25, నవంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2209 (హృదయముఁ జీల్ప...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"హృదయముఁ జీల్ప రత్నములు హేమములున్ గనవచ్చు నంతటన్"
లేదా...
"ఎదను జీల్పఁ గనంబడు హేమమణులు"
('చిత్ర కవితా ప్రపంచం' బ్లాగు సౌజన్యంతో)

70 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. పరమ పావని భూదేవి పరవశమున
   నరుని బుట్టించి పాలింప నాశ మీర
   తల్లి ప్రేమకు బదులుగ తనివి దీర
   యెదను జీల్పఁ గనంబడు హేమమణులు

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి 2. నీవార శూకవత్తన్వీపీతా ....


  సర్వ జీవుల యునికికి సత్య మైన
  యెదను జీల్పఁ గనంబడు హేమమణులు,
  రత్న హారముల వలెను రమ్య మైన
  కాంతి,యగ్రాహ్యుని కరుణ గద జిలేబి‌!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'యగ్రాహ్యుని' అన్నచోట గణదోషం. సవరించండి.

   తొలగించండి

  2. కంది వారు

   నెనర్లు

   యగ్రాహ్యుని కరుణ

   యగ్రాహ్యు ఇంద్ర గణం రాదాండీ ?

   జిలేబి

   తొలగించండి
  3. కాంతి / యగ్రాహ్యు / నికరుణ / గదజి / లేబి‌!

   గణములు సరిగా నున్నవనుకుంటా...

   క్షమించండి...

   తొలగించండి
 3. డా.పిట్టా
  సదయుని గుండె చప్పుడును సాగరఘోషయు నొక్కటటౌ జుమీ!
  "పద"మని తీరమాను "నల"బాపగ నీ నరజాతి దుఃఖమున్
  సదనమునిండ భాగ్యములె సాగడు సత్కృతినెంచ లోభి త
  త్హృదయము జీల్ప రత్నములు హేమ మణుల్ గనవచ్చు నంతటన్

  "రామ"యనువానిబ్రోచు వరాల తండ్రి
  హనుమ జూపె గుండెను జీల్చి హరిని,రమను
  కనక, మణి జతనంబునకైన జీవి
  ఎ(యె)దను జీల్ప గనంబడు హేమ,మణులు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'పద మని తీరమాను నల బాపగ...' ఇది అర్థం కాలేదు..

   తొలగించండి
  2. డా.పిట్టా
   పద యని తీరమునాను అల అనే భావం కాని నడకలో నిముడలేదు.పదమనికి బదులు "పదయని" అనవలసియుండెను.తీరమాను కు బదులు"తీరమేగు అ(య)ల గా సవరణ చేస్తే బాగుంటుందేమో.అలఉరకలు వేస్తూ సేవకై ముందుకు వస్తున్నాయి.కొన్ని పదార్థాలను ప్రజాళికి యిస్తాయి.తరంగాల నుండి electricity ఉత్పత్తి చేయవచ్చునట.ఇది ఒక ఉపకారం.ఆ భావం అందరు భాగ్యవంతులలో లేదని contrast గా యెంచుకోవాలనే ప్రయత్నం లో అలా భావించాను కాని వ్యక్తీకరణ రాలేదేమో,ఆర్యా

   తొలగించండి
 4. డా.పిట్టా
  "ట" మొదటి పాదం లో టైపాటుగా నెంచ మనవి..ఆర్యా

  రిప్లయితొలగించండి
 5. బీరు వాలోని 'చెస్టు ' లో బీరుబోక
  దాచియుంతురు సంపదల్ దారుణముగ
  నల్ల ధనమును మార్చుక, నయమునట్టి
  యెదను జీల్పఁ గనంబడు హేమమణులు.

  రిప్లయితొలగించండి
 6. "స్పుష్ట వక్తా న వంచకా" సూక్తి విలువ
  తెలుసు కొన్నను చాలును తెల్లమగును
  పలుకు కాఠిన్య మైనను బరగ జనుల
  "ఎదను జీల్పఁ గనంబడు హేమమణులు"

  రిప్లయితొలగించండి
 7. చదువుల సారమున్నెఱిగి సాంతము జీవిత మెంచి జూడగన్
  కదలిక లేక యుండుగా; కదిపి గాంచిన తెల్లమౌనుగా
  ఎద యెదలోపలన్ గలుగు నీసునసూయల చాటు మాటుగన్
  "హృదయముఁ జీల్ప రత్నములు హేమములున్ గనవచ్చు నంతటన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   వృత్తం రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. కంది శంకరయ్య గారూ!ధన్య వాదాలు. సవరిస్తాను.

   తొలగించండి
 8. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  పదినెలలున్ భరి౦చి , యటుపై కని ,

  ………… ని౦ జిన నాటి ను౦డియున్

  సదమల మైన ప్రేమ c బరిచర్యల c బె౦చెడు

  …………… మాతృ దేవతా

  హృదయము జీల్ప రత్నములు హేమములున్

  ………… గనవచ్చు న౦తటన్ |

  వదలకు మోయి తల్లి పయి భక్తిని ,

  ………… ప్రేముడి ( న్) జీవితా౦తమున్


  { ప్రే ము డి = పె ద్ద ల యె డ ల పి న్నల కు

  గ ల ప్రే మ }

  రిప్లయితొలగించండి
 9. వేద విజ్ఞానమంతయు పేర్చినారు
  ఋషి విరచితంపు కావ్యమ్ములినుమడించ
  మాటలందు దాగిన మహిమాన్వితంపు
  యెదనుఁ జీల్ప గనంబడు హేమమణులు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మహిమాన్వితంపు టెదను...' అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ: వేద విజ్ఞానమంతయు పేర్చినారు
   ఋషి విరచితంపు కావ్యమ్ములినుమడించ
   మాటలందు దాగిన మహిమాన్వితంపు
   టెదనుఁ జీల్ప గనంబడు హేమమణులు.

   తొలగించండి
 10. రక్త నాళముల్ ధమనులు రక్తి గలుగ
  నె దను జీ ల్ప గనంబడు, హేమ మణులు
  ధగధగ లుగను మెఱయుచు దలుకు లొలుక
  కాంతి పుంజముల్ వెదజల్లు గగన పరిధి

  రిప్లయితొలగించండి
 11. హృది ఘన కౌస్తుభంబు నిడి హేమకిరీటము దాల్చెడిన్ శత
  హ్రదమణి రత్న కంకణ విరాజిత భూషుని ధ్యానమందుచున్
  సదమల వృత్తినన్ పరవశంబున రంజిలు సుప్తచేతనా
  హృదయముఁ జీల్ప రత్నములు హేమములున్ గనవచ్చు నంతటన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణికుమార్ తాతా గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వృత్తినిన్' అనండి.

   తొలగించండి
  2. గురువుగారూ నమస్సులు. మీ సవరణకి ధన్యవాదములు.

   తొలగించండి
 12. రిప్లయిలు
  1. ఉదరము నంద కాదు సకలోన్నత పర్వత సంచయంబులన్
   సదమల పుష్క రాకలిత సాగర గర్భము లందుఁ బొందరే
   విదళిత మైన వేదన నుపేక్ష వహింపదు రత్నగర్భ స
   ద్ధృదయముఁ జీల్ప రత్నములు హేమములుం గనవచ్చు నంతటన్


   సదమల మనో వికాసుల హృది నివాసు
   లా పరమ పావన హరి భక్తాగ్ర మునులు
   మదన బాణార్త విరహంపు మనుజులఁ గని
   యెదను జీల్పఁ గనంబడు హేమమణులు

   [హేమమణులు= నారీరత్నములు]

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మనోహరమైన పూరణలు. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 13. ముదమును గూల్చి దుండగులు మూర్ఖత మీరగ దుర్మదాంధులై
  హృదయముఁ జీల్ప, రత్నములు హేమములున్ గనవచ్చు నంతటన్
  సదమలభావనాయుతుల సాధుజనావళి నీయుగంబునన్
  సదయుల భారతావనిని శంక యొకింతయు లేదు నిత్యమున్.
  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. పరులసొమ్ములను హరించి బస్సులోన
  పోరి పోలీసు కనుగప్పి పోవుచుండె
  పడతిని నిలువరించి వే పైట కొంగు
  నెదను జీల్పఁ గనంబడు హేమమణులు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. రాముడె తన సర్వస్వమై రాజిలునని
  పలికి మారుతి మదిలోన భక్తి నిలిపి
  ఎదనుజీల్ప గనంబడు హేమమణులు
  పొదిగినట్టి మాలనరామ పూరుషుండు

  రిప్లయితొలగించండి

 16. భవజలధిని మమతలను పాశములను
  జ్ఞానమంథదండమ్ముకు గట్టి చిలుక
  మనుజు డవధూతగా మారి మాయమగువ
  యెదను జీల్చ గనంబడు హేమమణులు

  రిప్లయితొలగించండి
 17. పసిడి పంటలు పండించ పంటకాపు
  పొలము దున్నగ కరమున హలము బూని
  లక్షణంబగు తల్లియా రత్నగర్భ
  యెదను జీల్ప గనంబడు హేమమణులు !!!

  రిప్లయితొలగించండి
 18. కదనమునందు శాత్రవుల కండలు చీల్చగ యోధు లెల్లెడన్
  పదవుల వేట కాక పరిపాలన శాంతిని గూర్చ నాయకుల్
  కుదురుగ సేద్యమున్ జరిపి గూర్చగ భుక్తిని రైతు, లీభువిన్
  హృదయముఁ జీల్ప రత్నములు హేమములున్ గనవచ్చు నంతటన్

  రిప్లయితొలగించండి
 19. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ఇచ్చిన ఈ
  సమస్యకు 1966 లో నేను పంపిన పూరణము.

  అదిరెను దేశమెల్ల సరిహద్దున నుత్తరదిక్క ఘూర్ణిలన్

  కదిలెను పుణ్యదేశమును కాయగ రత్నమువంటి సైనికుల్

  వదిలిరి ద్రవ్యసంపద సువర్ణ మనస్కులు;భారతాంబ, నీ

  హృదయము జీల్ప రత్నములు,హేమములున్ గనవచ్చు
  నంతటన్.

  ( ఆ రోజులలో దేశంకోసం ప్రజలందరు బంగారాన్ని
  డబ్బును స్వచ్ఛందంగా సమర్పించిన సందర్భము)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   మీ (అప్పటి) పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 20. భూరి సిరులకు నెలవైన భూమి తల్లి
  తనువు పైన వనములు భూ ధరులు నదులు
  ఖనులు గలిగిన నాతల్లి కల్పవల్లి
  యెదను జీల్పగనంబడు హేమమణులు.

  బదులుగ నొజ్జ జెప్పె నొక ప్రశ్నకు తా పరిహాస మందునన్
  పదిలము గాను రాఘవుని పావని గుండెను జీల్చి జూపెనా
  విధమున నేటి మానవులు పెక్కురు సపద గోరుచున్ గదా
  వదలిరి మానవత్వమును స్వార్థపు చింత న తోడ వారి యా
  హృదయముఁ జీల్ప రత్నములు హేమములున్ గనవచ్చు నంతటన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   సపద... సంపదకు టైపాటు...

   తొలగించండి
 21. క్రొవ్విడి వెంకట రాజారావు:

  బంగరు గనులుండెడి నిక్క పవిదిని భువి
  నెదను జీల్చ గనంబడు హేమ మణులు
  వలెను భక్తి తన్మయులగు వారి యెదను
  గన్పడు నెపుడు పరమాత్మ కరుణ దృశలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 22. సదయుడు కాడు డబ్బనిన చావునకున్ తెగియించు భార్య సం
  పదలను దెచ్చు యంత్రమని భావన మాటికి పుట్టినింటికిన్
  వదలక పంపు తెమ్మనుచు పైడిని సొమ్ముల లేదు జాలి యా
  హృదయముఁ జీల్ప రత్నములు హేమములున్ గనవచ్చు నంతటన్.

  రిప్లయితొలగించండి
 23. సుధఁ గురిపించు మాటలను సూటిగ పేదల యోట్లఁ బొందుచున్
  పదవులనెక్కినిత్యమును ప్రాభవమొందుచు సొమ్ము బొక్కుచున్
  వెధవలు దాయుచుందురిల వేయి విధమ్ముల వారి దుష్టమౌ
  హృదయముఁ జీల్ప రత్నములు హేమములున్ గనవచ్చు నంతటన్

  రిప్లయితొలగించండి
 24. అంతు లేనట్టి సాగరమందుదూరి
  యెదను చీల్చ కనంబడు హేమమణులు
  కష్టమనుచు వీడకచేయ కార్యములను
  సత్వరంబె సఫలమగు సదయులార.

  రిప్లయితొలగించండి
 25. స్వర్ణభూమిని నమ్మిన వర్గమేగ
  రైతులనువారు జూడగారాజులనిరి|
  పంట భూమిన నిధులెన్నొకంట బడును
  ఎదను జీల్ప ?గనంబడు హేమమణులు|
  2.హృదయ సామ్రాజ్య మందున పదిల మైన
  చదువు లందున దాగున్నసంపదలనె
  ఎదను జీల్ప గనంబడు హేమ మణులు
  పాలు తోడుంచ?నెయ్యిలాబయట బడును|
  3.సత్తువున్నట్టి భూమిలో విత్తులేసి
  పంటబండించి ధరకమ్మి ప్రధముడయ్యు
  విపణి యందున పేటికా విలువలున్న
  ఎదను జీల్ప గనంబడు హేమ మణులు
  చదువును సంస్కరించుటకుచక్కటి మార్గముసంపదౌనుగా|
  పదిలముగాను బంచగల భావితరాలకుధర్మ భూమియే
  నిధులను,నిత్యసౌఖ్యముల నిల్వల పేటిక| మూలమెంచియే
  హృదయము జీల్ప రత్నములు,హేమములున్ గనవచ్చు నంతటన్|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'సత్తువ+ఉన్నట్టి' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. 'సత్తువ గలుగు భూమిలో...' అనండి.

   తొలగించండి
 26. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సహజముగ వనరుల నిచ్చి సాయ మిడెడి
  భూతధారిణి నెంతయు పొందు గూడి
  భక్తి సంసేవ లొనరించి పన్ను నామె
  నెదను జీల్చ గనంబడు హేమ మణులు.

  రిప్లయితొలగించండి
 27. క్రొవ్విడి వెంకట రాజారావు:

  గురువు గారికి నమస్కారములు. అనారోగ్య రీత్యా గత నాలుగు రోజులనుండి పూరణలు పంపలేక పోయాను. ఇప్పుడు పంపుతున్నాను. నాయందు దయయుంచి పరిశీలించ గోర్తాను.

  (22-11-2016):

  మట్టును గూడని విధమున
  గుట్టుగ దాచిన ధనమును గుఱుతించు వడిన్
  పెట్టెల నిండుగ ముడుపుల
  కట్టలు గలవారి బాధ కంజుడెఱుగునా?

  (23-11-2016):

  హవణిక దోడ రహించెడి
  నవకము గూడిన పదముల నాలాపనముల్
  సవురుగ బఱచి నదాటున
  భువి వీడితివేల బాలమురళీకృష్ణా?

  (24-11-2016):

  సతము విపరీత మనదగు
  వితమున యతిశయ పలుకులు బేర్చుచు దిరిగే
  అతగుడనుచు బేరొందిన
  మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ?

  రిప్లయితొలగించండి
 28. ఎదుటి వానిని పరికించి మదిని గెలువ నిగుడ నాతని నీదరి నిలుపు కొనుచు
  వ్యధల ద్రుంచగ సుస్నేహ పథము లోన
  నెదను జీల్చ గనంబడు హేమ మణులు!

  రిప్లయితొలగించండి
 29. హలము జేపట్టి భూమిని కలియ దున్ని

  పంట పండించి ముక్కారు ఫలము పొంద

  రైతు నమ్ముకున్నట్టి యా రత్నగర్భ

  నెదను జీల్ప గనంబడు హేమమణులు.

  రిప్లయితొలగించండి
 30. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి నా పద్యార్థములను పరిశీలించినట్లు తలుస్తాను. మీ యామోదమున కై యెదురు చూచు చున్నాను.

  రిప్లయితొలగించండి
 31. సవరణ:"కదలక యుండుగా కదిపి గాంచిన వేగమె తెల్లమౌనుగా".

  రిప్లయితొలగించండి
 32. సదమల హిందుమాతృకను చల్లగ మెల్లగ కొల్లగొట్టుచున్
  కుదురుగ కోహినూరులను కుప్పలు గుట్టలు తస్కరించుచున్
  హృదయ విదార కమ్మయిన రీతిని దోచిన నాంగ్ల రాక్షసిన్
  హృదయముఁ జీల్ప రత్నములు హేమములున్ గనవచ్చు నంతటన్

  రిప్లయితొలగించండి