30, నవంబర్ 2016, బుధవారం

సమస్య - 2213 (మాధుర్యము లేని భాష...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మాధుర్యము లేని భాష మన తెలుఁగు గదా"
లేదా...
"మాధుర్యం బిసుమంత లేనిది గదా మా యాంధ్ర మీ భూమిపై"
గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలతో....

66 కామెంట్‌లు:

  1. ఆధునిక భాష లివియే:
    మేధావులకు రుచి: "జావ"; మేతకు: "కోబాల్";
    బాధాకరములుర...వినా
    మాధుర్యము!...లేని భాష మన తెలుఁగు గదా!

    రిప్లయితొలగించండి


  2. ఆధారంబును కోలుపోయె జనులున్నాంగ్లమ్ము నాడంగనౌ
    ఖేదంబాయెను రాజపోషకులు తాకీదివ్వ సీ పో యన
    న్రాదారుల్గనె మాతృభాష, సిలికానాంధ్రాన సన్మానియై ,
    మాధుర్యం బిసుమంత లేనిది గదా మా యాంధ్రమీ భూమిపై!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. వ్యాధింబొందుచు నాంగ్లనామకమహావ్యామోహభూతంబుచే
    బాధింపంబడుచుండి తెన్గున సుతున్ భాషింపగా నడ్డుచున్
    మేధ:పూర్ణుల మైతి మెల్లగతులన్ మేమన్న నవ్వారికిన్
    మాధుర్యం బిసుమంత లేనిది గదా మా యాంధ్ర మీ భూమిపై.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. ఆధిగ నాంగ్లా కాంక్షయె
    బాధించుచునుండ దీని బలుకుటనైనన్
    వ్యాధిగ దలచెడి వారికి
    మాధుర్యములేని భాష మన తెలుగు గదా.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఆదాయంబుల నివ్వని
      సాదా సీదా జిలేబి చాలిక వలదోయ్
      రాధా, నుపయోగంబను
      మాధుర్యము లేని భాష మన తెలుఁగు గదా!

      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. డా.పిట్టా
    మాధుర్యంబదె సంస్కృతంబు విరువన్?!మన్నున్ సపాశ్చాత్య వి
    చ్చేధంబారయు పల్కులున్ కరడముల్ ఛిన్నంబు భిన్నంబులౌ
    వేధల్ బ్రోదిని జేయ దక్షిణమునన్ విప్పారె సత్సంస్కృతిన్
    క్ష్మా ధుర్యంబిసుమంత లేనిది గదా!మా యాంధ్రమీ భూమిపై
    కరడము॥అల T.Sలో అక్షరాల గుణితాలు,పలుకులకు నలల వంటివే.వేధ॥విద్వాంసుడు.క్ష్మా॥రాక్షసి వి.ణ.రక్కసి జాతికి చెందిన.ధుర్యము॥బరువు మోసెడి యెద్దు.వెరసి॥రక్కసి మోత యైన భారము.ఇది తెలుగు భాషకు లేదను భావం.
    సాధారణ నుడియొడిలో
    వేధార్ణవ ప్రతిభ నింప వీలై దనరెన్
    ఆధారము సం స్కృతము సు
    మా! ధుర్యము(యెద్దు మోత)లేని భాష మన తెలుగు గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. డా.పిట్టా నుండి
    ఆర్యా, ఇండోయూరోపియన్ భాషలు పాశ్చాత్య భాషలు.భ్రాతృ॥brother.పితృ॥prater father గా మారడం వల్ల సంస్కృతాన్ని విరువగా యేర్పడినవి ఆ భాషలు.తల్లి సంస్కృతిని విరిచి వేస్తే spelling,pronunciation లలో తేడాలు వచ్చి వారి భాషలలో త్రికరణ శుద్ధి లోపించింది.తెలుగులో వ్రాత ఉచ్ఛారణ ఒకే విధంగా ఉంటాయి.మనవారందరికి తెలిసిన విషయమే

    రిప్లయితొలగించండి
  8. కం.మేధావులు మెచ్చు కొనరు
    మాధుర్యము లేని భాష;మన తెలుగు గదా
    సోధాహరణముగ నుడువ
    సాధారణ భాష కాక చవులూరించున్.

    రిప్లయితొలగించండి
  9. బాధిం చెడివ్యాకరణము
    సాధిం చునుయతి మైత్రి సమా సమ్ముల్
    మోదము నిండుగ నాంగ్లము
    మాధుర్యము లేని భాష మన తెలుఁగు గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలొ గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. బాధిం చెడివ్యాకరణము
      సాధిం చునుయతి మైత్రి సరిలే కున్నన్
      మోదము నిండుగ నాంగ్లము
      మాధుర్యము లేని భాష మన తెలుఁగు గదా

      తొలగించండి
  10. మాధుర్యంబుననుండగ
    మాధుర్యములేనిభాషమనతెలుగుగదా
    యాధారంబులుసూపక
    బాధనుగలిగించునటులబలుకుటమేలా?

    రిప్లయితొలగించండి
  11. మాధుర్యంబిసుమంతలేనిదిగదామాయాంధ్రమీభూమిపై
    యాధారంబులుసూపకిట్లుపలుకంహాయేమినాయంబుసా
    మీ!ధీరంబునుగోలుపోయియిటులంమీరిట్లుమాట్లాడగా
    బాధల్ నొందెనుమామనంబులిటులంబాధించనోర్వంగమే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పలుకంగా యేమి..., ధీరత్వము గోలుపోయి.., బాధల్ పొందెను.. ' అనండి.

      తొలగించండి
  12. శోధనముచేయ నితరులు
    ఆదరమేలేకపోయె నాంధ్రావనిలో
    వేదనగా తలచ యువత
    మాధుర్యము లేని భాష మన తెలుఁగు గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆధిక్య మమర గలదను
    బోధనతో నాంగ్ల మనెడి పొల్లగు భాష
    న్నధ్యయన మెంచు వారికి
    మాధుర్యము లేని భాష మన తెలుగు గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో ప్రాసదోషం. సవరించండి.

      తొలగించండి
    2. గురువుగారూ! నమస్కారములు. పొరపాటయినది. పద్యాన్ని సవరించాను. దయతో పరిశీలించండి.

      ఆధిక్య మమర గలదను
      బోధనతో నాంగ్లము నిట పురుటము లాడే
      మేధా శూన్యుల కెల్లను
      మాధుర్యము లేని భాష మన తెలుగు గదా!

      తొలగించండి
  14. శ్రీగురుభ్యోనమః

    తెలుగు భాషకు ప్రాచీన హోదా విషయముగా అడ్డుకొన్న కొందరు స్వార్థపరులను దృష్టిలో పెట్టుకొని


    ఆధారమ్మగు మూల బీజములిటన్ హా యంతరించెన్ కదా
    ఫ్రాధాన్యముల నొందుచుండ నిచటన్ పాశ్చాత్య దుస్సంస్క్రుతుల్
    స్వాధీనంబును వీడి తుచ్చు లిటులన్ స్వార్థంబునన్ పల్కిరే
    మాధుర్యం బిసుమంత లేనిది గదా మా యాంధ్ర మీ భూమిపై

    రిప్లయితొలగించండి
  15. బోధించుం గద సద్వివేకపటిమన్ బూజ్యార్హతం గూర్చుచున్
    సాధించెన్ గద సద్యశంబు, కనియెన్ సర్వత్ర సద్భావనా
    మాధుర్యం, బిసుమంత లేనిది గదా మా యాంధ్ర మీ భూమిపై
    బాధం గూర్చెడి తత్త్వ మెల్లగతులం బ్రహ్లాదియై యొప్పుచున్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  16. 30.11.2016.శంకరాభరణము
    సమస్య:మాధుర్యము లేని భాష మన తెలుగు కదా
    పూరణ:1.శోధింపగ తెలుగు కవులు
    బాధింతురు సంస్కృతంపు పదఘట్టనచే
    మేధావులు మెత్తురు కద
    మాధుర్యము లేని భాష మన తెలుగు కదా
    2.బోధింపరు టెల్గు లెసన్
    క్రోధము జూపెదరు టెల్గు కూతలు వినినన్
    మేధావులైన టెల్గులు
    మాధుర్యము లేని భాష మన తెలుగు కదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  17. సాధన విదితం బుత్కట
    మేధోద్ధారణ సుకరము మేదిని సారా
    గాధపద సుఖని మిథ్యా
    మాధుర్యము లేని భాష మన తెలుఁగు గదా


    సాధింపంగఁ బటుత్వ మాంగ్లమున భాషాంతర్గ తమ్మేలనో
    బాధల్ కల్గినఁ జిట్టి పిల్లలకు నింపారంగ నమ్మాయనన్
    వేధించం బరిపాటె యాంధ్రులకు నావేశంపు చిత్తమ్ములన్
    మాధుర్యం బిసుమంత లేనిది గదా మా యాంధ్ర మీ భూమిపై!

    [అంతర్గతము= మఱవఁబడినది]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  18. 3.వేధింతురు తప్పులనుచు
    బాధింతురు యచ్చ తెలుగు భాషించంగన్
    బోధపడక నొల్లననియె
    మాధుర్యములేని భాష మనతెలుగు కదా




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బాధింతురు+అచ్చ' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. 'బాధించెద రచ్చ తెలుగు...' అనండి. 'బోధపడక యొల్ల ననియె' అనండి.

      తొలగించండి
    2. గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
      3.వేధింతురు తప్పులనుచు
      బాధించెదరచ్చ తెలుగు భాషించంగన్
      బోధపడక యొల్లననియె
      మాధుర్యములేని భాష మనతెలుగు కదా

      తొలగించండి
  19. మోదమును గలుగ జేయదు
    మాధుర్యములేని భాష,మనతెలుగు గదా
    మేధావులు గొనియాడగ
    పాదమ్ముల మధువులూరు భాషయె భువిలో!!!

    రిప్లయితొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సాధుత్వమ్మది కొరవడు
    నాధునికాంగ్లమ్ము నేర్చి నడరుచు దిరిగే
    బోధన శూన్యుల కెప్పుడు
    మాధుర్యము లేని భాష మన దెలుగు గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నేర్చి యడరుచు' అనండి. 'తిరిగే' అనడం వ్యావహారికం.

      తొలగించండి
  21. రిప్లయిలు
    1. విద్యారంగము లోనంతంత మాత్రము గా తెనుగు భాషాధ్యయనము సాగుచున్న యీ రోజులలో పద్య రచనా నైపుణ్యోత్సాహములను తోటి తెనుగు వారిలో తెనుగు భాషాభిమానులలో పెంపొందించుచున్న మన గురువు గారు కంది శంకరయ్య గా రత్యంతాభినందనీయులు.
      గురువు గారికి నా సంస్కృతపద భూయిష్ట గంభీర శబ్దార్థ విలసితము తేనె లొలుకు తేట తెనుగు మాటలతోను నిండిన పద్య సుమాంజలులు:


      కంద్యన్వ యార్ణ వాబ్ధిజ
      నంద్యాయత వాహనాఖ్య నలినజ వంశా
      మాంద్యైక నగ పుర వసన
      వంద్య సుగుణ శంకరవర పండిత మాన్యా!


      కంది వారి యింటను గనువిందు సేసి
      యంద చందములగు విద్దె లందు నెల్ల
      నంది తీ వెందును గనని మంది మెప్పు
      నందు కొనవె మా మ్రొక్కులు విందు లనగ.


      అన్నట్టు నాకు చిన్న నాడు మొట్ట మొదట ఛందమును నేర్పిన గురువు గారి పేరు పోచిరాజు భీమ శంకరము. నాకు బాల్య మిత్రుడు బంధువు కూడ. మా అమ్మ గారి పిన్ని గారి కొడుకు. పిన్ని కూతుళ్ళిద్దరు పోచిరాజు వారి కోడండ్రే యయినందు వలన నాకు మామయ్య.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      నాకంతటి ప్రశంసార్హత లేదు. అయినా పది కాలాలు జాగ్రత్త చేసికొని, మాటిమాటికి చదివి మురిసిపోయే పద్యాలను అందించారు. ధన్యవాదాలు!
      'కంద్యన్వయసాగరంలో పుట్టిన చంద్రుడనై శంకరుని శిరోభూషణం కాకుండా శంకరుడనే అయ్యాను. నా బ్లాగు శంకరాభరణం అయింది'. (మనలో మాట... మేము వైష్ణవులం. మా సోదరులకు వెంకటనారాయణ, లక్ష్మినారాయణ, సూర్యనారాయణ అన్న పేర్లు పెట్టిన మా తల్లిదండ్రులు నాకు మాత్రం శంకరయ్య అని పెట్టారు. చిత్రం! 'ఏకం సత్ బహుధా వదంతి విప్రాః' అన్నమాటను సంపూర్ణంగా నమ్మినా, నాకు విష్ణువంటే పిసరంత ఎక్కువ భక్తి!)

      తొలగించండి
  22. గురువుగారికి నమస్కారములు.
    క్రమాలంకారములో ప్రయత్నించినాను.

    ఆధారంబులు సుంత భావముననీ యాంగ్లంబు యత్యల్పమే -
    ప్రాధాన్యంబెరిగించి గ్రంధములలో ప్రాగల్బ్యముల్ జూపి ని
    ర్బోధవ్యాధి వినాశకారకమయెన్ పూర్ణప్రభావంబుతోన్
    మాధుర్యం బిసుమంత లేనిది గదా - మా యాంధ్ర మీ భూమిపై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. ఆధునికుల తలకెక్కెను
    మాధుర్యము లేని భాష , మన తెలుఁగు గదా
    ఆదరణయెతగ్గి కుములన్
    బాధించెనుగాదె మాతృ భాషా ప్రియులన్


    వాదింతుర్ గద మాతృ భాషప్రియులే పాశ్చాత్య భాషొక్కటే
    ప్రాధాన్యమ్మని యెంచుచున్ ధరణినభ్యాసమ్ము నే జేసిరా
    మాధుర్యం బిసుమంత లేనిది గదా , మా యాంధ్ర మీ భూమిపై
    మేధోవర్గము మెచ్చినట్టి దదియే మేలైనదంచందురే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. 'ఆదరణయె తగ్గి కుముల' అనండి.

      తొలగించండి
  24. బోధన విద్యాలయమున
    ప్రాధాన్యముగాగ నాంగ్లభాషనగుటచే
    సాధన కొఱవడ నొకడనె
    మాధుర్యము లేని భాష మన తెలుఁగు గదా

    రిప్లయితొలగించండి
  25. బాధనిడును వినగ నెపుడు
    మాధుర్యము లేని భాష! మన తెలుగు గదా
    మేదిని లోనన్ ప్రియమగు
    నాదములను పలుకు పలుకున చిలుకు చుండున్!

    రిప్లయితొలగించండి
  26. మేదినిఁమెచ్చరు ప్రాజ్ఞులు
    మాధుర్యము లేని భాష;మన తెలుగు గదా
    నాధార మగుచును జనులకు
    సోదాహరణంబుతోడ సొబగును పంచున్.

    అన్నయ్యగారూ నిన్నటి పద్యాన్ని చూడండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. '...నాధార మగుచు జనులకు' అనండి.

      తొలగించండి
  27. బోధించుట వినజాలక
    సాధనఁ జేయఁగ సమయము చాలదటంచున్
    రోధించెడు వారికెపుడు
    మాధుర్యము లేని భాష మన తెలుఁగు గదా!

    రిప్లయితొలగించండి
  28. సాధించెన్ గరిమమ్ము బ్రౌను తెలుగున్ సౌభాగ్య ముల్ గాంచుచున్
    ఆధారమ్మగుఁగా యుపాదిఁ గొనగన్నాంగ్లమ్ము దేశమ్మునన్
    ప్రాధాన్యమ్ములు మారిపోయె నకటా! భారంబయెన్ దేశ్యముల్
    మాధుర్యం బిసుమంత లేనిది గదా మా యాంధ్రమీ భూమిపై

    రిప్లయితొలగించండి
  29. ఆధారంబగు యాశదోషముల విన్యాసాల విజ్ఞానతే
    బోధన్ జేయగ నాంగ్లభాష తనలో సంపూర్తిగానిండగా
    నాదంబేమియులేని రాగములు తన్నంటంగనే బల్కెగా
    మాధుర్యంబిసుమంత లేనిది గదా మాయాంద్రమీభూమిపై|
    2.సాధారణ మతిచిన్నది
    ఆధారము తక్కువున్న నభిమానముతో
    మోదము నింపనిదనుటే?
    మాధుర్యము లేని భాష మన తెలుగు గదా|


    రిప్లయితొలగించండి
  30. మేధావుల్ సృజయించినారు గదరా మేలైన యాంధ్రమ్మునున్
    బుద్ధిన్ శుద్ధియు లేని మాట లివిరా పోపోర పోపోర పో!
    వీధుల్ జిమ్మెడి వాడు మేలు గదరా! వెర్రోడ విట్లందువా!
    "మాధుర్యం బిసుమంత లేనిది గదా మా యాంధ్ర మీ భూమిపై"

    రిప్లయితొలగించండి