2, డిసెంబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం - 1251 (పిట్టకూఁతకు దిశలెల్ల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
పిట్టకూఁతకు దిశలెల్ల బిట్టు వడఁకె.

28 కామెంట్‌లు:

  1. పొంగి పొరలును సంద్రమ్ము పున్న మనుచు
    మొగులు వర్షించు చిరు గాలి సోకి నంత
    కూత ఘన మైన పక్షది కోయి లంట
    పిట్ట కూతకు దిశ లెల్ల బిట్టు వడకె

    రిప్లయితొలగించండి
  2. పట్టు వదలని బేతాళు చెట్టు నెక్కె
    చిలుక మాంత్రికు డైనను కులుకు సొగసు
    రాకు మారిని బట్టును రాగ మలర
    పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకె

    రిప్లయితొలగించండి
  3. దిక్కులన్నింటికే తెలియు తేజపాలు
    దిక్కుదోచక చెరలోన చిక్కుబడెను
    తరుణి చెయిబట్ట న్యాయమున్ తానుగోర
    " పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకె "

    రిప్లయితొలగించండి
  4. దిక్కులకు తెలియు తరుణ్ తేజపాలు
    తరుణి చెయిబట్ట న్యాయమున్ తానుగోర
    దిక్కుదోచక చెరలోన చిక్కుబడెను
    " పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకె "

    రిప్లయితొలగించండి
  5. దిక్కులకు తెలియు తరుణ్ తేజపాలు
    ' తరుణి వేధించు కేసున్న ' తరుణమందు
    దిక్కుదోచక చెరలోన చిక్కుబడెను
    " పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకె "

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    జపాను హిరోషిమా,నాగసాకిలపై అణు బాంబు వేయుట
    ==============*============
    దాడికి సమమైనది యొక్క దాడి యనుచు
    పాలకులు పగతోడను పట్టు బట్టి
    తూరుపున వేయ,ఘన మైన తోక లేని
    పిట్ట కూతకు దిశ లెల్ల బిట్టు వడకె

    రిప్లయితొలగించండి
  7. Swine Flu పై
    =============*===============
    పిలచిన బలికెడి పిలుపు విన్న జనులు
    ప్రాణ భయముతో బలు దిశల పరుగు లిడ
    గనిన సురలు బలికె రిట్లు కలియుగమున
    పిట్ట కూతకు దిశ లెల్ల బిట్టు వడకె !

    (పిలుపు = తుమ్ము )

    రిప్లయితొలగించండి
  8. కొత్త సౌండు సిస్టము దెచ్చి కోర్కె దీర
    రకరకములైన సంగీత లయల దేలి
    పిట్ట కూత వినుచు సౌండు పెంచి నంత
    పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకె

    రిప్లయితొలగించండి
  9. గురువుగారూ,
    బిట్టువడు = కళవళపడు అనే అర్థం నిఘంటువులో ఉంది. బిట్టు వడకు అనే రూపము కనిపించలెదు.
    పై అర్థములోనే ....

    వినత గరుడుని కన్నట్టి వేళ -వినుము,
    హరికి తగినట్టి వాహనమమరె నంచు,
    మురిసె జగతి; యతని స్వరమును వినగనె
    పిట్టకూఁతకు దిశలెల్ల బిట్టు వడఁకె.

    రిప్లయితొలగించండి
  10. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘పున్నమ + అనుచు’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘పున్నమ యని’ అనండి. ‘పక్షి + అది" అన్నప్పుడూ సంధి లేదు. ‘కూత ఘనమగు నాపక్షి’ అందాం.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మార్చి మార్చి వ్రాసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘తెలియు తరుణ్’ అన్నచోట గణదోషం. అక్కడ ‘దిక్కులకు తెలియును తరుణ్/దిక్కులకు తెలియు తరుణు(ణ) తేజపాలు’ అనండి.
    *
    వరప్రసాద్ గారూ,
    ఆటంబాంబును తోకలేని పిట్టను చేసిన మీ మొదటి పూరణ బాగుంది.
    అలాగే స్వైన్ ఫ్లూ పై చెప్పిన రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    ‘దిశల’ అంటే గణదోషం. అక్కడ ‘దిశల్’ అనండి. ‘పలికె రిట్లు...’ పలికి రిట్లు’కు టైపాటనుకుంటాను.
    *
    సహదేవుడు గారూ,
    మీ డిజె పిట్ట సౌండు అదిరింది. బాగుంది పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ‘బిట్టు’ శబ్దానికి శ్రీఘ్రము, అధికము అని అర్థాలున్నాయి. బిట్టు వడకె అంటే శ్రీఘ్రముగా లేదా అధికంగా వణికె నని భావం.
    అయినా మీ పూరణలో అర్థం మారలేదు. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శ౦కరయ్యగారికి వందనములు

    కాళ రాతిరి భూత భేతాళ తతులు
    భీకరాట్టహాసముల తో ప్రేతవనము
    జటల వటము నులూకము జతుక తీతు
    పిట్టకూతకు దిశలెల్ల బిట్టువడకె

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు నమస్కృతులు.
    మూడు రోజుల పాటు నేను బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. ఒక పెళ్ళికి వెళ్తున్నాను.
    మూడు రోజుల సమస్యలను షెడ్యూల్ చేసి వెళ్తున్నాను. అవకాశం దొరికితే తప్పక మీ పూరణలను పరిశీలిస్తాను.
    ఈ మూడు రోజులు దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  13. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    భయానకరసంతో వణికించారు మీ పూరణతో. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. అతిశయోక్తిని జెప్పుమా యనుచు గురువు
    శిష్యు నడుగగ నతడిట్లు చెప్పె వినుడు
    పిట్టకూతకు దిశలెల్ల బిట్టు వడకె
    గడ్డిపోచతో నేనుంగు కట్టు వడెను

    రిప్లయితొలగించండి
  15. అయ్యా! తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. చిన్న సూచన:
    కళరాతిరి సమాసము సాధువు కాదు. కాళరాత్రిలో అందామా?
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. భాగవతుల కృష్ణా రావు గారి పూరణ:
    పెను తుఫానులు వరదలు పెరిగి జనులు
    నాశన మ్మయి పీన్గుల రాశి వడగ
    ఘోర కలి వచ్చె నంచును గుడ్లగూబ
    పిట్ట కూతకు దిశ లెల్ల బిట్టు వడకె




    రిప్లయితొలగించండి
  17. పండిత నేమాని గారికి వందనములు
    మీ సూచనకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  18. శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    తమరి ఫోన్ స్విచ్ ఆప్ వస్తున్నది. మీ యాత్ర యంతయు సుఖముగా సాగాలని భగవంతుని ప్రార్థిస్తూ

    రిప్లయితొలగించండి
  19. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు..
    మీ యాత్ర శుభ యాత్ర కావాలని భగవంతుని ప్రార్థిస్తూ..

    రిప్లయితొలగించండి
  20. రావణుడు సీత నిడుకొని రథము పైన
    గగన వీధిని జనుచుండ గాంచి మిగుల
    క్రుద్ధుడై జటాయువు పోరి కూలె నేల
    పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకె

    రిప్లయితొలగించండి
  21. చిన్ని కృష్ణుడు పూతనన్ మన్ను గలుప
    నంద వ్రజమున గోపకుల్ నంద మంది
    యిట్లనిరి రక్కసిం జంపె నింతవాడు
    పిట్ట కూతకు దిశ లెల్ల బిట్టు వడకె!

    రిప్లయితొలగించండి
  22. అధిక శబ్దము నిచ్చెడి యంత్రములను
    వాడుచున్నారు మనుజులు వాడలందు
    నట్టి యంత్రమ్ములో పిట్ట యరుపు రాగ
    పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకె

    రిప్లయితొలగించండి
  23. ఈనాటి మరికొన్ని పొరణలను చూద్దాము:

    అందరికీ అభినందనలు.

    శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: అయ్యా! నమస్కారములు.
    మీ పద్యము చాల బాగుగ నున్నది. గుడ్లగూబను ఉట్టంకించేరు.

    శ్రీ లక్ష్మెనారాయణ గారు: శుభాశీస్సులు.
    జటాయువును ప్రస్తావించుచు మీరు చేసిన పూరణ చాల బాగుగ నున్నది.

    శ్రీ మిస్సన్న గారు: శుభాశీస్సులు.
    మీరు చిన్ని కృష్ణుని స్తుతించేరు. బాగుగనున్నది.

    శ్రీ నాగరాజు గారు: శుభాశీస్సులు.
    మీరు మంచి విరుపుతో పూరించేరు. బాగుగ నున్నది

    శ్రీ బొడ్డు శంకరయ్య గారు: శుభాశీస్సులు.
    యంత్రాల ప్రస్తావనతో మీ పూరన బాగుగ నున్నది.

    స్వస్తి.




    రిప్లయితొలగించండి
  24. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    ఆర్యా.....
    సమయాభావంతో సకాలములో పంపని పద్యాలకు కూడ ప్రతిస్పందిస్తె ఆనందిస్తాము

    పిట్టలను బట్టి యమ్మెడి వేటగాడు
    పిట్ట యొకటిని బంధించి పెట్టె బాధ
    తట్టు కొనలేక యాపిట్ట పెట్టె కూత
    పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకె

    అడవిలోనొక పిట్టల జోడు యొకటి
    కూడి ప్రేమతో కువకువ లాడుచుండ
    వేటగాని వలకుజిక్కి బెట్టె కూత
    పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకె

    రిప్లయితొలగించండి
  25. శ్రీ సుధర్శన్ కుస్మ గారూ! శుభాశీస్సులు.
    మీ 2 పద్యములును బాగుగ నున్నవి. అభినందనలు. కొన్ని సూచనలు:

    1. 1వ పద్యము 2వ పాదములో పిట్ట నొకటిని అని నుగాగమము చేయండి.
    2. 2వ పద్యంలో మొదటి పాదంలో ప్రాసయతి నియమము పాటింపబడలేదు.
    ఆ పాదమును ఇలాగ మార్చుదాం:
    కలదు పిట్టల జత యొండు కాన లోన
    2వ పాదములో కువకువ లాడుచుండ అందాము.
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  26. గురువుల సూచనలకు ధన్యవాదములు, సవరణతో............
    పిట్టలను బట్టి యమ్మెడి వేటగాడు
    పిట్ట నొకటిని బంధించి పెట్టె బాధ
    తట్టు కొనలేక యాపిట్ట పెట్టె కూత
    పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకె

    కలదు పిట్టల జత యొండు కానలోన
    కూడి ప్రేమతో కువకువ లాడుచుండ
    వేటగాని వలకు జిక్కి బెట్టె కూత
    పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకె

    రిప్లయితొలగించండి
  27. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    బకాసుర వధ :

    01)
    ____________________________

    పిట్ట రూపున నున్నట్టి - జెట్టి యొకడు
    నట్టహాసము జేయుచు - నిట్టె పైకి
    దూకబోయిన వానిని - పీక బట్టి
    కట్టి కుడుపగ కృష్ణుండు - కొట్ట నేల
    పిట్టకూతకు దిశలెల్ల - బిట్టు వడకె !
    ____________________________

    రిప్లయితొలగించండి