ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే௨ర్జున తిష్ఠతి |భ్రామయన్‌సర్వభూతాని యంత్రారూఢాని మాయయా || తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత |తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ||...భగవద్గీతహృదినది ప్రతివారలజనిమదినాడింజుచును శివుడు మాయావియెగాహృది పక్షపాత మెరుగక,మది నెపుడు మరువకుమా! సమమగు మనమునన్!
ప్రభాకర శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
యుద్ధరంగమున దీరిన కౌరవులజూపి, శ్రీ కృష్ణుడు అర్జునునితో:వారి'ది న'చ్చని మార్గముతీరున పో! 'వార'లటుల దీరిరి గనుమా!నేరు'ప, క్ష'ణంబు లివియా!పోరగ లే! 'మాస'టీడ! పూనిక తోడన్!మాసటీడు= శూరుడు, శ్రేష్టుడు
డా.పిట్టాభారత గాథనందిన సవాళులవే పరివార పక్షమున్నారయు ధర్మమార్గములు నప్పటి మాటలెగావు చూడ నున్నారిలలో సుయోధనుని యాత్మను గొన్న హుతాశనుల్ సుమా!మారణ జేయ పాండవ సమాస సమీకరణాలు గావలెన్భారత రాజనీతి యిది బట్టిన "పాకుల"గూల్చ వీలగున్(సమాసము॥సంక్షేపము,సమ్యక్ గ్రహణము."పాకులు"పాకిస్తాన్ వారలు.)
శిష్ట్లా శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పిట్టా సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. ముఖ్యంగా దత్త పదాలను మొదటిపాదంలోనే ఇమిడ్చిన మీ ప్రతిభ ప్రశంసనీయం. అభినందనలు.
భగవద్గీత నుపదేశించి పరమాత్ముడు అర్జునిని ప్రోత్సహిస్తూ , ఇది నమ్ముము పార్థా ననుమదినిలిపి తన పరివారమను భావన వీ డి దిటవుగొని ప్రతిపక్షము నెదిరించుము మాసటివలె, నెంజెలి విడుమా ! జిలేబి
జిలేబీ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
(దుర్యోధనునితో శ్రీకృష్ణుని మాటలు.....)ఇది నమ్ముము పాండుసుతులుకదనమ్మున గెలుపు నందఁగాఁ దగు వారల్,జెదఱును నీ పక్షము, సంపద లవనియు నీకు సొంతమా సతతమ్మున్?
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. శ్రీకృష్ణ సందేశ భరితము గా మీ పూరణ విలసిల్లుచున్నది.
శ్రీగురుభ్యోనమఃమహా భారత యుద్ధమున శల్యుడు కర్ణునిన్ గనిఆది నరుని యరదము కర్ణ యబలు డీవుసైన్య పరివారములు నీకు సాయపడునెపద్మనాభుడె వారల పక్షమాయెమోద మొందకు వినుమా సముడవు కావునీవు, ఫల్గునున్ గెలువంగ నీకు తరమె.
శ్రీపతి శాస్త్రి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నీకందిన నూర్వశినేతాకఁగ లేవా? రసికుడ! తడబాటేలా?నా కరమందింప క్షణమనేకుల మనమాసపడుట నీవెరుగవహో?
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు.
వినుమా సంజయ!రణముననెనయగబరివారమంతయాపక్షమునన్ గనుమరుగావగనామదిననునయముంజింతనొందెనదినచ్చదుగాధూ
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధూటైైపాాటుదోషము
..................................ీ గు రు మూ ర్తి ఆ చా రి ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, శ్రీ కృష్ణ రాయభారముహనుమ కేతనము పై ను౦డ , …………… స్య౦దన మేన్ నడిపి౦ప ,దినకర ప్రతిమాన శౌర్య ………… దీప్తి ( న్ ) గా౦డీవి మీ వారలను గూల్చు నెవరి నేనియు , వి…… డక | పక్షములు తెగు పులుగులన , గూలెదరు | కౌరవాధి ........ పా ! వలదు సుమా సమరము !
గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
లసదినమయూఖ పక్ష సమ సితావారణ సుదేహ మహి మాసదృశున్బిసరుహ నయన పృథ కనియెనసమాన వరప్రదాత హరిదశ్వునకున్
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
క్షణ మొక యుగ మది నరునకుదునుమగ పరివారమందు దూరిన సింధీశుని తన పక్షము మెచ్చంగను విను మాస లుడుగంగ కౌరవ తతులన్.
మిస్సన్న గారూ,మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.'సింధు+ఈశుని=సింధ్వీశుని' అవుతుంది.
ధన్యవాదాలండీ. సింధీశుడని సంధి చేసాను కాని ఏదో తేడాగా అనిపించింది. యణాదేశ సంధి సూత్రం గుర్తు రాలేదు.
మదిన శంకను వీడుము మదిని యెంచు వారొనర్చిన యెగ్గులు మర్వ బోకు పక్షపాతమేల పార్థనీకీవేళమాసమాన మెవడటంచు మదిని తలచు
దిన-వార-పక్ష-మాసశ్రీకృష్ణుడు ధర్మరాజుతో..........నీవిది నమ్ముము కదనమునేవిధి వారింపగలమదెట్టుల వారల్భావించి మనదు పక్షము రావించుట తెలుపుమా సరైన విధమునన్.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
దినకరుండస్తమించెడి తీరు గనిన యర్జునుండేగు యమపురి కదియె చాలు,నాపవశమా సమరమందు నన్ను; గూల్తు శత్రుపక్షము పరివార సహితము గను
భాగవతుల కృష్ణారావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
హృది నమ్మగ దగు నర్జున!కదనం బనివారణీయ కర్మము, కలుషంబది నీపక్షము చేరునెయిది వినుమా సమ్మతించు మీ పోరునకున్.హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
'కనుమా!సభ! నాశ్రయమం దినవార మిట తగవు వలదే సైరంధ్రీ!వినుము!,కలదు నీపక్ష మ్మున ధర్మ మటంచు 'కంకు ముసరుచు పలికెన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:"నాది ననియెడి భావము నణచు చుండి యుద్ధ మొనరించు వారల యునికి నొదలిఎదిరి పక్షము నున్నట్టి విమతుల యెడమాసటి వగుచు పోరులో మలయు మిపుడు కేవలము నిమిత్తుడ వీవు క్రియను జేయ" -ననుచు కృష్ణుడా పార్ధుని ననువు జేసిబవర మెంచగ నుత్సాహ బఱచి యుండె.
రాజారావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'నాది + అనెడి' అన్నపుడు 'నాది యనెడి' అని యడాగమం వస్తుంది. 'యునికి నొదలి' అని వదలిని ఒదలి అన్నారు. 'యునికి వదలి' అనవచ్చు.
కీచకుడు ద్రౌపదిని చూసి మోహముతో పలికిన మాటలుగా నూహించి ( కందం )ఓ మగువా రమ్మిటకున్ మా మది నచ్చిన పడంతి మా సరసకు రావే మము మురిపింప క్షణముమా మోహము దీర్చ గోరి మమకారముతో.
మాధవా! రణమునుజేయ మదిన కలిగెజంకు, మాన్పుమా సమరము శత్రు సంహరమ్ము , పాపక్షయముగాని రాజ్యమేలభోగముల్ సుఖములవేల పుణ్యచరిత
విరించి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.'మదిని' అనడం సాధువు. 'సంహరమ్ము'ను 'సంహరణము' అనండి.
కృష్ణరాయబారమునదెలిపినపలుకులు29.11.16.దినమణి నవ్వు| పాండవులు దెల్పిన రీతిగ భాగమివ్వకన్“పనిగొను దార్థరాష్ట్ర పరివారము గొల్తురు మిమ్ముయెప్పుడున్ ఘనతను చాటు లోకులిల గౌరవమందున పక్ష పాతమేవినుటకు లేకపోవుగద? విజ్ఞులమాసర వెట్టుధర్మమౌ| {పనిగొను=సేవజేయు;మాసరవెట్టు=మచ్చుకుఇచ్చు}
ఈశ్వరప్ప గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ధార్తరాష్ట్ర'ను 'దార్తరాష్ట్ర' అన్నారు. 'మిమ్ము నెప్పుడున్' అనండి.
మదినలరిన చాపల్యము తుదవర కునుకుంతి యెదను తూట్లు పరచెన్ ఉదరధి సుతుడై యుండియు ఎదివా రలపక్ష మందు నెక్కటి మాసటీ హమ్మయ్య కిట్టించాను .గురువు గారి దయ
అక్కయ్యా,మీరే అన్నారు 'కిట్టించాను' అని. 'తూట్లు పరచెన్, మాసటీ' అన్నచోట్ల గణదోషం.
గురువులకు ధన్య వాదములు -----------------మదినల రినచా పల్యము తుదవర కునుకుంతి యెదను తునియలు జేయన్ ఉదరధి సుతుడై మాసటి ఎదివారల పక్షమందు నెక్కొని బోయెన్
చేతి కందిన వారికి చేటు జేయనిఛ్ఛ గింపక వారల విడిచి పెట్టెధర్మ పక్షమును వహించు ధర్మజుండుమాసములరులు కాదని మారుతి యనె.
జనార్దన రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు![బంధువులతో యుద్ధముచేసి వారలఁ జంపవలసివచ్చెఁగదా యని యుద్ధరంగమున విషాదమందిన యర్జుననునకుఁ గర్తవ్యబోధ నుపదేశించుచున్న కృష్ణుని మాటలు]బంధు మృతిపట్లఁ గుందిన, భండనమునఁబగఱ గెలుచుట యెట్టు? లవ్వారలపయిఁగరుణ వీడి విపక్షమున్ గాండివమునఁజంపి, రాజ్యమ్ము నందుమా సవ్యసాచి!స్వస్తి
గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
కద ధర్మ పక్షపాతివి మదినమ్మిన వారమయ్య మాధవ నిన్నేకదనమ్మున మాసఖునిగ సదయుడ తగు సాయమిచ్చి జయమీయ గదే!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వదినగా జూడక వారలొనర్చినయవమాన భారమ్ము ననుభవించినిష్పక్షపాతియై నెయ్యమున్ ఘటించుధర్మతనూజుని తలపు గాంచినాతరమా సహనంబు నాశ్రయించపలుకవే నీవైన వాసుదేవ!భీకర రణదుందుభీధ్వనవిభ్రమాభ్యంతరస్థలిఁపరిభంజితశిరతే.గీకౌరవభటసంఘ సంయుతుఁ కౌరవేశునుగ్రుడై యనిలాత్మజుండూరు భంగము సలుపన్గని యనినే ముదిత చిత్తనగుచు నట్టహాసంబున నడర జూతు
మూర్తి గారూ,మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.'సహనంబు నాశ్రయించ' అన్నచోట గణదోషం.
ఇప్పటికీ గణదోషం తొలగిపోలేదు. 'సహనము నాశ్రయించగ' అనండి.
డా.బల్లూరి ఉమాదేవి గారి పూరణ: మదిన శంకను వీడుము మదిని యెంచువారొనర్చిన యెగ్గులు మర్వ బోకుపక్షపాతమేల పార్థనీకీవేళమాసమాన మెవడటంచు మదిని తలచు
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.'మదిన' అనరాదు. 'మదిని' అన్నది సాధువు.
వదినగా జూడక వారలొనర్చినయవమాన భారమ్ము ననుభవించినిష్పక్షపాతియై నెయ్యమున్ ఘటించుధర్మతనూజుని తలపు గాంచినాతరమా సహనమ్ము పాటించగాపలుకవే నీవైన వాసుదేవ!భీకర రణదుందుభీధ్వనవిభ్రమాభ్యంతరస్థలిఁపరిభంజితశిరతే.గీకౌరవభటసంఘ సంయుతుఁ కౌరవేశునుగ్రుడై యనిలాత్మజుండూరు భంగము సలుపన్గని యనినే ముదిత చిత్తనగుచు నట్టహాసంబున నడర జూతుకృతజ్ఞతలు గురువుగారూ, సవరించాను. చిత్తగించ ప్రార్థన
నాపతుల వారణ మరిది నాకపతికినాపతుల ననిఁ బ్రతిపక్ష మాపలేదుకీచ కాధమా సరగు నీ పీచ మడుచుకొనుము లేకున్న నేడే నీ దినము ముగియు
అన్నపరెడ్డి వారూ, బాగున్నది మీ పూరణ. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే௨ర్జున తిష్ఠతి |
తొలగించండిభ్రామయన్సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ||
తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత |
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ||
...భగవద్గీత
హృదినది ప్రతివారలజని
మదినాడింజుచును శివుడు మాయావియెగా
హృది పక్షపాత మెరుగక,
మది నెపుడు మరువకుమా!
సమమగు మనమునన్!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
యుద్ధరంగమున దీరిన కౌరవులజూపి, శ్రీ కృష్ణుడు అర్జునునితో:
రిప్లయితొలగించండివారి'ది న'చ్చని మార్గము
తీరున పో! 'వార'లటుల దీరిరి గనుమా!
నేరు'ప, క్ష'ణంబు లివియా!
పోరగ లే! 'మాస'టీడ! పూనిక తోడన్!
మాసటీడు= శూరుడు, శ్రేష్టుడు
డా.పిట్టా
తొలగించండిభారత గాథనందిన సవాళులవే పరివార పక్షము
న్నారయు ధర్మమార్గములు నప్పటి మాటలెగావు చూడ ను
న్నారిలలో సుయోధనుని యాత్మను గొన్న హుతాశనుల్ సుమా!
మారణ జేయ పాండవ సమాస సమీకరణాలు గావలెన్
భారత రాజనీతి యిది బట్టిన "పాకుల"గూల్చ వీలగున్
(సమాసము॥సంక్షేపము,సమ్యక్ గ్రహణము."పాకులు"పాకిస్తాన్ వారలు.)
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. ముఖ్యంగా దత్త పదాలను మొదటిపాదంలోనే ఇమిడ్చిన మీ ప్రతిభ ప్రశంసనీయం. అభినందనలు.
రిప్లయితొలగించండిభగవద్గీత నుపదేశించి పరమాత్ముడు అర్జునిని ప్రోత్సహిస్తూ ,
ఇది నమ్ముము పార్థా నను
మదినిలిపి తన పరివారమను భావన వీ
డి దిటవుగొని ప్రతిపక్షము
నెదిరించుము మాసటివలె, నెంజెలి విడుమా !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(దుర్యోధనునితో శ్రీకృష్ణుని మాటలు.....)
రిప్లయితొలగించండిఇది నమ్ముము పాండుసుతులు
కదనమ్మున గెలుపు నందఁగాఁ దగు వారల్,
జెదఱును నీ పక్షము, సం
పద లవనియు నీకు సొంతమా సతతమ్మున్?
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. శ్రీకృష్ణ సందేశ భరితము గా మీ పూరణ విలసిల్లుచున్నది.
తొలగించండిశ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిమహా భారత యుద్ధమున శల్యుడు కర్ణునిన్ గని
ఆది నరుని యరదము కర్ణ యబలు డీవు
సైన్య పరివారములు నీకు సాయపడునె
పద్మనాభుడె వారల పక్షమాయె
మోద మొందకు వినుమా సముడవు కావు
నీవు, ఫల్గునున్ గెలువంగ నీకు తరమె.
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నీకందిన నూర్వశినే
రిప్లయితొలగించండితాకఁగ లేవా? రసికుడ! తడబాటేలా?
నా కరమందింప క్షణమ
నేకుల మనమాసపడుట నీవెరుగవహో?
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు.
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు.
తొలగించండివినుమా సంజయ!రణమున
రిప్లయితొలగించండినెనయగబరివారమంతయాపక్షమునన్
గనుమరుగావగనామది
ననునయముంజింతనొందెనదినచ్చదుగాధూ
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధూటైైపాాటుదోషము
తొలగించండి..................................
రిప్లయితొలగించండిీ
గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శ్రీ కృష్ణ రాయభారము
హనుమ కేతనము పై ను౦డ ,
…………… స్య౦దన మేన్ నడిపి౦ప ,
దినకర ప్రతిమాన శౌర్య
………… దీప్తి ( న్ ) గా౦డీవి మీ వార
లను గూల్చు నెవరి నేనియు , వి
…… డక | పక్షములు తెగు పులుగు
లన , గూలెదరు | కౌరవాధి
........ పా ! వలదు సుమా సమరము !
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లసదినమయూఖ పక్ష స
రిప్లయితొలగించండిమ సితావారణ సుదేహ మహి మాసదృశున్
బిసరుహ నయన పృథ కనియె
నసమాన వరప్రదాత హరిదశ్వునకున్
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిక్షణ మొక యుగ మది నరునకు
రిప్లయితొలగించండిదునుమగ పరివారమందు దూరిన సింధీ
శుని తన పక్షము మెచ్చం
గను విను మాస లుడుగంగ కౌరవ తతులన్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
'సింధు+ఈశుని=సింధ్వీశుని' అవుతుంది.
ధన్యవాదాలండీ. సింధీశుడని సంధి చేసాను కాని ఏదో తేడాగా అనిపించింది. యణాదేశ సంధి సూత్రం గుర్తు రాలేదు.
తొలగించండిమదిన శంకను వీడుము మదిని యెంచు
తొలగించండివారొనర్చిన యెగ్గులు మర్వ బోకు
పక్షపాతమేల పార్థనీకీవేళ
మాసమాన మెవడటంచు మదిని తలచు
దిన-వార-పక్ష-మాస
రిప్లయితొలగించండిశ్రీకృష్ణుడు ధర్మరాజుతో..........
నీవిది నమ్ముము కదనము
నేవిధి వారింపగలమదెట్టుల వారల్
భావించి మనదు పక్షము
రావించుట తెలుపుమా సరైన విధమునన్.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దినకరుండస్తమించెడి తీరు గనిన
రిప్లయితొలగించండియర్జునుండేగు యమపురి కదియె చాలు,
నాపవశమా సమరమందు నన్ను; గూల్తు
శత్రుపక్షము పరివార సహితము గను
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హృది నమ్మగ దగు నర్జున!
రిప్లయితొలగించండికదనం బనివారణీయ కర్మము, కలుషం
బది నీపక్షము చేరునె
యిది వినుమా సమ్మతించు మీ పోరునకున్.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
'కనుమా!సభ! నాశ్రయమం
దినవార మిట తగవు వలదే సైరంధ్రీ!
వినుము!,కలదు నీపక్ష
మ్మున ధర్మ మటంచు 'కంకు ముసరుచు పలికెన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండి"నాది ననియెడి భావము నణచు చుండి
యుద్ధ మొనరించు వారల యునికి నొదలి
ఎదిరి పక్షము నున్నట్టి విమతుల యెడ
మాసటి వగుచు పోరులో మలయు మిపుడు
కేవలము నిమిత్తుడ వీవు క్రియను జేయ" -
ననుచు కృష్ణుడా పార్ధుని ననువు జేసి
బవర మెంచగ నుత్సాహ బఱచి యుండె.
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నాది + అనెడి' అన్నపుడు 'నాది యనెడి' అని యడాగమం వస్తుంది. 'యునికి నొదలి' అని వదలిని ఒదలి అన్నారు. 'యునికి వదలి' అనవచ్చు.
కీచకుడు ద్రౌపదిని చూసి మోహముతో పలికిన మాటలుగా నూహించి ( కందం )
రిప్లయితొలగించండిఓ మగువా రమ్మిటకున్
మా మది నచ్చిన పడంతి మా సరసకు రా
వే మము మురిపింప క్షణము
మా మోహము దీర్చ గోరి మమకారముతో.
మాధవా! రణమునుజేయ మదిన కలిగె
రిప్లయితొలగించండిజంకు, మాన్పుమా సమరము శత్రు సంహ
రమ్ము , పాపక్షయముగాని రాజ్యమేల
భోగముల్ సుఖములవేల పుణ్యచరిత
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'మదిని' అనడం సాధువు. 'సంహరమ్ము'ను 'సంహరణము' అనండి.
కృష్ణరాయబారమునదెలిపినపలుకులు
రిప్లయితొలగించండి29.11.16.దినమణి నవ్వు| పాండవులు దెల్పిన రీతిగ భాగమివ్వకన్
“పనిగొను దార్థరాష్ట్ర పరివారము గొల్తురు మిమ్ముయెప్పుడున్
ఘనతను చాటు లోకులిల గౌరవమందున పక్ష పాతమే
వినుటకు లేకపోవుగద? విజ్ఞులమాసర వెట్టుధర్మమౌ| {పనిగొను=సేవజేయు;మాసరవెట్టు=మచ్చుకుఇచ్చు}
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధార్తరాష్ట్ర'ను 'దార్తరాష్ట్ర' అన్నారు. 'మిమ్ము నెప్పుడున్' అనండి.
మదినలరిన చాపల్యము
రిప్లయితొలగించండితుదవర కునుకుంతి యెదను తూట్లు పరచెన్
ఉదరధి సుతుడై యుండియు
ఎదివా రలపక్ష మందు నెక్కటి మాసటీ
హమ్మయ్య కిట్టించాను .గురువు గారి దయ
అక్కయ్యా,
తొలగించండిమీరే అన్నారు 'కిట్టించాను' అని. 'తూట్లు పరచెన్, మాసటీ' అన్నచోట్ల గణదోషం.
గురువులకు ధన్య వాదములు
తొలగించండి-----------------
మదినల రినచా పల్యము
తుదవర కునుకుంతి యెదను తునియలు జేయన్
ఉదరధి సుతుడై మాసటి
ఎదివారల పక్షమందు నెక్కొని బోయెన్
చేతి కందిన వారికి చేటు జేయ
రిప్లయితొలగించండినిఛ్ఛ గింపక వారల విడిచి పెట్టె
ధర్మ పక్షమును వహించు ధర్మజుండు
మాసములరులు కాదని మారుతి యనె.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[బంధువులతో యుద్ధముచేసి వారలఁ జంపవలసివచ్చెఁగదా యని యుద్ధరంగమున విషాదమందిన యర్జుననునకుఁ గర్తవ్యబోధ నుపదేశించుచున్న కృష్ణుని మాటలు]
బంధు మృతిపట్లఁ గుందిన, భండనమునఁ
బగఱ గెలుచుట యెట్టు? లవ్వారలపయిఁ
గరుణ వీడి విపక్షమున్ గాండివమునఁ
జంపి, రాజ్యమ్ము నందుమా సవ్యసాచి!
స్వస్తి
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
కద ధర్మ పక్షపాతివి
రిప్లయితొలగించండిమదినమ్మిన వారమయ్య మాధవ నిన్నే
కదనమ్మున మాసఖునిగ
సదయుడ తగు సాయమిచ్చి జయమీయ గదే!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వదినగా జూడక వారలొనర్చిన
రిప్లయితొలగించండియవమాన భారమ్ము ననుభవించి
నిష్పక్షపాతియై నెయ్యమున్ ఘటించు
ధర్మతనూజుని తలపు గాంచి
నాతరమా సహనంబు నాశ్రయించ
పలుకవే నీవైన వాసుదేవ!
భీకర రణదుందుభీధ్వనవిభ్రమా
భ్యంతరస్థలిఁపరిభంజితశిర
తే.గీ
కౌరవభటసంఘ సంయుతుఁ కౌరవేశు
నుగ్రుడై యనిలాత్మజుండూరు భంగ
ము సలుపన్గని యనినే ముదిత చిత్త
నగుచు నట్టహాసంబున నడర జూతు
మూర్తి గారూ,
తొలగించండిమీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
'సహనంబు నాశ్రయించ' అన్నచోట గణదోషం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఇప్పటికీ గణదోషం తొలగిపోలేదు. 'సహనము నాశ్రయించగ' అనండి.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిడా.బల్లూరి ఉమాదేవి గారి పూరణ:
రిప్లయితొలగించండిమదిన శంకను వీడుము మదిని యెంచు
వారొనర్చిన యెగ్గులు మర్వ బోకు
పక్షపాతమేల పార్థనీకీవేళ
మాసమాన మెవడటంచు మదిని తలచు
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మదిన' అనరాదు. 'మదిని' అన్నది సాధువు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివదినగా జూడక వారలొనర్చిన
రిప్లయితొలగించండియవమాన భారమ్ము ననుభవించి
నిష్పక్షపాతియై నెయ్యమున్ ఘటించు
ధర్మతనూజుని తలపు గాంచి
నాతరమా సహనమ్ము పాటించగా
పలుకవే నీవైన వాసుదేవ!
భీకర రణదుందుభీధ్వనవిభ్రమా
భ్యంతరస్థలిఁపరిభంజితశిర
తే.గీ
కౌరవభటసంఘ సంయుతుఁ కౌరవేశు
నుగ్రుడై యనిలాత్మజుండూరు భంగ
ము సలుపన్గని యనినే ముదిత చిత్త
నగుచు నట్టహాసంబున నడర జూతు
కృతజ్ఞతలు గురువుగారూ, సవరించాను. చిత్తగించ ప్రార్థన
నాపతుల వారణ మరిది నాకపతికి
రిప్లయితొలగించండినాపతుల ననిఁ బ్రతిపక్ష మాపలేదు
కీచ కాధమా సరగు నీ పీచ మడుచు
కొనుము లేకున్న నేడే నీ దినము ముగియు
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిబాగున్నది మీ పూరణ. అభినందనలు.