కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తద్దినమే లేనిరోజు నా తద్దినమే"
(యతిని గమనించండి)
లేదా...
"ఏ దినమందు తద్దినములే కరవౌనొ మదీయ తద్దినం
బా దినమౌను...."
"ఎద్దినం తద్దినం నాస్తి తద్దినం మమ తద్దినమ్" అని ఒక బ్రాహ్మణుడు వాపోయాడట!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తద్దినమే లేనిరోజు నా తద్దినమే"
(యతిని గమనించండి)
లేదా...
"ఏ దినమందు తద్దినములే కరవౌనొ మదీయ తద్దినం
బా దినమౌను...."
"ఎద్దినం తద్దినం నాస్తి తద్దినం మమ తద్దినమ్" అని ఒక బ్రాహ్మణుడు వాపోయాడట!
చిన్నప్పుడు మా గురువు గారు చెప్పారు."
"యద్దినం తద్దినం నాస్తి
రిప్లయితొలగించండితద్దినం దుర్దినం మమ
(అనుష్టుభం చంధస్సు)
కం.చద్దన్నము కైనను నా
రిప్లయితొలగించండివద్ద ధనము 'కాని 'లేక వందురు చుంటిన్
తద్దినముల దిను చుంటిని
"తద్దినమే లేనిరోజు నా తద్దినమే"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిజనార్దన రావు గారు మీ పూరణ బాగుంది కాని నాల్గవ పాదములో యతి కూర్చలేదు మీరు.
తొలగించండియతిమైత్రి స్థానములో "నా" ఉంది కాబట్టి యతి "త" కు న తో సంయుక్తము లేదా త కు ముందు బిందువు వచ్చునట్లు కానీ చూడాలి.
ఉ.ఈదిన మాదినమ్మనుచు నెంచగ లేను దరిద్ర బాధచే
రిప్లయితొలగించండినీదుచు నుంటిగా సతము నీ భవ సాగర మెంత కష్టమో!
"ఏ దినమందు తద్దినములే కరవౌనొ మదీయ తద్దినం
బా దినమౌను వేగిరమె యాకలితో నను బాధ పెట్టగన్"
జనార్దనరావు గారు మీ పూరణ బాగుంది.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాళిదాసు ఉవాచ:
తొలగించండియద్దినమున్నిను గాంచిన
తద్దినమున్నాకు కనక ధారౌ భోజా
కద్దిది తధ్యము రాజ
న్తద్దినమే లేనిరోజు నా తద్దినమే
* న్దద్దినమే?
తొలగించండివిజ్ఞులు శ్రీ కామేశ్వర రావు గారిని కాపీ కొట్టుచూ...
శాస్త్రి గారు మీ పూరణ చాలా బాగుంది.
తొలగించండికాళిదాసూవాచ యన్నారు కాబట్టి రాజన్ సంబోధన పరముగా కేవల సంస్కృత పదము విభక్తియుతముగా వాడినా పరవాలేదు. రాజన్తద్దినమే సాధువు. ఏలన రాజన్ లో "న్" ద్రుతము కాదు.
__/\__
తొలగించండి
రిప్లయితొలగించండిమొద్దుగ నిద్దుర నుండగ
పద్దుల గడబిడి యముండు పాశము వేయ
న్నద్దరి గుటుక్కు బోవన్
తద్దినమే లేనిరోజు నా తద్దినమే!
జిలేబి
తొలగించండిబోవన్తద్దినమే చెయ్యాలాండీ ?
మొద్దుగ నిద్దుర నుండగ
పద్దుల గడబిడి యముండు పాశము వేయ
న్నద్దరి గుటుక్కు బోవ
న్తద్దినమే లేనిరోజు నా తద్దినమే!
జిలేబి
జిలేబి గారు మీ పూరణ బాగుంది.
తొలగించండిబోవం / దద్దినమే అనవలెను. ద్రుతసంధి. బిందు పూర్వక త, థ,ద,ధ లకు న తో యతి కుదురుతుంది.
బిందుయతి (అనుస్వారయతి) :- బిందువు అంటే అనుస్వారం (సున్న). ప్రతివర్గంలో మొదటి నాలుగు అక్షారాలు బిందుపూర్వకాలైనపుడు ఆయా వర్గాల పంచమ (అనునాసిక) అక్షరాలతో యతి చెల్లుతుంది. i) ంక,ంఖ,ంగ,ంఘ - ఙ; ii) ంచ,ంఛ,ంజ,ంఝ - ఞ; iii) ంట,ంఠ,ండ,ంఢ - ణ; iv) ంత,ంథ,ంద,ంధ - న; v) ంప,ంఫ,ంబ,ంభ - మ.
గురువుగారూ నిన్నటి పూరణ
రిప్లయితొలగించండివిలసిత నాట్య కన్యకను వేడుక చూచియు మోహమందిఁ దా
వలపున నామె భంగిమల వాసిగ నృత్యము జేయనెంచియున్
తలపున చింతలేక తను దండన బొందుచు భస్మమయ్యె దు
ష్ఫలితముఁ గోరి పాటుపడువారికి దక్కునె లాభ మెయ్యెడన్
ఫణికుమార్ గారు నిన్నటి మీ పూరణ బాగుంది.
తొలగించండిజేయనెంచియుం/ దలపున అనండి.
పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిడా.పిట్టా
రిప్లయితొలగించండిఏ దినమందు తద్దినములే కరువౌనొ మదీయ తద్దినం
బాదనమౌనటన్న పరి భాషను చావుల గోరు ఋ త్వికుం
డా దినమందు పస్తు యని డాయడు సత్యము పితృ దేవతా
సాదము దైవ సాదమగు సౌఖ్యమె పో కను మూయు వారిదౌ!
తద్దిన కర్మలు వద్దని
పెద్దలు నౌ ఋ త్వికుండ్రు పిండము వెట్టన్
గద్దరి చేష్టయె యనిరా
తద్దినమే లేని రోజు నా తద్దినమే
(పేద బ్రాహ్మణ ఉవాచ)
యతిమైత్రి స్థానములో "నా" ఉంది కాబట్టి యతి "త" కు న తో సంయుక్తము లేదా త కు ముందు బిందువు వచ్చునట్లు కానీ చూడాలి.
తొలగించండిడా.పిట్టా వారు మీ పూరణ బాగుంది.
తొలగించండిపితృ లో పి లఘువే. దేవతాసాదము, దైవసాదము ల సమాసములసాధువులు. సాదము అన్నమను నర్థమున యాచ్చికము.
డాపిట్టానుండిఆర్యా
తొలగించండిStressను బట్టి గురు లఘు నిర్ణయం ఉంటుంది పితృ॥అసలు॥పిత్రుగా పలుక నపుడు పితృ భక్తి పై పై భక్తిగా గోచరిస్తుంది. పోనీ వ్రాతలో ఋ కారం వాడనిదిspelling mistake ఔతుంది.పాఠకులు ఊహ తెలియంగల వారనుకుంటాం.యథా తథంగా చదువడం శల్య పరీక్షయేనేమో,భావం సంగతి వదలి వేయ వలసిందేనా? ఒక మంగళ హారతిలో సత్య వ్రత ప్రసాదాన్ని"దైవసాదమున నాలవ భాగంబారగించి" అని ఉన్నది.ప్రసాదం సాదం అన్నాలే కదా, మొదటిది రెండవది ఆసమయానికి నోటికి రా డమే ఘనం మాకు.
ఇక పద్యం లో ఒక చేంతాడు లాంటి సంస్కృత సమాసం కేవలం అభ్యాసంవల్లరాదు.మీసాంగత్యంలోనన్ను ఉండ నిస్తారా లేదా.నగణంలోఋకారం వస్తే అలాంటివే ఎన్నుకుంటాం లఘువు కావడం కాక పోవడం నడకనుకుంటు పరచాలన్న వధంగా చదివితే flow మాటేమిటి?ఓపికవహించండి,
డా.పిట్టా వారు క్షమించండి మీ మనస్సు కష్ట పెట్టినట్లున్నాను. మీ సాంగత్యమానందదాయకమే.
తొలగించండిప్రసాదము సాధువైనపుడు సాదము ఆచ్చిక పదమెలా అయినదో విచారించ వలసిన విషయమే.
బుద్ధిగ శ్రాద్ధపు కర్మలు
రిప్లయితొలగించండితద్దయు నిష్ఠగను జేసి తనయ జనమ్ముల్
ముద్దదిగుచుండె, నిజముగ
తద్దినమే లేని రోజు నా తద్దినమే
యతిమైత్రి స్థానములో "నా" ఉంది కాబట్టి యతి "త" కు న తో సంయుక్తము లేదా త కు ముందు బిందువు వచ్చునట్లు కానీ చూడాలి.
తొలగించండిసమస్యను గమనించకుండా పూరించాను. తమరి సూచనకు ధన్యవాదములు.
తొలగించండిముద్దదిగిచుండె, నరయం
తద్దినమే లేని రోజు నా తద్దినమే - అంటే సరిపోతుందా. తెలియజేయ ప్రార్థన.
సత్యనారాయణ రెడ్డి గారు సవరణతో మీ పూరణ బాగుంది.
తొలగించండితనియ జనమ్ముల్ అనండి.
హద్దుగ చెలిచేజిక్కిన
రిప్లయితొలగించండిముద్దుగ నుద్యోగమొచ్చి మురిసిన రోజున్
నొద్దిక నొకటే కాగా
తద్దినమే లేని రోజు నా తద్దినమే
యతిమైత్రి స్థానములో "నా" ఉంది కాబట్టి యతి "త" కు న తో సంయుక్తము లేదా త కు ముందు బిందువు వచ్చునట్లు కానీ చూడాలి.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియతిమైత్రి స్థానములో "నా" ఉంది కాబట్టి యతి "త" కు న తో సంయుక్తము లేదా త కు ముందు బిందువు వచ్చునట్లు కానీ చూడాలి.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండితద్దిన ములపై బ్రతుకుచు
తొలగించండితద్దిన కర్తలు యొసంగు దానము పైనే
తద్దినమంతయు గడవన్
తద్దినమే లేనిరోజు నా తద్దినమే"
గురువుగారూ సవరించినాను. గ్రుడ్డిగా చివరిపాదము paste చేశాను. విషయం నేర్పినందులకు కృతజ్ఞతాభివందనములు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివద్దని దేహపు భ్రాంతియు
రిప్లయితొలగించండిముద్దుగనే తలచినేను మోహము విడుతున్
కద్దది ప్రాణము లోన
న్తద్దినమే లేనిరోజు, నా తద్దినమే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిహనుమచ్ఛాస్త్రి గారు మీ పూరణ బాగుంది.
తొలగించండి"విడుతుం గద్దది","లోనందద్దినమే" అనవలెను గద.
ఏ దినమందు తద్దినములే కరవౌనొ మదీయ తద్దినం
రిప్లయితొలగించండిబా దినమౌను సద్ధితుడ! హాస్య మబద్ధము గాదు ప్రస్తుతం
బేదియు దోచకున్నయది యీపరివారము నీదలేను సం
పాదన శూన్య మయ్యెనని భాగ్య విహీనుడు బ్రాహ్మణుండనెన్.
హ.వేం.స.నా.మూర్తి.
ముద్దారగ వంటకములు
రిప్లయితొలగించండివద్దన్నను భోక్త వనుచు వడ్డించి ననుం
బెద్దగ జూతురు శ్రద్ధ
న్దద్దినమే, లేనిరోజు నా తద్దినమే.
హ.వేం.స.నా.మూర్తి.
మూర్తిగారు మీ రెండు పూరణలు చాలా బాగున్నవి.
తొలగించండియద్దినము సూర్యు జూడమి
రిప్లయితొలగించండితద్దినమును నండ్రు బుధులు తాదాత్మ్యత తో
మొద్దుగ బలుకుట న్యాయమె
తద్దినమే లేనిరోజు తద్దినమే నా
సమస్య పాదము మార్చ రాదు.
తొలగించండియతిమైత్రి స్థానములో "నా" ఉంది కాబట్టి యతి "త" కు న తో సంయుక్తము లేదా త కు ముందు బిందువు వచ్చునట్లు కానీ చూడాలి.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమొద్దుగ దిరిగెడి నన్నున్
సుద్దులు జెప్పుచు పితరుడు సూరిగ మార్చెన్
పెద్దగ జేసిన సుతి న
న్తద్దినమే లేనిరోజు నాతద్దినమే
(సుతి = తండ్రి )
రాజారావు గారు మీ పూరణ బాగుంది.
తొలగించండినందద్దినమే అనవలెను గదా. సుతి పదమును తండ్రి యర్థమున వాడితిరి బాగుంది.
సుతుని కాంక్షించు వాడు లేక సుతునిగ తలచు వాడని వ్యుత్పత్తి.
శ్రీ కామేశ్వరరావు గారికి నమస్కారములు. పద్యాన్ని తమరి సూచన ప్రకారం మార్చి వ్రాసాను. పరిశీలించగలరు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
మొద్దుగ దిరిగెడి నన్నున్
సుద్దులు జెప్పుచు పితరుడు సూరిగ మార్చెన్
పెద్దగ జేసిన పిత నం
దద్దినమే లేనిరోజు నాతద్దినమే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిశ్రీయుత కామేశ్వరరావు గారికి నమస్కారములు. క్షమించాలి. మీసూచన పాటించి నిన్నటి పూరణను మరొక్కసారి మీ పరిశీలనకు పంపుతున్నాను. దయతో పరీక్షించండి.
తెలివిగ కార్యమెంచి గడతేర్చెడి నేర్పును జూపు నొమ్మికన్
దెలియక నుండు లౌల్యమున ధీదయె సూనము నైన గ్రుడ్డిదౌ
బలదము చేనులో దిరుగు బద్ధతి నాచరణమ్ము లేకయే
ఫలితముగోరి పాటుపడు వారికి దక్కునె లాభ మెయ్యెడన్.
రాజారావు గారు మీ సవరణ బాగుంది. "దెలియక యుండు" అనండి. "శూన్యమునైన" అన్న పరవా లేదు.
తొలగించండిముద్ద దిగదు నిజ మరయం
రిప్లయితొలగించండిదద్దినమే లేనిరోజు నా తద్దినమే
యద్దిన మగు నిక సుమ్మీ
విద్దియ యియ్యది వృధాయె వివరింపంగన్
ఏ దినమందు తద్దినములే కరవౌనొ మదీయ తద్దినం
బా దినమౌను నిక్కముగ హాలికు డోర్చునె వర్ష శూన్యమున్
మోదము నీయ నేర్చునె విభూషణ హీనము నీరజాక్షికిన్
కాదనలేరు క్షత్రియులు కయ్యము లెన్నడు వీరవర్యులై
యద్దినే తద్దినం నాస్తి తద్దినం మమ దుర్దినమ్
రిప్లయితొలగించండితద్దిన భోక్తగ బాపడు
రిప్లయితొలగించండియొద్దిక,గారెలును పలల యూషము కుడిచెన్,
నిద్దురలో భాషించెన్
తద్దినమే లేని రోజు నా తద్దినమే
తిమ్మాజీ రావు గారు మీ పూరణ చాలా బాగుంది.
తొలగించండిభాషించెం దద్దినమే అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి]
తొలగించండిశ్రీ కామేశ్వరరావు గారికి నమస్కారములు. మీ సూచన మేరకు పద్యము సవరించితిని
తద్దిన భోక్తగ బాపడు
యొద్దిక,గారెలును పలల యూషము కుడిచెన్,
నిద్దురలో భాషించె౦
దద్దినమే లేని రోజు నా తద్దినమే
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమాదిరి లేని పోకడను మార్చుచు దండ్రియె నన్ను నెంతయో
నాదర మొప్పు బోధనల నచ్చుగ జేయుచు దీర్చె దల్చగా
నేదినమందు తద్దినములే కరవౌనొ మదీయ తద్దినం
బాదినమౌనుగా ననుచు పండితు డొక్కడు బల్కె నచ్చటన్.
రాజారావు గారు మీ పూరణ బాగుంది. యాదర మొప్ప అనండి.
తొలగించండిఏదినమందు తద్దినములే కరవౌనొ మ దీ యతద్దినం
రిప్లయితొలగించండిబాదిన మౌనుగా బలికి రార్యులు న్యాయమె యట్లు పల్కగ
న్నా దిన మందు నారవియ యాయత రీతిని గానడో యిక
న్నా ది నమున్ దలం తురట యయ్యది యూనని దుర్దినంబు గాన్
అన్నయ్య నీ పూరణ బాగుంది. మిక్కిలి దుర్దినంబు గాన్ అన్న నెట్లుండును?
తొలగించండిమేదినియందుమానవుడు మిత్తిని జేరిన రోజెతద్దినం
రిప్లయితొలగించండిబా దినమందు భోక్తలకు బాయస బూరెలు దక్షిణాదులౌ
యేదినమందు తద్దినములే కరవౌనొ మదీయ తద్దినం
బే తిరమంచునెంచునల విప్రవరుండు మనోవిచారతన్.
తద్దినపున్ భోక్తయగుట
తద్దిన ముల్గల్గురోజు ధన్యుడనగుదున్.
వద్దిక యనకుండన్నా
తద్దినమే లేనిరోజు నా తద్దినమే.
సూర్యనారాయణ గారు నమస్సులు. కంటి చికిత్స యయినదా? బాగున్నదా యిప్పుడు?
తొలగించండియతిమైత్రి స్థానములో "నా" ఉంది కాబట్టి యతి "త" కు న తో సంయుక్తము లేదా త కు ముందు బిందువు వచ్చునట్లు కానీ చూడాలి.
కామేశ్వరరావుగారికి నమస్సులు. హాస్పిటల్ కు వెళ్లలేదు. మరికొంచెం సమయమున్నది. అందువలన అలవాటు మానలేక పద్యాలుపంపాను. నిజమే ,బిందుపూర్వక తకారమే నాకారంతో చెల్లుతుంది.అలా ప్రయత్నంచేసి పంపుతాను.
తొలగించండిఉత్పలమాల 4వ పాద సవరణ, కందము సవరణ మరల వ్రాశాను. పరిశీలింపగోరెదను.
తొలగించండిసూర్యనారాయణ రావు గారు సవరణ తో మీ పూరణ బాగున్నది.
తొలగించండిపాయస బూరెలని సమసింపరాదు గద.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
స ప్త ప ది
ఏ దిన మ౦దు తద్దినములే కర వౌనొ ,
…………… మదీయ తద్దిన౦
బా దిన మౌ నట౦చు మది వ్యాకుల మ౦దె
…………………… మహీసురు౦ డొక౦ |
డే దిన మ౦దు చావు లిక హీనము చె౦దునొ
…………… కల్గు చావు నా
కా దిన మ౦ద ట౦చు హృదయమ్మున
…………… జి౦తిలె కాటి పాప | డి౦
కే దిన మ౦దు జాఢ్యములు హెచ్చక
…………… రోగుల స౦ఖ్య తగ్గునో
యా దిన మ౦దె తగ్గును ధనార్జన మి౦చుక
…………… య౦చు వైద్యు డె౦
తో దిగు లొ౦దెగా | పరుల దుస్థితి పై
…………… గడియి౦త్రు కొ౦ద ! రో
సోదర ! " శ్రీ " నిర౦తరము , క్షోణి పయిన్
…………… గలిగి౦చు చీదరన్ ! !
{ హీనము చె౦దు = తక్కువ యగు ;
కాటిపాపడు = కాటికాపరి ;
చీదర = ఉపద్రవము , గ౦దరగోళము }
గురుమూర్తి ఆచారి గారూ యష్ట కష్టాలను గుర్తు సేయు మీ సాప్తపదీయ పూరణ మనోహరముగా నున్నది.
తొలగించండిజాడ్యములు, గలిగి౦చు జీదరన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమూర్తిగారు సమస్య "ఏ దినమందు తద్దినములే కరవౌనొ మదీయ తద్దినం
తొలగించండిబా దినమౌను." దానిని మార్చకూడదు కదా.
వేదములన్నియుంజదివి వేదనలొందగ మాతృపుత్రదా
తొలగించండిరాదుల పోషణల్సలుప నన్యముగానకసంతతంబు( శ్రా
ద్ధాదికకార్యముల్జరిపి కాలము నీడ్చుచు నున్నవాడనా
కే దినమందు తద్దినములే కరవౌనొ మదీయ తద్దినం
బా దినమౌను నేలయన నాకలియగ్నిగమమ్ముగాల్చదే
గురువుగారూ, మీశ్రద్ధకు కడుంగడు సంతోషము. మీరు ఎంతనిశితంగా పరిశీలిస్తే మాకు అంతనేర్చుకునేఅవకాశంకలుగుతుంది.
తొలగించండి* ఉత్పలమాలికగా మార్చి వ్రాశాను, పరిశీలించప్రార్థన
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినాదొక దీనగాధ చిన నాటను పెద్దల చెప్పు సుద్దులన్
రిప్లయితొలగించండికాదని విద్య నేర్వకను గాడిద నైతిని లేదు సొమ్ము నా
కే దినమందు తద్దినములే కరవౌనొ మదీయ తద్దినం
బా దినమౌను లేక కడుపారగ తిండి భుజింప భోక్తనై.
మిస్సన్న గారు మీ పూరణ బాగుంది.
తొలగించండిగాదని, నేర్వకయు.
ధన్యవాదాలు కామేశ్వరరావుగారూ మీ సూచనలు గమనించాను.
తొలగించండిఎద్దినమున నిను గాంచిన
రిప్లయితొలగించండినద్దినమున నాదు ప్రాణనాడులు కదలున్
ముద్దులగుమ్మా ! వసుద
న్తద్దినమే లేనిరోజు నాతద్దినమే!!!
ఇద్దరు భామలు గట్టిగ
గుద్దుకు పోట్లాడు చుండ కోపములేలన్
వద్దని జెప్పిన వేళ
న్తద్దినమే లేనినాడు నాతద్దినమే!!!
శైలజ గారు మీ పూరణలు బాగున్నవి. రెండవ పూరణ లో పరిష్కారము కొంచెము సంశయము.
తొలగించండివసుధం దద్దినమే, వేళం దద్దినమే.
శుద్ధపు భోక్తనునగుట
రిప్లయితొలగించండిన్తద్దినమేలేనిరోజు నాతద్దినమే
తద్దినమన్సంబరమౌ
తద్దినమననాకునెప్డు ధనలాభంబౌ.
సూర్యనారాయణ రావు గారు మీ పూరణ బాగుంది.
తొలగించండినగుటం దద్దినమే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశర్మ గారు మీ పూరణ బాగుంది.
తొలగించండిబ్రత్కు రూపమసాధువు.
ఉత్పలమాల 4వ పాదం. సవరణ...
రిప్లయితొలగించండిబా దినమంచునెంచునల పారుడు దీనమనోవిచారుడై.
ఏ దినమందు తద్దినములే కరువౌనొ మదీయ తద్దినం
రిప్లయితొలగించండిబాదినమౌను, సంతతము పండిత పామరు లెల్లరున్ కడున్
మోదము తోడ శ్రాద్ధముల పొందిక తోడుతఁ జేయ గల్గినన్
వేదనలేని జీవితము పృథ్విని నాకును గల్గు రూఢిగా
సత్యనారాయణ రెడ్డి గారు మీ పూరణ బాగుంది.
తొలగించండిశ్రాద్ధములఁ బొందిక, లెల్లరుం గడున్.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురువు గారికి నమస్కారములు. నేను భావముక్తకాలు పేరున ఆటవెలదులలో వ్రాసిన రెండు వందలకు పైబడి పద్యాలను రోజుకు ఓ పది చొప్పున పంపుతాను. దయచేసి తమరు, తక్కిన ఈ బ్లాగులోని మహాకవులు పరిశీలించి సూచనలివ్వగలరు.
భావముక్తకాలు
భోగ భాగ్యములను పోనాడు కొనవచ్చు
విహిత మిత్రు నెపుడు వీడ రాదు
లోక ధర్మ మిద్ది ప్రాకటమ్ముగ నమ్ము
నారసింహ తనయ! సార హృదయ!
2. పరుగులెత్తి బోర్లపడు నాగరికు కన్న
తనదు కాళ్ళపైన తనరి వెడలు
కర్షకుండె గాద కడుమిన్న నిజమెన్న
నారసింహ తనయ! సార హృదయ!
3. కష్ట నష్టములకు కలగుండు పడకుండ
వెంట నంటి కాచు విద్య యెపుడు
తొలగి పోని యట్టి తొడవని తెలియరా!
నారసింహ తనయ! సార హృదయ!
4. కాల రీతి తోడ కాన వచ్చెడి మార్పు
కలుగ జేయు భయము తెలియకున్న
పూని విద్య లెల్ల పొందుగా నేర్వరా!
నారసింహ తనయ! సార హృదయ!
5. అధికమైన పొగను నణగార్చు మంటలు
మంట లెగయగ పొగ మాయ మౌను
తత్వ సిధ్ధి వలన తన మోహ మణగును
నారసింహ తనయ! సార హృదయ!
6. ధనము పెరుగు కొలది తగవైన మిత్రులు
తరిగి, వైరి జనులు పెరుగు చుంట
వాస్తవమ్ము లోక వ్యవహారమందున
నారసింహ తనయ! సార హృదయ!
7. అచ్చెరువును గొల్పు అంశములను బట్టి
తత్వ శాస్త్ర మదియె తనరి పుట్టు
తత్తరింత లేక తాత్పర్య మెంచుమా!
నారసింహ తనయ! సార హృదయ!
8. ఇడుము లెపుడు ధైర్య హీను కృంగగ జేయు
పటుత కల్గి యున్న వాని పెంచు
బలము చేత నన్ని బాగు చేయగ వచ్చు
నారసింహ తనయ! సార హృదయ!
9. నెలలు, వత్సరములు నేర్చిన జ్ణానమ్ము
గంటలోన పొంద గలుగ వచ్చు
ప్రఖ్య నొందిన పండితు జేరగా!
నారసింహ తనయ! సార హృదయ!
10. ఇల్లు కదలకుండు పొల్లు యూహల వాని
తెలివి బుధ్ధి యంత తెన్ను లేక
మణులు గనుల నుండు మాదిరి నొప్పవు
నారసింహ తనయ! సార హృదయ!
రాజా రావు గారూ - ఇతర పద్యములను మీరు గురువు గారి యీ మెయిలుకు పంపండి. వారు పరిశీలించి తగిన సమయంలో విడిగా ప్రకటిస్తారు. ఆ పద్ధతి శంకరాభరణం బ్లాగు లో గతం నుండి జరుగుచున్నది. ఈక్కడ దయచేసి సమస్యాపూరణలను మాత్రమే పంప మనవి. అన్యదా భావించవలదు.
తొలగించండిక్షమించండి. నాకు తెలియక పంపాను. ఈరకంగా ఇంక పంపను.
తొలగించండిరాజారావు గారు గురువు గారికి పంపండి.
తొలగించండిబుద్ధిగ ప్రజలందరు నిట
రిప్లయితొలగించండితద్దినముల శ్రద్ధ తోడ తప్పక నెఱపన్
తద్దినపు ద్విజుండనియె
న్తద్దినమే లేని రోజు నా తద్దినమే!
శ్రీధర రావు గారు మీ పూరణ బాగుంది.
తొలగించండిద్విజుండనియెం దద్దినమే
అద్దిర నాయన యనుచున్
రిప్లయితొలగించండిముద్దులతో పెట్టు వెన్నముద్దలు కాకన్
గుద్దులిడు గురుల సిద్దా
న్తద్దినమే లేనిరోజు నా తద్దినమే
కృష్ణా రావు గారు సిద్ధాన్త దినమే అనవలెను కదా. కాక ద్రుతాంతము కాదు.
తొలగించండిపెద్దల రమ్మంటివి మా
రిప్లయితొలగించండిపెద్దల తద్దినమటంచు ప్రియ భావముతో
రద్దాయె డబ్బు చెల్లక
తద్దినమే లేని రోజు నా తద్దినమే!
లక్ష్మీనారాయణ గారు సమస్య పాదములో యతిని కూర్చ లేదు. (చెల్లక ద్రుతాంతము కాదు.)
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅద్దిరబన్నా ముదమౌ
రిప్లయితొలగించండిపద్దెము వ్రాసెడు 'దినమ్ము'! వ్రాయకయున్నన్
మద్ద "దిగనిదౌ"! కనగం
'దద్దిన'మే లేనిరోజు నా "తద్దిన"మే
(మొదటి 'తద్దినము' ముదమైనది,
రెండవ "తద్దినము" ముద్దదిగనిది)
అద్దిరబన్నా ముదమౌ
రిప్లయితొలగించండిపద్దెము వ్రాసెడు 'దినమ్ము'! వ్రాయకయున్నన్
మద్ద "దిగనిదౌ"! కనగం
'దద్దిన'మే లేనిరోజు నా "తద్దిన"మే
(మొదటి 'తద్దినము' ముదమైనది,
రెండవ "తద్దినము" ముద్దదిగనిది)
ఏ దినమందు తద్దినములే కరవౌనొ మదీయ తద్దినం
రిప్లయితొలగించండిబా దినమౌను, బ్రాహ్మణులు వందలు వందలు జాబులేక యీ
సాధక బాధకమ్ములను సందడి జేయుచు వేచియుంటిరే!
పేదల కోసమైనకట! పెద్దలు గ్రక్కున చావకుండిరే!