3, నవంబర్ 2016, గురువారం

సమస్య - 2188 (కారాగారమునందు ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్"
లేదా...
"కారాగారమున ఘనసుఖంబులు దక్కున్"

102 కామెంట్‌లు:

 1. తీరుల్ తెన్నులు మారి పోయె నకటా ! దేశమ్మునన్ జూడగన్
  పారావారము మించు సేవలవి తా బంధీగ యున్నప్పుడున్
  చేరన్ బోవును స్వర్గ భోగములు శ్రీమంతుడౌ వాడికిన్
  "కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారు మీ పూరణ బాగుంది. బారావారము, బందీగ, జేరన్, గారాగారము అనండి. మూడవ పాదములో గణదోషము.

   తొలగించండి
  2. ధన్యవాదాలు.మూడవ పాదంలో గణదోషమన్నారు. "లు" లఘువే కదా !వివరించగలరు.

   తొలగించండి
  3. లు లఘువే. కాని దాని తర్వాత మూడు గురువు లుండాలి కదా! మీరు రెండు గురువులే వేశారు. 'భోగములు శ్రీమంతుండునౌ వానికిన్' అనండి.

   తొలగించండి
  4. ఆగురువు శ్రీ కి మందుండాలి లేకపోతే యతిభంగము

   తొలగించండి
  5. కామేశ్వర రావు గారికి,
   నమస్సులు & ధన్యవాదములు !
   మీ సూచనల మేరకు సవరించిన పద్యము తిరిగి పోస్ట్ చేస్తున్నాను. మరొక మారు ధన్యవాదములు
   ****$$$$$****

   తీరుల్ తెన్నులు మారి పోయె నకటా ! దేశమ్మునన్ జూడగన్
   బారావారము మించు సేవలవి తా బందీగ యున్నప్పుడున్
   జేరన్ బోవును స్వర్గ భోగములహో ! శ్రీమంతుడౌ వానికిన్
   "గారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్"

   తొలగించండి
 2. గౌరవనీయులు మంత్రులు
  కోరిక లన్నిటిని దీర్చు గురుకోవిదులున్
  నేరములు జేసి చిక్కిన,
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్!

  రిప్లయితొలగించండి
 3. మారుని పాలన్ జిక్కిన
  నీరజ లోచనకుబాహు నిర్బంధమునన్
  గారాబపు బిగికౌగిలి
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూర్తి గారు మీ పూరణ చాలా బాగుంది. ప్రియుని ప్రస్తావన యున్న నింకనూ బాగుండును.

   తొలగించండి
  2. నేనూఅలాగేఅనుకున్నాను, అందుకే క్రిందమార్చాను. నమస్సుమాంజలి

   తొలగించండి
  3. చూచాను బాగుందండి. నిన్నటి మీ వివరణ నేను యీ రోజు చూచి చిన్న సవరణ యిచ్చితిని తిలకించండి.

   తొలగించండి
 4. మారుని పాలన్ జిక్కిన
  నీరజ లోచనకుబాహు నిర్బంధమునన్
  గారాబపు పతికౌగిలి
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్"

  రిప్లయితొలగించండి
 5. రిప్లయిలు
  1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి.
   మొదటి పూరణలో 'కౌగిటి కారాగారమున' అంటే బాగుంటుందేమో!

   తొలగించండి
  2. మారుని పాలన్ జిక్కిన
   నీరజ లోచనకుబాహు నిర్బంధమునన్
   గారాబపు పతికౌగిటి
   కారాగారమున ఘనసుఖంబులు దక్కున్"

   అవును గురువు గారూ, మీరన్న విధంగానేమార్చాను. కృతజ్ఞతాపూర్వక నమస్సులు.

   తొలగించండి


 6. దారాసుతులకు పోషణ
  భారంబాయెను జిలేబి బతుకుల నీడ్వన్
  పోరాటము విడిచి చనెద
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:
  గురువు గారికి నమస్కారములు. తమరు క్షేమమని తలుస్తాను. మీ శుభాశీస్సులతో దాదాపు ఆరోగ్యాన్ని తిరిగి సంతరించుకుని నేను ఈరోజు ఉదయమే అమెరికానుండి వచ్చాను. ఈ ప్రయాణ హడావుడిలో గత నాలుగైదు రోజులుగా పద్య పూరణలు పంపలేదు. ఇప్పుడు పంపుతున్నాను . దయతో పరిశీలించ గలరు.
  (03_11_2016):
  నేరము లెంచుచు నుండెడి
  తీరును గూడిన ధనికుడు దిట్టతనమ్మున్‌
  దా రూకలు వెదజల్లగ
  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్‌.

  (02-11-2016):
  తియ్యని వలపుల పాటలు
  నెయ్యముగా వేణువందు నేర్పున పలుకన్‌
  తొయ్యలి యా రాధిక క
  న్నయ్యను గని విరహమందె నతివ సహజమే.

  (01-11-2016):
  కన్నుల కనువుగ నమరు కాంతుల నిడి
  ముక్కు చెవి నోరులకు నెంత ముప్పు నిడని
  మందుగుండును మీరలు మట్టుగాను
  ముట్టజేసి దీపావళి పట్ట రండు.

  (31-10-2016):
  కణకణమున మూఢత్వము
  గణముగ గల్గుచు ఖలమగు గర్వము దోడన్‌
  సణుగులిడు దనుజుల నణచెడి
  రణమే సుఖశాంతులిచ్చి రంజిల జేయన్‌.

  కణకణమున భక్తి గలిగి
  గణుతిగ భజనలు సలుపుచు ఘనమగు రీతిన్‌
  ప్రణతిల్లుచు నుండ హరి చ
  రణమే సుఖశాంతు లిచ్చి రంజిల జేయన్‌.
  ఈ హవె
  (30-10-2016):
  బాళి గూర్చు రంగుల నద్దు పండుగొచ్చు
  ఫాల్గుణమున; దీపావళి పండుగ గద
  నాశ్వయుజమున; జనులకు ననువు నిడెడి
  పుణ్యతిధు లన్ని నెలలందు పొసగు నిలను.

  (29-10-2016):
  బాగుగ నరకాంతకుడగు
  యా గోపాలుని చరితల నభ్యసనమ్మున్‌
  వేగించని వాడనె నిటు
  నాగాభరణుండు కినిసి నరకుని జంపెన్‌.


  రణమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
   మీ విదేశయాత్ర సుఖసంతోషాలతో ముగిసి తిరిగి మాతృదేశానికి చేరుకున్నందుకు సంతోషం! (నాకేం కానుక తెచ్చారు?)
   మీ పద్యరచనాభిలాష ప్రశంసనీయం. మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'కారాగారమున..' పూరణలో 'దిట్టతనమునన్ అనండి. బాగుంటుంది.
   'రణమే సుఖ...' పూరణలో మూడవపాదంలో గణదోషం. 'సణుగులిడు దనుజుల నణచు..' అనండి.
   'ఫాల్గుణమున దీపావళి...' పూరణలో వచ్చును ఒచ్చు అన్నారు. 'పర్వ మలరు' అనండి.
   'నాగాభరణుండు...' పూరణలో 'నరకాంతకు డగు । నా గోపాలుని...' అనండి.

   తొలగించండి
 8. తీరని ధనదాహ మునను
  పారా వారములు దాటి బాంధవ్య ములన్
  దూరపు కొండలు నునుపని
  కారా గారమున ఘనసు ఖంబులు దక్కున్

  రిప్లయితొలగించండి
 9. డా.పిట్టా
  (మన జాతీయ నాయకులు వేదాంత తత్త్వ సంపన్నులు.వారిమాటలు:)
  "ఏరా కష్టమటంటివొ
  పోరా!తనువెంత మాకు భువి మా యాత్మన్
  ఓరీ!గట్టగ గలవే?!
  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్!!"
  పోరా నవ్వుచు నెహ్రు వంటి ఘనులే బుచ్చంగ తత్ కాలమున్
  సారాచార విశారదుల్ రచనలన్ చాటింపరా ధర్మమున్
  పారావారము వంటి బోధలకదే భాగ్యంబు చాల్చాలనన్
  కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదంబొప్పగన్!

  రిప్లయితొలగించండి


 10. కొడితే ఖజానా డబ్బులు !
  లేకుంటే కారాగారం సౌఖ్యంబులు !
  దొరికాక చోరుల మనోభావాలు !

  మారాటంబికనేల! వెళ్ళదమికన్ మాటాడ మాకోయి మే
  లారామంబది హెచ్చుగాను మన కైలాసమ్మదేగాద ! బా
  గారక్షింతురు!గంటకొట్టి సరి సింగారమ్ము లన్జేతురే !
  కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్!

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   'మాటాడమాకు' అని మాండలికాన్ని ప్రయోగించారు. 'మాటాడబోకోయి' అనండి.

   తొలగించండి
 11. ధీరోదాత్తుడు, మానస
  చోరుడు కోరి మనువాడె చోద్యము గొలుపన్!
  గారాల మగని హృదయపు
  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్!

  రిప్లయితొలగించండి
 12. ఆరాటమ్ముగ బోవనెంచె నకటా యాసంద్ర ముల్ దాటు చున్
  పేరాశన్ ధనకాం క్షతోడ వెడలెన్ ప్రీతిన్ గనన్ డాలరున్
  దూరా భారము నెంచకుండ వెడలెన్ తోబుట్టు వున్ వీడుచున్
  కారాగారము నందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీకు అమెరికా నివాసం కారాగారంలా తోస్తున్నదా?

   తొలగించండి
  2. నమస్కారములు
   మీరు భగినీ హస్త భోజనమునకు వెళ్ళినందుకు చాలా ఆనందముగా ఉంది. నేను అక్కడె [హైదరాబాదులో] ఉండిఉంటే తప్పక ఆ అదృష్టాన్ని పొంది ఉండేదాన్ని.ఇక్కడ ఉండి ఆత్మీయతలు అనుబంధాలకు దూరమై పోయాను.కనీసం అమ్మాయిని చూడటానికి కుడావెళ్ళి 6ఏళ్ళు ఐంది. నిరుడు అమ్మపోయినా వెళ్ళలేదు .సిటిజన్ షిప్ ఉంది .వీసా చెయ్యలేదు .ఇక్కడ వీళ్ళ చేతిలోనేగాక ప్రకృతి చేతిలో కుడా బందీలే.డబ్బుతప్ప మరేమీ ఉండదు .నేను చాలా దురదృష్ట వంతురాలిని.
   నా పద్యంలో " వెడలె " అని రెండు చోట్ల వచ్చింది. మీరు ఆపొరబాటు గమనించలేదు .ధన్య వాదములు .
   మీరు కోలుకుంటున్నందుకు చాలా సంతోషం గాఉంది.

   తొలగించండి
  3. అక్కయ్య గారు మీరు OCI అవ్వలేదా? అది ఉంటే వీసా బాధలుండవు కదా!

   తొలగించండి
  4. Overseas citizen of India. అది తీసుకుంటే మీరు NRI తో సమానము అన్ని విషయాలలో. ఒక్క voting హక్కు ఉండదు. మా అబ్బాయి, అమ్మాయి కుటుంబ సమేతము తీసుకున్నారు. ఒకరు Canada యింకొకరు ఆస్ట్రేలియా.

   తొలగించండి
  5. aite ledanu kumtaanu ikkaDa maatrame siDijanu 2 ELLu aimdi.maavaaLLu kaavaalanE teesukO lEdu .amtE.

   తొలగించండి
 13. మారెను నేటి పరిస్థితి
  నేరస్థులు జడియబోరు నిందితులయ్యున్
  కోరిన మేరకు సేవలు
  కారగారమున ఘన సుఖంబులు దక్కున్.

  రిప్లయితొలగించండి
 14. మిత్రులందఱకు నమస్సులు!

  పేరాసన్ బరిమోషితాది దురితం బేపారఁగాఁ జేయుచున్
  దారాపుత్రుల పోషణమ్ము లెపుడున్ దాఁ గూర్చుచున్ దోషిగా
  నేరారోపణ మంది మోసగిలి పోనేలా? భటాధీనతన్

  గారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పఁగన్!

  స్వస్తి

  రిప్లయితొలగించండి
 15. ఘోరాలన్నియు వర్జనీయమని యుద్ఘోషించు యోగీశులన్
  నేరారోపణ జేసి రాక్షసులు దుర్నీతిన్నిబంధించగన్
  సౌరత్వంబున భక్తకోటి మది యాశౌరిన్నుపాసించగన్
  కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్

  రిప్లయితొలగించండి
 16. కారాగారము నందున
  నేరాలకు శిక్షయుండు నిక్కముసామీ !
  నేరాల నేతలకు మఱి
  కారాగారము న ఘన సుఖంబులు దక్కున్

  రిప్లయితొలగించండి

 17. చోరులు,సంఘద్రోహులు,
  ఘోరనరాంతకులకైన కూరిమి యుండన్
  పేరున్న నాయకునితో
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్

  రిప్లయితొలగించండి
 18. రిప్లయిలు
  1. లేరే కార్మికు లప్పురంబునను వారిం జూచితే నీ వికన్
   వేరే రీతిఁ దలంప నేల వినుమా విస్తారపుం బల్కులన్
   దూరం బైనను నేమి సంతసము దాఁ దోడై శ్రమింపంగ నా
   కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్

   [కార = యత్నము,ఉద్యోగము; కారాగారము = ఉద్యోగము చేయు చోటు, కర్మాగారము]


   నీరారాతి విధూమాం
   గారక మిచ్చు ఘన శీతకమ్మున ముదమున్
   ఘోర తర నిధాగమ్మున
   కారాగారమున ఘనసుఖంబులు దక్కున్

   [కార+ఆగారము = కారాగారము; కార = మంచుకొండ; మంచుకొండలలో యిల్లు]

   తొలగించండి
  2. కామేశ్వరరావు గారూ నమస్సులు. పద విచ్ఛేద ప్రక్రియలో మీకు మీరే సాటి. పద సమీకరణ చేసి ఏకసమాస పద్యాలు వ్రాయడంలోనూ మీకు మీరే సాటి. మీకు నా నమశ్శతంబులు.

   తొలగించండి
  3. ఫణి కుమార్ గారు నమస్సులు. కడుంగడు ధన్యవాదములు.

   తొలగించండి
  4. కామేశ్వర రావు గారూ,
   ఫణికుమార్ గారు ప్రశంసించినట్లు మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి.

   తొలగించండి
  5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. మీకు పూర్తిగా స్వస్థత చేకూరినట్లు తలుస్తాను.

   తొలగించండి
  6. కామేశ్వర రావు గారూ,
   ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఒంటి నొప్పులు కొద్దిగా ఉన్నాయి. క్రొత్తగా నడుస్తుంటే ఎడమ మోకాలు నొప్పి లేస్తున్నది. మందులు వాడుతున్నాను.
   మీరు శ్రమకోర్చి ఓపికగా మిత్రుల పూరణలను సమీక్షిస్తూ నాకెంతో ఉపకారం చేస్తున్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు!

   తొలగించండి
  7. పూజులు శంకరయ్య గారికి వందనములు. తగినంత విశ్రాంతి తీసుకోండి.

   తొలగించండి
 19. ఆరటము ప్రజల కొరకని
  నేరుగ వాడలనుఁ జెప్పి నేర్పరితనమున్
  తేరగదోచు ప్రముఖునకు
  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్!

  రిప్లయితొలగించండి
 20. వీరుండై సుమహత్ప్రభావయుతుడై విస్తారసద్భక్తితో
  ధీరత్వంబున మాతృభూమికొరకై ధీశక్తితో బోరగా
  జేరంబోయెడి దేశభక్తుని మదిన్ క్షేమంబులే గల్గు నా
  కారాగారము నందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్.

  వీరునకు దేశభక్తున
  కౌరా! సద్భావదీప్తి నన్నిట శుభముల్
  కోరుచు నుండెడి వానికి
  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.

   తొలగించండి
 21. 2.దారాపుత్రాదుల భవ
  పారావారమున బంధు పరిజనయుత సం
  సారము.మమతలకూటమి
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్

  రిప్లయితొలగించండి
 22. ఆ రాజుల్ యవినీతిలోఁబడి యనూహ్యంబైన సంపాదన
  న్తారాస్థాయికిఁజేరి ప్రజలకన్యాయంబుగావింపగన్
  నేరారోపణ వచ్చునా పిదప మున్నెంన్నండు లేనట్టి స
  త్కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదంబొప్పగన్ ||

  రాజులు = Rulers = పాలకులు; సత్కారాగారము = గౌరవనీయ సదుపాయములు కూర్చిన ఇల్లు. (Well facilitated house).

  నేరారోపణఁజేయగ
  తారాస్థాయికినెదిగిన ధనవంతులపై
  నేరస్తులకప్పుడు స
  త్కారాగారమున ఘనసుఖంబులు దక్కున్ ||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అనిల్ కుమార్ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. మీరేం తక్కువ తిన్నారు? 'సత్కార+ఆగారము' అంటూ చక్కని ప్రయోగం చేశారు.
   'రాజుల్+అవినీతి' అన్నపుడు యడాగమం రాదు కదా!'ఆ రాజుల్ దమ నీతి కోల్పడి...' అందామా?

   తొలగించండి
  2. ఆర్య! అనేక నమస్కారములు. అక్కడ కొంత తడబడుట జరిగింది. మీ సవరణ చాలా బాగున్నది. అలాగే సవరణ చేసి పంపుచున్నాను. ధన్యవాదములు.

   ఆ రాజుల్ దమ నీతి కోల్పడియనూహ్యంబైన
   సంపాదన
   న్తారాస్థాయికిఁజేరి ప్రజలకన్యాయంబుగావింపగన్
   నేరారోపణ వచ్చునా పిదప మున్నెంన్నండు లేనట్టి స
   త్కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదంబొప్పగన్ ||

   తొలగించండి
 23. నేరంబులెన్ని జేసిన
  భూరిగ నైశ్వర్యమున్న భూమము లోనన్
  చేరును వైభోగమ్ములు
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్!!!

  రిప్లయితొలగించండి
 24. నారీ నీమధురాదరాసుధల నాహ్వానించునదృష్టమో
  భారీ మూల్యము నందె వాకిట,నహో నాభాగ్యమేదో నిటన్
  శ్రీరాశుల్ యెదనింప,కాంక్ష యుత యావజ్జీవమౌ కౌగిలీ
  కారాగారము నందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదంబొప్పన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామారావు గారు మీ ప్రయత్న మభినందనీయము.
   1. అధరము అ కారంత పుంలింగ శబ్దము. సమాసములో దీర్ఘము రాదు.అధర+అమృతము=అధరామృతమనవచ్చు.
   2. నా- హ్వా లకు యతి మైత్రి లేదు. "నదృష్టమో" లో న లఘువే. దృ సంయుక్తాక్షరము కాదు కనుక.
   3. భారీ హిందీ పదము.
   4. 2,3 పాదాలలో యతి మైత్రి మీరు 14 వ అక్షరానికి కలిపారు .యతి మైత్రి స్థానము 13 వ అక్షరము.
   వీటిని పరిగణలోనికి తీసుకొని సవరణలు చేసి పంప గలరని నా విశ్వాసము.

   తొలగించండి
  2. శ్రీరామ్ గారూ,
   ఉదయమే వాట్సప్ లో సవరణలను సూచించాను. అది చూసి సవరించి బ్లాగులో పెడతారనుకునాను. నేను చెప్పిన వానికంటె అదనంగా కామేశ్వర రావు గారు చెప్పారు. సూచనలను పాటించండి.

   తొలగించండి
  3. శ్రీరామారావు గారు మీ పద్యమునకు నా సవరణ:

   నారీ నీ మధురాధరామృతము సన్నాహంబుగం ద్రావగం
   బారం బన్నది నేర దీ ముదము నాభాగ్యంబు నేమందునో
   శ్రీరాగం బెదనింప, కాంక్ష యుత సుస్నేహంపు నీకౌగిలే
   కారాగారము నందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదంబొప్పగన్

   తొలగించండి
 25. ఓ రాణీ! యిటు చూడు మల్గె సుత, నా యుద్యోగమో చిన్న, ద
  య్యారే! కావలె సాఫ్టువేరు వరుడే యన్నన్ తరం బౌనె? స
  ర్కారుద్యోగము వాని చూడ దట! కంగారౌను నాకేమొ నీ
  మారామే మన కొంప ముంచె, మననే మార్చంగ తానెంచె! వే
  డ్కా? రా! గారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్.

  రిప్లయితొలగించండి
 26. నేరమ్ముల్ సతతమ్ము సల్పుచును దుర్నీతిన్ మిటారించుచున్
  తోరమ్మౌ యవినీతితోడ ఘనులై దుష్టంపు మార్గమ్ములన్
  ఘోరమ్మౌ సరళిన్ సతమ్మఁ గొనినన్ కోట్లాది రూపాయలన్
  కారాగారము నందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్

  రిప్లయితొలగించండి
 27. శంకరయ్యగారు యధాప్రకారము నా ఛందో దోషములను క్షమించాలి...


  ధారావాహిక! ఇయ్యది;
  రారా! ఈశంకరాభరణ రణమున దా
  బోరాడు శూరులకునీ
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది.

   తొలగించండి


  2. "e-రణము"! జిలేబీ లా
   రా రారండోయి శంకరాభరణంబై
   పూరణల జేయగన్నీ
   కారాగారమున ఘనసుఖంబులు దక్కున్!

   జిలేబి

   తొలగించండి
 28. . శ్రీరామున్ మదినమ్మి దాసుడయి|ప్రేరేపించ భద్రాద్రిలో
  ఆరామంబున గట్టగా గుడిని “ద్రోహంబంచు భావించినా?
  ధారాళంబగు కీర్తనల్ బలుకు లందించంగ సద్భక్తియే
  కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదంబొప్పగన్| {భక్తరామదాసునకు}
  2.చోరునకొక కలయందున
  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్
  ఆరాదించి రటంచున్
  ప్రేరణ సహజంబు గాదు|పిరికితనంబే.

  రిప్లయితొలగించండి
 29. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { దేశ స౦పదను చక్కగా ఆరగి౦చే నేతలు

  కారాగారములో నున్నను అది అత్త గారి౦టి

  తో సమానముగా ను౦డును }


  నేరా లెన్నియొ చేసి " ఛీ యని "

  ………… జనానేక౦బు దూషి౦పగన్ ,

  చోరాగ్రేసరు లైన నాయక వరుల్ నొక్కన్

  ……… బ్రయత్ని౦తు , రౌ

  రౌ రా , దేశ ధన౦బు | శ్వశ్రు గృహ

  ………… తుల్య౦ బౌగ - నవ్వారికిన్

  కారాగారమె | య౦దు లభ్య మగు

  ……… సౌఖ్య౦బుల్ ముద౦ బొప్పగా

  { శ్వశ్రువు = అత్త , భార్య తల్లి ;

  శ్వశ్రు గృహ తుల్యము = అత్త గారి౦టితో

  సమానము }

  రిప్లయితొలగించండి
 30. నేరాలెన్నియొ జేయనేమి యిలలో నేతై ప్రకాశించెడిన్
  వారిన్ బంధిగ జేసిన న్నచట సంప్రాప్తించు బాధేమిటో?
  కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్
  దారాపుత్రులతోడ విందులట వార్తాపత్రికల్ మెండుగన్

  క్షీరాంబోధిన శేషతల్పమున తాశ్రీలక్ష్మితో నుండగన్
  గోరన్ దేవతలెల్ల పుట్టెనవనిన్ గోవిందుడై శ్రీ హరే
  కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్
  గోరక్షాశయ ధర్మశీలి జననమ్ గోపాలలోకమ్ముకే

  నారాయణుడే పుట్టెను
  కారాగారమున, ఘనసుఖంబులు దక్కున్
  దారియె తప్పిన ధర్మము
  ధారుణిలో నిలిపినంత తథ్యము గాదే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి.
   మొదటి పూరణలో 'నేత+ఐ' అన్నపుడు యడాగమం వస్తుంది. 'నేతల్ ప్రకాశించెడిన్' అనండి.
   రెండవ పూరణలో 'క్షీరాంభోధిని' అనండి. 'హరి+ఏ=హరియే' అవుతుంది. అక్కడ 'శ్రీశుడే' అనండి.'జననమ్' అని హలంతంగా వ్రాశారు. ధర్మశీలి భవమే... అనండి.

   తొలగించండి
 31. సారా మానుడు, ధూమ పానమును వీసం బైనవద్ధంచు తా
  నూరూరన్ ప్రవచించి విక్రయముఁ కు "న్నూ" కొట్ట రాజ్యంగ మే,
  సారా విక్రయదారు నుండి ముడువుల్ సంధించు సభ్యుండ నెన్
  "కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   'విక్రయముఁకున్' ఇక్కడ అర్ధానుస్వారం ఎందుకు? విక్రయమునకున్.. అనవలసి ఉంటుంది. అక్కడ 'విక్రయమున న్నూకొట్ట..' అనండి.

   తొలగించండి
 32. శ్రీరామునె నిందించెను
  క్రూరపు శిక్షల భరించి క్రుంగుచు చెరలో
  శ్రీరామదాసు, ధర నే
  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్?

  రిప్లయితొలగించండి
 33. దారా పుత్రులు తల్లి దండ్రులను సంధానంబుతో నుండినన్
  జేరన్రావు ప్రయాసలున్ సుఖముగా జీవింతు రెల్లప్పు డే
  పోరాటంబులు లేక నుండెదరు, సంపూర్ణాను బంధంబు శ్రీ
  కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్

  రిప్లయితొలగించండి
 34. భారతమాత విముక్తికి
  భారత యోధులు పడినటు వంటి యిడుములను
  తారక మంత్రముగా మహి
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   '...యిడుములన్' అనండి. కందం సరిపాదాల చివర తప్పక గురువుండాలి కదా!

   తొలగించండి
  2. అది " ఇడుమలు" అని నిఘంటువంటున్నది.   తొలగించండి
 35. తీరుగ నార్జించుటకై

  నేరములన్ జేయుచుండి నిందితులయ్యున్

  గౌరవము గల వ్యక్తులకే

  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్.

  రిప్లయితొలగించండి
 36. గారాబము తో తల్లియె
  మీరుచు తన సుతుల జేరి మెత్తని బుగ్గల్
  తీరుగ నిమిరిన తోషులు
  కారా? గారమున ఘనసుఖంబులు దక్కున్.

  రిప్లయితొలగించండి
 37. వారము లోపల వలపుల
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్
  రారా సఖుడా యనుచును
  నారమణి పిలువంగ తేలె నానందాబ్ధిన్.

  నేరుపు తోడను చేయుచు
  నేరముల నితరులపైన నెట్టెడి జనముల్
  వారి రి వాజును గనుమా!
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్.

  కోరిన కోర్కెలు దీర్చెడి
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్
  ఘోరపు పనులను చేసియు
  నారామము ననుభవింతు రవినీతిపరుల్.

  చోరులు నవినీతి పరులు
  పేరొందినయటువంటి పెద్దల కృపయున్
  చూరగొనుచున్నవారికి
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్.

  రిప్లయితొలగించండి
 38. వారము లోపల వలపుల
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్
  రారా సఖుడా యనుచును
  నారమణి పిలువంగ తేలె నానందాబ్ధిన్.

  నేరుపు తోడను చేయుచు
  నేరముల నితరులపైన నెట్టెడి జనముల్
  వారి రి వాజును గనుమా!
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్.

  కోరిన కోర్కెలు దీర్చెడి
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్
  ఘోరపు పనులను చేసియు
  నారామము ననుభవింతు రవినీతిపరుల్.

  చోరులు నవినీతి పరులు
  పేరొందినయటువంటి పెద్దల కృపయున్
  చూరగొనుచున్నవారికి
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్.

  రిప్లయితొలగించండి
 39. GP Sastry (21) @
  IIT Kharagpur 1965:👇

  లేరే బాంధవులీ యరణ్యముననున్ లెక్కింపగా నొక్కడున్
  తీరుల్ తెన్నులు లేని తిండ్లిచటఛీ! తియ్యందనాలన్నిటన్...
  పోరాటమ్మవ వేన వేల ఘనమౌ పొత్తంపు దొంతర్లతో
  కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్!

  రిప్లయితొలగించండి