కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా"
లేదా...
"కట్టలు గల్గువారు పడు కష్టము నబ్జభవుం డెఱుంగునా"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా"
లేదా...
"కట్టలు గల్గువారు పడు కష్టము నబ్జభవుం డెఱుంగునా"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
కం.అట్టిట్టని యన లేముగ
రిప్లయితొలగించండిగుట్టుగ నల్ల ధనము గల కుమతుల నిలలో
గుట్టగ బేర్చిన నోటుల
"కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా"
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మా చిన్నప్పుడు పెండ్లి భోజనాలు విస్తళ్ళలో వడ్డించేవారు. భోజనానంతరం ఆ పుల్లాకులను ఎత్తి దిబ్బలో పారెయ్యడానికి పది మంది కూలీలను నియమించేవారు:
రిప్లయితొలగించండిపట్టణ మందరు వచ్చిరి
బుట్టలు తట్టలుగ పెండ్లి భోజనమునకున్
గుట్టుగ విడిచిన విస్తరి
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా!
తొలగించండిగుట్టుగ ? లేక గుట్టగ?
"గుట్టుగ" అనగా "ఛుప్పుగ"..."సిగ్గూ ఎగ్గూ లేకుండా"
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గుట్టుగ' అన్నదానికి మీరిచ్చిన అర్థం సమర్థనీయంగా లేదు.
పూజ్యులు శ్రీ శంకరయ్య గారికి నమస్కృతులు:
తొలగించండిఎవరు తినిన విస్తరిని వారే తీసి పారేయాలనే నియమాన్ని ఆ రోజులలో ఉల్లంఘించేవారు. ఇది చిన్న వయసు లోనే నాకు నచ్చేది కాదు...
ఉ.గుట్టుగ నార్జన న్సలిపి గుట్టలు గుట్టలు కోట్ల డబ్బులన్
రిప్లయితొలగించండిరట్టగు నెప్పుడైన నని రాతిరి నిద్దుర సుంత లేకయే
కట్టడి మీరుచు న్మిగుల కష్టము లెన్నియొ కోరిపొందియున్
"కట్టలు గల్గువారు పడు కష్టము నబ్జభవుం డెఱుంగునా"
గుఱ్ర్రం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యోస్మి !
తొలగించండిగట్టిగ గొట్టినాడు గద కాకుల మోసము జేయుఁగద్దలన్
రిప్లయితొలగించండిపుట్టెడు బాధతో దగిన మోక్షము కై పరుగెత్తుచుండ తా
కట్టడి చేసె గద్దలు కు కర్మ ఫలంబులుబొంద, నోట్ల వే
కట్టలు గల్గువారు పడు కష్టము నబ్జభవుం డెఱుంగునా
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మోక్షమునకై' అనడం సాధువు. 'మోక్షము గోరుచు పారుచుండ/ నేగుచుండ..' అందామా?
రిప్లయితొలగించండిగుట్టలు గుట్టల నోటుల
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా
చట్టము తనపని జేయుచు
గుట్టుల విప్పగ జిలేబి గుబులే గుబులౌ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువులకు నమస్కారములు
రిప్లయితొలగించండిస్వస్థత చేకూరి దర్శన భాగ్యము కలిగించి నందుకు చాలా సంతోషముగ ఉంది.ధన్య వాదములు .నేను వారం రోజులగా పారీస్ వెళ్ళాను .అందుకే మనబ్లాగు ఆత్మీయు లందరికీ దూరమైనందుకు వెలితిగా ఉంది.
=============================
పట్టిన బంగార మవగ
గట్టిగ వరమందె నేని కరువే మిగిలెన్
పెట్టదు తిండిని ముట్టిన
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా .
అక్కయ్యా,
తొలగించండిధన్యవాదాలు! నిజానికి ఇంకా పూర్తి స్వస్థత చేకూరలేదు. మందులు వాడుతూనే ఉన్నాను. అస్వస్థత వల్ల కొద్ది రోజులు నేను బ్లాగుకు దూరంగా ఉండడం వల్ల మీ లోటును గమనించలేదు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిచుట్టములెల్ల వచ్చెదరు ,చూడగ ద్రవ్యము చొట్టబోయె నే
చట్టము మేర నమ్మితిని చాపకు మించనిదుంచి భూమినిన్
బిట్టుగ పిల్ల పెళ్ళికన బేలను దోషిని పెద్ద నోటులన్
కట్టలు గట్టువారు పడు కష్టము నబ్జ భవుండెరుంగునా
పుట్టితి మాయ జగత్తున
బట్టెను నర జన్మ నపుడు బహు రీతులలో
పుట్టెడు జ్యేష్టపు నోటుల
కట్టలు గలవారి బాధ కంజుడెరుగునా
బట్టల గట్టి లాకరులె బాసటలంచును దాచి దాచి వే
లొట్టలు వేసి భూముల నులూకపు దృష్టినగొంచు శాసనా
లట్టల ప్రోవులన్కొనిరి అ(య)చ్చపు నాగులె సుమ్ము నేడు నా
కట్టలు గల్గువారు పడు కష్టము నబ్జ భవుండెరుంగునే
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిబిట్టుగ నల్లధనమ్మును
గుట్టుగఁ గూర్చంగ; మోడి కోరి రద్దిడన్
రట్టయెఁ; జెల్లని నోటుల
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా?
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్యాపూరణం
రిప్లయితొలగించండికట్టిరి మేడలు మిద్దెలు
గుట్టుగ పోగేసి డబ్బు గుట్టల తీరున్
చట్టము కట్టడి నిడనా
కట్టలుకలవారి బాధ కంజుడెరుగునా
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కట్టలుగొల్లలుగలిగిన
రిప్లయితొలగించండికట్టలుగలవారిబాధకంజుడెరుగునా
కట్టలులక్ష్మీదేవియె
కట్టలనేమార్చుకొండ్రుకనకమువోలెన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ప్రణామములు. ఆరోగ్యము జాగ్కత్త.తమ కుమారుల వారు త్వరగా కోలుకోవాలని భగవంతునికి మా ప్రార్థన.
రిప్లయితొలగించండిపట్టణము పొడవునన్ నదిఁ
గట్టడి జేయ బలహీనకరముగ నుండన్
తట్టుకొనవని వరద కర
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా?
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిధన్యవాదాలు!
మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.
బిట్టుగ నోట్లను దీయగ
రిప్లయితొలగించండికొట్టుచు పొట్టల నితరుల గొట్టుచు పెట్టన్
గుట్టలుగా పుట్టలలో
కట్టలు, గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉపాధ్యాయ వృత్తి:
రిప్లయితొలగించండిచట్టపు రీతిన నెలనెల
పెట్టినవి పరీక్షలెన్నొ వేలకు వేలుల్
పుట్టలు బుట్టల యాన్సరు
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
'వేలకు వేలున్' అనండి.
(ఒక మాస్టారు విద్యార్థుల సమాధాన పత్రాల కట్టలు పట్టుకొని పోతుంటే ఒక విద్యార్థి "మాస్టారు గాడిద బరువు మోస్తున్నారు" అన్నాడట పరిహాసంగా. విన్న ఉపాధ్యాయుడు "నిజమేరా.. కాని ఇది నూట యాభై గాడిదల బరువు" అన్నాట్ట!)
పట్టునె నిద్దుర పరుపుల
రిప్లయితొలగించండిగుట్టది రట్టయినఁ దేలు కుట్టిన బరులే
దిట్టముగా నింట కవిల
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా
[కవిలకట్ట= ఆస్తిపాస్తుల సంబంధమైన కాగితముల కట్ట; బరి= దొంగ]
చుట్టము లంచు వత్తురిక చోద్యము మీరగ నెల్ల వేళలం
గట్టుడు పన్నులంచు నధికారులు నిత్యము వచ్చి పోదురే
పెట్టుదు రంచుఁ గన్నమును వీటికి దొంగలు చింత నొందరే
కట్టలు గల్గువారు పడు కష్టము నబ్జభవుం డెఱుంగునా
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరింపజేశాయి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిఎట్టుల మార్చగ వలెనో
రిప్లయితొలగించండితట్టక కోట్లన్ గుట్టుగ తగులంబెట్టన్
కట్టా గుండియపగిలెను.
కట్టలుగలవారిబాధ కంజుడెఱుగునా!
చుట్టము పక్కమైన తన శుల్కము నంతయు ముక్కుబిండుచున్
గట్టిగ గుంజినట్టి ఘన గౌరవ సేవకచక్రవర్తి యా
కొట్టిన కోట్లసంపదకు కుందుచు గుండెకు బోటుదెచ్చెగా
కట్టలుగల్గువారుపడు కష్టము నబ్జభవుండెరుంగునే?
మాన్యులు శంకరయ్యగారికి...నేను రేపు 9గం.లకు. బెంగుళూరులోని శేఖర్ ఐ హాస్పిటల్ లో ఎడమకన్ను కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోబోవుచున్నాను. కొంత కాలం మన సాహితీ మిత్రులకు దూరంగా ఉండవలసి వస్తుంది.బాగా అలవాటు అయిన కారణంగా కొంత బాధగనే ఉన్నా తప్పనిసరి.
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మీ కంటి ఆపరేషన్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. నాకు ఎడమకంటి ఆపరేషన్ అయి దాదాపు ఐదు నెలలవుతున్నది. కుడి కంటి ఆపరేషన్ చేయించుకోవాలి. కాని అనారోగ్యం, పనుల ఒత్తిడి వలన ఇంకా సిద్ధపడలేదు).
మీరన్యధా భవించకపోతే నా అనుభవాన్ని బట్టి ఒక సలహా. నేను ఎడమకంటి ఆపరేషన్ (ఐ.సి.డి. బైపాస్ ఆపరేషన్ అప్పుడు పెట్టించుకొన్న మిషన్ వలన) ఆలస్యం చేసిన కారణాన ఆ వత్తిడి రెండవ కంటిపైబడి ప్రజర్ వస్తుంది. దానివలన లోపలి నరాలు బలహీనమౌతాయట.కనుక వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకొంటేనే మంచిదని చెప్పి చేస్తున్నారు. మీరు ఆలస్యం చేయవలదని నా సలహా. మీ అనుకూలతలను బట్టి చేయగలరు. నమస్సులు.
తొలగించండిపుట్టెను యజ్ఞమ్మున చే
రిప్లయితొలగించండిపట్టెనువీరాధివీర పాండవులను తా
కట్టుకొనెను నాపదలను
కట్టలుగలవారిబాధకంజుడెరుగునా!?
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండికొంత అన్వయం లోపం ఉన్నట్టు అనిపించినా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కట్టలు గల్గువారు పడు కష్టము నబ్జ భవుండెఱుంగునా
రిప్లయితొలగించండికట్టలు గల్గువారలకు గష్టము లేవియు లేవుగా నిలన్
గట్టల నొక్కటొక్కటిగగాంచుచు మార్చుచు నుంటిరే గదా
యట్టి తరించ తుర్ముఖుని కందున నేర్వగ నేమి గానిట న్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
'లేవుగా యిలన్, తరిం జతుర్ముఖుని...' అనండి.
గుట్టుగ డబ్బు మూటలను గుట్టలు గుట్టలు రాశిజేసియున్
రిప్లయితొలగించండికట్టడి చేయ చట్టము కకావికలై దమనక్రమార్జనన్
పట్టునదాయలేక విధి వక్రత సుమ్మని దిట్టిపోయుచున్
కట్టలుగలవారు పడు కష్టము నబ్జభవుండెఱుంగునా
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిట్టా కెక్కని సంపద
రిప్లయితొలగించండిరట్టుగ భావించి మోది రద్దొనరించన్
పెట్టెల బేర్చిన నోటుల
కట్టలు గలవారి బాధ కంజుండెఱుగునా!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"చిట్టా కెక్కని సంపద !" - చక్కని భావ వ్యక్తీకరణ ! అభినందనలు !
ధన్యవాదములు గురువుగారు...
తొలగించండిధన్యవాదములు జనార్ధనరావుగారు..
రిప్లయితొలగించండిsuryanarayana rao ponnekantyనవంబర్ 22, 2016 11:44 [AM]
మీరన్యధా భవించకపోతే నా అనుభవాన్ని బట్టి ఒక సలహా. నేను ఎడమకంటి ఆపరేషన్ (ఐ.సి.డి. బైపాస్ ఆపరేషన్ అప్పుడు పెట్టించుకొన్న మిషన్ వలన) ఆలస్యం చేసిన కారణాన ఆ వత్తిడి రెండవ కంటిపైబడి ప్రజర్ వస్తుంది. దానివలన లోపలి నరాలు బలహీనమౌతాయట.కనుక వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకొంటేనే మంచిదని చెప్పి చేస్తున్నారు. మీరు ఆలస్యం చేయవలదని నా సలహా. మీ అనుకూలతలను బట్టి చేయగలరు. నమస్సులు.
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ సలహాకు ధన్యవాదాలు!
ఎడమ కంటి ఆపరేషన్ తర్వాత 45 రోజులకు కుడికంటి ఆపరేషన్ చేస్తాము, రమ్మన్నారు. కాని కొన్ని ఈతిబాధల కారణంగా వెళ్ళలేకపోయాను. ఇప్పుడంటే అబ్బాయి ఆపరేషన్ అయి ఇంట్లో ఉన్నాడు. కోడలుకు ప్రసవదినాలు. కనుక ఇంకా కొంత సమయం తప్పదు.
భగవానుడు మీకనుకూలమైన వాతావరణమును కలిగించాలని, అందరికి సంపూర్ణ ఆయురారోగ్య భాగ్యాలు కలిగించాలని మనసా కోరుచున్నాను.
తొలగించండికుట్టిన పుట్టము లమ్మెడు
రిప్లయితొలగించండికొట్టున జేరిన యెలుకలు గుట్టుగ నచటన్
బట్టలు కొట్టగ వలువల
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా
గుట్టుగ దాచిరే ధనము కుప్పలు తెప్పలు గాను సుంకమున్
గట్టని వంచకుల్ తమదు కర్మఫలమ్ముల నెల్ల స్వార్థసా
మ్రాట్టుల పన్నికన్ జెరప రద్దనె మోడియె పెద్దనోట్ల నా
కట్టలు గల్గువారు పడు కష్టము నబ్జభవుం డెఱుంగునా
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
వట్టి శరీర కష్టమున పాటువడన్ , దమ
…………… జీవితా౦తమున్ ,
బెట్టగ లేరు భార్యకును పిల్లల కెన్నడు
…………… పట్టెడన్నమున్
గట్టగ లేరు కొ౦పలను కట్టగ లేరుగ
…………… మ౦చి బట్టలన్ |
గట్ట ! యిదిట్టు లు౦డ బహు కాల కుబేరులు
…………… నక్రమార్జకుల్
పెట్టెల ని౦డ కట్టలను పేర్తురు పేదల
…………… నోరు కొట్టుచున్ |
బట్టును పట్టి మోది మన పాత " కరెన్సిని "
……………… మార్చివేయగా
కట్టలు గల్గు వారు పడు కష్టము
……… నబ్జభవు౦ డెరు౦గుగా ! !
{ బహు కాల కుబేరులు = పెక్కురు నల్ల
కుబేరులు ; ఆర్జకులు = స౦పాది౦చు వారు }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుట్టిన నాటినుండియును బూజ్యులు పెద్దలు తల్లి,తండ్రి నీ
రిప్లయితొలగించండికిట్టివి కూడదంచు వినిపించిన సూక్తులు విస్మరించి చే
పట్టిన రౌరవాదులకు బాటలు వేసెడి కల్మషాల పెం
గట్టలు గల్గువారు పడు కష్టము నబ్జభవుండెరుంగునా.
పుట్టుక నొసగిన వారల
నిట్టట్టని బలుకనీక యిడుముల పాలం
బెట్టుచు బొందిన కలుషపు
కట్టలు గలవారి బాధ కంజు డెరుగునా.
హ.వేం.స.నా.మూర్తి
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"ఆంధ్ర భారతి" నిఘంటువు ప్రకారము అవి " ఇడుమలు". సరిచూడ గలరు.
చట్టమున కొగ్గి పన్నులు
రిప్లయితొలగించండికట్టని పాపుల ముడుపులు కడువడి పెరుగన్
కట్టడి నందిన నోటుల
కట్టలు గల వారి బాధ కంజుడెఱుగునా!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుట్టిన దాదిగ నెందున్
రిప్లయితొలగించండిపట్టకదశరథనందను పదయుగళంబున్
గుట్టలుగవెనుకఁ పాపపు
"కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తిట్టక,కొట్టక,ముట్టక
రిప్లయితొలగించండిదిట్టంగా దిరుగువారి దిగులేబెంచన్
గుట్టుగ దాచిన డబ్బుల
కట్టలు గలవారిబాధ కంజు డెఱుగునా?
2.పుట్టినయాశ,దోషములె పూర్తిగ బెంచగ?డబ్బుసంచులే
కట్టలుగల్గువారు పడుకష్టము నబ్జ భవుండెఱుంగునా?
తిట్టక,గొట్టకన్ తగిన తీర్పుగజేసెను మోడి మంత్రమే
పట్టును బెంచ లోకులకు బాధలవేధన కష్ట కాన్పులే|
చట్టము పట్టునుబెంచగ?
రిప్లయితొలగించండికట్టిన యానోట్లకట్ట కలతలు బెంచన్?
పట్టును వీడు కుబేరుల
కట్టలు గలవారి బాధ కంజు డెఱుగునా?
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గుట్టుగ డబ్బు మూటలను గుట్టలు గుట్టలు రాశిజేసియున్
రిప్లయితొలగించండికట్టడి చేయ చట్టము కకావికలై దమనక్రమార్జనన్
పట్టునదాయలేక విధి వక్రత సుమ్మని దిట్టిపోయుచున్
కట్టలుగలవారు పడు కష్టము నబ్జభవుండెఱుంగునా
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
గుట్టుగ నిక్షిప్త గదుల
రిప్లయితొలగించండిగుట్టలు గుట్టలుగ నోట్లు కుంభిని దాచన్
చట్టంబవి చెల్లవనిన
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా!
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంగీతామృత భాండము
రిప్లయితొలగించండినంగీకృత బహుకళా మహాద్భుత సారం
బుం(న్)గీర్వాణి కడకరిగె
మంగళ మురళీ సుస్వర మాధుర్యంబై
మంగళంపల్లి కి అశృ నీరాజనములతో
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమంగళంపల్లి వారికి మీ శ్రద్ధాంజలి బాగున్నది.
గుట్టుగ దాచిన ధనమును
రిప్లయితొలగించండిరట్టవ్వగ జేసె నోట్ల రద్దును చేయన్
చట్ట విరుద్ధపు డబ్బుల
కట్టలు గలవారి బాధ కంజుడెఱుగునా?
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కట్టక ప్రభుతకు పన్నులు
రిప్లయితొలగించండిగుట్టలుగా ప్రొగుజేసి కూర్చినధనముల్
కట్టెలకున్ సరిపోలమి
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చట్టము గౌరవించక కసాయి తనమ్మున నక్రమమ్ముగా
రిప్లయితొలగించండిబిట్టుగ దోచుకొంచుకడు పేదల సొమ్ముల, భూగృహమ్ములన్
గుట్టుగ దాచ పాలసులు, కొట్టె ప్రభుత్వము నోట్లరద్దుతో
కట్టలు గల్గువారు పడు కష్టము నబ్జ భవుండెరుంగునే
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
రాళ్ళు కరుగు రీతి రాగాలు పలికించి
రిప్లయితొలగించండిగాత్ర సౌరభాన యాత్ర గరపి
జతుల గూర్చి మనల స్మృతులందు మరిపించి
తెలుగు గాయకుండు దివికినరిగె
జట్టుగ కూడంబెట్టిన
రిప్లయితొలగించండిగుట్టది పదిమందిలోన రట్టగుననుచున్
గట్టున మంటల పాలౌ
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా
ఫణికుమార్ తాతా గారూ- రెండవపాదంలో ప్రాస యతి వేశారు. కందపద్యానికి ప్రాసయతి చెల్లదు. మార్చండి.
రిప్లయితొలగించండిసత్యనారాయణరెడ్డి గారూ నమస్సులు. ధన్యవాదములు. పొరపాటున గమనించలేదు. మన్నించండి.
రిప్లయితొలగించండిజట్టుగ కూడంబెట్టిన
గుట్టది తమమధ్యలోన గోప్యంబుంచన్
గట్టున మంటల బెట్టగ
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా
గుట్టుగ నుండరే బుధులు గూడు పుటానిని జేసి వ్రాసిరే
రిప్లయితొలగించండిగట్టిగ మూడు గంటలట గాలిని మేయుచు గీకి గీకుచున్
చట్టున రాగ మాకడకు చప్పున దిద్దగ వారియాన్సరౌ...
కట్టలు గల్గువారు పడు కష్టము నబ్జభవుం డెఱుంగునా!