్‌లు:

  1. ఎవని తలపైన దా చేయి నిడిన వాడు
    భస్మమగుటకు భవుడొక వరమొసంగె
    దనుజుడంతట శివుడినే తరుమజొచ్చె
    పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె. !!!!

    రిప్లయితొలగించండి
  2. ఉగ్ర వాదుల నా నాడు యుగ్గు బాల
    రాజకీయమె పెంచెను మోజు మీరి
    ప్రజల కది శాపమై నేడు బాధ వెట్టె
    పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె.

    రిప్లయితొలగించండి
  3. భీముడను నొక నల్లరి - పిల్ల వాడు
    పాము తలమీద పాలన్ని - పారవోసె
    ఆగ్రహించిన సర్పము - కాటు వేసె
    పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె.

    రిప్లయితొలగించండి
  4. భస్మమయ్యెడి అసురుని - భరత మెల్ల

    చిట్టి పద్యము లోన నే - చెక్కినావు

    విష్ణు నందన ! సుందర ! - నీదు రచన

    నిరుపమానము ! సత్యము !- నిత్యమయ్య

    రిప్లయితొలగించండి
  5. లేమ పెక్కేండ్లు సంతాన లేమిఁ క్రుంగి
    నలుగురమ్మలుజెప్పగ నాగుఁ గొలిచి
    పండె తనగర్భమనిదెల్సి పలికె నిటుల-
    పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె

    రిప్లయితొలగించండి
  6. గుడిసె మేడగ మార్చెద,రోడ్డు వేసి
    తారు పూసెద ,సరిపోవు నీరు దెత్తు
    మనిరి,గెలిచిరి యిపుడన్నిమరిచిరైరి
    పామునకు బాలు వోసిన ఫలిత మిదియె?

    రిప్లయితొలగించండి
  7. రైతు మరచిన హైటెక్కు రాజకీయు
    డతని నోడించి నొక 'దేవు' కందల మిడ
    వేల కోట్లతో పుత్రు కుబేరు జేసె
    పామునకు బాలు వోసిన ఫలిత మిదియె?

    రిప్లయితొలగించండి
  8. కవుల కొలను లోకి కలహంసలొచ్చెను,
    గనుడు కన్ను లార కవిత లెల్ల,
    పూరణాలు కనక తోరణాలై దోచు,
    మంద వారి మాట!మణుల మూట!!!

    రిప్లయితొలగించండి
  9. ఊకదంపుడు గారూ!
    మంచి ఫలితముతోమీ
    మీ పూరణ బాగుంది

    మంద పీతాంబరధరా!
    మరియు
    హరీజీ
    మీమీ పూరణలు అద్భుతమైతే
    భావనలు అమోఘం
    నూటికి నూరుపాళ్ళూ మీతో ఏకీభవిస్తున్నానహో...........................................................

    రిప్లయితొలగించండి
  10. @ వసంత్ కిషోర్ గారు
    మీ ప్రశంసా పూర్వక పద్యానికి బహుధా ధన్యవాదాలు....మూడవ పాదంలో యతి మరొక్క సారి.....గమనింపగలరు!

    @ మంద పీతాంబర్ గారు
    మంచి ఆటవెలది...." కవుల కొలను లోన కలహంస లడుగిడె" అంటే కావ్యభాషగా మారుతుంది...!!!!!!

    రిప్లయితొలగించండి
  11. పీతంబార్ గారూ మీ కవుల కొలను పద్యం నిజంగా మణుల మూట. డాక్టర్ గారు చెప్పిన చికిత్స మొదటి పాదానికి చెయ్యండి.

    రిప్లయితొలగించండి
  12. డా.విష్ణు నందన్ మీ సూచనకు కృతఙ్ఞతలు.ఆ పదాన్ని సవరించి నా బ్లాగులో ప్రకటించుకొంటాను
    మిస్సన్న గారికి ధన్య వాదములు. డాక్టరు గారి సూచనలను, రోగులు పాటించడం పరిపాటే గదా!

    రిప్లయితొలగించండి
  13. అదివొక కొత్త బంగారు లోకమంట
    అందు కలదొక పాండిత్య విరుల తోట
    పూయు చున్నవి పద్యాల పూల మణులు.
    గాంచి నంతనె యెద నిండ హాయి కలుగు
    సరసతీ పుత్రుల మెండు పేరోలగమ్ము.
    అందరికిని గురువు ఆది శంకరుడు.

    రిప్లయితొలగించండి
  14. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారి పూరణ ....

    అలసి సొలసి నిద్రించిన యతని కొక్క
    పాము నీడను పట్టెను పడగ విప్పి
    దానిఁ గని మెచ్చి చెప్పి రవ్వాని సఖులు
    పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె.

    రిప్లయితొలగించండి
  15. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంశనివారం, డిసెంబర్ 18, 2010 9:58:00 PM

    గురువు గారూ,
    నా భావాన్ని సరిచేసి మంచి పద్య రూపమిచ్చినందుకు కృతజ్ఞతలు.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  16. డా. విష్ణు నందన్ గారూ,
    ఎంత చక్కని పోలికతో సమస్యను పూరించారు. బాగుంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    సమయానుకూలమైన పూరణ నందించారు. చక్కగా ఉంది. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    బాగుంది. మీ మొదటి పద్యానికి అభినందనలు. రెండవ పద్యానికి ధన్యవాదాలు.
    అయితే రెండు పద్యాల్లోనూ మూదవ పాదంలో యతి తప్పింది.

    ఊకదంపుడు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ ఉదాత్తంగా ఉంది. అభినందనలు.
    ఇక మీ రెండవ పద్యం "మణుల మూటే". ధన్యవాదాలు.

    హరి గారూ,
    సమయోచితమైన పూరణ. అభినందనలు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    ధన్యవాదాలు.

    మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    మీ భావం చందస్సులో చక్కగా ఒదిగిందా?

    రిప్లయితొలగించండి
  17. కలలు గనెనంత నాతల్లి కొడుకు కొరకు
    ముద్దు మురిపాలు గురిపించి పెంచె గాన
    ఆలి వొడిలోన మురియంగ నమ్మ విషము
    పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె !
    -----------------------------------
    శివుని గళమందు మెలిగెడు సర్పమైన
    పరమ భక్తితొ పూజించి పాలు బోయ
    విషపు కోరల నైజము వీడి పోదు
    పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె !

    రిప్లయితొలగించండి
  18. సదస్యులందరికీ శుభాభినందనలు.
    ఒకరిని మించి మరొకరి పూరణ ఉంటోంది.

    విష్ణు,శంకరుల సూచనలకు ధన్యవాదములు.

    హంసల కొలనిలో ప్రవేశించిన బాతునైన నన్నుకూడా హంసగా
    అభివర్ణించిన పీతాంబరధరునికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  19. శంకరాభరణము(బ్లాగు)
    ____________________________
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
    ఆది కాలము నుండియు - జగము లోన
    విష్ణు శంకరు లొక్కరే! - వేరు గాదు!
    సర్వ రూపము లొక్కటే! - సత్య మిదని!
    వివిధ విధముల జెప్పిరి - విబుధ వరులు

    ఎంద రెంతగ జెప్పినా - వినరె! జనులు!
    కావరము చేత సత్యంబు - కానకున్న
    వారు! శివ,కేశవులు, వేరు - వేరనియెడి
    మూర్ఖు లందరు, నత్యంత - మూఢు లవని

    కనులు విప్పుడు! ఇంకెంత - కాల మయ్య!
    ఒక్కటై యుండి రిచ్చటే - కొలువు దీరి
    కాపురము చేయుచున్నారు - కలసి మెలసి
    రండి! రండయ్య! చూతము - రయము గాను

    అవని పైనను బ్లాగులు - గలవు పెక్కు
    బ్లాగు లన్నియు వెదకెడి - బాధ లేదు
    బ్లాగులకు రాజు ఈబ్లాగు - బాగు బాగు
    శంకరాభరణ మనునిందు! - శంక ఏల!

    రిప్లయితొలగించండి
  20. Angla lipi vaadi nanduku kshaminchamdi. ippude world trade center kulina sthalamuni sandarSinchi vastunnaamu. Sree Missanna gaaru cheppinde marala cheppaka tappa ledu. Missanna gaaru sahrudayulu, mannistaaru.

    రిప్లయితొలగించండి
  21. మూర్తిగారూ భావాలు ఒకరి సొత్తు కాదు. మీ పద్యం చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  22. నేదునూరి రాజేశ్వరి గారూ,
    మంచి భావాలతో పద్యాలు చెప్పారు. బాగుంది. అభినందనలు.
    కాని మొదటి పద్యం మొదటి రెండు పాదాలలో యతి తప్పింది. నా సవరణ ...
    "కలలు గనె తల్లి కొడుకును గనవలెనని
    ముద్దు మురిపాలు గురిపించి పెద్ద సేయ ........"
    ఇక రెండవ పద్యం మొదటి పాదంలో యతి తప్పింది. నా సవరణ ....
    "శంభు గళమందు మెలిగెడు సర్పమైన ......"

    రిప్లయితొలగించండి
  23. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మంచి విషయాన్ని ఎన్నుకొని పద్యం చెప్పారు. బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో "అహిలు తోడ" అని ఉంది. అది "అహితు తోడ" అనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  24. ఉగ్ర వాదుల నాదము నూది యూది
    అగ్ర రాజ్యము లాడిరి అహితు తోడ
    విపణి కేంద్రము కూలగ విజ్ఞు లనిరి
    పామునకు పాలు వోసిన ఫలిత మిదియె!!!

    రిప్లయితొలగించండి