23, నవంబర్ 2013, శనివారం

సమస్యాపూరణం - 1243 (పూలవానకు శిరమున)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
పూలవానకు శిరమునఁ బుండ్లు రేఁగె.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    మూన్నాళ్ళ ముచ్చటైన మంత్రిపదవికోసం
    విదేశీవనిత మోచేతి నీళ్ళు తాగుతున్న
    మన మేటి నటనాధురీణునకు
    కాకినాడ దగ్గర తిమ్మపురంలో జరిగిందదేగా
    పూలు జల్లవలసిన ప్రజలు రాళ్ళుచ్చుక్కొట్టారు :

    01)
    _________________________________

    ముష్టిమంత్రను మాటకై - కష్ట పడుచు
    నష్టమంచని యెంచక - నిష్ట పడుతు
    పుట్టిముంచగ రాష్ట్రము - పట్టు బట్టి
    మెట్టు దిగినట్టి నటనలో - దిట్టయైన
    వఠ్ఠిమాటలు పలికెడి - పంద పైన
    పూల రేకుల కలిపిన - రాలు విసర
    పూలవానకు శిరమునఁ - బుండ్లు రేఁగె !
    _________________________________
    పంద = నపుంసకుడు

    రిప్లయితొలగించండి
  2. రాష్ట్ర విభజన సరికొత్త సమస్యలకు వేదిక కానుంది. ప్రధానంగా భద్రత పరమైన అంశాలపై తీరని ప్రభావాన్ని చూపే అవకాశ ముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెర్రరిజాన్ని పెంచిపోషించినట్లవుతుందనే ఆందోళనను కేంద్ర నిఘా విభాగం వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి ఒక నివేదికను కేంద్ర నిఘావర్గాలు తెలియజేసినట్లు సమాచారం. కేంద్ర ఇంటలిజెన్స్‌ బ్యూరో అధిపతి ఇబ్రహీం విభజన వల్ల హైదరాబాద్‌తో పాటు పలు రాష్ట్రాలపై భద్రతకు ముప్పువాటిల్లే అవకాశముందనే
    విషయాన్ని ఆయన తన నివేదికలో కళ్ళకు కట్టినట్లు కేంద్ర మంత్రుల బృందంతో పాటు ప్రభుత్వానికి అందజేసిన నివేదిక లో వివరించినట్లు తెలుస్తోంది.

    విభజన వల్ల నీటి కష్టాల తో పాటు విద్యా, ఉపాధి అవకాశాల్లో సీమాంధ్రకు చెందిన విద్యార్థులు, యువకులు తీ వ్రంగా నష్టపోవడంతో పాటు నీటియుద్ధాలు సంభవించే అవకాశ ముందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ హైకమాండ్‌ వద్ద గట్టి వాదనను వినిపిస్తున్నారు. ఆది నుంచి ఇదే వాదనకు కట్టుబడి వున్న సీఎం విభజన వల్ల నక్సలిజం, టెర్రరిజం పంజా విసిరే అవకాశముందనే అభిప్రాయాలను కూడా అధిష్టానానికి వివరించారు. ఇప్పుడు ఇదే విషయా న్ని కేంద్ర నిఘావర్గాలు వెల్లడించాయి. సీఎం కాంగ్రెస్‌ పెద్దల ముందుంచిన సవాళ్లనే నేడు నిఘావర్గాలు తెలియజేశాయి. పైగా నిఘావర్గాలు అందజేసిన నివేదిక సీఎం వాదన కు కొనసాగింపునకు అనుగుణంగా వుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. రాష్రం విభజన జరిగితే భవిష్యత్‌తో ఎలాంటి నష్టాలు సంభవిస్తాయనే దానిపై స్పష్టమైన వైఖరిని ఈ నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా తీవ్రవాద సంస్థలు పట్టుసాధించే అవకాశముంది. హైదరాబాద్‌ను తమ గుప్పిట్లో పెట్టుకునే అవకాశం కూడా లేకపోలేదనే అభిప్రాయాలను నిఘాసంస్థలు తెలియజేస్తున్నాయి.

    ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన విధ్వంసం జరిగిన దాని మూలాలు హైదారాబాద్‌లోనే బయటపడుతున్న సంఘటనలు తెలిసిందే. రాష్ట్రం విభజన జరిగితే ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారడమే కాదు దీని ప్రభావం ఇతర రాష్ట్రాలపై పడుతుందనే అభిప్రాయాలను నిఘాసంస్థలు తమ నివేదికలో వెల్లడించినట్లు సమాచారం. అంతేకాదు తీవ్రవాద సంస్థలకు హైదరాబాద్‌ నగరం అడ్డాగా మారే ప్రమాదం కూడా వుందనే ఆందోళనలను నిఘావర్గాలు వ్యక్తం చేశాయి. విభజన జరిగితే తీవ్రవాద సమస్య ఒక్క హైదరాబాద్‌ నగరానికే పరిమితం కాదని దీనివల్ల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సరికొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందనే హెచ్చరికలు జారీ చేశాయి. దీనివల్ల దేశంలో భద్రత పరమైన అంశాలు పోలీస్‌ వ్యవస్థతో పాటు నిఘావర్గాలకు పెనుసవాళ్లుగా మారే అవకాశముందనే అనుమానాలను సైతం వ్యక్తం చేస్తున్నాయి.

    రాష్ట్ర విభజన వల్ల జరిగే పరిణామాలు ఇతర అంశాలపై కేంద్రం కసరత్తు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. విభజనవాదంతో ఉగ్రవాదం జడలు విప్పే అంశాలను నిఘావర్గాలు స్పష్టంగా తమ నివేదికలో వెల్లడించారు. అంతేకాదు నక్సలిజం ఎలా పెరుగుతుందనే అంశాలను కూడా తమ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. దీనివల్ల రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలపై దీని ప్రభావ తీవ్రత మరింత పెరిగే అవకాశముందనే అభిప్రాయాలను సైతం నిఘావర్గాలు వ్యక్తం చేశాయి.
    విభజన వాదం భవిష్యత్‌ భద్రతపై చూపే ప్రభావం దానివల్ల సంభవించే దుష్పరిణాలను సోదాహరణంగా తన నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు భద్రతపై ఆందోళనకర పరిస్థితిని నిఘాసంస్థలు వ్యక్తం చేశాయి. కేంద్ర నిఘావర్గాల అందించిన నివేదికపై సమగ్రంగా లోతైన అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు సమాచా రం.

    గతంలో ఈ అంశాలపై సుధీర్ఘమైన వివరణలు చేసిన సీఎం వ్యాఖ్యలను కొట్టపారేసిన అధిష్టాన పెద్దలు నిఘావర్గాల నివేదికతో ఆలోచనలో పడినట్లు సమాచారం. జడలు విప్పే ఉగ్రవాదం, పంజా విసిరే నక్సలిజం పరిష్కారానికి కేంద్రం ఎలాంటి పరిష్కారాలు చూపుతుందనే అంశాలు రాష్ట్ర విభజనలో నేడు సరికొత్త ఆలోచలనకే వేదికగా కావడం విశేషం.


    దేశ సమైక్యతకు భంగం కలిగే
    విధంగా విభజనకు పూనుకున్న వెధవలందరికీ
    చెయ్యవలసిన సన్మాన మిదే :

    02)
    _________________________________

    పుట్టి పెరిగిన దేశంపు - పుట్టి ముంచ
    ముష్టి మంత్రులు ఎంపీలు - దుష్టులైన
    దేశ నాశన కరులపై - లేశమైన
    నాస లేనట్టి ప్రజలహో - దోసమనక
    బుద్ధిలేదుర? మీకంచు - బూతులాడి
    దురద పుట్టించు నట్టిదౌ - దూలగుండ
    పూలతో పాటు కలుపుచు - మేలమాడి
    నెత్తి మీదను పోయంగ - తొత్తులకును
    పూలవానకు శిరమునఁ - బుండ్లు రేఁగె !
    _________________________________
    తొత్తు = 1. బానిస, దాసి;2. లంజియ.

    రిప్లయితొలగించండి
  3. చీమలు పట్టిన పూలతో సన్మానం చేస్తే యింతే మరి :

    03)
    _________________________________

    స్త్రీల హక్కుల సాధించె - బాల యనుచు
    చాల బుట్టల నిండుగ - బూలు దెచ్చి
    గోల గోలల జేయుచున్ - బూలు జల్ల
    పూలచీమలు తలలోన - చాల కుట్ట
    పూలవానకు శిరమునఁ - బుండ్లు రేఁగె !
    _________________________________

    రిప్లయితొలగించండి
  4. ప్రకటనలు గాంచి నంతనె వికసి తముగ
    రాతి పూలను జేసిన రంగు నూనె
    బాగు బాగంచు దట్టించె బట్ట తలకు
    పూల వానకు శిరమున బుండ్లు రేగె

    రిప్లయితొలగించండి
  5. పాండవుల కీర్తి దిశలందు వ్యాప్తి జెందె
    నమరు లాదృతి కురిసిన యద్భుతమగు
    పూల వానకు, శిరమున బుండ్లు రేగె
    ఘోషయాత్రకు నేగిన కురువరులకు

    రిప్లయితొలగించండి
  6. పానకాల్రావుకే పూలు పడవు, నేడు
    పదవి విరమించు వేళలో బట్ట తలను
    పూలు జల్లుచు మిత్రులే పోగ, చూడ
    పూలవానకు శిరమునఁ బుండ్లు రేఁగె.

    రిప్లయితొలగించండి
  7. సర్వ కాలుష్యముల తోడ నుర్వి మిగుల
    నామ్ల వర్షాలు పీడించ నవతరించ
    దురద రేగగ గోకిరి శిరము పైన
    పూల వానకు శిరఁమున బుండ్లు రేఁగె

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని గారికి పూజ్య శంకరయ్య
    గురుదేవులుగారికి వందనములు
    సున్నితాల సుందరి
    పూలవానకు శిరమున బుండ్లు రేగె
    కాకరాకు తాక నా కాలు కందె
    అందచందాల "కవితను"కందివారి
    యాడపడుచును గనుడు నా యనుగు చెలిమి

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
    మూడు నాళ్ళ ముచ్చట యగు పదవులనిచ్చెద నని యధినేత్రి జెప్పగ నాయకుల బాధను
    ============*============
    ప్రక్క వారి కాష్థము లందు పరగ జనులు
    బాలు గోరి మీరుచు నుండ, పదవులనెడి
    పూల వానకు, శిరఁమున బుండ్లు రేఁగె
    ముందు వెనుక నీడలు లేని విందు నందు
    (కాష్థము=కష్టము,బాలు=భాగము)

    రిప్లయితొలగించండి
  10. శ్రీ తిమ్మాజీ రావు గారు " కాకరాకు తాక నా కాలు కందె" పాదము మరొక్క మారు జూడ గలరు.

    రిప్లయితొలగించండి
  11. పూలవా నకు శిరమున బుండ్లు రేగె
    నెంత చిత్రము ? మీ పలుకెంత గానొ
    నవ్వు దెప్పించె నోసామి ! నాకు మిగుల
    రాళ్ళ వానకు శిరములు రగులు గొనును

    రిప్లయితొలగించండి
  12. కాంతులీను దీపావళి క్షణమునందు
    బాణసంచును కాల్చ నభమ్మునందు
    వెలుగు పూలన్ని రాలుచు తలను తగుల
    పూలవానకు శిరమున బుండ్లురేగె

    రిప్లయితొలగించండి
  13. దీప కాంతుల భువిజూడ దివియె కాగ
    నిండు అమవాస రోజున నింగినుండి
    రంగు రంగుల వెలుగుల రాలు అగ్ని
    పూలవానకు శిరమున బుండ్లు రేగె

    రిప్లయితొలగించండి
  14. శ్రీ తిమ్మాజీ రావు గారి పద్యములో "కాకరాకులు" అని ఉండాలి - టైపు పొరపాటు కావచ్చు - లు అనే అక్షరమును అచ్చట జేర్చుదాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. పూలవానకు తనువంత పులకరించు
    పూల వానకు మురియును పుడమి తల్లి
    జలద రింపును కల్గించు జ్ఞాపకాల
    పూల వానకు శిరమున బుండ్లు రేగె

    రిప్లయితొలగించండి
  16. పూల వానకు శిరమున బుండ్లు రేగె
    పూల వానకు మఱియును పూల రహిత
    వాన పడినను రేగును వరుస పుండ్లు
    వాన దెబ్బకు నటులగు వారి జాక్షి !

    రిప్లయితొలగించండి
  17. వరప్రసాదు గారికి పండితనేమానిగారికి వందనములు
    టైపుచేయుటలో 'లు'అన్న అక్షరము లుఫ్త మయినది ఆ ఆ పాదము"కాకరాకులు తాక నా కాలు కందె'అని
    యుండవలెను దోషము సవరించిన నేమానిగారికి
    ధన్యవాదములు.చిరంజీవి వరప్రసాదుకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  18. "నెత్తిపై పుండ్లు నీకేల నీరజాక్ష?"

    "పూల వానకు శిరమున బుండ్లు రేగె"

    "పూలు పుండ్లను జేసెనె?" "పూలు లోహ-

    పాత్రతో పాటు కురిసిన పడవె పుండ్లు?"





















    /

    రిప్లయితొలగించండి
  19. అయ్యా! శ్రీ వసంత కిశోర్ గారూ! శుభాశీస్సులు.
    నేను కొంచెము చొరవ తీసికొని వ్రాయుచున్నాను. మీరు అన్యథా భావించరని నా భావము. మన శంకరాభరణము బ్లాగును సాహిత్యేతర విషయాలకు వేదిక చేయకుండా ఉంటే బాగుంటుంది అని నా వినయపూర్వకమైన సలహా. గ్రహించ గలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శంకరయ్య గారికివందనములు

    కాంగ్రెసు ప్రభుత్వము తెలగాణ వేరు

    పాటు ప్రక్రియలొక పూలవాన యనగ

    విభజన వలదని జనుల పిలుపు దోచు

    పూల వానకు శిరమున బుండ్లు రేగె

    రిప్లయితొలగించండి
  21. కవిమిత్రులకు నమస్కృతులు...
    నిన్న రోజంతా బ్లాగుకు అందుబాటులో లేను. మన్నించండి.
    నిన్నటి సమస్యకు మంచి మంచి పూరణలను అందించిన
    వసంత కిశోర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సహదేవుడు గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    వరప్రసాద్ గారికి,
    సుబ్బారావు గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    శైలజ గారికి,
    మిస్సన్న గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    మిత్రులారా,
    పండిత నేమాని వారి సలహాను పాటిద్దాం. మన బ్లాగును కేవలం సాహిత్యాంశాలకే పరిమితం చేద్దాం. రాజకీయాల జోలి మనకు వద్దు. వాటికోసం. ఎన్నో ఇతర బ్లాగులు ఉన్నాయి. సహృదయంతో సహకరించండి.

    రిప్లయితొలగించండి
  22. మిత్రులారా! శుభాశీస్సులు. ఈ నాటి సమస్యకు అందిన స్పందనలను గూర్చి చూద్దాము.

    ప్రథమ తాంబూలము శ్రీ వసంత కిశోర్ గారిదే. 3 పద్యముల నుండి కొంచెము ఘాటు బైటికి వచ్చుచునున్నది. బాగుగ నున్నవి పద్యములు.

    శ్రీమతి రాజేశ్వరి గారు:
    రాతిపూలు రంగు నూనెలతో ఇబ్బందులు పేర్కొనినారు. బాగుగ నున్నది పద్యము.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
    పానకాల రావు గారి ప్రస్తావన తెచ్చేరు. బాగుగ నున్నది పద్యము.

    శ్రీ తిమ్మాజీ రావు గారు:
    2 పద్యములు వ్రాసేరు. కాకరాకులు పడితే కందిపోయే కాలుగల కాంత గురించి మరియు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల గురించి. పద్యములు బాగుగ నున్నవి.

    శ్రీ వరప్రసాద్ గారు:
    పదవులే నాయకులకు పూల వానలని అభివర్ణించేరు. బాగుగనున్నది.

    శ్రీ సుబ్బా రావు గారు:
    సమస్యనే చిత్రమని వర్ణించేరు. బాగుగ నున్నది.

    శ్రీ బొడ్డు శంకరయ్య గారు:
    దీపావళి బాణసంచా పూలు శిరస్సుపై పడెనన్నారు. బాగుగ నున్నది.

    శ్రీమతి శైలజ గారు:
    2 పద్యములు. 1. దీపావళి బాణ సంచాలో అగ్ని పూలు గురించి బాగున్నది. 2 జ్ఞాపకముల పూల వాన - కాని జ్ఞాపకముల వాన పూల వాన కాదు రాళ్ళ వాన కదా. బాగుగ నున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. నేమాని వారికి ధన్యవాదములు !
    శంకరార్యా ! ధన్యవాదములు !

    మీ సలహాలు స్వాగతించదగినవే , కాని
    నిన్నటి సమస్యే దానికి అవకాశం కల్గించినది !
    నేనేమీ కావాలని రాజకీయాలకు పోలేదు !

    సమస్య పూరణలో భాగంగానే
    నేపథ్యాన్ని వివరిస్తూ
    దేశ సమైక్యతకే ముప్పు కలిగే పరిస్థితి ఉందన్న ఐబీ చీఫ్
    రిపోర్టును ఉటంకించడం జరిగినది !

    దీనిపై మిత్రులంతా స్పందిస్తారనుకొన్నాను !
    కాని ఎవ్వరూ స్పందించ లేదు ఒక్క వరప్రసాద్ గారు తప్ప !
    వారు కర్ణాటక నుండి ఫోనులో వారి అభినందనలను తెలియ జేసారు !

    ఏం ? దేశ సమైక్యతకే ముప్పు కలిగే పరిస్థితి ఉందంటే
    అంతా ముక్త కంఠంతో ఈ విభజన ప్రయత్నాలను ఖండించ వలసిన అవసరము ఉన్నది !

    కాని ఇక్కడ ప్రస్తావించొద్దనడం నిజంగా
    భారతీయులంతా సిగ్గు పడవలసిన విషయం !

    జైహింద్ !




    రిప్లయితొలగించండి
  24. వసంతకిశోరు గారూ,
    మీరు వ్రాసిన వ్యాసం నిన్న చదివినాను. విభజన ప్రస్తావనల వలన కలిగే కష్ట నష్టముల గురించి మనసు కలత చెంది ఉంది. కానీ వేరే ఏ సంగతులు ఇక్కడ వ్రాయడానికి పెద్దలు అనుమతి ఇవ్వరని తెలిసినందునే మౌనంగా ఉన్నాను. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. విభజన వలన సామాన్య ప్రజానీకానికి ఎంతమాత్రం మేలు జరుగుతుందో భవిష్యత్తులో అందరికీ తెలియనుంది.

    రిప్లయితొలగించండి
  25. వసంత కిశోర్ గారూ,
    మీకు మనస్తాపం కలిగించి ఉంటే మన్నించండి.
    మీ వ్యాసంలో ఏ అంశాన్నీ నేను ఖండించడం లేదు. అయితే అంత వివరంగా వ్యాసరూపంలో వ్రాయడానికి ఇది వేదిక కాదు అంటున్నాను.
    గతంలో వరప్రసాద్ గారు ఎన్నోసార్లు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, నాయకుల గురించి వ్యంగ్యంగా పూరణలు చేశారు. నేను దేనినీ ఖండించలేదు.
    మీరు కేవలం ఆరవపేరా మాత్రం ఉంచి మీ పూరణ వ్రాస్తే సరిపోయేది.
    నేను మొదటినుండీ ఈ వేర్పాటు, సమైక్య వాదాల పట్ల తటస్థంగా ఉంటున్నాను. జీవితంలోనూ తటస్థంగా ఉన్న కారణం వల్లనే నేనీనాడు వృద్ధాశ్రమాన్ని ఆశ్రయించవలసి వచ్చింది.
    సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, బ్లాగుపట్ల మీ అభిమానాన్ని కొనసాగించవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  26. వసంత మహోదయా! మీ ఆవేదన అర్థం చేసుకోగలం. రాష్ట్ర విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి. మనం ఇలా ఆలోచిస్తున్నాము. గురువుగారు వరంగల్ వాసి. వారు మనతో ఏకీభవించలేక పోవచ్చు. దాన్ని పైకి మనందరి దగ్గరా చెప్పలేక పోవచ్చు.

    మొదటినుంచీ శంకరాభరణం పద్య సాహిత్య విషయాలకే పరిమితమై ఉంటూన్నది.
    ఏ విషయం పైనైనా మన పూరణ ఉంచడం వేరు. విపులమైన, ఆవేశపూరితమైన వ్యాఖ్య పెట్టడం వేరు.

    మన అభిప్రాయాన్ని వేరొకరి బ్లాగులో పెట్టి దానిపై అందరూ తప్పనిసరిగా స్పందించా లనుకోవడం అంత సబబు కాదు.

    ఎవరూ స్పందించ నంత మాత్రాన మీ అభిప్రాయంతో ఏకీభవించ లేదని బాధపడడం కూడా తగదు.

    ఇటువంటి సున్నితమైన విషయాలపై తప్పకుండా అందరూ స్పందించాలంటే మన బ్లాగులోనో ఫే సుబుక్కులోనో పెట్టి మిత్రులను దాన్ని చదవమని ఆహ్వానిస్తే సరిపోతుంది.

    శంకరాభరణం తటస్థ స్థితిని కాపాడుదాం.

    మనందరం సాహితీ మిత్రులం.
    తెలుగు భాషాభిమానులం.

    రిప్లయితొలగించండి
  27. మిత్రులారా! శుభాశీస్సులు.
    మంచి వివరణను ఇచ్చిన శ్రీ మిస్సన్న గారికి హృదయపూర్వక అభినందనలు.
    నేను బ్లాగు యొక్క శ్రేయమును కోరేవానినే కాని విరుద్ధ భావములకు తావునీయను. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నప్రియః అనే భగవద్గీతా వాక్యమును బాగుగా నమ్మిన వానిని. మన మందరమునూ ఆలాగుననే సుహృద్భావముతోనే సర్వదా ఉండవలెనని ఆకాంక్షించు వాడను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  28. నా ఆవేదనకు స్పందించిన మిత్రులు
    లక్ష్మీదేవి గారికి
    శంకరయ్య గారికి
    మిస్సన్న మహాశయులకూ
    నేమానివారికీ
    మిగిలిన బ్లాగు మిత్రులందరికీ
    ధన్యవాదములు !

    నేను నా చుట్టూ ఒక వృత్తం గీసుకొని
    అ పరిధిలోనే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటానెప్పుడూ !
    అది నేను వ్రాసినది కాదు !
    ఎక్కడో ఎవరో వ్రాస్తే
    చదివి , స్పందించి,
    సమాచారం అందించడం కోసమే ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ చెయ్యడం జరిగింది !
    ఇది ఎవరినీ మెప్పించడానికీ కాదు
    ఎవరినీ నొప్పించడానికీ కాదని నా విఙ్ఞప్తి !

    రిప్లయితొలగించండి