21, నవంబర్ 2013, గురువారం

సమస్యాపూరణం - 1241 (చెంప మీదఁ గొట్ట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
చెంప మీదఁ గొట్ట సిరులు గురియు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

32 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించ నున్నవి !

    చేరువైన చిన్న పిల్లల చెంపమీద చిన్నగా కొడితే
    బోసినవ్వుల సిరులు కురుస్తాయి గదా !

    01)
    ______________________________

    చెలిమి జేసి నంత - చేరువౌదురు గాదె
    చిలుకు చుందు రెపుడు - చిన్నినవ్వు !
    చెంత జేరి మురియు - చిన్నారి పాపల
    చెంప మీదఁ గొట్ట - సిరులు గురియు !
    ______________________________

    రిప్లయితొలగించండి
  2. దొరికిన మట్టుకు దోచుకొని పోతారు దొంగలు !
    ఒకవేళ పొరపాటున దొరికితే
    దొరికిన వారి చెంప పగల గొడితే సిరుల వర్షమే గదా :

    02)
    ______________________________

    అర్థ రాత్రి యర్థ - మంకించుకొని వేగ
    పారి పోవు నెపుడు - వారు జూడ !
    దొంగతనము జేయు - దొంగలు దొరికిన
    చెంప మీదఁ గొట్ట - సిరులు గురియు !
    ______________________________

    రిప్లయితొలగించండి
  3. దొంగ నాయకులను చెప్పుదీసి కొడితే సిరులుగాక మరేం కురుస్తాయి ?

    03)
    ______________________________

    ప్రజల సొమ్ము దోచు - కుజన నాయకులను
    ప్రజల మధ్య నిలిపి - పట్టి , కట్టి
    ప్రజలు చెప్పు దీసి - పలుమార్లు తిట్టుచు
    చెంప మీదఁ గొట్ట - సిరులు గురియు !
    ______________________________
    ప్రజల మధ్య నిలిపి = రచ్చబండ/గ్రామపంచాయితీ/ప్రజాన్యాయస్థానము/బహిరంగవిచారణ

    రిప్లయితొలగించండి

  4. చెంప మీదఁ గొట్ట సిరులు గురియు
    అయ్యవారు చెప్పే రని , వాయించితి
    సిరి చెంప, జివ్వుమన వాయగొట్టే
    నా మరు చెంప 'తిరుగు చపల సిరి' !!

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. మంత్రములను వేసి మాయలు జూపెడు
    నొకని యొద్ద నున్న దొక్క మూర్తి
    దాని యెదుట నిలిచి దండమ్ము వెట్టుచు
    జెంప మీద గొట్ట సిరులు గురియు

    రిప్లయితొలగించండి
  6. చిన్నదాని సిగ్గు సిరులేగ చెలునికి
    తరుణి ప్రేమ పంచు తరుణమందు
    చెంత నగుచు జేరి చిటికెన వ్రేలితో
    చెంపమీద గొట్ట సిరులు గురియు

    రిప్లయితొలగించండి
  7. చిన్నదాని సిగ్గు సిరులేగ చెలునికి
    తరుణి ప్రేమ పంచు తరుణమందు
    చుబుక మందుకొనుచు చూపుడు వ్రేలితో
    చెంపమీద గొట్ట సిరులు గురియు

    రిప్లయితొలగించండి
  8. శ్రీమతి జిలేబి గారి భావానికి నా పద్య రూపం...

    చెంపమీద గొట్ట సిరులు గురియునని
    చెప్పెనయ్యవారు, సిరినిజేరి
    చెంప బగులగొడితి, చెప్పునదేముంది
    గూబనాది పగిలె గ్రుడ్ల నీరె.

    రిప్లయితొలగించండి
  9. చెంప అనే చెలికత్తెతో చెపుతున్నట్లుగా ఒక ఊహ........

    మర్మగర్భమగుచు మహిమ జూపెడునొక్క
    దివ్య ఘటమునికటి దేవమౌని
    వరము లిచ్చు రీతి నరవరుకొసగెనే
    చెంప! మీద కొట్ట సిరులు కురియు.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    ఈ మధ్య సినిమాలలో ముఖ్యముగా అత్తారింటికి దారేది సినిమాలో చెంప దెబ్బలు జూచి మిగిలిన సినిమాలలో చెంప దెబ్బలు చిన్న వారితో పెద్ద వారిని కోట్టిస్తూన్నారు.
    ఆ చిత్ర మాటల రచయిత మరొక నిర్మాత తో
    ==========*==========
    చెంపమీదగొట్ట సిరులు గురియు స్వామి
    పవనుడి సినిమాకు పట్టు బట్టి
    చిన్న వారి తోడ మిన్నగా పెద్దల్ని
    చెంప పగుల గొట్ట సిరులు గురిసె!

    రిప్లయితొలగించండి
  11. వ్రాసితి బలుకులను పవనుడి సినిమాకు,
    చిన్న వారు గొట్ట చెంప మీద,
    పెద్ద లెల్ల జేరె బిడ్డల తోడను,
    చెంపమీద గొట్ట సిరులు గురియు!

    ( పెద్దలు = ప్రేక్షకులు )

    రిప్లయితొలగించండి
  12. గురుదేవులకు,కవి మిత్రులకు ధన్యవాదములతో..

    సమస్యలు "బుద్ధి నీకు లేదు పుణ్యమూర్తి!" మరియు "చెంపమీద గొట్ట సిరులు గురియు!" లిచ్చు నపుడు భయముతో ఇచ్చితిని కానీ గురుదేవులు, కవి మిత్రులు సహృదయులై పూరణలు జేసినారు. అందరికి పేరు పేరునా ధన్యవాదములు దెలుపు చుంటిని.

    రిప్లయితొలగించండి
  13. పొదుపు ధనము దాచు బొమ్మను గొనె బాబు
    బొమ్మ గొప్ప తనము నమ్మ జూపె
    శిరపు కలుగు నందు చిల్లర వేయుచూ
    చెంప మీద గొట్ట సిరులు గురియు!

    రిప్లయితొలగించండి
  14. చిలిపి వలపు తెలుప చిన్నారి చెలియకు
    చెంత జేరి సఖుడు చెలిమి తోడ
    సిగ్గు పడుచు నవ్వు చిన్నదానినిజూచి
    చెంప మీద గొట్ట - సిరులు గురియు

    రిప్లయితొలగించండి
  15. చిల్లర యలవాట్ల చిలిపివాడొకనాడు
    దొంగిలించి డబ్బు దొరికి పోయె.
    పట్టుబడ్డ చిన్న వానిని నిలదీసి
    చెంప మీదఁ గొట్ట సిరులు గురియు !

    రిప్లయితొలగించండి
  16. బూది మెత్తి యున్న బుద్దిహీనుడొకడు
    మాయ జేయు చుండె మాట లమ్మి
    చెంప మీద గొట్ట - సిరులుగురియునన్న
    చేర బిలిచి జనులు జెంప చూపె

    రిప్లయితొలగించండి
  17. చోర వృత్తి జేయు చోరుని బంధించి
    యడుగ నిగ్రహించు నిడడు తిరిగి
    పట్టి జైలు నందు బెట్టి పోలీసులు
    చెంప మీదఁ గొట్ట సిరులు గురియు.

    రిప్లయితొలగించండి
  18. చోర వృత్తి జేయు చోరుని బంధించి
    యడుగ నిగ్రహించు నిడడు తిరిగి
    పట్టి జైలు నందు బెట్టి పోలీసులు
    చెంప మీదఁ గొట్ట సిరులు గురియు.

    రిప్లయితొలగించండి
  19. పళ్ళు రాలిపోవు పటపట యనుచును
    చెంప మీద గొట్ట , సిరులు గురియు
    శ్ర ధ్ధ భక్తి గలిగి శంభుని బూజించ
    మారు మాట లేదు మాధవుండ !

    రిప్లయితొలగించండి
  20. అయ్య వారి కెల్ల నత్తరు జల్లుచు
    పేద వారి నెల్ల బాధ బెట్టి
    చల్ల జేయు చున్న నల్ల కుభేరుని
    చెంపమీద గొట్ట సిరులు గురియు!

    (అయ్యలు = మంత్రులు, అత్తరు = లంచములు, చల్ల జేయు = వ్యాపారము జేయు )

    రిప్లయితొలగించండి
  21. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శంకరయ్య గారికివందనములు

    చెంప దెబ్బ కొట్ట సిరులు గురియు ననుచు
    కొత్త పెళ్లి కూతు కొట్ట చెరను
    బెట్టి కట్నహింస పేరున లాఠీలు
    మేల మాడె వరుని మేని పైన

    రిప్లయితొలగించండి
  22. వసంత కిశోర్ గారూ,
    నోసినవ్వుల సిరులు కురిపించిన మీ మొదటి పూరణ, దొంగసొమ్ము రాబట్టిన రెండవ పూరణ, రచ్చబండ పరిష్కారం చూపిన మూడవ పూరణ బాగున్నవి. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    మంచి భావాన్ని అందించారు. మీ భావాన్ని గోలివారు ఛందోబద్ధం చేశారు, వారికి ధన్యవాదాలు తెలియజేయండి.
    *
    పండిత నేమాని వారూ,
    మీ మంత్ర్రగాని పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    అలాంటి దొంగస్వాములను గురించి అప్పుడప్పుడు పత్రికలలో చదువుతూనే ఉన్నాము. మంచి పూరణ. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    శృంగారపు సిరులు కురిపించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    జిలేజీ గారి భావానికి చక్కని పద్యరూపాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    దివ్యఘటం గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘నికటి’...?
    *
    వరప్రసాద్ గారూ,
    భావం ఒకటే అయినా కలెక్షన్లు పెంచుకొనడానికి సినిమావాళ్ళ టెక్నిక్కును చక్కగా వివరించారు మీ రెండు పూరణలలో. బాగున్నవి.
    మీ మూడవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    అటువంటి టెక్నిక్కులు గల బొమ్మలు మార్కెట్టులో బాగానే దొరుకుతున్నాయి. మంచి పూరణ. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    వలపు సిరులు కురిపించిన మీ పూరణ, మాయగాని గురించిన రెండవ పూరణ రసవత్తరంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ చిలిపి దొంగ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    దొంగ సొమ్ము రాబట్టిన పోలీసుల గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    అందరిలో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    కట్నం కోసం భార్యలను హింసించే వారి గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు
    ========*===============
    4.రాజ కీయ మనుచు రాక్షసులెల్లరు
    పుడని జేరి వారు బొజ్జ బెంచె
    చీడపురుగు లయ్యె సిగ్గు విడచి, వార్ని
    చెంప మీదగొట్ట సిరులు గురియు!

    ఐ ఎ యస్ అధికారుల పై (శ్రీ లక్ష్మి )
    =============*===========
    5.మాటలెల్ల నేర్చె మాయలోడి జతలో
    లక్షకోట్లు దిన్న లచ్చి మగని
    చెంప మీదగొట్ట సిరులు గురియు జూడు
    సంశయమ్ము వలదు స్వామి నీకు!

    రిప్లయితొలగించండి
  24. తల్లి కోపగించ, తండ్రి దండించగ,
    గురువు చెంప మీద గొట్ట సిరులు
    గురియు భావి నీకు, కోపమున్నదె వార్కి
    నిన్ను బాగు జేయు నిరతి గాక.

    రిప్లయితొలగించండి
  25. వరప్రసాద్ గారూ,
    మీ తాజా పూరణలూ రెండూ బాగున్నవి. అభినందనలు.
    మీరొక దోషాన్ని మాటిమాటికి చేస్తున్నారు. కర్త బహువచనంలో ఉంటే క్రియ ఏకవచనంలో వ్రాస్తున్నాను. ఒకటి రెండుసార్లు నేమాని వారు కూడా హెచ్చరించారు కూడా!
    నాల్గవ పూరణలో ‘వారు బొజ్జ పెంచిరి’ అనాలి కదా. ఆ పాదాన్ని ఇలా మార్చేద్దాం... ‘పెరిగి బొజ్జలెల్ల పెంచినారు’. ఆ పద్యంలోనే ‘వార్ని’ అన్నారు. అక్కడ ‘చీడపురుగులైరి సిగ్గువిడుచు వారి’ అనండి.
    ఐదవ పూరణలో ‘మాయలోడి’ని ‘మాయగాడు’ అనండి.
    *
    మిస్సన్న గారూ,
    తల్లిదండ్రుల, గురువుల దండనీతిని గురించి చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. మిస్సన్న గారి స్ఫూర్తితో...

    త్రాగుబోతు లగుచు ధనమునంతను జూద
    గృహము పాలుసేయు కితవులైన
    పతుల హితము గోరు సతులు వారిని బట్టి
    చెంపమీదఁ గొట్ట సిరులు గురియు.

    రిప్లయితొలగించండి
  27. శంకరార్యా ! ధన్యవాదములు !

    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    కితవులైన పతుల హితము గోరు సతులు
    ఏం చెయ్యాలో మీ పూరణలో చక్కగా చెప్పారు !
    అభినందనలు !

    రిప్లయితొలగించండి
  28. అందలంబునెక్కి లంచమడుగువాడు
    దొంగ కన్న హీను డౌను గాదె
    పాపి బుద్ధి చేత పరులదోచు నతని
    చెంపమీదఁ గొట్ట సిరులు గురియు.

    రిప్లయితొలగించండి
  29. అందలంబునెక్కి లంచమడుగువాడు
    దొంగ కన్న హీను డౌను గాదె
    పాప బుద్ధి చేత పరులదోచు నతని
    చెంపమీదఁ గొట్ట సిరులు గురియు.

    రిప్లయితొలగించండి


  30. పియెస్సార్ మూర్తి గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు సంతోషంగా స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటి రెండు పాదాల్లో యతిదోషం ఉంది.
    నా సవరణ...
    మంచిపదవి పొంది లంచ మడుగువాఁడు
    దొంగకన్న పిలు గనంగ దగును...
    (పిలుగు = హీనుఁడు)
    *
    మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి