కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ"
లేదా...
"మతిహీనాచల భావ పూరుషుని సన్మానింప సంభావ్యమే"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ"
లేదా...
"మతిహీనాచల భావ పూరుషుని సన్మానింప సంభావ్యమే"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
హితమేమి గలుగ బోదిల
రిప్లయితొలగించుమతిహీన పురుషు నుతింప; మాన్యులు సుమ్మీ!
గతమెంత వెక్కిరించిన,
వ్రతమానంబైన బ్రతుకు వలచెడి వారల్!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వ్రతమానము'....?
'వ్రత నిష్ఠంబైన...' అంటే బాగుంటుందేమో?
తొలగించుగురువుగారూ....వ్రతౌన్నత్యముగల....అనే అర్థం లో వాడాను.....మీరు సూచించినవిధముగా...వ్రత నిష్ట.. బాగుంది... సవరిస్తాను.... ధన్యవాదములు.
తొలగించుభారతీయ ఆదర్శ ప్రధాన మంత్రి:
రిప్లయితొలగించుఅతివినయమ్ము నటించక
మతవాదుల నడ్డగించి మౌనవ్రతుడౌ
యతివోలె వసించెడు దు
ర్మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
యతిరాజులు కొందరిలను
రిప్లయితొలగించుమతిహీనుల వోలెనుంద్రు మాయా విముఖుల్
గతి నీవేయని జని యా
మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ"
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మంగళంపల్లి వారికి శ్రద్ధాంజలి
రిప్లయితొలగించుసీ.
కీర్తనల్పాడుచో గీర్వాణి తలయూచి
కచ్చపిని విడచు కంజుఁమరచు
నవరాగ సృజనలో నలువనాఁకటఁదోసి
పుట్టించుటెట్లనో పొసగ జూపు
నాదానుసంధాను నైపుణ్య ధాటిలో
నారదతుంబురుల్ నాన బరచు
స్వరమును విప్పెనా సర్వంబు మరపించు
సరిలేరు నాకంచు సందడించు
తే.గీ
మంగళంపల్లి గళములో మార్దవంబు
బాలమురళిగానాద్భుత పాటవంబు
కోటి కోయిల లకునైన కొంతరాదు
మరల నికపుట్టడిటువంటి స్వరపు జోదు
నాన:సిగ్గు
తొలగించుమూర్తి గారూ,
తొలగించుచక్కని సీసపద్యంతో మంగళంపల్లి వారికి అందించిన శ్రద్ధాంజలి బాగున్నది.
రిప్లయితొలగించుఅతిగా మాటల్లాడెడి
మతిహీన పురుషు నుతింప, మాన్యులు సుమ్మీ
చితికెదరు బతుకున నిజ
మ్ము, తెలివి గలిగి మెలగవలె మూర్ఖుల తోడన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అతిగా మాటల నాడెడి...' అనండి.
అతిగా ప్రేమను పంచుతు
రిప్లయితొలగించుమతిహీన పురుషు నుతింప ,మాన్యులు సుమ్మీ
వెతలను దాటుచు తెలివిగ
పతనము గాకుండ నిలను ప్రఖ్యాతు లగున్
అక్కయ్యా,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గాకుండ యిలను...' అనండి.
అతిగా ప్రేమను పంచుతు
తొలగించుమతిహీన పురుషు నుతింప ,మాన్యులు సుమ్మీ
వెతలను దాటుచు తెలివిగ
పతనము గాకుండ యిలను ప్రఖ్యాతు లగున్
డా.పిట్టా
రిప్లయితొలగించుగతులను గానని జగతి
న్నతిగా కర్మలను జేయు నరవరు కంటెన్
ధృతినింద్రియ నిగ్రహ దు
ర్మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ!
వ్రతముల్ వాయనముల్ సుయాగములు సంభ్రాంతిన్ఘటింపించి వై
ధృతినిన్ మౌఢ్య విచారధారల నిలన్ రిక్కించి పెన్ జీకటిన్
గతినిన్నెంచక నిగ్రహత్వ పరతన్ గవ్వించు యోగాత్మ దు
ర్మతిహీనాచల భావపూరుషుని సన్మానింప సంభావ్యమే!
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కం. చతురత యొకింత లేకయె
రిప్లయితొలగించుమతిమంతుడనని భ్రమించి మాయల జేయ
న్నతిగా వర్తిలు చుండెడి
మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ !
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మ.గతి తప్పెన్నని సంస్కరింప దొడగెన్ గాపాడ దేశమ్మునే !
రిప్లయితొలగించుమతిమంతుల్ వలదన్న గాని వినకే మాయల్ తనన్ గ్రమ్మగన్
వ్యతిరేకింపక మెచ్చుకోలు తగునే వ్యాపార దుర్నీతులన్?
"మతిహీనాచల భావ పూరుషుని సన్మానింప సంభావ్యమే"
జనార్దన రావు గారూ,
తొలగించుమీ వృత్త పూరణ బాగున్నది. అభినందనలు.
మతిహీనుల మాటయ యిది
రిప్లయితొలగించుమతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ
మతిగల వారెవ్వరు మఱి
యతిగా గొఱగాని మాట లాడరు ధరణిన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ పద్య ద్వయమున నర్థ ద్వయమును గ్రహింప మనవి.
తొలగించునుతజల సన్ముఖ ధౌతున్
గత కల్మష దర్ప భాస కర్మాసక్తున్
ధృతరాగమానస, కలుష
మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ
నత భావోద్ధిత కార్య సంచయ సువిన్యాసాత్త సంతోషినిన్
శ్రుతి హేలాభవ చిత్త మానవు సదా రోషద్యుతిక్షీణునిన్
హిత కామార్థ విభూతి పూజ్యు సతతై కైకాంబ రాచ్ఛాదితున్
మతిహీనాచల భావ పూరుషుని సన్మానింప సంభావ్యమే
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించుశబ్దశోభను సంతరించుకున్న మీ రెండు పూరణలు అత్యద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
రూఢ్యర్థం బోధ పడింది. అన్యార్థం అవగాహనకు అందలేదు. మీరు వివరిస్తే బాగుంటుంది.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించుప్రథమ పూరణ:
మొదటి అర్థము:
నుతజల సన్ముఖ ధౌతున్= మంచి నీటితో కడిగిన ముఖము వాడు; గత కల్మష దర్ప భాస= పోయినకల్మష దర్పములతో భాసిస్తున్న; కర్మాసక్తున్ = కర్మలనిష్ట పడువాడు; ధృతరాగమానస = అనురాగముతో నిండిన మనసు వాడు; కలుష మతిహీన= కలుషపు బుద్ధి లేని; పురుషు నుతింప మాన్యులు సుమ్మీ = పురుషు నుతింప మాన్యులే.
రెండవ అర్థము:
నుతజ=పొగడ్తల వలన కలిగిన ; లసన్ముఖ= వెలిగిన ముఖము; ధౌతున్= కడిగిన వాడు;
గత కల్మష దర్ప భాస= పూర్వపు కల్మషము గర్వములు ప్రకాసమానమగు; కర్మాసక్తున్ = కర్మలనిష్ట పడువాడు; ధృత రాగ మానసకలుష= నిశ్చయమైన మాత్సర్యపు మనస్సుచేత కలుషితమైన వాడు;
పురుషు నుతింప మాన్యులు సుమ్మీ = పురుషు నుతింప మాన్యులే?
ద్వితీయ పూరణ:
మొదటి అర్థము:
నత భావోద్ధిత కార్య సంచయ సువిన్యాసాత్త సంతోషినిన్ = లోతైన భావములతో పుట్టిన కార్య సమూహముల సు రచన తో పొండబడిన సంతోషము కలవానిని;
శ్రుతి హేలాభవ చిత్త మానవు = శ్రుతి హేలా + అభవ చిత్త మానవు= వేదములందు తిరస్కారము పుట్టని మనస్సు గల మానవుని;
సదా రోష ద్యుతి క్షీణునిన్ = ఎల్లప్పుడు రోషపు కాంతి లేని వాని; హిత కామార్థ విభూతి పూజ్యు = హితములైన కామము, అర్థము, ఐశ్వర్యముల వలన పూజింపబడు వాడు;
సతత+ఏక+ఏక+అంబర+ఆచ్ఛాదితున్ = ఎల్లప్పుడు అంబరమే ఆచ్ఛాదన (కప్పు) గా కలవాడు
మతిహీనాచల భావ పూరుషుని = కోరికలు లేని వాడు, స్థిరమైన భావములు కలవానిని
సన్మానింప సంభావ్యమే.
రెండవ అర్థము:
నత భావోద్ధిత కార్య సంచయ సువిన్యాసాత్త సంతోషినిన్ = వంకర భావములతో పుట్టిన కార్య సమూహముల సు రచన తో నపహరింప బడిన సంతోషము కలవానిని;
శ్రుతి హేలాభవ చిత్త మానవు = శ్రుతి హేలా + భవ చిత్త మానవు = వేదములందు తిరస్కారము పుట్టు మనస్సు గల మానవుని;
సదా రోష ద్యుతి క్షీణునిన్ = ఎల్లప్పుడు రోష కాంతులచేత క్షీణుని;
హిత కామార్థ విభూతి పూజ్యు = హితములైన కామము, అర్థము, ఐశ్వర్యముల శూన్యుడు;
సతతైకైకాంబరాచ్ఛాదితున్ = ఎల్లప్పుడు నేక వస్త్రము నాచ్ఛాదన గా కలవాడు;
మతిహీనాచల భావ పూరుషుని = మతి హీనుడు, కొండ వంటి (కఠిన) భావములు కలవానిని;
సన్మానింప సంభావ్యమే?
విజ్ఞులు, కవివరేంద్రులు, కామేశ్వర రావు గారు:
తొలగించుమీరు అష్టదిగ్గజాలలో ఒకరైన వారు. మా అదృష్టం!!!
శాస్త్రి గారు నమస్సులు. అష్ట దిగ్గజములకు నాకు హస్తిమశకాంతరము.
తొలగించుకామేశ్వరరావుగారూ, ద్వ్యర్థ పద్యాలతో మీకవనవిన్యాసవిన్నాణము అత్యద్భుతం
తొలగించుఆర్యా!
తొలగించుఅత్యద్భుత పద్యరచన.
నమస్కారములు.
ఆర్యా మూర్తి ద్వయములకు నమశ్శతములు.
తొలగించుగతి లేకున్నను తలపరు
రిప్లయితొలగించుమతి హీన పురుషు నుతింప! మాన్యులు సుమ్మీ
చితికిన బ్రతుకుల నైనను
చతికిల బడక కొనసాగు సామాన్యులిలన్!
శ్రీధర రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధృతిసడలి కుక్కతోకను
రిప్లయితొలగించుగతినీవే యంచు పట్ట గౌతమి నీదన్
జతపడున ఫలిత మెవ్విధి
మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ?
అతిగా సేవల నిర్వహించ తన కత్యంతంపు ప్రావీణ్యతల్
రిప్లయితొలగించుచతురాస్యుండిడెనంచుపల్కికరమౌ చాతుర్యమున్ జూపుచున్
ధృతితో గద్దెల నెక్కుచున్ జనములన్ దీనత్వమున్ ద్రోయు దు
ర్మతిహీనాచల భావ పూరుషుని సన్మానింప సంభావ్యమే?
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అతివాదము శ్రేయమనెడి
రిప్లయితొలగించుమతి హీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ
పతనము జెందిన నేతలు
చతురతతో దోచుకొనెడి సహచరు లెల్లన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వెతలను కలిగించునిలను
రిప్లయితొలగించుమతిహీనపురుషు నుతింప, మాన్యులుసుమ్మీ
ప్రతికూలములెదురైనను
గతితప్పక జీవితమును గడిపెడువారే!!!
శైలజ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సతతానందభరాత్ముడై వెలుగుచున్ సన్మార్గసంచారియై
రిప్లయితొలగించుస్తుతి కర్హంబగు కర్మ చేయు ఘనునిన్ శుద్ధస్వభావాన్వితున్
క్షితి సర్వోత్తముగా గణించ వలయున్ క్షిప్రాగ్రహగ్రస్తు నా
మతిహీనాచలభావ పూరుషుని సన్మానింప సంభావ్యమే?
స్తుతమతులను గీర్తించిన
నతులితయశ మందుకొనెద రటుగాకుండన్
క్షితి నెట్లౌదురు దుష్టుని
మతిహీన పురుషు నుతింప మాన్యులు? సుమ్మీ!
హ.వేం.స.నా.మూర్తి
మూర్తి గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అతిథులను గౌర వించుచు
రిప్లయితొలగించుసతతము మాతా పితరుల చరణమ్ములనే
క్రతువుగ పూజించెడు దు
ర్మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ
శితికంఠేశుని నామమున్ దలవడే చింతింపడే మోక్షమున్
హితమున్ గూర్చడు తల్లిదండ్రులకు దానిష్టంబునే జూపడే
వెతలన్ దీర్చగ, స్వార్థమున్ విడువడే విత్తంబునే పొంద, నా
మతిహీనాచల భావ పూరుషుని సన్మానింప సంభావ్యమే
విరించి గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అతిదుర్నీతులు లోకమందలమగా నన్యాయకృత్యంబులీ
రిప్లయితొలగించుక్షితిపై నిత్యము విస్తృతంబులగుచున్ చేకూర్చగా క్రౌర్యతన్
వ్రతహీనాత్ములు నిండియున్న జగతిన్ వాదేల తథ్యంబుగా
మతిహీనాచలభావపూరుషుని సన్మానింప సంభావ్యమే.
హ.వేం.స.నా.మూర్తి
మూర్తి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గతి తప్పిన మనసులు పరి
రిప్లయితొలగించుణతి నొందగ తగు చికిత్స నందించుటకై
యతనము జేయు తలంపున
మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ!
నాగేశ్వర రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్థితిమంతుండని తమకున్
రిప్లయితొలగించుహితమొన గూర్చునను స్వార్థ మిమడఁగ మదిలో
నతిశయ పూరిత వాక్కుల
మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ?
సహదేవుడు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కృత కర్ముడనంగ దగునె
రిప్లయితొలగించుమతిహీన పురుషు నుతింప? మాన్యులు సుమ్మీ!
స్తుతియించుచు పరమాత్ముని
చతురానను చెంత జేర సంసిద్ధులిలన్
నిన్నటి సమస్యకు నా పూరణ
నవనీత సమాన గళము
నవరసములు చిలుక వినక నరుపులె మెచ్చన్
దివిసేమంబని దలతువ?
భువి వీడితి వేల బాల మురళీకృష్ణా?
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అతిహేయమగును గాదే
రిప్లయితొలగించుమతిహీన పురుషు నుతింప;మాన్యులు సుమ్మీ
హితమును దెలిపెడివారలు
సతతము వారిని కొలువగ సంతసమబ్బున్.
2.నుతియించుచు సాధువులను
యతి పుంగవులను మరువక హరుషము తోడన్
సతతము జీవించెడి దు
ర్మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ.
3.హితమెనగూడదు నెపుడును
మతిహీన పురుషు నుతింప;మాన్యులు సుమ్మీ
యతివర్యుల కొలుచుచు సు
వ్రతముల నొనరించువారు వసుధను గనుమా.
డా.బల్లూరి ఉమాదేవి.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించుమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అతిగా మాటల నాడకే మితముగా నందించి సూత్రాలనున్
రిప్లయితొలగించుసతతమ్ శాంతము దాంతమున్ సహనమున్ సంధించి వైరాగ్యమున్
హితమౌ రీతిని దృష్టితో నఘములన్ హింసించి పోరాడు దు
ర్మతిహీనాచల భావ పూరుషుని సన్మానింప సంభావ్యమే