19, నవంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం - 1239 (విప్రవరుఁడు మాంసమ్ముతో)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
విప్రవరుఁడు మాంసమ్ముతో విందొసంగె.
ఈ సమస్యను పంపిన కొదుమగొండ్ల వినోద్ గారికి ధన్యవాదాలు.

35 కామెంట్‌లు:

  1. శ్రర్ద్ధ గా జేయు కార్యము శ్రార్ద్ధ మనుచు
    పలల మును వండి వడ్డించు పండి తునకు
    తొల్లి యాచార మదియట వెల్లి దముగ
    విప్ర వరుఁ డు మాంసమ్ముతో విందొ సంగె

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఈ రోజుల్లో ఇది అతి సహజం !
    ఏం జేస్తాడు పాపం !!!
    ఊరిలో పెద్ద మోతుబరి !
    కూతురు సుప్రజ వివాహం !
    ఊరందరికీ భోజనాలు పెట్టవలసిన అవసరం !
    సరే , ఎవరికి నచ్చిన భోజనము వారికి పెడదామనుకొని
    పొట్టేళ్ళనూ , మేకపోతులనూ తెప్పించి
    వంటలు వారికీ వీరికీ విడి విడిగా వండించి
    సర్వజనరంజకముగ యిచ్చిన విందు :

    01)
    _________________________________

    విప్రులకు వేరు వంటల - విడి విడి గను
    మరియు విప్రేతరు లదెల్ల - మురియు రీతి
    విప్రవరుఁడు మాంసమ్ముతో - విందొసంగె
    సుప్రజ వివాహ వేడుకన్ - శుభము గలుగ !
    _________________________________

    రిప్లయితొలగించండి
  3. కోడి కూర్మను జేసిను కూర్మి కొఱకు
    రొయ్యలే దెచ్చి చారిడె రోస మేల
    ఎఱ్ఱగా వేగె నిచ్చట నెండు జేప
    రండు ముదమార భుజియింప రండు రండు
    విప్ర వరుడు మాంసమ్ముతో విందొ సంగె

    రిప్లయితొలగించండి
  4. ఓ వివాహ కార్యమునకు వెల్లి వచ్చిన వారు దాని గూర్చి మిగతా వారితో యిలా...

    వేద మంత్రాల సాక్షిగా పెద్ద పెళ్ళి
    చిత్తమలరించు రీతిగ జేసి వెడల
    విప్రవరుఁడు, మాంసమ్ముతో విందొ సంగె
    బంధు మిత్రులు దీవెన లంద జేయ

    రిప్లయితొలగించండి
  5. ఇతర దేశీయు లెందరో యేగుదేర
    నొక సమావేశమునకందు నొప్పు మీర
    నతిథులకు ప్రియమొనరించు నట్టి రీతి
    విప్రవరుడు మాంసమ్ముతో విందొనర్చె

    రిప్లయితొలగించండి
  6. తన కుమారుని పెండ్లికి తరలివచ్చి
    నట్టి బంధుమిత్రులకు నత్యంత ముద భ
    రితుఁ డగుచు సి నారాయణ రెడ్డి యను క
    వి ప్రవరుఁడు మాంసమ్ముతో విందొసంగె.

    రిప్లయితొలగించండి
  7. రాజేశ్వరి అక్కయ్యా,
    పూర్వం బ్రాహ్మణులు మాంసభక్షణ చేసేవారని, ఆ తరువాత వారిని అది నిషిద్ధమైనదని చదివాను. ఆ విషయాన్నే మీ మొదటి పూరణలో తెలిపారు. బాగుంది.
    ‘వెల్లిదము’ శబ్దం నిఘంటువులలో వెదికితే దొరకలేదు. ‘ఎల్లిదము’ ఉంది.
    ఇక మీ రెండవ పూరణ బ్రాహ్మణుడు నిర్వహించే చైనీస్ రెస్టారెంట్ గురించి అనుకుంటాను. బాగుంది.
    అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీరు చెప్పింది నాకు అనుభవమే. మా బంధువుల ఊరికి వెళ్ళినప్పుడు మా బావ (వరుసకు) ఒక పెళ్ళికి తీసుకువెళ్ళాడు. అది బ్రాహ్మణుల ఇంట్లో పెళ్ళి. కాని అక్కడ కూర్చుంటే మాంసం వండుతున్నవాసన వచ్చింది. ఏమిటని అడిగితే అటుపక్క కాస్త ఎడంగా ఊళ్ళో వాళ్ళకోసం భోజనాలు. ఇక్కడ సాత్త్విక భోజనమే అన్నాడు.
    మీ పూరణ చదివాక ఆ విషయం గుర్తుకు వచ్చింది.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మాంసం లేనిదే ముద్ద దిగని విదేశీయులు మరి! ఏం చేస్తాడు పాపం!
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. క వి ప్రవరుడు భలే విరుపు గురువు గారు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  9. పెండ్లి వేడుకల్ ముగిసిన పిదప పెండ్లి
    పెద్ద ముచ్చటించుచు బల్కె వివరములను
    వేరుగా తన మిత్రుల ప్రీతి కొరకు
    విప్ర! వరుడు మాంసమ్ముతో విందొసంగె

    రిప్లయితొలగించండి
  10. విప్రవరుని మాంసమ్ముతో కలుపకుండా విడదీసిన సహదేవుడు గారి పూరణ ,,విప్రవరుని కవి ప్రవరునిగా, విప్ర ! వరునిగా మార్చిన గురువర్యుల పూరణలు బాగున్నవి.


    మంచి మాటను వినడయ్య మంగరాజు
    పెండ్లి పేరంటములలోన ప్రియముగాను
    వలదు మాంసమ్ము పెట్టకు వలదనిన
    విప్రవరుఁడు - మాంసమ్ముతో విందొ సంగె

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని వారూ,
    విప్ర శబ్దాన్ని సంబోధనగా చేసి వరునితో విందు ఇప్పించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    బ్రాహ్మణుడు మాంసం పెట్టవద్దన్నా వినని మంగరాజు చేత విందు ఇప్పించారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. మాం, సం అనే శబ్దములు ఆద్యంతములుగా పద్యముల నల్లిన ఒక కవి గూర్చి:

    మాం అనుచు (మామ్మనుచు) మొదలిడి చాల మథురముగను
    సం అనుచు (నమ్మనుచు) ముగియించుచు సరసముగను
    భావరమ్యమ్ముగా జెప్పి పద్యముల క
    విప్రవరుడు మాంసమ్ముతో విందొసంగె

    రిప్లయితొలగించండి
  13. సంధ్య వార్చును మానక శ్ర ధ్ధ తోడ
    విప్ర వరుడు ,మాంసమ్ము తో విందొ సంగె
    పెండ్లి రోజున సోముడు ప్రియము గలుగ
    మేలు మేలనుచు దినిరి పాళె గాండ్రు

    రిప్లయితొలగించండి
  14. పగలు రాత్రియు గొలిచెడు భక్తవరుని
    త్రచ్చు జేయగ వచ్చెను చిచ్చు కంటి
    చేవతోడ సుతునడగించి సిరియాళ
    విప్రవరుడు మాంసమ్ముతో విందొసంగె.

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని వారూ,
    ఆద్యంతాలలో మాం,సం పెట్టి పద్యరచన చేసిన కవి ప్రవరుని గురించిన పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    "మాం పాలయేతి వినమ్రమస్తకః నమామి రఘురామం మధురదరహాసమ్" (మన్నించాలి. నాకంతగా సంస్కృత పరిజ్ఞానం లేదు)
    *
    సుబ్బారావు గారూ,
    విరుపుతో మంచి పూరణ చెప్పినారు. అభినందనలు.
    *
    రవి గారూ,
    సిరియాళుని కథాప్రస్తావనతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమానిగారికి గురుదేవులు శంకరయ్యగారికి వందనముల

    యజ్ఞయాగాదిక్రతువుల యందు జంతు
    బలి యొనర్చివేల్పులకు నర్పణము జేసి
    యజ్వ తత్ప్రసాదముగ భక్ష్యములు వండి
    విప్రవరుడు మాంసమ్ముతో విందొసంగె

    రిప్లయితొలగించండి
  17. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
    ఒక శాస్త్రి గారు మతము మార్చుకొని,మాజీ ముఖ్య మంత్రి యల్లుడైన వానిపై
    ========*================
    ఆలి కొరకు నాలిని వీడి,మేలి మరచి
    జిలుక వలె బల్కు నాంగ్లము స్థిరము గాను,
    మతము మార్చి ఖలుల తోడ మన్ను దినుచు,
    విప్రవరుఁడు మాంసమ్ముతో విందొసంగె

    రిప్లయితొలగించండి
  18. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    ఆ ‘విప్రవరుని’ గురించి అందరికీ తెలుసు. మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘మేలు మరచి’ అనాలనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  19. ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి పదివి యిచ్చుటకు సోనియా గాంధి కోట్ల, కన్నా మొదలగు వారిని యడిగి యుండెను, పదవి పొందిన తరువాత అల్లుని కొరకు తప్పులు జేయించగ
    ===========*=============
    పొంద ముఖ్య మంత్రి పదవి,ముదము నొంది
    విప్రవరుఁడు మాంసమ్ముతో విందొసంగె1
    మెచ్చి నధి నేత యిచ్చెను మేడి పండు
    పొట్ట విప్పి జూడ పురుగు పొరలు చుండె!

    రిప్లయితొలగించండి
  20. వరప్రసాద్ గారూ,
    మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    ‘మెచ్చి యధినేత’ అనండి.

    రిప్లయితొలగించండి
  21. సంకల్ప మాత్రాన సర్వ సృష్టికి చెతనమొసగె,
    సమర్ధ జీవులకు సౌకర్యమనుభవించు బుద్ధినొసగే,
    మనిషి కన్నా మేలైన అడవి జంతువులకు
    ఆది విప్రవరుఁడు మాంసమ్ముతొ విందొసంగె.

    మీ శైలికి నేను రాలేను కాబట్టి నా శైలి నేను అనుసరిస్తాను మీకు అభ్యంతరం ఐన తెలుపగలరు

    రిప్లయితొలగించండి
  22. నేమాని పండితులు, గురువుగారు మెరిపించిన విరుపులు బలే ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  23. నా పూరణకనువైన పద్యము:
    (మాం తో ప్రారంభించి సమ్ము తో పూర్తి చేసితిని).

    మామవ మహేశ! గిరిజేశ! మద్ధృదీశ!
    యనుచు ప్రార్థింప నభవుని, నభయ మిచ్చి
    కాచె భవుడు మార్కండేయు గరుణ మెరయ
    నంత పితరులలో వెల్గె సంతసమ్ము

    రిప్లయితొలగించండి
  24. అయ్యా! ఆదిత్య గారూ!
    మీరు శంకరాభరణములో ఆసక్తి చూపుట ముదావహమే. కాని మా బాణీ మాత్రమే ఇక్కడ బాగుంటుంది. పద్యములతోనే సమస్యలను పూరించ వలెను కదా. గణ యతి ప్రాస మొదలైన నియమములు లేని రచనలతో మా బ్లాగులో ప్రయోజనము ఉండదు. ఏదో మీ సంతృప్తికి మాత్రమే పరిమితము అవుతుంది. గ్రహించగలరు. పద్య విద్యలో మొన్న మొన్ననే అడుగు బెట్టిన శ్రీమతి శైలజ గారు మంచి శైలిని తొందరలోనే నేర్చుకొన్నారు. మీరుకూడ మరికొంత ప్రయత్నము చేస్తేనే బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    మీ ప్రశంసలకు మా సంతోషము. మా దంపతులము ఈ నెల 30వ తేదీన విదేశ యానము చేస్తాము. కొన్ని నెలల బాటు in UK & USA ఉంటాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  26. గురుదేవులకు ధన్యవాదములు.
    అది ‘మేలు మరచి’నండి.sorry for typing mistakes.

    sri aaditya gaaru call me 9480013983 if you are from Bangalore.

    రిప్లయితొలగించండి
  27. పండిత నేమానిగారికి గురుదేవులు శంకరయ్యగారికి వందనములు

    ఒకరు నoబూదిరియవ వేరొకరు కాష్మి

    ర౦పు విప్రులు దేశ సారథులు రాష్ట్ర

    ప్రగతి నాశించి సమితిలోపాల్గొనగ న

    విప్రవరుడు మాంసమ్ముతో విందొసంగె

    రిప్లయితొలగించండి
  28. గురువులకు నమస్కారములు
    దారి తప్పిన ప్ర్వరాఖ్యుడు త్రోవ చెప్పమంటే
    నీవెఱుగవే మును వచ్చిన ద్రోవ జొప్పు
    నీకింత భయంబు లేకడుగ ....వెల్లిద మైతిమి .....మాట లేటికిన్
    అని అంటుంది కదా వరూధిని అందుకని వెల్లిదము రైటే అవుతుందని వ్రాసాను పొర బడితే మన్నించ గలరు

    రిప్లయితొలగించండి
  29. పండిత నేమాని వారూ,
    ఆద్యంతాలలో మాంసమ్మును పెట్టి మీరు వ్రాసిన పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    అక్కడ చలిబాగా ఉందట.. మా బంధువులు చెప్పారు. ఈసమయంలో వెళ్తున్నారు. ఆరోగ్యం జాగ్రత్త. మీ ప్రయాణం సుఖవంతంగ జరగాలని ఆరామంచంద్రుని ప్రార్థిస్తున్నాను.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    అవిప్రవరుని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఆద్యంతాలలో మాంసమ్మును పెట్టి మీరు వ్రాసిన పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    అక్కడ చలిబాగా ఉందట.. మా బంధువులు చెప్పారు. ఈసమయంలో వెళ్తున్నారు. ఆరోగ్యం జాగ్రత్త. మీ ప్రయాణం సుఖవంతంగ జరగాలని ఆరామంచంద్రుని ప్రార్థిస్తున్నాను.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ఆ పదం ‘ఎల్లిదమైతిమి’ మీరన్నట్టు వెల్లిదము కాదు. ఆ పద్యం ఇది......

    "ఇంతలు కన్నులుండఁ దెరువెవ్వరి వేఁడెదు భూసురేంద్ర ! యే
    కాంతమునందు నున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా
    గింతియ కాక, నీ వెఱుఁగవే మునువచ్చిన త్రోవచొప్పు ? నీ
    కింత భయంబు లే కడుగ నెల్లిదమైతిమి మాటలేటికిన్

    ఇక్కడ ‘అడుగన్ + ఎల్లిదమైతిమి" అని...

    రిప్లయితొలగించండి
  30. క్షమించాలి
    అవును నేను వ్రాసేంతలొ మీరు వ్రాసారు

    వెల్లిదము కాదు
    నెల్లిద మైతిమి అని ఉంది పద్యంలొ

    రిప్లయితొలగించండి