8, నవంబర్ 2016, మంగళవారం

సమస్య - 2192 (బోండా లరవై....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే."
లేదా...
"బోండా లర్వది యైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

92 కామెంట్‌లు:

 1. కం. కొండొక వైద్యుడతనితో
  'మెండగు భోజనము మాను ' మేలగుననగా
  తిండిని తగ్గింప దలచి
  బోడాలరవై నమిలెను బొరుగుల వలెనే !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారు మీ పూరణ సహజత్వానికి దగ్గరగా బాగుంది.
   మీ సమస్యను మీరే తప్పుగా వ్రాస్తే యెలాగండి? బోండా కదా!
   "తిండినిఁ దగ్గింప" అంటే బాగుంటుంది.

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ ! నమస్సులు ! ధన్యవాదాలు ! 34 సంవత్సరాలు రాజనీతి శాస్త్ర పాఠాలు చెప్పిన వాడిని.తెలుగు వ్యాకరణమంతగా రాదు.రా.నీ. శాస్త్రంలో అనేక సాంఘికార్థిక సమస్యలను చర్చిస్తాము కదా ! వాటి సూత్రీకరణలకు పద్య రూపమిస్తే బాగుంటుందని , విద్యార్థులు గుర్తుపెట్టు కుంటారని వాటికి సంబంధించిన వంద కంద పద్యాల శతకమొకటి 1998లో ప్రచురించాను.ప్రస్తుతం శ్రీ కంది శంకరయ్య గారికి పంపినాను.సమీక్షిస్తానని చెప్పారు. మీ ఇ-మెయిల్ చిరునామా ఇస్తే పంపగలను. బోలెదు వ్యాకరణ దోషాలుండవచ్చు. గమనించాలి. నా ప్రధాన రంగము రాజనీతి శాస్త్రమే కానీ తెలుగు సాహిత్యం కాదు. కావున నా పరిమితులు నాకున్నాయి.

   తొలగించండి
  3. జనార్దన రావు గారు నమస్సులు. చాలా సంతోషము.
   నేను గూడా M.Tech. (Machine Design) ECIL లో33 years అనుభవము. తర్వాత Associate Professor గా MVSR Engg. College, Hyd, Rungta College of Engg. & Technology, Raipur లలో 11 years అనుభవము.
   చిన్నప్పుడు సంస్కృతము లో అభిజ్ఞ పరీక్షలో ఉత్తీర్ణత. తెలుగు మీద విపరీతమైన మక్కువ. నా 15 వ యేట పద్యములు వ్రాయడము మొదలు పెట్టాను. 20 వ యేట వేంకటేశ్వర శతకము వ్రాసితిని. అది కాలక్రమములో నదృశ్యమైతే మళ్ళీ తిరిగి యీ సంవత్సరము వ్రాసితిని. పద్య రచన1968 నుండి 2015 వరకు మరుగున పడింది.
   మాయన్న గారి ప్రోద్బలము శంకరాభరణము గురుదేవుల ప్రోత్సాహముతో తిరిగి ప్రారంభమైనది.
   ఈ కాలములో రామచంద్ర శతకము, పోచిరాజ శతకము, పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము), వేంకటేశ్వర శతకములను వ్రాసితిని. ఇది నా వృత్తాంతము.
   మీ శతకమును పంపండి. ప్రయత్నిస్తాను.
   Email id: Kamesh_pochiraju@yahoo.co.in

   తొలగించండి
 2. కొబ్బరి తోటలో దూరిన కలియుగ గజేంద్రుడు:  దండిగ ఆకలి దప్పులు
  తిండీ తిప్పలునులేక తికమక జేసెన్!
  పండుగ! యనుచును కొబ్బరి
  బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాస్త్రి గారు మీ పూరణ మతిశయోక్తిగా బాగుంది. "గొబ్బరి" యె సరి. "నాకలి" అవుతుంది.
   బోండా , బొండము వేరు వేరు. నమిలెను అన్నారు కాబట్టి యిక్కడ కొబ్బరి బొండము కాదు. పిండివంట.

   తొలగించండి
  2. విజ్ఞులు కామేశ్వరరావు గారు:

   ధన్యవాదములు! తప్పులతో ప్రారంభించి ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేయడం నేర్చుకొంటున్నాను.

   కృతజ్ఞతలు!

   తొలగించండి
 3. రండీ పలహార శాలకు
  దండిగ లభియించు నంట ధర తక్కువకున్
  మెండుగ తినవలె రుచిగల
  బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్య గారు "తినుమన" అంటే అన్వయము బాగుంటుంది. మొదటి పాదములో గణ దోషము. రండు అంటే సరిపోతుంది.

   తొలగించండి
 4. కండల్బెంచెనుగుండె నిబ్బరముతోఁ గావించి వ్యాయామమున్
  కొండల్పిండిని జేయు భీమ బలుడై కొండాడ గ్రామీణులున్
  తిండిన్మెక్కెడి స్పర్ధ యందు గెలిచెన్, ధీరత్వమున్ జూపె, తా
  బోండా లర్వది యైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్

  రిప్లయితొలగించండి
 5. కండల్బెంచెనుగుండె నిబ్బరముతోఁ గావించి వ్యాయామమున్
  కొండల్పిండిని జేయు భీమ బలుడై కొండాడ గ్రామీణులున్
  తిండిన్మెక్కెడి స్పర్ధ యందు గెలిచెన్ ధీరుండు, స్వాదిష్టమౌ
  బోండా లర్వది యైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మీనారాయణ గారు మీ పూరణ ప్రశస్తముగానున్నది.
   "స్వాదిష్టమౌ" పద ప్రయోగ మాసక్తికరమైన వ్యాకరణ సూక్ష్మపు చర్చ కవకాశము నిచ్చుచున్నది.
   స్వాద్+ఇష్ట =స్వాదిష్ట; స్వాదు+ ఇష్ట = స్వాద్విష్ట.
   స్వాద్ ధాతువు. ధాతువు పై ఇష్ట పదము రాదు. ఇత ప్రత్యయము వచ్చి స్వాద్ + ఇతము=స్వాదితము (పానము చేయబడిన)అవుతుంది.
   స్వాదువు ఉ కారాంత విశేషణము. స్వాదు+ ఇష్టము = స్వాద్విష్టము (ఇంపైన యిష్టమైన) అవుతుంది.
   ఇక్కడ స్వాద్విష్టము చక్కగా కుదురుతుంది.
   మీ మొదటి పూరణయు ప్రశస్తమే. "జూపె దా" అనాలి.


   తొలగించండి
 6. డా.పిట్టా
  చండీ యాగము మాడ్కి నిర్గడలలో స్థాపించి యగ్నిన్ బలే
  ఖండాల్ గ్రుమ్మిరి ప్రత్తినూనె భరణిన్ కాల్చంగ కంచుళ్ళలో
  మెండౌ వేపుడు తిండి బండి కడ నా మేలైన యెన్బోతనన్
  బొండాలర్వది యైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్
  ఖండంబుల పాన్ పురీల్
  దండింతురు నరులు రోడ్డు దరి దాపుల నా
  బండిన్ కుమ్మిన వృషభము
  బొండాలరవై నమిలెను బొరుగుల వలెనే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారు మీ కవనము నారికేళ పాకమండి. పూరణలు బాగున్నవి.గ్రుమ్మిరి? కుమ్మిరి యనా క్రమ్మరి యనా? కంచళ్ళు?
   పూరీల్ అనియా లేకపోతే గణ దోషము. పానీ ని పాన్ అనడము సరికాదు. బండిన్ గుమ్మిన అనండి.

   తొలగించండి


 7. గుఱ్ఱం జనార్ధన రావు గారు శార్దూలం లో మంచి తర్ఫీదు యిస్తున్నారు :)


  చెండాడన్వెనుకాడకన్నదురహో చెంగాయనన్గట్టి తా
  గండాగొండి గలాటలెల్ల గెలిచెన్ గాండామృగమ్మై, భళీ
  కొండాట్టంబులనన్ జిలేబి రమణుల్ కోరంగ పొంకంబు గా
  బోండా లర్వది యైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలు జిలేబి గారు! కందపద్య పాద సమస్య నేను రూపొందించినదే యైనా శార్దూల పద్య పాద సమస్యకు రూప కల్పన శ్రీ కంది శంకరయ్య గారిదే.

   తొలగించండి

 8. నగరాన్ని బైకులో త్రిప్పి చూపించిన పెనిమిటి కి ముద్దుల జిలేబి బోండాలందిస్తే :)

  హోండా బైకున్ ద్రిప్పెను
  పెండ్లామును వెంకటేశు పెనుమార్లు, భళీ
  గండర గండా గొనుయన
  బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారు మీ పూరణ బాగుంది. బైకునఁ అనండి. వేమార్లు అంటే బాగుంటుంది.

   తొలగించండి
 9. [11/8, 6:19 AM] sreeramaraochepuri: కండలు పెంచిన మల్లుడు
  బండలనే పిండిచేసి బలమును చూపెన్
  దండిగ తిండిని దినుచును
  బోండాలరవై నమిలెను బొరుగుల వలెనే
  [11/8, 6:22 AM] sreeramaraochepuri: దండున తప్పిన యేనుగు
  దండిగ నా మొక్కజొన్న దండల జూడన్
  ఎండిన ముదిరిన కంకుల
  బోండాలరవై నమిలెను బొరుగుల వలెనే

  రిప్లయితొలగించండి
 10. పండుగ రోజున మిత్రులు
  నిండుగ బందెమ్మువేయ నెయ్యము తోడన్
  మొండిగ రాముండాలూ
  బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే!!!

  రిప్లయితొలగించండి
 11. రండీ వార్తను మిత్రులార! వినగా రాజయ్య యారోజునన్
  దండించంగను బిల్చి తుంటరి సఖుం దా జూపె భక్షించగా
  బండున్వీడిక నేడటంచు నిజ మా స్వప్నంబు నంజూచితిన్
  బోండా లర్వదియైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్.

  దండిగ భక్షణ జేసెడు
  భండాసురనామకుండు బహు హర్షితుడై
  పండుగ నాడది యగుటను
  బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 12. కొండల్పిండిగ జేయగాదలచి కుంభంబుల్ నహో మెక్కుచున్
  కండల్పెంచెను దండిగా నతడటన్ కాల్దువ్వి కయ్యానికై
  జెండానెత్తుచు నూరువుల్ జరిచి విజృంభించె బందెమ్ములో
  బోండాలర్వదియైననేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామారావు గారు మీ పూరణ బాగుంది.విజృంభించె లో వి లఘువే. జృ సంయుకాక్షరము కాదు.కాబట్టి గణ దోషము.

   తొలగించండి
 13. కవిమిత్రులారా! ఎవరికైనా శ్రీ పిస్కా సత్యనారాయణ గారి పరిచయం ఉంటే వారి గురించి, వారి సాహిత్య ప్రతిభ గురించి పది లైన్ల పరిచయ వాక్యాలు వ్రాయమని మనవి. నలుగురైదుగురు వ్రాసినా పరవాలేదు.ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తెలుగు సాహిత్య రంగాన్ని దీర్చి దిద్ది
   తనది యగు శైలి నొకదాని నొనర జేసి
   తెలుగు భాషకు వన్నెను దెచ్చి నట్టి
   సత్య నారాయణు బ్రతిభ జాట తరమె ?
   ----

   తెలుగు వెలుగుల నీనుచు దేనె వోలె
   తీయ గనునుండు నాతని తెలుగు రచన
   సాటి యెవ్వరగానరు సములలోన
   నాత నికతడే సాటియీ యైహికమున

   తొలగించండి
  2. మనతెలుగు వారికి నమస్కారములు
   పిస్కా గాru Andhrafolks. net lo " చాలా ఆర్టికల్స్ వ్రాసారు ." పురాణాల్లో సైన్స్" ముఖ్యంగా పేరొందినది .అది ఇటీవల f.bi.lo కుడా వస్తోంది. " చేమకూరి వేంకట కవి అభిమాని. అందలి పద్యాలను కోకొల్లలుగ ఫ్.బి.లో వ్రాసారు. అంతేగాక వాగ్గేయ కారుల పాటలను " ఆద్య్క్షరి " క్రింద పాడారు [డల్లాస్ వచ్చి నప్పుడు] .ఇలా మంచి పేరు ఉంది.

   తొలగించండి
 14. గుండా సుబ్బారాయుడు
  కండలవీరుండు బూని ఘనమౌ ప్రతినన్
  దండిగ పునుగులు బజ్జీల్
  బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే.

  రిప్లయితొలగించండి
 15. శా. కొండారెడ్డిదె తిండిపుష్టి యనినన్ గొండాడ శక్యంబొకో?
  నిండా పాతిక యేళ్ళు లేని యొకడున్ నేగెల్తు పందెమ్మనెన్
  మెండౌ ఖాద్య పదార్థ రాశి మిగులన్ మెక్కంగ సాగెన్ భళా !
  బోండాలర్వది యైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్.

  రిప్లయితొలగించండి
 16. తిండికి పోటీయన నా
  తండు గెలుపును గురి చూచి తన్మయ మందన్
  నుండల వలె జేసిన చిరు
  బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే!

  రిప్లయితొలగించండి
 17. చండా మార్కుడు ద్రాగెను
  బోండా లరవై,నమిలెను బొరుగుల వలెనే
  పెండ్యాల వారి కొమరుడు
  తండులముల బావు శేరు తానొక్కండే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చండామార్కుడు అని విక్రమార్కుడిలాగా ఎవరూ లేరండీ. శుక్రాచార్యులవారి కుమారులు చండుడు అమార్కుడు అని ఇద్దరు. ఉమ్మడిగా పిలచినప్పుడు వీరు చండామార్కులు. గమనించ ప్రార్థన. ఏదో తెలుగుసినిమాలో కూడా చండామార్కుడు అని పొరపడ్డారు. తెలుగుసినిమా ప్రామాణికత విషయంలో మనకెవరికీ ఏవిధమైన భ్రమలూ లేకపోయినా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరాలవాళ్ళకు తెలుసుసినిమా కథల ద్వారానో ఇతర తెలుగుమాథ్యమాల ద్వారానో అందుతున్న తెలుగు మాత్రమే తెలుస్తుంది. అలాంటీ వాళ్ళకు చండామార్కుడు అన్నదే సరైనది కావచ్చును లేదా నాగభరణం అన్నదే సరైన పదం కావచ్చును. ముందుముండు వచ్చే ప్రజాప్రభుత్వాలు అటువంటీ తెలుగునే అధికారికభాషగా చేసినా చేయవచ్చును తెలుగుతల్లి అన్నిటికీ సిధ్ధంగా ఉండక తప్పదు మరి.

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. అన్నయ్య నీ పూరణ బాగుంది. కానీ బోండా , బొండము వేరు వేరు. నమిలెను అన్నారు కాబట్టి యిక్కడ కొబ్బరి బొండము కాదు. పిండివంట.
   చoడామార్కులన్నదమ్ములు.హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చదువుకని వీరి వద్దకే పంపుతాడు.

   శ్యామల రావు గారు మీ వివరణకు ధన్యవాదములు. తెనుగు సాహిత్యముపై గల మీ యభిమానావేదనలు ప్రశంసనీయములు.

   తొలగించండి
 18. శుండాలము నొకదానిని
  కొండలలో వెదకి తెచ్చి కోవెల నుంచన్
  వండిన వంటలు కనుగొని
  బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే

  రిప్లయితొలగించండి
 19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 20. రిప్లయిలు

  1. పండుగ నెలయని దలచుచు
   దండిగ భోజనమునందు దనియచు దినమున్
   రెండేసిగ దిన నెలలో
   బోండాలరవై నమిలెను బొరుగుల వలెనే!

   తొలగించండి
  2. శర్మ గారు మీ పూరణ బాగుంది.
   [అన్నియు నొక్క రోజున వండినవి కాదు కదా! అలాగయితే పురుగుల వలనే అనవలసి వస్తుంది.!!]

   తొలగించండి
  3. కామేశ్వర రావు‌గారూ... రోజుకి రెండు బోండాలు మాత్రమే వండుకు తినివుండవచ్చుగదా...లేకపోతే వండినవాటిట్లో యితరులతో కలిపి తాను ప్రతి రోజు రెండు తినివుండవచ్చుగదా....అలా ఆ నెలలో అరవై తిన్నాడన్నది...నా భావము....ఎంత తిండిపోతైనా ఒక్కసారి అరవై తినగలడా!

   తొలగించండి
  4. శిష్ట్లా శర్మ గారికి నమస్సులు ! అరవై బోడాలు తినటమొక పెద్ద విశేషమనుకుంటున్నారా? ఒక ప్రపంచ స్థాయి పోటీలో "జోయ్ చెస్ట్ నిట్" అనే అతను కేవలం 12 నిముషాల్లో 141 (అక్షరాల నూట నలభై యొకటి) గుడ్లను తిన్నాడు.స్వయంగా చూడ వచ్చు, యూట్యూబ్ లో "12 eggs eaten in 8 minutes " అని టైప్ చేయండి.ఆలెక్కన అతడు మూడు నాలుగు వందల బోండాలు (గుడ్డు సైజువి) తినగలడు) "టైం" నియమం లేకపోతే.(అంటే ఇన్ని నిముషాలనే నియమం లేకపోతే)

   తొలగించండి
  5. జనార్ధనరావు గారూ.....నా ఉద్దేశ్యంలో....అలాంటప్పుడు సమస్యే ఉండదు!ఎక్కడైనా exceptional గా ఉండియుండవచ్చు!

   తొలగించండి
 21. కండలు నిండుగ నుండిన
  మెండుగ నుద్దండు లైన మిండల నెల్లన్
  దండిగ చెండాడంగన్
  బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే.

  [మిండఁడు = పురుషుడు]


  దండోరా విని సంతసమ్మున ఘనోద్దండక్రియన్ సాగి తాఁ
  జండంబౌ మృదు విడ్డెనల్ చిదిమి యాశ్చర్యమ్ముగన్ ముప్పదుల్
  గండం బించుక నెంచకుండ నలభై గారెల్ విలాసంబుగన్
  బోండా లర్వది యైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్

  రిప్లయితొలగించండి
 22. 08.11.2016.శంకరాభరణము
  సమస్య:బోండాలరవై నమిలెను బొరుగుల వలెనే
  తండా భూమయ మెసవెను
  బొండాలరవై,నమిలెను బొరుగుల వలెనే
  వండిన జంతిక లాపై
  కుండెడు గోరసము గ్రోలె కొసరుగ పొద్దున్

  రిప్లయితొలగించండి
 23. మెండౌభోజనమున్నొసంగ ధృతితో మీయూరిలోనున్న యా
  కొండన్మోసెద నంచుపల్క యువకుల్ కూర్చంగ నాహారమున్
  బోండా లర్వది యైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్
  కండల్ బెంచికడున్ ముదమ్ము కదురంగన్ జేరి తానమ్ముకున్
  కొండన్ వీపుననుంచ మంచు ప్రజలన్ గోరెన్ భరించంగఁదాన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ రెడ్డి గారు మీ పూరణ కథా శ్రవణముగా నలరారు చున్నది.

   తొలగించండి
  2. కవివర్యులు కామేశ్వర రావు గారికి ధన్యవాదములు - జేరి తల మ్ముకున్ - తలమ్మునకు అనాలనుకుంటున్నాను. జేరి తలమ్ము, నా / కొండ ను - అంటే సరిపోతుందా తెలియజేయ ప్రార్థన.

   తొలగించండి
  3. అవునండి తానమ్ముకున్ అన్నారు. గమనించ లేదు. తానమ్మునకున్ అనవలసి యుంటుంది. "తానమ్ము నా" అంటే సరి పోతుంది. ధన్యవాదములు.

   తొలగించండి
 24. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  అ౦డా పాయస మ౦త ద్రావె | పది భక్ష్యా

  ……… లొక్కడే మ్రి౦గుచున్ ,

  బో౦డా లర్వది యైన నేమి నమలెన్

  …………… భూమయ్య పేలా ల్వలెన్ |

  ని౦డె న్నాతని బాన పొట్ట యిక | కానీ ,

  ………… యుబ్బర౦ బయ్యె పో |

  యు౦డ౦ బట్టక బ౦పి రాతని c

  …………… జికిత్సోధ్ధారణార్థ౦ | బటన్

  చ౦డాపాన సమీర శబ్ద హతుడై ,

  ……… చచ్చెన్ గదా వైద్యుడే ! !


  { అ౦డా = పెద్ద పాత్ర ; ఉ౦డ౦ బట్టక =

  ఊరకు౦డుటకు మనసు రాక ; }

  రిప్లయితొలగించండి
 25. కొండల్రావను మిత్రుడు
  బండయ్యను పిలిచినంత వచ్చెన్ సతితో
  పండుగ రోజంచు నచట
  "బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే

  బండే కొంటిని విందునిత్తు ననుచున్ పంపించి సందేశమే
  తండాలో నివసించు మిత్రుడొకడిన్ తా బిల్చి రాజేశమే
  వండించెన్ పలు వంటకమ్ములనతడే వడ్డింపగా నేస్తమే
  బోండా లర్వది యైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారు మీ రెండు పూరణలు చాలా బాగున్నాయి. "బంపించి","దా బిల్చి","బలు వంటకమ్ము" అనండి ద్రుత సంధి యుత్వ సంధి యంత నిత్యము. "వంటకమ్ములతడే" అనండి లేకపోతే గణ దోషము.

   తొలగించండి
 26. గుండా వంశోద్భవుడట
  పండా వారింటికేగి పంతముతోడన్
  దండిగ జబ్జలు జరచుచు
  బోండాలరవై నమిలెను బొరుగులవలెనే.
  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారు నమస్సులు. చిరకాల దర్శనము. కుశలమే కదా.
   మీ పూరణ గుండా వారు, పండా వారితో చాలా బాగుంది. "జబ్బలు" అనుకుంటాను.

   తొలగించండి
  2. నమస్సులు కామేశ్వరరావు గారు, మీ అభిమానానికి కృతజ్ఞతాభివందనములు . ఇటీవలి కాలంలో ,నాకంటికి (కాటరాక్ట్ ఆపరేషన్)అవసరమైనది. అది చేయించుకొందామని కంటి వైద్యుని సంప్రదిస్తే రెండవ కంటికి ఒత్తిడి ఉన్నది. ముందు దానికి మందువాడి తగ్గిన పిదప రెండవది చేద్దామన్నారు. ఇది గాక 4రోజుల నుండి వైరల్ ఫీవర్ వచ్చింది.ఈరోజే తగ్గి మనవారితో ఆనందం పంచుకొందామని వచ్చాను. మీ అందరితో కలవడం మహదానందం.ఏమాత్రం అవకాశమున్నా కలుస్తాను. ఆపరేషన్ బెంగుళూర్ లో చేయించుకొందామని (మా అమ్మాయి,అల్లుడు ఉన్నారు)అనుకుంటున్నాను.తేదీ ఇంక నిర్ణయం కాలేదు. మీ పట్ల చనువుతో తెలియజేశాను.అపుడపుడు కలుస్తుంటాను. నమస్తే.

   తొలగించండి
 27. నిండా పదునై దేడులు

  బోండామని పిలుచుచుంద్రు బొద్దుగ నుండన్

  తిండి యన ప్రేమ మెండయి

  బోండాలరవై నమిలెను బొరుగుల వలెనే.

  రిప్లయితొలగించండి
 28. రండో చేవగలట్టి భీమబలురై రంజిల్లు భాగ్యోదయుల్
  కండల్దిర్గిన మండితుల్ రుచుల వ్యాఖ్యానించు మాన్యోదయుల్
  దండంజేరుడు పందెమందనుచు ఖాద్యంబులందీయగా
  బోండాలర్వదియైననేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారు మీ పూరణ చాలా బాగుంది. పేలాల్వలలెన్ కదా. మూడవ పాదములో గణ దోషము.
   "ఖాద్యశ్రేణినందీయగా" అనిననెట్లుందును?

   తొలగించండి
  2. మహత్తరంగా ఉంటుంది. నకారపొల్లు పొరపాటున జారిపోయింది.

   తొలగించండి
  3. మహత్తరంగా ఉంటుంది. నకారపొల్లు పొరపాటున జారిపోయింది.

   తొలగించండి
 29. మిత్రులందఱకు నమస్సులు!

  [బకాసురునిం జంపుటకు ముందు భీముని నిర్వాహకము]

  గండర గండఁడు భీముఁడు
  దండిగ నా బండిలో నొదవు వంటకముల్
  బొండుగ దాఁకం దినియును

  బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. [2]
   గూండా యెవ్వఁడొ వెంబడింప, భయుఁడై కొండన్ దగన్ గాంచియున్
   మెండౌ రీతినిఁ జేర, రక్కసుఁ డొకం డేదో మహామంత్రపున్
   దండంబున్ దనకీయ, దాని మహిమన్, దారాధ్వ దీర్ఘాంగుఁడై

   బోండా లర్వది యైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్!

   తొలగించండి
  2. కవిపుంగవులు మనోహరమైన పూరణలు. భీమునికి బోండాలు రుచి చూపించారు. ధన్యులు.
   "తారాధ్వము బద్ధమైన తప్పక యిత్తున్" గుర్తు జేసారు! చాలా సంతోషము.

   తొలగించండి
 30. శ్రీకామేశ్వరరావుగారికి వందనచందనాలతోనిన్నటిపూరణ,మరియు ఈనాటి పూరణలు పంపుచున్నాను పరిశీలనచేయమని విన్నపము
  7.11.16. కోరిన కోర్కెలకై పరి
  హారముగొలిచిన నదిపదియామడ లుండెన్
  వారికి నాయకు డై తను
  సారధిగా నిలిచిజేసె సాయంబడుగన్ {పదియామడలపల్లెవాసులకు}
  2.ధీరత మాని మోసపు,విధేయత యందున జేయు మిత్ర సం
  హారముగొల్చి చూడబదియామడ లున్నది కంటివే సఖీ
  మారని పాక్ చర్యగన మానవ తత్వము మానిజేయుటే
  కారణ మెంచకే జరుపు కావరమే గద?ధర్మ మార్గమా?
  8.11.16. కాండమువలె కండలతో
  మెండుగ పైల్ మ్యాను లాగ మేటియు తానై
  వండిన తిండిని తిని,మరి
  బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే|
  2.సండూరందున రాత్రియందు తిని విశ్రాతందు నిద్రించగా
  బోండా లర్వది యైననేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్
  చెండాడెన్ గద పళ్ళ మధ్యసమసేన్ చిత్రంబుగా మ్రింగగా|
  కండల్ గల్గిన రాక్షసుండుగను తా గన్పించెనానిద్రలో| {కలలో}


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారు నిన్నటి మీమొదటి పూరణ బాగుంది.
   రెండవ పూరణలో మూడవ పాదములో గణ దోషము. పాక్ చర్య లో చ కూడా గురువుకద.
   నేటి పూరణ లో పహిల్వాను తెలుగు పదము కాదు పైగా పైల్ మ్యాను అన్నారు. ఛందోబద్ధమైన పద్యములలో నన్య భాషాపదముల వాడక మభిలషణీయము కాదు.
   రెండవ పద్యములో కలయందనిన మీ పూరణ బాగుంది.1."విశ్రాతందు" అర్థము కాలేదు. 2."సమసెన్" అనా?

   తొలగించండి
 31. మాయబజార్ కథాపరంగా..

  పెండిలిఁ జెడుప ఘటోత్కచుఁ
  డుండుచు మాయాశశివలె నొరులెల్లరికిన్
  గుండెలు గుభిల్లు మనగన్
  బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే

  రిప్లయితొలగించండి
 32. ఆర్యా డా.పిట్టా నుండి
  పానీ పూరీ అని నాకు తెలియక గప్ చుప్ లని లాయ్లప్పాలని నేనంటే నవ్వుతారు.ఆ బండి నాకు గిట్టక పాన్ పానమునకు.తొందరగా చెప్పాలని పురీ అంటారేమో అనుకుని గణదోషానికి పాల్పడితిని.మౌఖికంగాdeliver చేయాలనే అభ్యాసం లో మీసూచనలమేరకు సర్ది చేసి ప్రచురించుకుంటాను.T hanks a lot!

  రిప్లయితొలగించండి
 33. దండిగ తద్దినముల లో
  మెండుగ సంతర్పణలను మ్రింగుటె పనియౌ
  డిండిమ భట్టు బజారున
  బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే.

  రిప్లయితొలగించండి
 34. డా .పిట్టా నుండి TSలోకంచుడంటే వెడల్పాటి పాత్ర.కళాయి అంటారో తెలియదు.భరణి నూనె సీసా .కుమ్మరించి .బడబడా పోసి అనే భావన. ఆర్యా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదములండి. మీ భావమర్థమైనది. కళాయి ని కంచు అంటారా బాగుందండి.
   కుమ్మరు / క్రుమ్మరు అంటే కుమ్మరించనెడి యర్థము రాదు. "సంచరించు" అని యర్థము వస్తుంది. పోయగఁ బ్రత్తినూనె అనవచ్చునేమో?

   తొలగించండి
 35. నమస్సులు కామేశ్వరరావు గారు, మీ అభిమానానికి కృతజ్ఞతాభివందనములు . ఇటీవలి కాలంలో ,నాకంటికి (కాటరాక్ట్ ఆపరేషన్)అవసరమైనది. అది చేయించుకొందామని కంటి వైద్యుని సంప్రదిస్తే రెండవ కంటికి ఒత్తిడి ఉన్నది. ముందు దానికి మందువాడి తగ్గిన పిదప రెండవది చేద్దామన్నారు. ఇది గాక 4రోజుల నుండి వైరల్ ఫీవర్ వచ్చింది.ఈరోజే తగ్గి మనవారితో ఆనందం పంచుకొందామని వచ్చాను. మీ అందరితో కలవడం మహదానందం.ఏమాత్రం అవకాశమున్నా కలుస్తాను. ఆపరేషన్ బెంగుళూర్ లో చేయించుకొందామని (మా అమ్మాయి,అల్లుడు ఉన్నారు)అనుకుంటున్నాను.తేదీ ఇంక నిర్ణయం కాలేదు. మీ పట్ల చనువుతో తెలియజేశాను.అపుడపుడు కలుస్తుంటాను. నమస్తే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఓహో అలాగా. ఇప్పుడు జ్వరము పూర్తిగా తగ్గినట్లు తలుస్తాను. కాటరాక్ట్ యీ రోజుల్లో చాలా సుళువయ్యింది. సవ్యముగా జరుగుతుంది. బెంగళూరులోనే చేయించుకోండి.

   తొలగించండి

 36. కండలు పెంచిన వీరుడు
  బోండాలరవై నమిలెను బొరుగుల వలెనే
  నిండెను కడుపది యనుచును
  కండలు చూపుచు పలికెను ఘనముగ తానున్.

  గండస్థలమున కుమ్ముచు
  ఖండించుచు మంచి యిక్షు గడలను కరియున్
  నిండగు యాకారముతో
  బోండాలరవై నమిలెను బొరుగుల వలెనే.

  రిప్లయితొలగించండి