12, నవంబర్ 2016, శనివారం

సమస్య - 2196 (మారుతి చక్రాయుధమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మారుతి చక్రాయుధమున మన్మథుఁ జంపెన్"
లేదా...
"మారుతి చక్రమున్ విడిచి మన్మథుఁ జంపెను గ్రూరకర్ముఁడై"

84 కామెంట్‌లు:

  1. కం.శ్రీరాముని బంటెవ్వడు?
    ఏరీతి నరకుని జంపె నిమ్మహి హరియే?
    గౌరీపతి చంపె నెవని?
    మారుతి;చక్రాయుధమున ;మన్మథు జంపెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారు మీ పూరణ క్రమాలంకారముతో చాలా బాగుంది.
      బంటెవ్వడు? ఏరీతి విసంధి గా వ్రాయకూడదు. బంటెవ్వడొ?యేరీతి అంటే సరి.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. నరేంద్ర మోది పూర్తి పేరు: నరేంద్ర దామోదర దాస్ మోది. దామోదరుడనగా విష్ణుమూర్తి. ఆతని అవతరమే శ్రీరాముడు.

      దామోదర దాసుడనగా శ్రీరాముని బంటయిన మారుతి.

      మన్మధుడనగా మనసును మధించు వాడు. అనగా మన్మోహనుడు.

      మారుతి మన్మధు(జంపెన్ = నరేంద్ర మోది మన్మోహనసింగును ఓడించెను



      మారుతి మోదీ యవగా
      మారుడు మౌనమును దాల్చి మనుమోహనుడై
      చోరులు గద్దెలు దిగగా
      మారుతి చక్రాయుధమున మన్మథుఁ జంపెన్

      తొలగించండి
    4. శాస్త్రి గారు మీరద్భుతమైన తర్కముతో బ్రహ్మాండమైన పూరణ చేసారు.
      తర్కములో ఋజువైనవన్ని నిజములు కాదుకదా.
      1x0 = 0
      2x0 = 0
      3x0 = 0
      కాబట్టి 1=2=3.
      సగము మూసిన సగము తెరిచిన ఒక్కటే కాబట్టి మూసిన అంటే తెరచిన ఇత్యాదులు!!!

      తొలగించండి
    5. విజ్ఞులు కామేశ్వర రావు గారు:

      నాకీ సమస్యాపూరణంలో అనుభవం అసలు లేదు కదా! అందున చాలా కుస్తీ పట్టి ప్రయత్నం చేశాను. ఇది"అక్రమాలంకారం". సరదాగా వ్రాశాను. క్షమించండి!

      తొలగించండి
    6. శాస్త్రి గారు మీ పూరణలో తప్పు లేదు నేను హాస్యమునకే అన్నాను. పైగా దానిని ఉత్ప్రేక్షగా కూడా అనుకోవచ్చును.

      తొలగించండి


  3. ఆ రాముని బంటెవరూ?
    ఆ రాక్షసుల హరి యెట్లు హతమార్చెనుగా ?
    ఆ రుద్రుడేమిజేసెన్ ?
    మారుతి; చక్రాయుధమున ; మన్మథుఁ జంపెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి


  4. మా రాఘవేంద్ర రావుని
    "హేరంభా" యను జిలేబి హెచ్చగు చిత్రం !
    పోరాటంబున హీరో
    మారుతి, చక్రాయుధమున మన్మథుఁ జంపెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    కోరరు రాముని భజనల
    మారరు భక్తులుగ నబల మానపు హర్తా
    త్యారడి హెచ్చగ కలియుగ
    మారుతి చక్రాయుధమున మన్మథు జంపెన్
    నీరును గల్పకుండగనె నెమ్మది నమ్మెను పాల పానముల్
    భారమటంచు నీప్రజల బాలన జేయగ వచ్చె భక్తితో
    కోరెను బొక్కస ప్రగతి గూల్చుచు శాంతి కుటీర ప్రేమలన్
    మారుతి చక్రమున్ విడిచి మన్మథు జంపెను క్రూర కర్ముడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.పిట్టా వారు మీ రెండు పూరణలు బాగున్నవి.
      హర్తాత్యారడి అర్థము కాలేదు.
      బొక్కస ప్రగతి లో స లఘువే యవుతుంది బొక్కసము ఆచ్చికము కాబట్టి.
      బొక్కసపుప్రగతి సరియైన సమాసము.

      తొలగించండి
    2. డా.పిట్టా నుండి
      ఆర్యా
      దానసాత్ పుణ్యం అనేసముదాయంలో దానము వల్ల వచ్చిన పుణ్యం అని భావం.హరించుట వలన వచ్చిన గందరగోళం ,ఆసక్తి కాదా?ఈ ,సాత్ ఏ విభక్తి ప్రత్యయమో?

      తొలగించండి
    3. దాన అ కారాంత నపుంసక పదము. దానస్య:షష్టీ విభక్తి, దానాత్: పంచమీ విభక్తి. దానసాత్ అసాధువు.
      ఆరడి తెలుగు పదము. యీ రెంటికి సంధి కాని సమాసము కాని చేయరాదు.
      హర్తాత్యారడి: హర్త+అతి+ ఆరడి; హర్త, అతి రెండు సంస్కృత పదములు. ఆరడి తెలుగు పదము కనుక హర్తాతి వరకు సాధువే కానీ తర్వాత ఆరడి తో సంధి మరియు సమాసము చేయ దగదు.


      తొలగించండి
    4. ఆర్యా
      బొక్కసాత్ప్రగతి సరి పోతుందేమో!? డా.పిట్టా నుండి

      తొలగించండి
    5. తెలుగు పదములకు తెలుగు విభక్తులనే వాడాలి కదా. బొక్కసమ్ములను గూల్చుచు అన్న సరిపోతుంది.

      తొలగించండి
  6. డా.పిట్టా
    ఆర్యా
    నిన్నటి నా పూరణలో "చేయకన్ "ungrammatical అన్నారు .భాగవతం.వామన .ఘట్టంలో "గాకుంట(576వ పద్యం)"సంతోషి గాకుంట సంసార హేతువు పోతన ప్రయోగం.గాకన్*ఉంట ల కలయిక ఒప్పుకోవాలి కదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెద్దలు పిట్టా వారూ...నమస్సులు!
      కాక... ద్రుతాంతము కాదు. అనగా...కాకన్ అనునది తప్పు. కాక + ఉంట = కాకుంట...అగును. ఈ విధంగా చేయకన్...అనునది కూడా తప్పే. వ్యతిరేకార్థక క్రియలకు [అక ప్రత్యయమునకు] అంతమున ద్రుతము రాదు.

      తొలగించండి
    2. డా.పిట్టా వారు మీ సందేహము పూర్తిగా తీరినట్లు భావిస్తాను.
      కవిపుంగవులు మధుసూదన్ గారు మీ వివరణకు ధన్యవాదములు.

      తొలగించండి
  7. శ్రీరాముని దాసుడెవరు?
    దూరెడు శిశుపాలునెట్లు దునిమెను హరియే?
    వారుండెవరిని జంపెను?
    మారుతి, చక్రాయుధమున, మన్మథు జంపెన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారు మీ పూరణ చాలా బాగుంది. వారుడు! క్రొత్త క్రొత్త పదములు వాడుటలో మీకు మీరే సాటి!

      తొలగించండి
  8. ఆ రామ దూత యెవ్వం
    డేరీతిని దునిమె కృష్ణు డీ శిశుపాలున్?
    గౌరీశు డెవని జంపెను?
    మారుతి, చక్రాయుధమున, మన్మథు జంపెన్!

    రిప్లయితొలగించండి
  9. నిన్నటి సమస్యకు నా పూరణము:

    పగ్గా లేవియు నాపవు
    సిగ్గెగ్గులులేని మనుజు, సిరి తా వలచున్
    గగ్గోలొందుచు జేరగ
    బెగ్గలముల ద్రుంచి వారి ప్రియముంగనగన్!

    రిప్లయితొలగించండి
  10. ఉ.కోరిన వెంటనే వరము గొల్చిన వారికి నిచ్చు దేవుడే !
    చీరఁ గజేంద్రుడే మకరి జెండెను శ్రీహరి యెవ్విధమ్మునన్?
    ఏరిని సంహరించె హరు డెవ్విధి చచ్చె సుయోధనుండిలన్?
    "మారుతి; చక్రమున్ విడిచి; మన్మథుఁ జంపెను; గ్రూరకర్ముఁడై"

    రిప్లయితొలగించండి
  11. శ్రీగురుభ్యోనమః

    ధీరత వార్ధి దాటిన సుధీరుని నామ మదేమి మిత్రమా?
    వారిజనేత్రు డెట్లు శిశుపాలుని జంపె? త్రినేత్రుడుగ్రుడై?
    కోరి శరమ్ములన్ విడచె కూలగ పక్షి కిరాతు డేలనో?
    మారుతి, చక్రమున్ విడిచి, మన్మథుఁ జంపెను, గ్రూరకర్ముఁడై"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారు క్రమాలంకారములో జంపెను పదము ద్విరుక్తము కాకుండ చక్కటి పూరణ చేసారు.

      తొలగించండి
    2. గురువుగారు ధన్యవాదములు. 'ద్విరుక్తము కాకుండా' ఆనునది అర్థము కాలేదు. దయ జేసి వివరింప ప్రార్థన.(అన్యదా భావింప ప్రార్థన).

      తొలగించండి
    3. శాస్త్రి గారు జంపెనెవరి యిలా ప్రశ్నను సంధించక ప్రశ్నలోను నుత్తరమున జంపె పదము రాకుండా పూరించడము. ("మన్మథుని జంపెను" నకు)

      తొలగించండి
    4. గురువుగారు నమస్సులు, ధన్యవాదములు.

      తొలగించండి
  12. శ్రీరామ దూత యెవ్వరు?
    శౌరి రిపుల జంపునెటుల? జప భంగమున
    న్నా రుద్రుడేమి జేసెను?
    మారుతి! చక్రాయుధమున! మన్మథు జంపెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారు మీరు కూడా ద్విరుక్తము లేకుండ క్రమాలంకారములో చేసిన పూరణ చాలా బాగుంది.

      తొలగించండి
    2. కవివర్యులు కామేశ్వరరావు గారికి ధన్యవాదములు .

      తొలగించండి
  13. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఆరయ రామ భక్తు డెవ ? రా హరి చైద్యు

    …………… నెటుల్ వధి౦చెనో ?

    వారిజ బాణముల్ విసిరి భ౦గ మొనర్ప

    ……………… తపమ్ము , నీశ్వరు౦

    డేరిని జ౦పె ? సీతను హరి౦చెను

    ………… రావణబ్రహ్మ యే విధిన్ ?


    మారుతి | చక్రమున్ విడిచి | మన్మథు

    ………… జ౦పెను | క్రూరకర్ముడై |

    { చైద్యుడు = శిశుపాలుడు ; హరి౦చు =
    దొ౦గిలి౦చు }

    రిప్లయితొలగించండి
  14. మైరావణుఁ జంపెనెవరు?
    శౌరి రయమున శిశుపాలు సరిగొనె నెటులన్?
    గౌరీపతి చంపె నెవరి?
    మారుతి, చక్రాయుధమున, మన్మథుఁ జంపెన్

    రిప్లయితొలగించండి
  15. ఆ రావణ సుతు నక్షయుఁ,
    జేరగఁ దప్పు లట వంద శిశుపాలుని నే
    పార బకారియు,శివుడున్
    మారుతి, చక్రాయుధమున, మన్మథుఁ జంపెన్


    ఆరగ నేలఁ గృష్ణుఁ బరమాత్ము డటంచును గొల్తు రెల్లరున్
    ధీరుడె వీడ టంచును మథించ మనమ్ము మురారి చైద్యునిన్,
    దారుణ నిందలం గలగి ధర్మ సుతాదుల తోడఁ జూడ నా
    మారుతి, చక్రమున్ విడిచి మన్మథుఁ జంపెను గ్రూరకర్ముఁడై
    [మన్మథుఁడు = బుద్ధిని కలవరము చేయువాడు; క్రూరకర్ముఁడు = భయంకరమైన కర్మ చేసిన వాడు]

    రిప్లయితొలగించండి

  16. శ్రీరాము సతిని వెదకుచు
    నా రావణసతుల గాంచి యాశించ డహో!
    ధీరుడు జితెంద్రియుండౌ
    మారుతి చక్రాయుధమున మన్మథు జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారు యింద్రియ నిగ్రహమనే చక్రముతో యన మీ పూరణ చాలా బాగుంది.
      జితేంద్రియు దీర్ఘము మర్చి పోయారు

      తొలగించండి
    2. శ్రీ కామేశ్వరరావు గారూ,ధన్యవాదములు.సవరించిన పద్యము
      శ్రీరాము సతిని వెదకుచు
      నా రావణసతుల గాంచి యాశించ డహో!
      ధీరుడు జితే౦ద్రియుండౌ
      మారుతి చక్రాయుధమున మన్మథు జంపెన్

      తొలగించండి
  17. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సూరికి ఛాత్రుడెవరిలన్?
    క్రూర మకరి నేవిధమున కుందుడు గూల్చెన్?
    భూరికసి నేమిజేసెను?
    మారుతి; చక్రాయుధమున; మన్మధు జంపెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నూత్న నామములతో మీ పూరణ చాలా బాగుంది రాజారావు గారు.

      తొలగించండి
    2. పూజ్య కవివరేణ్యులు శ్రీ కామేశ్వరరావు గారికి ధన్యవాదములు.

      తొలగించండి
  18. ఆ రవిని తాకె నెవ్వడు
    క్రూరుని శిశుపాలు నెటుల గూల్చెను హరి, యీ
    శ్వరు డేమొనర్చె హిమగిరి
    మారుతి చక్రాయుధమున మన్మథుఁ జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారు మీ పూరణ బాగుంది.
      మూడవ పాదములో మొదటి యక్షరము గురువై యుండాలి కద.

      తొలగించండి
  19. శ్రీ రఘు రాముగూర్చి గడు చింతన జేసిన భక్తు డెవ్వ డా ?
    దారుణ మైన నక్రమును దార్క్ష్యుడు వచ్చియు జంపె నెట్టులన్?
    భైరవు డెవ్వనిన్నడచె భంగము జేయ తపస్సునుగ్రుడై ?
    మారుతి, చక్రమున్ విడిచి , మన్మథుఁ జంపెను గ్రూరకర్ముఁడై.

    రిప్లయితొలగించండి
  20. నీరధి దాటవేగముగ నింగికి లేచిన వీరుడెవ్వరో?
    శౌరి యమేయ క్రోధమున చైద్య మహీపతిఁ జంపెనెవ్విధిన్?
    క్రూరముగానజుండెవరిఁ గూల్చె?సుయోధను డెట్లు రూపఱెన్?
    మారుతి, చక్రమున్ విడిచి, మన్మథు జంపెను, క్రూర కర్ముడై

    రిప్లయితొలగించండి
  21. శ్రీరాముని భక్తుడెవరు?

    శౌరియు రక్కసులనెటుల జంపెను రణమున్

    గౌరీశుడు జంపె నెవరి?

    మారుతి,చక్రాయుధమున, మన్మధు జంపెను.

    రిప్లయితొలగించండి
  22. ఒకసారి అవధానం లో ఒకసమస్య యిచ్చారు.
    "వక్త్రా స్తోత్ర పరాయణత్వమున నీ వాగ్ధార శ్ల్యాఘ్యంబగున్" ఎంత క్లిష్ట ప్రాసనో చూడండి.డా.నాగఫణి శర్మ గారి పూరణ.

    దృక్త్రాసాయుత జీవితమ్మున మహాదేవీ ప్రసాదమ్ముతో
    స క్త్రైంత వచోవిచారిణి లసద్రాజేశ్వరీ మూర్తినిన్
    యోక్త్రాలంబిని నా సరస్వతి రమా సోమాడ్య నా తత్రయీ
    వక్త్రా స్తోత్ర పరాయణత్వమున నీ వాగ్ధార శ్ల్యాఘ్యంబగున్
    తా:--దుఃఖ పూరిత మైన ఈ జీవితములో ఆ మహాదేవి కరుణ వలన వేదాలన్నీ తెలిసిన ఆ రాజేశ్వరీ దేవి,
    యోక్త్రము (పెళ్ళప్పుడు నడుముచుట్టూ కట్టే తాడు)ఆలంబన గాగల సరస్వతీ, రమాదేవి (లక్ష్మీ దేవి)ఉమా దేవి (సోమా =స ఉమ)వీరు ముగ్గురి ఆశీర్వాదము వల్ల నీ వాగ్ధార పొగడబడుతుంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారు మంచి సమస్యను ప్రస్తావించారు. అవధానములో పూరించిన శ్రీ నాగఫణి శర్మ గారు నిస్సందేహముగ సరస్వతీ పుత్రులే.
      అయితే సమస్య పాదము "వక్త్రస్తోత్ర పరాయణత్వమున నీ వాగ్ధార శ్ల్యాఘ్యంబగున్" అయ్యుండవచ్చు. క్త్ర కి దీర్ఘముండదు.

      నా పూరణ తిలకించండి.

      వాక్త్రాణప్రభ భారతీ సుకర సంభావ్యాబ్జజాశీస్సులన్
      ధృక్త్రాతాయత సద్గుణాత్త విలసద్దివ్యాస్య విష్ణ్వోద్ధతన్
      దృక్త్రేతాగ్ని రుచిప్రభా సదృశ సందీప్తాన నాశీస్సులన్
      వక్త్రస్తోత్ర పరాయణత్వమున నీ వాగ్ధార శ్ల్యాఘ్యంబగున్"



      తొలగించండి
    2. దీన్నే కాబోలు మా నాన్నగారు నారికేళపాకం అనేవారు!

      తొలగించండి
    3. భళా కామేశ్వర రావు గారూ...మీరూ సరస్వతీ పుత్రులే! అభినందనలు!
      చిన్న సందేహాలు...నా అజ్ఞానముచే అడుగుచుంటిని. అన్యథా భావింపవలదని మనవి.
      ధృక్...? ఇది సమాసాంతమున గదా ఉండవలసింది? ప్రారంభాన ఉన్నది. ఐనను... ధృక్త్రాత అనగా? విష్ణ్వోద్ధత?
      ఇవి నా ఆలోచనకు అందకనే అడుగుచుంటిని. వివరింపగలరు.

      తొలగించండి
    4. కవిపుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు. ధృక్ ధరించునది యనునర్థమున చివర నుండాలి. ఇక్కడ ధైర్యముతో గూడిన యనునప్పుడు ముందుండవచ్చును.
      విష్ణు+ ఉద్ధత = విష్ణూద్ధత: విష్ణువుచేతనుద్ధరింపబడుట.

      తొలగించండి
    5. చిన్న సవరణతో

      వాక్త్రాణద్యుతి భారతీ సుకర సంభావ్యాబ్జజాశీస్సులన్
      ధృక్త్రాతాయత సద్గుణాత్త విలసద్దివ్యాస్య విష్ణూద్ధతన్
      దృక్త్రేతాగ్ని రుచిప్రభా సదృశ సందీప్తాననాశీస్సులన్
      వక్త్రస్తోత్ర పరాయణత్వమున నీ వాగ్ధార శ్ల్యాఘ్యంబగున్"

      [వాక్త్రాణ= వాక్బలము; ధృక్త్రాత= ధైర్యముతోగూడినరక్షకుడు; దృక్త్రేతాగ్ని= చూపులనే మూడగ్నులు]

      తొలగించండి
    6. సుకవి మిత్రులు కామేశ్వర రావు గారూ...నమస్సులు! ఆలస్యంగా వీక్షించినందులకు మన్నించండి.

      సవరణ...వివరణల తదుపరి మీ పూరణము మరింత మనోహరముగ నున్నది. ఎంతైనా మీకు మీరే సాటి. శుభాభినందనలు.

      తొలగించండి
    7. కవిపుంగవులు మధుసూదన్ గారు నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  23. మారుతిఁ గృష్ణుని పాత్రకు
    చేరిచి మన్మధుడతండు శిశుపాలుండౌ
    భారీ నాటక వేదిన్
    మారుతి చక్రాయుధమున మన్మధుఁ జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారు సమస్య పాత్రలను నాటకపాత్ర ధారులుగ చేసి సమస్యను గోష్పదీకృతము చేశారు. చాలా బాగుంది.

      తొలగించండి
    2. ఆర్యా! గోప్పదీకృతము అంటే? దయతో తెలుప ప్రార్థన.

      తొలగించండి
    3. ఆర్యా! గోప్పదీకృతము అంటే? దయతో తెలుప ప్రార్థన.

      తొలగించండి
    4. సహదేవుడు గారు గోష్పదమనగా ఆవుయొక్క పాదము. గోష్పదీకృతమనగా పెద్ద దాన్ని చిన్నగా చేయడము. ఆవు దాట కల్గినంత చిన్నగుంట యని.
      ఈ క్రింది మారుతి స్తుతి చూడండి.

      ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృత సాగరమ్
      తృణీకృత దశగ్రీవ మాంజనేయం నమా మ్యహమ్

      తొలగించండి
  24. తీరుగ త్రిమూర్తులను మరి
    మారుతి తన విశ్వరూప మౌనని జూపన్
    వేరుగ హరియై హరుడై
    మారుతి జక్రాయుధమున, మన్మథుజంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామా రావు గారు మారుతిని త్రిమూర్త్యాంశగా భావించిన మీ పూరణమద్భుతము.

      తొలగించండి
  25. ఈ సవరణ పరిశీలించి, తప్పైన తగిన సూచన నివ్వ ప్రార్థన.
    అగ్గంబౌ యడియాసతోసతత మన్యాయంపు మార్గమ్ములో
    పగ్గమ్ముల్ గొనుచున్ బికారి జనులన్ వంచించు దుర్మార్గుడౌ
    సిగ్గెగ్గుల్ దన లోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్
    యెగ్గుల్ బొందుచునుంద్రు సుమ్మ బడుగుల్ హేయంపు సంసారమున్

    రిప్లయితొలగించండి
  26. మారుతి కారునన్ "శివుడు" "మన్మథు" గైకొని షైరుజేయగా
    దారిని మన్మథుండపుడు త్రాగుచు త్రుళ్ళుచు గోలజేయగా
    మారుతి బూటునన్ శివుడు మార్పిడి చక్రము చేత బూనుచున్
    మారుతి చక్రమున్ విడిచి మన్మథుఁ జంపెను గ్రూరకర్ముఁడై :)

    రిప్లయితొలగించండి