4, నవంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2189 (తనయుఁడు తమ్ముఁ డయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తనయుఁడు తమ్ముఁ డయ్యె నది తప్పగునో మఱి యొప్పునో సఖీ"
లేదా...
"తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ దప్పో యొప్పో"

73 కామెంట్‌లు:



  1. పినతల్లి కైక ముద్దుల
    తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ, దప్పో యొప్పో
    తనకై కోరెను వరమ
    మ్మ నన్నరణ్యమునకేగమనుచున్ గాదే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      పూరణ బాగున్నది.
      చివరి పాదం ప్రారంభంలో కొంత అస్పష్టట, అన్వయలోపం ఉన్నవి.

      తొలగించండి
  2. ఆర్యా! ఇది ఉన్న మాట! స్మార్తుడనైన నేను దూరాభారమైన మధ్వుల కన్యను వివాహమాడి లెఖ్ఖలుగట్టగ తను నాకు వేళ్ళు విడిచిన కూతురాయె!!!



    తన మతమును తన కులమును
    తన శాఖను తలనుదన్ని తత్తర బిత్తై
    తన పిన్నిని పెండ్లాడగ
    తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ దప్పో యొప్పో!


    మనువులు దొరకని ఈకాలం అన్నీ తార్మారే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా కనిష్ఠ మేనమామ గరిష్ఠ పుత్రిక, నా భార్య కనిష్ఠ పినతాత గారి కనిష్ఠ పుత్రిక, తీరాజూస్తే ఒకే ఇంటి కోడళ్ళయ్యారు! ఏదీ ప్రేమ వివాహం కాదు...ద్రావిడులూ మధ్వులూ కలగాపులగం!

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది.

      తొలగించండి
  3. అనునయ ముగకోరె దుహితను
    తనయులు నీకుండె గాన దత్తత నొకనిన్
    వినయమ్మున తల్లి కీయగ
    తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ దప్పో యొప్పూ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. 'అనునయముగ గోరె సుతను' అనండి.

      తొలగించండి
    2. అనునయ ముగకోరె సుతను
      తనయులు నీకుండె గాన దత్తత నొకనిన్
      వినయమ్మున తల్లి కీయగ
      తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ దప్పో యొప్పో

      తొలగించండి
  4. వినయ గుణంబు నెన్నటికివీడనివీడనఁనాకుఁ బ్రాణమే
    అనయము నాకు, నీతడు మహార్ణవశాయి కిశేషునట్లు నౌ,
    మనకు సుపూజ్య యౌచుఁ నిజమాతకు సాదృశయౌ సుమిత్రకున్
    తనయుఁడు తమ్ముఁడయ్యె నది తప్పగునా మఱి యొప్పగునా సఖీ"

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    తన తల్లి యొరిగె రోగిగ
    తనయుడు తన బాగు జూచు తల్లిం గొన మా
    ర్మనువున కోడలు చెలియలె!?
    తనయుడుతన తమ్ముడయ్యె తప్పో యొప్పో?!
    మననము జేసితిన్ జటిలమాయె సమస్యయె, పాలివారికిన్
    విన నపహాస్య హేతువగు వీడరు స్వార్థము దాన లాభమే?
    కనుగొనె యుక్తకాయుడగు కన్న సుపుత్రుడె దారి జూపె బో!
    తనయుడె తమ్ముడయ్యె నది తప్పగునా మరి యొప్పగున్ సఖీ?!

    రిప్లయితొలగించండి
  6. యముని తలపులలో...

    మునిసేవకు వరమందుచు
    వర పుత్రునిఁ గుంతి పొందె భానుని వలనన్
    తను నాతో భీమునిఁ గన
    తనయుఁడు తన తమ్ముఁడయ్యెఁ దప్పో యొప్పే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. రెండవపాదములో ప్రాస ?
      'గనె పుత్రుని కన్య కుంతిగ్రహపతి వలనన్'
      అనవచ్చా

      తొలగించండి
    3. ధన్యవాదాలు! నేనా దోషాన్ని గమనించలేదు. మీ సవరణ బాగున్నది.

      తొలగించండి
    4. సహదేవుడుగారు మీ యూహ యద్భుతము. కాని ధర్మజుఁ గన అనండి. అలాగే ప్రాస గూడ మార్చాలి రెండవ పాదములో.

      తొలగించండి
    5. గురుదేవులకు, కవిమిత్రులకు ధన్యవాదములు.తమరి సూచనలననుసరించి సవరించిన పూరణ:

      యముని తలపులలో...

      మునిసేవకు వరమందుచుఁ
      గనె పుత్రుని కన్య కుంతి గ్రహపతి వలనన్
      తను నాతో ధర్మజుఁ గన
      తనయుఁడు తన తమ్ముఁడయ్యెఁ దప్పో యొప్పే?

      తొలగించండి
  7. వినుడీ వరుసలు ! పితరుని
    తనయుడు తన తమ్ముడయ్యె! దప్పో యొప్పో
    యన, పిన్నగుచో యొప్పగు!
    తనకు మునుపె పుట్టెనేని తన యన్న యగున్!

    రిప్లయితొలగించండి
  8. విన భారతీయులందరు
    మనకు సహోదరులగుదురు మరియా విధమున్
    గన నిట్లనవలె గాదా!
    తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ దప్పో యొప్పో"

    రిప్లయితొలగించండి
  9. ......మఱి యొప్పగున్ సఖీ అని ఉండాలి టైపాటు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      ధన్యవాదాలు. గుండు మధుసూదన్ గారు కూడా ఫోన్ ద్వారా గణదోషాన్ని తెలియజేశారు. సవరించాను.

      తొలగించండి
  10. వనమున కేగుచు,కైకకు
    తనయుడుతనతమ్ముడ య్యె తప్పోఒప్పో
    తనరాజ్యము పాలించగ
    అనుజుడు భరతుడె సమర్దు డనిరాముడనెన్

    రిప్లయితొలగించండి
  11. తన సుతు నేమని యందురు?
    తన తదుపరి తోడబుట్టు తనయుండేమౌ?
    తన యన్న తండ్రి సముడగు!
    తనయుడు, తన తమ్ముడయ్యె, దప్పో యొప్పో!

    రిప్లయితొలగించండి
  12. తనసఖి తోననెన్ యొకతె తమ్ముడు నత్తరి బెండ్లియాడగన్
    వినుమిది వావియున్ వరుస వీడి చరింపగ క్రిందుమీదునౌ
    మునుపటి కాలమందు మును ముందుగ జూచిరి జాగరూకతన్
    "తనయుఁడు తమ్ముఁ డయ్యె నది తప్పగునా మఱి యొప్పగునా సఖీ"


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      'అనెన్+ఒకతె' అన్నపుడు యడాగమం రాదు. 'తన సఖితోడ బల్కె చెలి...' అందామా?

      తొలగించండి
    2. ధన్యవాదాలు ! తెలుగు పాఠాలు చదివి నలభై రెండేళ్ళు కావస్తున్నది.(రాజనీతి శాస్త్రం వాళ్ళం) ఎప్పుడు నేర్చుకుంటామో ఈ యడాగమ, నుగాగమ, సరళాదేశ, ధృత,టుగాగమ,పుంప్వాదేశ etc సంధులు!

      తొలగించండి
  13. దినకరుని కుమారుడనని
    యనిరుద్ధుడు దెలుప దెలిసె ; నా ధర్మజుడే
    యనుజుండ గునట ! కుంతీ
    తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ దప్పో యొప్పో

    రిప్లయితొలగించండి
  14. విను,భానుడి వరమున నీ

    జననము నా కుంతి వలన సంభవమొందె

    న్నన, కర్ణుడనియె కుంతీ

    తనయుడు తన తమ్ముడయ్యె దప్పోయొప్పో!

    రిప్లయితొలగించండి
  15. మాఅమ్మగారి పెదన్నాన్న మగపిల్లలు లేరని కూతురు కొడుకుని దత్తత తీసికొని యింటి పేరుకూడా మార్చి ఆస్తిని వ్రాశాడు.
    సమస్యః తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ దప్పో యొప్పో
    తనయులు లేరంచు నొకడు
    తనూజ పుత్రుఁగొన దత్తత తలోదరికిన్
    తన గర్భమునను పుట్టిన
    తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ దప్పో యొప్పో

    రిప్లయితొలగించండి

  16. హనుమయు,భీముడు,పవనుని
    తనయులవగ తగునటన్నదమ్ము లనంగన్,
    హనుమకు,విజయుడు,కుంతీ
    తనయుడు తన తమ్ముడౌట తప్పో?,యొప్పో?

    రిప్లయితొలగించండి
  17. కన మిల నిట్టి వాని నికఁ గన్నుల నిక్కలి కాల మందునన్
    వినయ విధేయ తాది గుణ విశ్రుత సచ్చరి తాంత రంగుడే
    యనయము దైవ చింతనము నాకలి దప్పులె రుంగ డమ్మ శాం
    త నయుఁడు తమ్ముఁ డయ్యె నది తప్పగునో మఱి యొప్పునో సఖీ

    [నయుడు= నీతిపరుడు]


    తన వారన్న న్గిట్టదు
    తన మాటయె కాని యొరుల తలపుల వినడే
    వినయమ లేని వదరుఁబో
    తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ దప్పో యొప్పో

    [వదరుఁబోతు+అనయుఁడు; అనయుడు = నీతిలేనివాడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      విలక్షణమైన విరుపులతో మీ పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  18. 04.11.2016.శంకరాభరణము.సమస్య:తనయుడు తన తమ్ముడౌటతప్పో,యొప్పో.
    పూరణ:హనుమయు,భీముడు,పవనుని
    తనయులవగ తగునటన్నదమ్ము లనంగన్,
    హనుమకు,విజయుడు,కుంతీ
    తనయుడు తన తమ్ముడయ్యె? తప్పో?,యొప్పో?

    రిప్లయితొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తనకు పినదండ్రి కృష్ణుని
    తనయుడు తన తమ్ముడయ్యె దప్పో యొప్పో
    నను సంశయమే వలదిట
    ననుజుండౌ నాతడు దన నన్నను గొల్చున్.

    గురువుగారూ! నమస్కారములు. మీకోరిక ఏదైనా నెరవేర్చుటకు నేను సిద్ధం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      '...యొప్పో యను సంశయమే...' అనండి.
      మీరు క్షేమంగా మాతృదేశానికి తిరిగివచ్చారు. అంతకంటే వేరే కానుక ఏముంటుంది? నిన్న ఏదో సరదాగా అన్నాను సుమా!

      తొలగించండి
  20. వినుడొక నాటకంబునను విజ్ఞత మీరగ పాత్రధారులై
    జనకుడు దత్సుతుండు కడు సంతస మందుచు చేరి యుండ నా
    ఘనతర మైన కార్యమున గాంచగ నా సమయాన దండ్రికిన్
    తనయుఁడు తమ్ముఁ డయ్యె నది తప్పగునో మఱి యొప్పునో సఖీ.

    కనుడొక నాటక మందున
    ఘనతరముగ నటన చేయ కడగిరి వారల్
    జనకుడు సుతు డవ్వేళను
    తనయుడు తన తమ్ముడయ్యె తప్పో యొప్పో.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  21. ఘనముగ శౌరి సత్యయుగకాలమునన్ గొనె పంటతొయ్యలిన్
    జననము నొంది భూమిసుత జానకిపెండిలియాడె పిమ్మటన్
    కనుగొన వారి బంధమును కన్పడు భూమిజ యైన సీతకున్
    తనయుఁడు తమ్ముఁడయ్యె నది తప్పగునా మఱి యొప్పునో సఖీ

    రిప్లయితొలగించండి
  22. వినుమా యిది యెట్లగు నిల
    ద నయుడు తన తమ్ముడయ్యె దప్పో యొప్పో
    వినగనునింపుగ లేదిది
    వనజా !మఱి నీవచె ప్పు వరుసలు గుఱిచి న్

    రిప్లయితొలగించండి
  23. అనిలుని యంశను బుట్టిన
    తనయుడు తన తమ్ముడయ్యె తప్పో యొప్పో
    భానుజుడ నేను కుంతికి
    తనయుడనైతినియటంచు తా వెత నొందెన్.

    ఇనున కేమగు కర్ణుడు
    అనిలునకేవరుసయయ్యె నర్జునుడచ్చో
    వినినంతనె విస్మయమగు
    తనయుడు,తన తమ్ముడయ్యె తప్పో యోప్పో

    రిప్లయితొలగించండి
  24. అనిలుని యంశను బుట్టిన
    తనయుడు తన తమ్ముడయ్యె తప్పో యొప్పో
    భానుజుడ నేను కుంతికి
    తనయుడనైతినియటంచు తా వెత నొందెన్.

    ఇనున కేమగు కర్ణుడు
    అనిలునకేవరుసయయ్యె నర్జునుడచ్చో
    వినినంతనె విస్మయమగు
    తనయుడు,తన తమ్ముడయ్యె తప్పో యోప్పో

    రిప్లయితొలగించండి
  25. మనకిలఁజెప్పెనే పితృసమానుడు జ్యేష్ఠుడటంచు వేదముల్
    తనరగనైదుమందియగు తల్లులలో వదినన్ గణించుచున్
    ఘనతరవేదసూక్తుల ప్రకారముగా విని యాచరింపగన్
    తనయుఁడు తమ్ముఁ డయ్యె నది తప్పగునా మఱి యొప్పగున్ సఖీ ||

    పితృ సమో జ్యేష్ఠః

    రాజపత్నీ గురోఃపత్నీ జ్యేష్ఠభ్రాతుః కుటుంబినీ
    పత్నీమాతా స్వమాతాచ పంచైతాః మాతరః స్మృతాః ||

    అనవద్యుని జ్యేష్ఠభ్రా
    తను వేదములున్ వచించె తండ్రికి తుల్యుం
    డని గణియింపగనవ్విధి
    తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ దప్పో యొప్పో ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.అనిల్ కుమార్ గారు నమస్సులు. సందర్భోచితముగ శ్లోకరత్నాని అందించారు. ధన్యవాదములు.
      చక్కని పద విభజనతో పూరించారు.
      తమ్ముడు తనయుఁ డయ్యెను అది.....

      ఈ సందర్భముగా నా పోచిరాజ శతకములోని యీ పద్యములను తిలకించండి.


      జనకుండు భయత్రాతా
      శనదాత సహానుయోక్త చను దండ్రి యనన్
      వనితకు నల్వురు నుపనే
      త నరునకుం బోచిరాజతనయా వినుమా


      జననీ జనకులు విజ్ఞత
      నొన గూర్చుగురువు గురుత్ర యోచ్చారితులై
      చన వారలమించు గురువు
      దన కెప్పుడు పోచిరాజతనయా వినుమా

      తొలగించండి
  26. ఆర్య! కామేశ్వరరావుగారూ! అనేక నమస్కారములు. ధన్యవాదములు. మీ అనువాదపద్యములు చాలా బాగున్నవి. ప్రాసకై తెచ్చిన అశనదాత పద ప్రయోగం మఱియు మకుటం అద్భుతంగా ఉన్నవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.అనిల్ కుమార్ గారు ధన్యవాదములు.
      భారతములో కణ్వ మహర్షి జనకుడు, అన్నప్రదాత, భయత్రాత మువ్వురు వనితకు నుపనేత, నిరంతరాధ్యాపకులతో పురుషునకు నేవురు గురువులన్నారు. అయితే ప్రస్తుత కాల ధర్మ మనుసరించి వనితకు కూడా నధ్యాపకుని కలిపితిని.

      తొలగించండి
    2. ఆర్య! వనితకు కూడ ఉపనయనము చేయుట, సావిత్రీ మంత్రోపదేశము చేయుట కలదు. స్త్రీలకు వివాహమైన పిదప భర్త మౌంజీ ధారణము చేస్తాడు. అది ఉపనయన సమానమే. పురుష శబ్దానికి "పురే సంచరతి ఇతి పురుషః" అని వ్యుత్పత్తి. పురం ద్వారం తు గోపురం అని పర్యాయపదాలు. పురం అంటే రంధ్రము. నవరంధ్రాలలో శ్వాసక్రియ జరుగును కావున పురుష శబ్దమేర్పడినది. మనిషి అనే అర్థాన్ని ఇస్తుంది. అందుకే స్త్రీలందు పుణ్యస్త్రీలు వేరయా అని అనలేదు.

      ఐతే మీరు ప్రత్యేకించి చెప్పినందున సౌందర్యవంతంగా ఉన్నది. ప్రాచీనకాలంలో ఆశ్రమాలలో స్త్రీలు గురువుల వద్ద వేదాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేసినారు.

      తొలగించండి
    3. డా.అనిల్ కుమార్ గారు చక్కటి విషయాలను ప్రస్తావించితిరి. ధన్యవాదములు.

      తొలగించండి
  27. కనుగొంటిమిబంధుత్వము
    మనువాడిన భార్య వరుస మాతకు చెల్లే
    అనుకొనగా మాయిద్దరి
    తనయుడు తనతమ్ముడయ్యె దప్పో యొప్పో
    2.దినములు మారిపోయె పరదేశమునందలి తీరు తెన్నుతో
    మనుగడ యందు మోసమున మాతగ మారియుకన్నపుత్రునిన్
    యునికిని నాశ్రమానగని నుద్గత మందున బల్కెనొక్కతే
    తనయుడు తమ్ముడయ్యె|నదితప్పగునో మఱి యోప్పునోసఖీ
    ఘనతను కప్పి పుచ్చగలకల్మష భాషణ పల్కెతల్లియే|


    రిప్లయితొలగించండి
  28. తనకొడుకు పెండ్లియాయెను
    తనతల్లియె గర్భవతిగ తనకడ జేరెన్
    పెనునొప్పులతో కనగా
    తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ దప్పో యొప్పో.

    రిప్లయితొలగించండి
  29. నిన్నటి నా పూరణ...

    గారాబము తో తల్లియె
    మీరుచు తన సుతుల జేరి మెత్తని బుగ్గల్
    తీరుగ నిమిరిన తోషులు
    కారా? గారమున ఘనసుఖంబులు దక్కున్.

    రిప్లయితొలగించండి
  30. తన సుతు నేమని యందురు?
    తన తదుపరి తోడబుట్టు తనయుండేమౌ?
    తన యన్న తండ్రి సముడగు!
    తనయుడు, తన తమ్ముడయ్యె, దప్పో యొప్పో!

    రిప్లయితొలగించండి
  31. కవిమిత్రులారా,
    ఈ సాయంత్రం నా కుమారుడు స్కూటర్‍పై వస్తూ ప్రమాదానికి గురి అయ్యాడు. కాలు విరిగింది. శస్త్రచికిత్స చేయాలన్నారు. అందువల్ల రెండు మూడు రోజులు మీ పూరణలను సమీక్షించలేను. ప్రతిరోజూ సమస్యలను మాత్రం ఇస్తూ ఉంటాను. గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  32. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    బ్రోవగ జా గదేల ? ఫణిభూషణ ! శ౦కర !

    ………… నిన్ను మి౦చి యే

    దేవుడు లేనె లేడని , మదిన్ నెరనమ్ముచు

    ………… గొల్తు భక్తి తోన్ |


    పావన నామ ! సర్వ భవబ౦ధ వినాశన !

    ………… చ౦ద్ర మౌళి ! దీ

    నావన ! నీలక౦ఠ ! కరుణాకర !

    ………… భక్త వశ౦కరా ! శివా !


    """"""""""""""""""""""""""""""""""""""""

    నీవే గద నా ప్రాణము

    నేవే నా తోడు - నీడ నిజముగ | నీవే

    జీవము | ధవునిన్ మి౦చెడు

    దేవుడు లేడ౦చు నమ్మి , తిరముగ గొల్తున్

    ( జీవము = బ్రతుకు )

    రిప్లయితొలగించండి
  33. మిత్రులందఱకు నమస్సులు!

    [తన చిన్ననాఁటి స్నేహితురాలితో తన భార్య చెల్లెలి భర్త గూర్చి ముచ్చటించుచున్న యొకానొకని మాటలు]

    వినయము, సాధువర్తనము, విజ్ఞత వీడియు సంచరించుచు,
    న్ననయము కయ్యమాడుచును, నందఱఁ జొక్కిడి, నాదు ధర్మ ప
    త్న్యనుజనుఁ బెండ్లియాడి, యిఁక నాకును బంధుఁడయెన్; గనంగ వీ

    త నయుఁడు, తమ్ముఁ డయ్యె, నది తప్పగునో, మఱి యొప్పునో సఖీ!

    రిప్లయితొలగించండి
  34. దినమొక గండ మాయెనున దేమిటి చిత్రమొ పాలుద్రాగడే
    తనయుఁడు;..తమ్ముఁ డయ్యె నది తప్పగునో మఱి యొప్పునో సఖీ
    వినకయె నింజినీరిచట వీధులు చిమ్మిరి సీనియర్లహో!
    కనుమిక నా మగండటును కమ్మగ జారును నైటుక్లబ్బుకున్

    రిప్లయితొలగించండి