3, నవంబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం - 1224 (వచ్చును దీపావళి)

కవిమిత్రులారా,
అందరికి దీపావళి శుభాకాంక్షలు
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
వచ్చును దీపావళి యను పండుగ నవమిన్.

32 కామెంట్‌లు:

  1. వచ్చెడి తన పుట్టిన దిన
    మిచ్చుటకై నిర్ణయించె నిక తెలగాణన్
    నిచ్చలు - సోనియ గాంధీ!
    వచ్చును దీపావళి యను పండుగ నవమిన్!

    (*వచ్చే నెల తొమ్మిదో తేదీన సోనియా గాంధీ పుట్టిన రోజు)

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    పిచ్చివాని పలుకులు :

    01)
    ____________________________

    విచ్చగ తల , ఱాయి తగిలి
    పిచ్చెక్కిన వాడు పలికె - పిల్లల తోడన్
    "రెచ్చగ సంతోషంబదె
    వచ్చును దీపావళి యను - పండుగ నవమిన్ "!
    ____________________________

    రిప్లయితొలగించండి
  3. అచ్చు వేయించిన "ఆవళి " అనే పుస్తకములో
    ఎన్నో అప్పుతచ్చులు !
    అందు మచ్చున కొకటి :

    02)
    ____________________________

    అచ్చున తప్పులు దొర్లిన
    అచ్చొత్తిన నచ్చ తెలుగు - "నావళి" యందున్
    మచ్చిది చూడగ నొక్కటి
    వచ్చును దీపావళి యను - పండుగ " నవమిన్ "!
    ____________________________

    రిప్లయితొలగించండి
  4. నా పుట్టిన రోజైన నవమి నాడే మా యింట దీపావళి :

    03)
    ____________________________

    మెచ్చగ బంధువు లందరు
    ముచ్చటగా జరుగు నాదు - పుట్టిన దినమున్
    చిచ్చుల బుడ్లును , జువ్వలు
    వచ్చును దీపావళి యను - పండుగ నవమిన్ !
    ____________________________

    రిప్లయితొలగించండి
  5. దీపావళి యెప్పుడొస్తుందో సరిగ్గా చెప్పిన వారికి బహుమతి యిస్తానంటే :

    04)
    ____________________________

    మెచ్చెడి రీతిని జెప్పిన
    నిచ్చెద బహుమాన మనిన - నిట్లనె నొకడున్
    "హెచ్చగు చిచ్చుల వెలుగుల
    వచ్చును దీపావళి యను - పండుగ నవమిన్ " !
    ____________________________

    రిప్లయితొలగించండి
  6. ఆకలిచిచ్చుతో రగిలే వారికి, నవమైనా, అష్టమైనా
    కనీసం పచ్చడి మెతుకులైనా దొరికిన రోజే గదా దీపావళి :

    05)
    ____________________________

    చిచ్చదె కడుపున రేగగ
    పుచ్చుకొనుచు తలతు రంత - పుణ్యాత్మునిగా
    పచ్చడి మెతుకుల నిచ్చిన
    వచ్చును దీపావళి యను - పండుగ నవమిన్ !
    ____________________________

    రిప్లయితొలగించండి
  7. మచ్చిక గోరెడు యుగమట
    నిచ్చగ తా వచ్చె నేని నీసుని కృపచే
    అచ్చెరు వొందగ దివిజులు
    వచ్చును దీపావళి యను పండుగ నవమిన్


    రిప్లయితొలగించండి
  8. పూజ్య గురువులకు ప్రణామములు
    సోదర సోదరీ మణులకు గురువులకు అందరికీ దీపావళి శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

    పూజ్య కవి గురువులకు, కవి మిత్రులకు, బ్లాగు వీక్షకులకు మరియు
    సోదర సోదరీ మణులకు గురువులకు అందరికీ దీపావళి శుభా కాంక్షలు

    శ్రీ డా: ఆచార్య ఫణింద్ర గారు (12. 31) ఉదయాన్నే దీపావళి టపాసులు కాల్చుట ప్రారంబించారు, శ్రీ వసంత కిషోర్ గారు ఐదు తారా జువ్వలను, శ్రీ రాజేశ్వరి అక్కయ్య గారి మతాబులతో బ్లాగు వీక్షకులకు దీపావళి వెలుగుల పంచినారు.

    అందరికీ మరొక్క సారి దీపావళి శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  10. హరికిన్ భూమికి పుత్రుడౌ నరకు డౌరా! దైత్యుడై లోకభీ
    కరుడై కూలెను కృష్ణ చక్రహతి, లోకంబుల్ ముదంబందె, చె
    చ్చెర వెల్గుల్ ప్రసరించె విశ్వమున నక్షీణోజ్జ్వలోత్సాహులై
    యరుదౌ పండుగ జేసి రెల్లరును దీపారాధనల్ సల్పుచున్

    మన మిత్రులకందరకును
    మనమలరగ గూర్తు నేను మహితోత్సవ కా
    మనలను దీపావళికిన్
    మనుడీ శుభమస్తటంచు మధురోక్తులతో

    రిప్లయితొలగించండి
  11. మధురకందము:
    ముచ్చట లెన్నో గొలుపుచు భూమికి వెలుగై
    వచ్చును దీపావళియను పండుగ, నవమిన్
    వచ్చును మా జన్మ దినపు పర్వము లహహా
    నిచ్చలు మా స్వాంతములను నింపును ముదమున్

    (మా దంపతు లిరువురి పుట్టిన దినములు నవమి నాడే యగును - స్వస్తి).

    రిప్లయితొలగించండి
  12. గురువు గారికీ, శంకరాభరణం కవులకూ, దీపావళి శుభాకాంక్షలు!!

    రిప్లయితొలగించండి
  13. గురువులు శ్రీకందిశంకరయ్య గారికి, గురువులు శ్రీ పండిత నేమాని గారికి మరియు నితర కవిమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు.

    హెచ్చిన కాంతులఁ దెచ్చుచు
    వచ్చును దీపావళి యను పండుగ, నవమిన్
    ముచ్చట గొలిపెడి రాముఁడు
    వచ్చెను దశకంఠుఁ గూల్చ ప్రాభవమెసఁగన్.

    రిప్లయితొలగించండి
  14. గురువులు శ్రీకందిశంకరయ్య గారికి, గురువులు శ్రీ పండిత నేమాని గారికి మరియు నితర కవిమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు.

    దీపజ్యోతుల ప్రాభవంబు మననుద్దీపింపగాజేసి, సం
    తాపంబుల్ పరిమార్చి సౌఖ్యముల సంధానించి,దుష్కర్మలౌ
    భావోద్వేగవితండవాదములు నిర్వ్యాపార సంక్లిష్టముల్
    వేవేలౌ తిమిరంపు చేష్టలకు దివ్వెల్ కాంతి దీపావళౌ.

    రిప్లయితొలగించండి
  15. గురువర్యులకు, కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు

    చీకటి వృక్షము బ్రతుకున
    కూకటి వేళ్ళైన లేక కూలగ వలెగా
    శ్రీకర దీపపు వెలుగులు
    మీకందరకందవలయు మిక్కుటమగుచున్.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
    శ్రీ వసంత కిషోర్ గారి తారా జువ్వలకు, శ్రీ నేమాని గురుదేవుల దీవెనలకు ధన్యవాదములతో...
    ఈ సంవత్సరము మాయింట దీపావళి పందుగ లేకున్నను..
    నా భూ చక్రములు
    ========*==========
    వచ్చును దివిజుల కెల్లను
    వచ్చును దీపావళి యను పండుగ,నవమిన్
    వచ్చును భువిజుల కెల్లను
    వచ్చును రామ నవమి యను పండుగ గదరా!
    ========*==========
    వచ్చున మావాస్య కెపుడు
    వచ్చును దీపావళి యను పండుగ,నవమిన్
    వచ్చును భద్ర గిరులకును
    వచ్చును కొంగ్రోత్త శొభ ప్రతి వత్స రమున్
    ==========*============
    వచ్చును ఖలులకు దప్పక
    వచ్చు నరకుని వలె జావు వచ్చును మహిలో
    వచ్చును మహిళలకు సుఖము
    వచ్చును దీపావళి యను పండుగ,నవ మిన్
    ==========*==============
    వచ్చును వేడుక జనులకు
    దెచ్చును మరచిన ముదమును దీపపు కాంతిన్
    వచ్చును మదమును గాల్చిన
    వచ్చును దీపావళి యను పండుగ,నవ మిన్
    ===========*============
    (కుక్కలు = అవినీతి పరులు)
    వచ్చును కుక్కల కొక దిన
    మొచ్చును దీపమును బట్ట వొచ్చును భువిపై
    దెచ్చుచు సంతోష సిరిని,
    వచ్చును దీపావళి యను పండుగ,నవ మిన్
    (నవ మిన్= కొత్తగా)

    రిప్లయితొలగించండి
  17. పిచ్చయ్య యే నవంబరు
    నచ్చముగా తెలుగులోన నవమని తలచెన్
    రెచ్చుచు చెప్పెను వినుడని
    వచ్చును దీపావళి యను పండుగ నవమిన్!

    రిప్లయితొలగించండి
  18. శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి, సాహితీ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు...


    వచ్చెడి రాముని పెళ్లికి
    పచ్చని పందిరిలువేసి పండుగ జరుగున్
    విచ్చిన చిచ్చుల కాంతుల
    వచ్చును దీపావళి యను పండుగ నవమిన్


    చిచ్చుల బుడ్డులు జువ్వలు
    ముచ్చట తీరగ ముదముగ ముందే గాల్చన్
    హెచ్చగు వెలుగుల నిచ్చుచు
    వచ్చును దీపావళి యను పండుగ నవమిన్

    రిప్లయితొలగించండి
  19. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు.
    2పదములు ప ప్రాసతోను 2 పాదములు వ ప్రాసతోను వ్రాసేరు కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ వరప్రసాద్ గారూ!
    శుభాశీస్సులు. మీ పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు.
    ఒచ్చును అని పదమును వాడుట సాధువు కాదు. చూడండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. పండిత నేమానిగారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి
    కవిమిత్రులందరికి మంగళమయ దీపావళి
    పుచ్చగ నరకుని యమపురి
    వచ్చును దీపావళి యను పండుగ.నవమిన్
    లచ్చిమగడు రాముడుగా
    వచ్చిదనుజు సంహరించి వసుధను గాచెన్

    రిప్లయితొలగించండి
  22. పండిత, సాహితీ మితృలందరికి,
    దీపావళి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  23. గురువర్యులకు,బ్లాగు కవిమిత్రులకు వీక్షకులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  24. తుచ్ఛ నరకుఁ హరి గూల్చగ
    వచ్చును దీపావళియను పండుగ, నవమిన్
    వచ్చును చైత్రము నందున్
    ముచ్చట గా రామనవమి ముదమును గూర్చన్

    రిప్లయితొలగించండి
  25. ముచ్చటగా నమవసకే
    వచ్చును దీపావళి యను పండుగ, నవమిన్
    వచ్చును జన్మదినోత్సవ
    మచ్చముగా కౌసలేయు నందరు గొలువన్.

    రిప్లయితొలగించండి
  26. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
    సవరణలతో మరొక్కమారు
    ============*============
    5.వచ్చును సిరి శునకములకు
    దెచ్చును మదము విరివిగను, దీనజనులకున్
    వచ్చిన కోపము దప్పక
    వచ్చును దీపావళి యను పండుగ, నవమిన్
    ============*============
    6. కుచ్చులు బెట్టెడి వారికి
    వచ్చును దీపావళి యను పండుగ, నవమిన్
    ముచ్చట దీరగ,గనబడు
    మచ్చలు హెచ్చుగ లలమున మచ్చెరము వలెన్!
    ( లలమున=శరీరమున)
    ============*============
    7. పుచ్చిన విలువలు హెచ్చుగ
    వచ్చును దీపావళి యను పండుగ, నవమిన్
    పచ్చిక దినవలె దప్పక
    కచ్చిక కోరక నరవర! కలియుగమందున్!

    రిప్లయితొలగించండి
  27. శ్రీ నేమాని పండిత గురువర్యులకు నమస్సులు.

    పప్పులో కాలేశానండీ. ఆత్రగాడికి బుద్ధి మట్టు అనే సామెతకు నిలువుటద్దములాగా మారినాను. అత్యవసరంగా వ్రాస్తూ చేసిన తప్పిదము.

    సవరణ ఈ క్రింది విధంగా చేయుచున్నాను.

    దీపజ్యోతుల ప్రాభవంబు మననుద్దీపింపగాజేసి, సం
    తాపంబుల్ పరిమార్చి సౌఖ్యముల సంధానించి,దుష్కర్మలౌ
    కోపేద్రేకవితండవాదముల భంగుల్ నిత్యకర్మంబులై
    లోపంబెంచెడు తామసంబునకు వెల్గుల్ నేటి దీపావళౌ.

    తప్పొప్పులను సమీక్షించవలసినదిగా వేడుకొంటున్నాను.

    రిప్లయితొలగించండి
  28. మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  29. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారికి శుభాశీస్సులు.
    మీ సవరించిన పద్యము బాగుగ నున్నది. చివరలో దీపావళౌ అనుట సాధువు కాదు. దీపావళియౌ అని యడాగమము చేయవలసి యుండును. "వెల్గుల్ గూర్చు దీపావళుల్" అని పద్యము చివరిలో సవరించితే బాగుండును.

    రిప్లయితొలగించండి
  30. ఇచ్చకమై పిల్లలకును
    వచ్చును దీపావళి యను పండుగ; నవమిన్
    వచ్చెడు రాముని పండుగ
    తెచ్చును వేసవి శలవుల దివ్యమ్మదియే.

    రిప్లయితొలగించండి