26, నవంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం - 1246 (తాతకు నేర్పును మనుమఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడి విధమున్.

33 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించ నున్నవి !

    ఇందిరాగాందీ వేసిన బ్రహ్మముడులు విప్పడం
    ఈ పాతకీ, ఘాతకుల తరమా ???
    చూద్దాం :

    01)
    _______________________________

    ధాతగ నిలిచెను యిందిర
    ఘాతకురాలైన నేటి - గాంధీ యెదుటన్ !
    చూతము జరుగున దేమో ?
    తాతకు నేర్పును మనుమడు - దగ్గెడి విధమున్ ???
    _______________________________

    https://www.facebook.com/photo.php?

    fbid=330098637130293&set=a.137584453048380.27540.100003904789679&type=1&theater

    రిప్లయితొలగించండి
  2. నేతులు ద్రాగిన తాతల
    మూతులు వాసనకు నైన ముచ్చట జెప్పన్
    రాతలు మారిన వటునిటు
    తాతకు నేర్పును మనుమడు దగ్గెడి విధమున్

    రిప్లయితొలగించండి
  3. అమెరికాలో నలుగురిలో దగ్గటానికి కూడా ఒక ఫ్యాషన్ కావలేమో అనిస్తుంది:
    తాతల నాడట లేవుట
    మూతుల కడ్డము నిడుకొను ముచ్చట “నాప్కిన్”
    చేతలు (రోతలు), అమెరిక రీతిగ
    తాతకు నేర్పును మనుమడు దగ్గెడి విధమున్!

    రిప్లయితొలగించండి
  4. ఏ తరమున కా తరమున
    రీతులలో పెక్కు మార్పులే కలుగుటచే
    నూతన పద్ధతి యిది యని
    తాతకు నేర్పును మనుమడు దగ్గెడి విధమున్

    రిప్లయితొలగించండి
  5. చేతిని నోటికి చూడీ
    రీతిగ నడ్డమ్ము వెట్టి "రేయ్ " దగ్గుమనన్
    ప్రీతిగ తాననుకరణను
    తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడి విధమున్.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ శంకరయ్య గురుదేవులకు , శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

    తాత మనుమల బంధము బహు గట్టిది,

    రాత్రి పూట దగ్గు చున్న మామకు వాతలు బెట్టుట జూచిన మనుమఁడు
    =========*==================
    వాతలు బెట్టగ మాతయు,
    తాతను జూచిన మనుమఁడు తల్లడిల్లుచున్ !
    రాతిరి సమయమ్మున దన
    తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడి విధమున్.

    రిప్లయితొలగించండి
  7. ఈ మధ్య పలు రకములుగా నవ్వుట, దగ్గుట నేర్పు చున్నారు. దగ్గుటలో తగు జాగ్రత్తలు నేర్చిన మనుమఁడు ముందుగా తాతకు జూపును,తరువాత మిగిలిన వారికి దెలుపును
    ========*================
    నూతన రీతులు నేర్వగ ,
    తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడి విధమున్
    ప్రీతిగ దరి జేరి వడిగ,
    జేతుల నూపుచు బరులకు క్షేమము ననుచున్ !

    రిప్లయితొలగించండి
  8. పాతవి పాతర వేయుచు
    నూతన పోకడలుపోవు నూతన తరమున్
    తాతల రాతలు మారగ
    తాతకు నేర్పును మనుమడు - దగ్గెడు విధమున్

    రిప్లయితొలగించండి
  9. నూతన విధములు తెలియని
    పాతతరానికిప్రతినిధి పండితుడయినన్
    పౌత్రుడు చెప్పగ వినవలె
    తాతకు నేర్పును మనుమడు - దగ్గెడి విధమున్

    రిప్లయితొలగించండి
  10. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘నిలిచెను + ఇందిర’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి నిత్యం. దానిని ‘నిలబడె నిందిర’ అందాం.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    బాగున్నాయి మీ రెండు పూరణలు. అభినందనలు.
    ‘తల్లడిల్లుచున్’ అన్నచోట గణదోషం. దానిని ‘తల్లడపడుచున్’ అనండి.
    *
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శంకరయ్య గారికివందనములు

    తాతా !తెలియుము సంజ్ఞలు
    వాతపు దగ్గున పిలుతురు వద్దకు జేరన్
    శీతపు దగ్గున పొమ్మని
    తాతకు నేర్పును మనుమడు దగ్గెడి విధమున్

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    మన్నించ ప్రార్థన! ప్రక్క వారి పద్యము లందు గణ దోషములు కనిపించు చున్నవి. నావి నాకు కనిపించుట లేదు గురువు గారు.

    రిప్లయితొలగించండి
  13. భీతాహవమందున తా
    నేతెంచుచు వీరపుత్రుడీయభిమన్యుం
    డేతద్వీరుల దునుమెను
    తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడి విధమున్.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    చిన్న సూచన: భీత అనగా భయపడిన అని అర్థము. భీత ఆహవము అని మీరు వాడిన విధము సరికాదేమో. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. గుండెనొప్పి వచ్చినపపుడు శ్వాసతీసుకుని దగ్గే విధము గురించి ఆమధ్య Face Book లో విస్తృతంగా Share చేయటం జరిగింది. ఆ విషయంగా నా పూరణ:
    తాతయ్య గుండెఁ బట్టుకు
    భీతిగ నల్లాడ, వైద్య విషయము దెలుపన్
    ప్రీతిగ హృదయము నిమురుచు
    తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడు విధమున్

    రిప్లయితొలగించండి
  16. శీతాకాలపు పడిసెము
    తాతా!మరి తప్పకుండ దగ్గెడు వేళన్
    చేతుల నడ్డము వెట్టని
    తాతకు జెప్పును మనుమడు దగ్గెడు విధమున్

    రిప్లయితొలగించండి
  17. తాతల తరములు గడిచెను
    మాతరములు గూడ గడువ మార్పులు గలుగన్
    ఈ తరపు కుటిల జగమున
    తాతకు నేర్పును మనుమడు దగ్గెడి విధమున్

    రిప్లయితొలగించండి
  18. శ్రీ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది నేను కూడా ఆ విషయము గుర్తుకు వచ్చి పద్యము వ్రాసితిని!

    రిప్లయితొలగించండి
  19. శ్రీ నేమాని గురువర్యులకు నమస్సులు.

    మీ సూచనానంతరము ఈ క్రింది విధంగా సవరిస్తున్నాను.

    " భీతిఁ గొలుపు రణమున తా "

    ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  20. మాతులుని జంపి ,పితరుని,
    మాతను చెఱ విడువ జేయు మాధవుకివిగో
    జోతలనిరి ప్రజలిట్లని -
    "తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడి విధమున్".

    రిప్లయితొలగించండి
  21. తాతల రోజులు మారెను
    మూతిని కరతలముతోడ మూసియు దగ్గో
    తాతా! యని ప్రియమగు తన
    తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడి విధమున్.

    రిప్లయితొలగించండి
  22. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    చిన్న సూచన: మాధవుకివిగో అనరాదు. మాధవునకివిగో అనుట సాధు ప్రయోగము. అందుచేత "మాపతి కివిగో" అని మార్చుదామా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    తాత నెదిరించిన అభిమన్యుడి ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘పెట్టుమని’ అనవలసి ఉంటుంది కదా.“అడ్డమిడు మనుచు” అంటే ఎలా ఉంటుంది?
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారి సవరణను గమనించారు కదా!
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి,
    శ్రీ గురువులకు నమస్కృతులతో,

    తాతలు నేతులు ద్రావిన
    హేతువున ననువుగ లేనియెడలఁ బెనకువన్
    జేఁతఱిక మగును గావునఁ
    దాతకు నేర్పును మనుమడు దగ్గెడి విధమున్.

    చేతనగువాఁడు కార్యము,కై తగ్గు, వంగుఁ గాక, యల్పుం డగునే
    యేతము వడిఁ దా వంగును, బాతాళము నీరుఁ దెచ్చి బయలున్ జల్లన్.

    అని చాటువు. తగ్గు = తగ్గుదల

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  25. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    సరళాదేశాన్ని సానుకూలం చేసికొని వైవిధ్యంగా ఉత్తమమైన పూరణ నందించారు. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు నమస్కారములు, సవరణతో...........

    శీతాకాలపు పడిసెము
    తాతా! మరి తప్పకుండ దగ్గెడు వేళన్
    చేతులనడ్డమిడు మనుచు
    తాతకు జెప్పును మనుమడు దగ్గెడు విధమున్

    రిప్లయితొలగించండి
  27. డా.ఏల్చూరివారికి ధన్యవాదాలు,"యేతము వడిఁ దా వంగును బాతాళము నీరుఁ దెచ్చి బయలు జల్లున్" అనే వాక్యం మా అమ్ముమ్మ గారు ఎప్పుడూ చెబుతూఉండేవారు. పూర్తి చాటువునిచ్చినందులకు వారికి ధన్యవాదాలు.(చంద్రశేఖర్)

    రిప్లయితొలగించండి
  28. గురువర్యులకు మరియు కవిమిత్రులు శ్రీ వరప్రసాద్ గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  29. manninchandi sir.nenu 25/11/13 na bank branch mention cheyaledu.anduku nannu mannistharani koruth.......!!branch details kinda mention chusthunnanu dayachesi gamaninchi naku mi vanthu sahayam chestharani koruthunnanu. Jangidi Rajendar,SBH{arepally}(warangal district). A/c No:62257143263.PLZ HELP ME..!!

    రిప్లయితొలగించండి
  30. నా తరమా! స్మార్ట్ ఫోనున
    వ్రాతలు వ్రాయుట ననుచును వాపోవంగన్
    చేతులు గైకొని నొక్కెను...
    తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడి విధమున్

    రిప్లయితొలగించండి


  31. కోతల రాయుండైనటి
    తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడి విధమున్,
    చేతిని మొబయిలు బట్టుచు
    నీతర మాయని జిలేబి నిమ్మళముగనన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  32. చేతికి మొబైలు నిడుచును
    ప్రీతిని జూపుచు ప్రియంక పెళ్ళివి ఫోటోల్
    రీతిగ గూగులు నందున
    తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడి విధమున్

    ప్రియంక = Priyanka Chopra

    రిప్లయితొలగించండి